"ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కానులె...!" అంది రాజీ అతని అంతర్యం గ్రహించి.
"ఆ విషయం నాకు తెలుసనుకో... హాఠాత్తుగా మాయం అయ్యే సరికి భయం వేసింది...." అన్నాడు రాంపండు ఆమెని మరింత దగ్గరకు లాక్కుంటూ.
"అంతేలే... మనిషి దూరం అయ్యారనుకుంటేనే వాళ్ళా విలువ తెలుసోచ్చేది!"
"నా మీద ఇంకా కోపం పోలేదా... ఉదయం నుండీ కనిపింఛకుండాపోయి నన్ను హైరానా పెట్టేసి కసి తీర్చుకున్నావుగా.... ఇకనైనా నువ్వు...."
"నీ మీద నకు కసీలేదు.... కోపం లేదు.... ఎవరికిఎమ్త ప్రాప్తమో అంతవరకే దక్కుతుంది!.... ఏం చేస్తాం!" అంది రాజీ నిర్లిప్తంగా.
"అబ్బా...ఇంక మాములుగా మాట్లాడు!... సరేగానీ ప్రోద్దున్న నుండీ ఎక్కడి కేళ్ళావు అంతే చెప్పావెం?" అడిగాడతను.
"ఎక్కడికో అక్కడికి వేల్లానులే."
"ఏం... అదేమైనా చెప్పకూడని రహస్యమా?" "నీలాగా నాకేం రహస్యాలు లేవు?"
"మరి ఎక్కడికెళ్ళావో చెప్పడానికికేం?
"పత్రికా ఫీసుకి వెళ్ళాను!" అంది ఆమె.
పత్రికాఫీసుకా? ఎందుకూ...?!" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అతను.
"నేను రాసిన కధలూ, కవితలూ కూడా రాస్తావ...? నాకు తెలీదే?!... ఇన్నాళ్ళూ నాకీ విషయం ఎందుకు చెప్పాలేదూ? మా ఆవిడా రచియిత్రి అయిపోతుందోచ్..." సంతోషంగా అని ఆమె బుగ్గా గిల్లాడు అతను.
కానీ అంతలోనే అతనికి ఓ అనుమానం వచ్చింది.
"కధలు ఇవ్వడానికి అంత ప్రొద్దునే నేను ఇంకా నిద్రలేవక ముందే వెళ్ళాలా? వెళ్ళినా ఇచ్చేసి వెంటనే వచ్చేయాలి గానీ రాత్రిదాకా ఏం చేశావు?" సందేహంగా అడిగాడు.
"ఏం?.... మీ ఆఫీసు అయినా వెంటనే నువ్వు తిన్నగా యింటికి వస్తున్నావా? రాత్రి రావడం లేదూ?" అడిగింది ఆమె.
అతనికి ఎక్కడోస్తున్నామో? ఎప్పుడో పని వుంటేనే కాస్త ఆలస్యము అవుతుంది!" అన్నాడు మేల్లగా.
"నేనూ రోజూ బయటకేళుతున్నావా? మన పెళ్ళయిన తర్వాత ఇదే మొదటి సారినేనిలా బయటకెళ్ళి ఆలస్యంగా రావడం!" అంది రాజీ.
రాంపండుకి అర్ధమయింది. రాజీ కేవలం తనని ఏడిపించడానికే అలా బయటకెళ్ళి ఎక్కడో రాత్రిదాకా కాలక్షేపం చేసి వచ్చిందని.
ఎంటో చిన్నపిల్లాలా దీని ప్రవర్తనా యిదీనూ!
నవ్వుకున్నాడు అతను.
"పోనిలే తల్లీ.... నీ రహస్యాన్ని నువ్వే దాచుకో.... నిన్ను మాత్రం నాలో దాచుకో!" అంటూ ఆమెని దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.
"ఈ ప్రేమ ఎంతసేపు.... రేపు తెల్లారిన తర్వాత మీరాఫీసుకేళ్తారు. అక్కడనుండి మళ్ళీ అంతా మామూలే!"
