Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 23

 

    "ఆడపిల్లని కనకే నిన్ను వెతుక్కుంటూ నీ గదికి వచ్చాను.నువ్వు కాలేజికి రాలేదు. ప్రిన్సిపాల్ నిన్ను అడిగాడు.

    "పద వెళదాం" ఆన్నాడు.

    అర్జున కారు  డోర్ తెరచింది.

    "ఈ పరిస్దితిలలో మనం ఇద్దరం కలిసి వెళితే ఇంకా గొడవగా వుంటుంది అర్జునా."

    "డోంట్ ఫియర్ మ్తెబాయ్ నిన్నేలాగు వేనేగా పెళ్ళిచేసుకొనేది" అంది నవ్వుతూ.

    "నిన్నా, పెళ్ళా?"

    "ఏం నా కంటే అందమ్తెంది దొరుకుతుందా నీకు!"

    "కో అంటే  కోరిమంది" నవ్వుతూ అన్నాడు విజయ్.

    "మిష్టర్ జి, నీ జాతకంలో వుంది నేనొక్కదాన్నే నన్ను మిస్ అయితే నీ కసలు పెళ్ళి కాదు ఇది  నాశాపం" అంది అర్జున.

    కారు చాలా రాష్ గా పోతోంది అర్జున డైవ్ చేస్తుంటే  ప్రాణాలు గుప్పెట్లో  పెట్టుకోవాల్సిందే  దారి పొడుగునా ఎవరో ఒకరు  తిట్టుకుంటూనే వుంటారు ఆమె కారు స్పీడుచూసి.

    "అందరితో  చివాట్లు తినేబదులు మెల్లగా పోవచ్చుగా" అన్నాడు విజయ్.

    "అసలు డాడికి చెప్పి ఈ రోడ్డు మొత్తాన్ని  కోనేయాలనుకుంటున్నాను. ఎవరూ నడవకుండా" అంది అర్జున.

    కాలేజిలో కారు ఆపుతూనే అంది అర్జున.

    "చూడు ఎంత అందంగా  రాపెరో వెధవలెవరో తేలిస్తే పోయి డాంక్సన్న చెప్పచ్చు" అంది  ప్రిన్సిపాల్  గదివైపు నడుస్తూ.

    ప్రిన్సిపాల్ ఇద్దర్ని చూసి అన్నాడు.

    "మీ కెవరిమిదన్నా అనుమానం వుందామ్మా" అడిగాడు.

    "నాకు ఈ విజయ్ రాసి వుంటాడని అనుమానంగా వుంది సార్" అంది అర్జున నవ్వుతూ.
   
    "ఆ" అన్నాడు ప్రిన్సిపాల్

    "రాసుకొనివ్వండి సార్ ఎవరి సరదా వాళ్ళది. నేనేమి దాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. పట్టించుకొన్నకొద్ది వాళ్ళు రెచ్చిపోతారు. ఈ గోడలు చాలకపోతే డాడికి చెప్పి పదిగోడలు కట్టించాలను కొంటున్నాను అంది.

    "అదికాదమ్మా ఎంత్తేనా నువ్వు ఆడపిల్లవి."

    "ఏమిటిసార్ ! ఆడ మగ అంటూ విడదీస్తారు. పరువూ మర్యాదా ఎవరికీ  పోయినా ఒకటే మిరి విషయాల్ని మర్చిపోండి సార్, మా స్నేహాన్ని చూసి గిట్టని వాళ్ళు చేశారిపని  గోడలకి  సున్నం వేయించండి. ఖర్చు నాదే " అంది విజయ్ తో పాటు బయటకోస్తూ అర్జున.

    తాము ఊహించినట్లు ఏడుస్తూ తలొంచుకొని  కాకా ధీమాగా హిరోతో సహా వస్తున్న అర్జుననీ చూసి కొంతమంది విస్తుపోయారు.

    స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంటు రమేష్ అతని ఆవ్త మిత్రుడుగా కాలేజిలో చెప్పుకోబడే పూర్ణ దాసు, వాళ్ళ ఎదురురుగా వచ్చారు.

    రమేష్ అన్నాడు.

    "సారి మిస్ మన కుర్రాళ్ళలోనే ఎవరో ఇది చేసివుంటారు. దీనికి నేను చాలా బాధపడుతున్నాను. నేను ఇది చేసిందెవరో తేలుచుకోనేవరకు నిద్రపోను" అన్నాడు.

    "చూడు రమేష్ ఈ చిన్న విషయాన్ని పట్టించుకోనేంత టైము నాకులేదు. నువ్వేమి శ్రమ పడకు" అంది.


    కారులో కూర్చున్నాడే కానీ విజయ్ ఆలోచిస్తున్నాడు.

    ఇది ఎవరి పని.

    రమేష్ నీ, పూర్ణాని దాసుని త్రివిచ్చేస్ అంటారు కాలేజిలో ఇది వీళ్ళ పనికాదుకదా! అన్న అనుమానం విజయ్ కి  కలిగింది.


    పూర్ణా పంచాయితి బోర్డు ప్రెసిడెంటు కొడుకు. అతని తండ్రి బసవయ్యలావే అతనికి పాపభీతిలేదు. రౌడి వెధవల్ని మొరిగే కుక్కలికి   బిస్కట్ ముక్కలు పడేసినట్లు  చేరదిస్తాడు. రమేష్ నీ కాలేజి ఎన్నికల్లో  గెలిపించింది కూడా పూర్నాయే.

    పూర్ణా అడుగుల్ల్లో  అడుగువేసి  నడుస్తారు రమేష్, దాసు.

    అర్జున నవ్వింది.

    "ఏమిటి ఆలోచిస్తున్నావు?"

    "ఒట్టి దద్దమ్మ" అంది.

    "నేను సీరియస్ గా అడుగుతున్నాను"
   
    "నేను సీరియస్ గానే చెప్తున్నా" అంది అర్జున.

    "చీకటిపడుతోంది ఇంకెక్కడికి తిసుకేళుతున్నావ్?" అడిగాడు.

    "చికటంటే భయమా?" అంది.

    "చీకట్లోనే అన్ని జరుగుతాయి" అన్నాడు.

    "అవును దెయ్యాలు కూడా వస్తాయి" అంది.

    "దెయ్యాలు  పగలూ వస్తాయి"

    "నువ్వు చూశావా?"

    "ఆ"

    "ఎలా వుంటుంది"

    "అటుచూడు" అన్నాడు రియర్ వ్యూ మిర్రర్ నీ చూపిస్తూ.

    "అయితే దయ్యాలు అందంగా వుంటాయన్న మాట"

    విజయ్ నవ్వేడు.

    "విజయ్  మనుషులు దెయ్యలెందుకవుతారు?" అడిగింది  అర్జున.

    "మనసులో కోరికలు తీరకుండా చచ్చిపోతే  అవుతారు"

    "కరెక్ట్ అవునా అందుకనే నేను కోరిన కోరికలన్నీ  వెంటనే  తీర్చే సేయ్ ఏ ఏక్సిడెంట్  లోనో నేను వెళ్ళి పోయాననుకో నిన్ను పట్టుకుంటాను మళ్ళి" అంటూ  పగలబడి  నవ్వేసింది.

    విజయ్ కోపంగా "ఇంక అవుతావా?" అన్నాడు.

    "నీకు చాతకాదు ఎవరన్నా నవ్వితే ఏడుస్తావు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS