"ఎవరో చూశావా మొగుడ్ని అమ్మకానికి పెట్టినట్టు ప్రకటన యిచ్చింది. చాలా వింతగా లేదు?"
"అంతకంటే వింతైనవి ఈ ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. తండ్రి కూతర్ని రెఫ్ చెయ్యడం,పసిపిలల్ని తండ్రి పొడిచి చంపడం, పసిపిలల్ని తండ్రి పొడిచి చంపడం, రెండు తలల శిశువు జన్మించడం.... ఇలాంటి వార్తలన్నీ ఇవే న్యూస్ పేపర్లలో చదువుతున్నాం."
రాంపండు ఆశ్చర్యంగా రాజీ వంకచూశాడు. తను లాంటి న్యూస్ చదువుతుందనీ భావించాడు. కానీ రాజీ ఏ మాత్రం ఇంటరెస్ట్ చూపించలేదు.
"నువ్వు చెప్పింది నిజమే గానీ మరీ మొగుడ్ని అమ్ముతానని పెళ్ళాం ప్రకటించటం నేనేక్కాడా చూడలేదు. నువ్వేన్నయినా అను. ఇండి వింతల్లో కెళ్ళా వింత... నీచం కూడానూ..."
"తమ అవసరాల కోసం, స్వార్ద ప్రయోజనలా కోసం పెళ్ళాన్ని వేరే మగాళ్ళకు తార్చే భర్తలున్నారు. అంతకంటే ఇదెం నీచం కాదు" అంది రాజీ.
"ఏమో.... నువ్వేమయినా చెప్పు. నాకీ విషయం మింగుకుంటాడనీ?"
"నువ్వు నాకొద్దు అని అంటే ఒప్పుకోక ఏం చేస్తాడు?"
'వద్దని అంటే ఆమెని వెళ్ళిపొమ్మంటాడు. లేదా తనే వెళ్ళిపోతాడు. అంతేగానీ అమ్మకానికి రెడీగా కూర్చుంటాడా? అసలు ఈ ప్రకటన యిచ్చిన ఆ మహాతల్లిని ఓ సారి చూడాలని వుంది..." అన్నాడు రాంపండు.
"చూడాలని వుంది అని అంటారేం? ఆమె నీకు తెలేయకపోతే కదా!"
"నాకు తెలుసా?" ఆశ్చర్యంగా అడిగాడు.
"మీరు ప్రకత్నక్రిమ్డ యిచ్చిన అడ్రస్ చదివి వులిక్కిపడ్డాడు. అది వాళ్ళ యింటి అడ్రస్. కానీ ప్రకటన ఇచ్చినామె పేరు మాత్రం రమ అని వుంది.
"రమ... ఎవరీ రమ? మన ఇంటి ఆడ్రస్ తో ప్రకటన ఇచ్చిందెం? ఈమెనీ ప్రేంఢా?" అయోమయంగా అడిగాడు రాంపండు.
"కాదు... నేనే ఆ రమని."
* * * *
ఆఫీసులో కూర్చుని ఫైళ్ళవంక చూస్తున్నాడన్న మాటేగానీ రాంపండు బుర్రలోకి ఏమీ ఎక్కడం లేదు. ఓ రెండు గంటల క్రితం జరిగిన సంఘటన అతని బుర్రని తొలిచేస్తుంది.
తాను ఆ రోజెప్పుడో అంతగా అయితే నన్ను అమ్మేసుకో అని ఊర్కే అన్నంత మాత్రాన నిజంగనే పేపర్లో ప్రకటన ఇచ్చేయ్యాలా? పైగా రమ అనే పేరుతో ఎందుకిచ్చావ్ అంటే తన పేరుతో అయితే నా పరువు పోతుందని అలా యిచ్చిందట పేరు మారిస్తే ఏం లాభం ఆడ్రస్ మనదే కదా అంటే వేరే పేరుమీద ప్రకటన వచ్చింది కాబట్టి అది ప్రింటింగ్ మిస్టేక్ అని చుట్టుప్రక్కలవాళ్ళు అనుకుంటారట! కాబట్టి పరవాలేదట! షిట్...
ఫైలు తీసి టేబుల్ కేసి కొట్టి వేరే ఫైలు అందుకుని దాన్ని స్టడీచేశాడు అతను. దాంట్లోదీ ఒక్క ముక్క కూదాతనికి అర్ధం కావడం లేదు. అతని బుర్ర సరిగా పనిచేస్తుంటే కదా ఏ విషయం అయినా అర్ధం కవాడానికి.
'నన్నే మో నాలుగు లక్షలకి కొందట...కాబట్టి లాభానికి అమ్ముతుందట! ఇదెక్కడి అన్యాయం అంటే నువ్వే కదా నన్ను అమ్మేసుకో అని అన్నావు అంటుంది. ఫోనీ వేరే వాళ్ళకి అమ్మడం యిష్టం లేకపోతే ఆ నాలుగు లక్షలూ నా మోహాన పారేసి నీ దారి నువ్వు చూస్కో అంటుంది. అయినా కోపం వచ్చినప్పుడు లక్షా తొంబై అంటాం... దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా? కోపంతో నరికేసుకో అంటే నిజంగానే నరికేస్తుందా?' అనుకున్నాడు.
ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయి తల గట్టిగా పట్టుకున్నాడు రాంపండు.
"ఏంటోయ్ పండూ! తల గట్టిగా పట్టుకుని కూర్చున్నావ్? అంత తలనొప్పి పుట్టించే ఫిలా అది?"
బ్రహ్మాజీ గొంతు విని తల పైకెత్తి చూశాడు రాంపండు. అతని చేతిలో న్యూస్ పేపర్!
"ఆ.. అ... కాస్త తలనొప్పి కలిగించే విషయమే. కాస్తెంటి? చాలా తలనొప్పి కలిగించే విషయం!" అన్నాడు రాంపండు నీర్సంగా.
"అయితే ఆ ఫైలక్కడ పడేసేయ్! నీకో గమ్మత్తయిన విషయం చెప్తాను. కాస్త రిలాక్స్ అవుదువుగానీ" అంటూ న్యూస్ పేపరు విప్పాడు బ్రహ్మాజీ.
రాంపండు గుండె గుబగుబలాడింది.
"ఇదిగో....ఈ న్యూస్ పేపర్ లో ప్రకటన చూశావా?" పేపర్ ని అతని ముందుంచాడు బ్రహ్మాజీ. "చదువు...
నీకేం తెలుస్తుంది. ఎవతో రెడీమేడ్ మొగుడ్ని అమ్ముతానని ప్రకటన యిచ్చింది."
ఎవతోనా? తన భార్యని అతను అలా అనడం రాంపండుకి కోపం తెప్పించింది. కానీ ఏం చెప్తాడు కోపాన్ని దిగమింగుకోడం తప్ప.
ఇంటి దగ్గర చదివిన ప్రకటననే మళ్ళీ చదివినట్టు నటించి ప్రక్కన పడేశాడు.
"ఏంటీ? చదివి అలా ప్రక్కన పడేశావ్ . అదెంతో మామూలు విషయం అయినట్టూ" ఆశ్చర్యంగా అడిగాడు బ్రహ్మజీ.
"లేకపోతే ఇంకేం చెయ్యమంటావు? పరుగెత్తుకెళ్ళి ఆవిడని అపమంటవా? ఆవిడా సంగతి ఆవిడా మొగుడు చూసుకుంటాడు మనకేందుకు?" కాస్త చికాకుగా అన్నాడు రాంపండు.
"నువ్వేదో చేస్తావని కాదు. ఇలాంటి ప్రకటన చదివిన తర్వాత ఓ యాక్షన్ అంటూ వుంటుంది కదా! దాని గురించి నేను మాట్లాడుతున్నా!"
"ఏమో..! అవిదకేం యిబ్బంది వుంది అలంటి ప్రకటన ఇచ్చిందో?"
ఆమె యిచ్చిన ఆడ్రస్ చూశావా? నువ్వు వుండే ఏరియాలోనే వుంటుంది. రమ అట! మీ కేమైనా తెలుసా?" కూతుహాలంగా అడిగాడు బ్రహ్మాజీ.
"తే...తే... తెలీదు" అన్నాడు రాంపండు.
"నీకు తెలీయకపోయినా మీ ఆవిడకి తెలిసే వుంటుందిలే. ఈ వేళ యింటికేళ్ళాక అడుగు."
"ఊ.."
"అమ్మో! అదేవతో గుండెలు తీసిన బంతుల వుంటుందిలే. ఈ వేళ మోగుడ్నే అమ్మేస్తుంది. దాని మొహం మండా... అయినా అది అమ్మినా అమ్మించుకోవడానికి దాని మొగుడెంత చవట సన్నాసో...? హిహిహి" అన్నాడు బ్రహ్మాజీ.
"షటప్! నువ్వు కాస్త నోర్ముయ్!" గట్టిగా అరిచాడు రాంపండు డిపార్ట్ మెంట్ లోని అందరి తలలూ వాళ్ళవైపు తిరిగాయ్.
బ్రహ్మాజీ బిత్తరపోయాడు. రాంపండు తల వొంచుకున్నాడు.
రెండు క్షణాలు చూసి మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి పోయారు.
"సారీరా! నువ్వు చేసిన కామెంట్ కి కోపం వచ్చి అలా అరిచా" మెల్లగా అన్నాడు రాంపండు.
వాళ్ళనేవరినో అంటే అతనికెందుకు కోపం వచ్చిందో బ్రహ్మాజీకి అర్ధంకాలేదు.
"అయినా వాళ్లకేం ప్రాబ్లమ్స్ వున్నాయో మనకేం తెలుసునని అలా కామెంట్ చెయ్యడం?" అన్నాడు రాంపండు.
"నిజమే కవొచ్చుగానీ... నీ కోపం చూస్తుంటే ఆ రమ నీ పెళ్ళామేమో అన్నా అనుమానం వస్తుంది ఎవరికైనా."
రాంపండు గతుక్కుమన్నాడు. మళ్ళీ అంతలోనే తేరుకుని "నువ్వు భలే జోకులేస్తావు బ్రహ్మాజీ! హహహ...." గట్టిగా నవ్వుతూ అన్నాడు
