Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 24

 

    "అది మితిమీరితే  కొంప మునుగుతుంది."

    "నీకు కోంపెక్కడి దోయ్ అప్పలకొండ , నాకు వుంది మునిగితే మంచిదే నా కొంప ఏం__ముంచుతావా?" అంటూ కార్ నీ జర్క్ చేసింది.

    విజయ్ ముందుకు తూలాడు.

    "ఎందుకు అవస్ధ పడతావ్  కానీ  పన్ను పట్టుకుని కూర్చో." అంది అర్జున.

    "ఎక్కడ పట్టుకొను?"

    "నీ ఇష్టమొచ్చిన చోట అయినా నికా దైర్యం ఎక్కడిదిలే స్వామి" అంది అర్జున కన్ను గిటుతూ.

    "కారు మెల్లగా తోలు"

    "తోలడానికి ఎదులబండి కాదు  మిష్టర్ అప్పాలకొండా కారు కారు స్పీడు గా తిలితేనే  కారుకి, తోలేవానికి అందం" అంటూ కారా సింది  అర్జున.

    విజయ్ కారు దిగి.

    "బై బై "అన్నాడు.

    "బై ." అంటూ  రాకెట్ లా  వెళ్ళిపోయింది అర్జున.

        *    *    *

    రాబర్టు పెదవుల మధ్య సిగరెట్  వెలిగింది.

    "ఇది పూర్నాగాడి పనే!" అనుకున్నాడు. కాలేజి గోడల మీద పేర్లు రాసింది పూర్ణా గాడే వాడే చేయించి వుండాలి. అంతేకాదు  ఆ నాడు తనని కొట్టించింది కూడా వాడే అయుండాలి. లేకపోతే అర్జున దగ్గర కెళ్ళి ఎలా చెప్పగలడు.

    పూర్ణా.

    రమేష్!
   
    దాసు!

    "త్రివిచ్చేస్" పళ్ళు పటపట కొరికాడు.

    ఆ రోజు.,..పూర్ణా అర్జున పైన సవాల్ చేశాడు అంతు  చూస్తానని.

    రాబర్టు అడుగులో అడుగు వెస్తూ కిటికీ దగ్గరగా  నడిచాడు.

        *    *    *

    డి. యస్ .పి  గారమ్మాయి  శోభాకి  విజయ్ ప్రేమలేఖ  రాశాతన్న వార్త గుప్పమంది కాలేజిలో.

    శిభాచేత  ఎఅమేష్ ప్రిన్సిపాల్ కి రిపోర్టు చేయించాడు. శోభాకి విజయ్ పైన సదభిప్రాయమే వుంది. కానీ ఆ లవ్ లెటర్  లేడిస్  రూంలో  అందరూ వుండగా  అందడంతో  తల కొట్టేసినట్టయిందామెకి.

    విజయ్ తనకేమి  తెలిదన్నాడు.

    శోభాకి నచ్చచెప్పడానికి  అర్జున ప్రయత్నం చేసింది. రెండు రోజుల్లో నిరూపిస్తానంది అర్జున.

    "ఎలా చేస్తావమ్మా" అడిగాడు ప్రిన్సిపాల్.

    "అప్టాల్ ఇది  చాలా చిన్న విషయం సార్. విజయ్ నేను త్వరలో  పెళ్లి చేసుకోబోతున్నాం. అది తెలిసి కావాలని ఎవరోచేసిన  చిలిపి ప్రయత్నం"  అంది.

`    "అవునండి  అతను చేశాడంటే నేను నమ్మలేకుండా వున్నాను. దీనికి కారణమ్తెన  వాడిని డిస్మిస్  చేస్తే కానీ మిగిలినవాళ్ళకి  బుద్దిరాదు" అంది శోభ.

    "వీల్లేదు  ఇది విజయ్ రాసినట్టు తెలుస్తూనే వుంది. ముందు అతన్ని సస్పెండ్ చెయ్యండి" అన్నాడు రమేష్ .

    అర్జున శోభకేసి చూసింది.శోభ అంది.

    "ప్రిన్సిపాల్ గారూ నాకు విజయ్ పైన అనుమానంలేదు. ఎంక్వయిరీ  చేయించండి. తర్వాత యాక్షన్  తీసుకోవచ్చు" అంది.

    రమేష్ దుమదుమలాడుతూ  వెళ్ళిపోయాడు.

    సాయంత్రం  తెలుగు లెక్చరర్  వెంకట్రామయ్యగారింటికి వెళ్ళారు అర్జున శిభ విజయ్.
   

    ఆయనకి విషయమంతా చెప్పి ఆయన దగ్గరున్న  తెలుగు టెస్ట్  పేపర్లని ఇవ్వమని  అడిగింది ఆర్జన.

    అన్ని పేపర్ల నీ వుత్తరంతో  పోల్చిచూశాడు.

    ఒక పేపరు మీద దస్తూరికి, ఆ ఉత్తరం లోని దస్తూరికి పోలిక ఒకటే దస్తూరి.

    "సార్ ఈ పేపర్ ఎవరిదీ?" అడిగింది శోభ.

    "నెంబరు 164 ఇది రమేష్ దస్తూరమ్మ " అన్నాడు  లెక్చరర్

    అది రాసింది రామేషెనని రుజువై పోయింది.

    విజయ్ అర్జునల పేర్లు గోడలపైన రాయడం విజయ్ నీ రౌడిలతో కొట్టించింది ఆ వుత్తరం  రాసింది  అన్ని ఆ 'తివిచ్చేస్' అని తెలిసి పోవడంతో రమేష్ నీ పూర్ణానీ కాలేజినించీ డిస్మిస్  చేశారు.

    ఆ సాయంత్రం  విజయ్ అర్జున కారేక్కుతుంటే పూర్ణా రమేష్  వచ్చారు.

    కాలేజిలో రుణం తిరిపోయినా ఇంకా చూరుపట్టుకుని  వేలాడతా  వేంస్వామి  పెట్టె, సర్దుకొని మీ వూరు  పోరాదూ?" అంది  పూర్ణానీ.

    "అర్జునా ఇల్లాల కాగానే  సంబరం కాదు. నీ గుండెల్లో నిద్ర పోతాను" అన్నాడు  పూర్ణా.

    "ఇంకా పొగరు చావలేదన్నమాట. శ్రీకృష్ణ జన్మ స్ధానానికి  పంపెస్తాను  జాగ్రత్త" అంది.

    "నీ అంతు చూసే వేళతాను.

    "మిష్టర్ పూర్ణా నేను మామూల ఆడదాన్ని కాదు. అగ్ని గోలాన్ని ఈ కారు చక్రాల కింద  పడి నలిగిపోకుండా  నిన్ను నువ్వు కాపాడుకో" అంటూ  విసురుగా కారుని పోనిచ్చింది.

    విజయ్  విస్మయంగా  చూస్తూ వూరుకున్నాడు అర్జున మాట్లాడుతుంటే అతనికి మాటలురావు.

                *    *    * 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS