అర్జునని హత్య చేసిందెవరు?
పూర్ణా
రమేష్.
దాసు.
తప్పకుండా ఈ ముగ్గురిపనే.
వాళ్ళే ___వాళ్ళే హంతకులు రాబ్ర్టు కళ్ళలో నిరు నిలిచింది.
"ఎందుకా కన్నీరు?
రాబర్టు మెల్లగా తలతిప్పి చూశాడు.
మేరి!
"ఏంలేదు!
" నా దగ్గర కూడా నీకు రహస్యాలున్నాయా రాబర్టు" దినంగా అడిగింది మేరి.
రాబర్టు కి విశ్రాంతి తీసుకోవాలానుంది అతనికి చాలా అలసటగా కూడా వుంది.
రాబర్టు మంచంపైన పడుకున్నాడు. తల కింద చేతులు పెట్టుకుని పైకి చూస్తున్నాడతను
మాట్లాడవే నా ప్రశ్నకి సమాధానం చెప్పడం నీకిష్టం లేదా? అడిగింది మేరి.
మేరి చెయ్యిపట్టుకుని మీదకు లాక్కున్నాడు రాబర్టు.
మేరి అతని చాతిపైన వాలిపోయింది.
"రాబర్టు"
"ఉ" అన్నాడు యదాలానంగా.
"నిన్ను చూడకుండా నేను ఒక్కక్షణం వుండలేకపోతున్నాను. ఏ క్షణంలో నన్ను నీకు అర్పించుకున్నావో గాని నాలోని ప్రతి అణువులోనూ నువ్వే నిండిపోయావు" అంది.
రాబర్టు కళ్ళకి ఆమె గుండెలు అతని మొహంపైకి ఉరకడానికి సిద్దంగా కనబడినాయి.
మేరి గుండెల పైన చెయ్యి వేసి జిఫ్ లాగాడు రాబర్ట్.
మేరి చెక్కిళ్ళనీ అరచేతులతో రాస్తూ ఆమె మొహాన్ని దగ్గరగా తీసుకుని పలుచని పెదిమల పైన ముద్దు పెట్టుకున్నాడు రాబర్టు.
మేరి తన రెండు చేతుల్ని అతని విపుచుట్టూ వేసి గట్టిగా కౌగిలించుకుంది.
అతని చేతులు ఆమె నడుముమీదికి జారినాయి.
"మేరి"
"ఏమిటి"
"నేనంటే నీ కెందుకింత ఇష్టం!" అడిగాడు.
"ఇన్నేళ్ళ నా తపస్సుకు దొరికిన వరానిని నువ్వు" అంది మేరి.
"నన్నంతగా ఇష్టపడుతూన్నావా?"
"నీతోనే నా ఆడ జీవితం మొదలయింది."
బాబ్ చేసిన జుత్తుని ఎడం చేత్తో వెనక్కి తోసుకుంది. మేరి.
"నువ్వు నా ఊపిరిని ప్రాణానివి రాబర్టు" అంది.
"పిచ్చి పిల్ల!" అన్నాడు ఆమె పెదిలమ పైన చేతివేలితో రాస్తూ.
అతని కళ్ళలోకి నువ్వే నా సరస్వం అన్నట్టుగా చూసింది మేరి.
రాబర్టు జేబులోంచి చిన్న ప్లాసిక్ పెట్టె తీశాడు. అందులో వున్న ఓ ఎర్రరాయి వుంగారాన్ని మేరికి అందించవోయాడు.
మేరి తీసుకోలేదు.
"ఏం నచ్చలేదా?" అడిగాడు.
"నచ్చకపోవడం కాదు. ఉంగరాన్ని ఎవర్తేనా చేతికిసతారా?" అంది.
రాబర్టు మేరి చేతికి వుంగారాన్ని తొడిగాడు.
"ఆడపిల్ల చేతికి రింగ్ పెడితే పెళ్ళయినట్టే లఖ్క" అంది మేరి నవ్వుతూ .
"పెళ్లి అంత ముఖ్యమా జీవితానికి" అడిగాడు రాబర్టు .
మేరి మొహం చిన్నబోయింది.
"నా మనసుని నాలో వున్న అన్నింటిని నికిచ్చేశాను. నాకు కేవలం నా శరీరమే ముఖ్యమనుకుంటే నువ్వన్నట్టు పెళ్ళి అవసరం లేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు శాశ్వాతం కావాలి నువ్వు నావాడవని చెప్పకున్నప్పడే నాకు తృప్తి ఆడది నమ్మి దగ్గరకొస్తే అందినవి దోచేసి చాలా మంది పారిపోతారు. అందుకే ఐ హేట్ మెన్ ఇన్ని రోజులు ఎంతమంది నా వెంటపడినా ఏడ్చినా ఎవర్ని యిష్టపడలేదు నా మనసుకి నచ్చిన మొదటివాడివి ఆఖరి వాడివి నువ్వే" చాలా స్దిమితంగా అంది మేరి.
రాబర్టు మాట్లాడలేకపోయాడు.
ఓ నిట్టూర్పు విడిచాడు.
"ఏమిటి ఆలోచన? నువ్వు నిజం చెప్పు నువ్వు నన్ను ప్రేమించడం లేదా" అడిగింది జాలిగా.
"ప్లీజ్ నన్ను విసిగించకు" అన్నాడు రాబర్టు.
మేరి అప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంది.
"అనుకున్నాను కానీ నువ్వూ మామూలు మగాడివే " ఎత్తి పోడుస్తున్నట్టుగా అంది వెక్కి వెక్కి ఏడుస్తూ మేరి.
మేరి తల పైన చెయ్యివేసి నిమిరాడు రాబర్టు
"ఏడవకు మేరి నిన్ను మోసగించాలని నేనెప్పుడూ అనుకోలేదు కానీ నీకు తెలిదు ఈ గుండెల్లో రగిలే అగ్ని పర్వతాల గురించీ నీకు తెలిదు ఈ రాబర్టు ఏమిటో నీకు తెలిదు.
ఎలా చెప్పను?
ఏమని చెప్పను?
నేను ఏ స్ధితిలో వున్నానో నాకే తెలిదు మేరి"
"ప్రభువు నన్ను పెళ్ళిపిటల పైన నడిపిస్తాడో ఉరి కంచానికే పంపుతాడో తెలీని దౌర్భాగ్యపు బతుకు నాది నేను తొందరపడి నీ జీవితాన్ని నాశనం చెయ్యలేను" రాబర్టు కళ్ళలోని ఎర్రని జిరాల్ని చూసి కలవరపడినా మేరి ధృడంగా అంది.
