ఊర్మిళ కన్నీరు అతడ్ని కలవరపరుస్తోంది. తనంటే ఆమెకెంత యిష్టమో పరుశురాం కి తెలుసు.
సిగరెట్ పొగని గుండెల్లోకి పీల్చి వదిలాడు పొలమారింది.
దగ్గు.... కళ్ళల్లో నీరు......
ఆ సమయంలోనే చేయి అతడు భుజం పైన పడింది.
తల తిప్పి చూశాడు.
ఊర్మిళ...
పవిటచెంగుతో అతని కళ్ళను తుడిచింది.
"నువ్వెందుకొచ్చావు ఊర్మళా!" జీరబోయింతని గొంతు.
ఆమె దిగులుగా చూసింది.
"పోలీసులతో దెబ్బలుతిని ఇంటికొస్తే ఆదరించేది పోయి ఇంట్లోంచి గెంటాడు నాన్న. నా మనసుండబట్టలేక నేనే వచ్చేశాను" అతడు గుండె మీద ఆనించి వెక్కి వెక్కి ఏడిచింది ఊర్మిళ.
ఆమె తలపైన చేత్తో ఏడిచింది ఊర్మిళ.
"ఒళ్ళు హూనం చేసేశారు ఊర్మళా!" బాధగా చెప్పడతను.
"ఇలాంటి సమయంలో నీకు దగ్గరుండి సేవచేసే అదృష్టం లేకపోయింది."
"ఫర్వలేదు . నువ్వెళ్ళిపో.ఎవరయినా చూస్తే బాగోదు."
ఆమె తలెత్తి అతని మొహంలోకి చూసింది.
"ఒకళ్ళకి బాగుంటుందా లేదా అన్నది నాకు అనవసరం బావా! నా బావ కోసం నేను వచ్చాను. అది తప్పంటే ఎలా? నా బావ కట్టుబట్టలతో బయటకొచ్చేశాడంటే బాధ నాకుంటుంది గానీ ఇంకెవళ్ళ కుటుంది?" ఆమె గొంతులో దుఃఖం ధ్వనిస్తోంది.
ఆమె పిచ్చిగా నవ్వింది.
"పిచ్చిదాన్ని బావా! వెంటరావద్దంటే ఎత్తుకోమని ఏడ్చినట్టు , నువ్వు ప్రేమించకపోయినా వెంటపడుతున్నానని కాదు నువ్వు. నువ్వు అనుకునేది!"
" చెప్పకు బావా! నువ్వు నన్ను ప్రేమించలేదని నాకు తెలుసు."
"నా మీద నాకు ఒట్టి అభిమానం తప్ప ప్రేమలేదు నాకు తెలుసు. అయినా నీమీద మమకారాన్నీ,ప్రేమనీ ,ఆరాధననీ పెచుకున్నాను భావా! దానికి నీ అనుమతి అవసరం లేదు అది నాయిష్టం"
"అంటే?"
ఊర్మిళ వెర్రిగా చూసిందతన్ని.
" నువ్వు నన్ను ప్రేమించకపోవచ్చు. కానీ నన్ను ప్రేమించవద్దనడానికి, నీకు అధికారం ,హక్క లేవుగా!"
అతను మాట్లాడలేదు. ఊర్మిళ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది
"ఎక్కడికెళ్ళాలని వచ్చావు?" అడిగింది.
"తెలీదు."
ఆమె నిట్టూర్చుంది.
"నీకు తెలీదని నాకు తెలుసు. నేను కూడా వచ్చేస్తాను.నీతో తీసుకెళతావా?" అడిగింది ఊర్మిళ.
ఆమె మాట్లాడే ప్రతి మాటా చాలా ఇరకాటంలో పెడుతోంది పరుశురాం.ని
ఏం సమాధానం చెప్పడానికి తోచడం లేదనతనికి.
"నా నిస్సహాయతని గుర్తుచేసి పరితపిస్తున్నావాఊర్మిళా!" అన్నాడు.
ఆమె అతని పెదవులకి చేతిని అడ్డుపెట్టింది.
"ఎంత మాటన్నావు బావా! మానసికంగా నేను నీకెంత దగ్గర అయ్యానో నీకు తెలీదు. ఇది నీకు తెలుసా?"
"ఏమిటి?"
"ప్రతి రాత్రీ నీపక్కలో పడుకున్నట్టే అనుభూతి చెందుతుంటాను"
ఆమె పెదవులపైన చిరునవ్వు కదలాడుతోంది. మొహంలో సిగ్గు దొంతరలు.... అంతలోనే సీరియస్ గా మారిపోయింది.
" సిగ్గువిడిచి మాట్లాడుతున్నానుకుంటున్నావు కదూ! నీ దగ్గర నా కెందుకురా సిగ్గూ!"
"నువ్వు అమాయకుడివి. దుర్మార్గులకీ,అవినీతికీ నిలయమైపోయిన ప్రస్తుత కలుషిత వాతావరణంలో నీకు తోడుగా, అండగా నిలవాలనుకోవడం... అది నా స్వార్థం బావా!"
."పిచ్చి పిల్లా! నేను నేరస్థుడిని. ఊళ్ళో జనం నన్నెలా చూస్తున్నారో తెలుసా?"
ఊర్మిళ అతని నుదుటిపైన ముద్దాడింది. చుట్టూ వున్న పొలాల పైనుంచి వీస్తున్న పైరుగాలికి ఆమె అందమైన ముంగురులు మొహం పైన పడుతున్నాయి.
"నువ్వు అనుమానించలేదని నువ్వు..... నువ్వు నమ్ముతున్నావా?" ఆమె భుజాలను గుచ్చిపట్టుకుని కుదిపేస్తూ అడిగాడు పరుశురాం.
ఆమె నవ్వింది.
" ఈ ప్రపంచమంతా ముక్తకంఠంతో నిన్ను నేరస్థుడున్నా నేను నమ్మను బావా! ఆనాడు నిన్ను కవ్వించడానికి చిలిపితనంతో నీకు నగ్నంగా కనిపించినా , నిగ్రహంతో నన్ను మందలించావు.
అంత అవకాశం దొరికినప్పుడు ఏ ఆడదాన్నైనా ఏమగాడైనా విడిచి పెడతావా
అనాడు నువ్వు చూపిన నిగ్రహం నన్ను మందలించడంతో నీమీద ఆరాధన రెట్టింపయింది నాకు.
అలాంటి మనిషి ఓ ఆడపిల్ల యింటికి వెళ్ళి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడంటే నేనెలా నమ్ముతాను? నువ్వో మనిషిని హత్య చేశావంటే నమ్మేదాన్ని కానీ ఆడపిల్లనైన అత్యచారం చేశావంటే నా కంఠంలో ప్రాణముండగా నమ్మను.
అవును బావా!
నీకు అంత 'అడది' కావాలనుకుంటే నీ కోరిక తీర్చడానికి నీకౌగిటిలో కరిగిపోవడానికే నా మన సెరిగిన నువ్వు నన్ను నీ అనుభవంలోకి తీసుకుపోయేవడివా?