"సరే...సరే...ఊర్కో ఇలాంటి సూటీపొటీ మాటలతో టైము వేస్టుచేయ్యకు."
మంచం ప్రక్కనే వున్న లైట్లా అర్పేశాడు రాంపండు.
* * * *
ఉదయం....
రాజీ యిచ్చిన వేడి వేడి కాఫీ త్రాగి టీపాయ్ మీద ఖాళీ కప్పు పెట్టాడు రాంపండు.
సరిగ్గా అప్పుడే వీధిలోంచి రివ్వున దూసుకుంటూ వచ్చి మడత పెట్టిన న్యూస్ పేపర్ అతని నోసలకి ఠాప్ మని కొట్టుకుని నేలమీద పడింది.
రాంపండు ఉల్లిక్కిపడ్డాడు.
"వీడమ్మ కడుపు మాడా.... న్యూస్ పేపర్ యిచ్చే పద్దతి ఇదేనా అని" అంటూ విసుక్కుని గబగబా వరండాలోకి వెళ్ళాడు.
అప్పుడే న్యూస్ పేపర్ కుర్రాడు ప్రక్కింట్లో కూడా న్యూస్ పేపర్ విసిరేసి హడావిడిగా ముందుకు వెళుతున్నాడు పరుగులాంటి నడకతో.
"ఏయ్ బాబూ!" గట్టిగా పిలిచాడు రాంపండు.
పేపర్ కుర్రాడు వెనక్కి తిరిగి చూశాడు "ఏం సార్! ఈ వేళ ఇంగ్లీష్ పేపరు కూడా కావాలా?" అడిగాడు.
"ఏం? కావాలని అంటే దాన్నీ నా నెత్తికేసి కొట్టిపోతావా? అయినా ఏంటి బాబూ ఆ పేపరు విసిరే పద్దత.... కాస్త చూసుకుని విసరోద్దూ..... నువ్విలానే విసురుతూ వుంటే నిన్ను మాన్పించేసి వేరే పేపరాబ్బయిని పెట్టుకుంటూ."
"అలాగే పెట్టుకోండి.... ఆ యద్గిరిగాడు లేదూ... వాడిని పెట్టుకొండి" అన్నాడు పేపరు కుర్రాడు నిర్లక్ష్యంగా.
"ఏం? వాడయితే పేపర్ని నీలాగా విసరడా?" అడిగాడు రాంపండు.
"నాలాగా విసరడు... పేపరు మద్యలో రాయి పెట్టి విసుర్తాడు. వడి గద్దర పేపరు తీసుకునే వాళ్ళకి చాలామందికి నెత్తికి కన్నాలు పడ్డాయి" అనేసి స్పీడ్ గా ముందు కెళ్ళిపోయాడు వాడు.
"ఓరి వీడి పొగరు మండా" అనుకుంటూ లోపలికెళ్ళి నేలమీద పడి న్యూస్ పేపరుని తీసుకుని సోపాలో కూలపడ్డాడు రాంపండు.
"పండూ... ఏం చేస్తున్నావ్?" లోపల్నుంచి రాజీ అడిగింది.
"న్యూస్ పేపర్ వచ్చిందా? సరే చదువుకొండి" అంది వంటగదిలోంచే.
రాంపండు న్యూస్ పేపరులోని మొదటి పేజీ చదివాడు. బొంబాయిలో బాంబు ప్రేలుళ్ళు, కరీంనగర్ లో నక్స్ లైట్ల ఎన్ కౌంటర్, మొగుడూ పెళ్లాల దారుణ హత్య, కాశ్మీర్ లో మిలిటెంట్స్ మొత్తం ఇవే వార్తలు.
విసుగ్గా పేజీ త్రిప్పాడు. మెల్లగా ఆ న్యూస్, ఈ న్యూస్ చదువుతున్న అతని కళ్ళని ఓ ప్రకటన ఆకర్షించింది.
"అమ్మకానికి మొగుడు"ఇదీ ఆ ప్రకటన చదివాడు.
"మీరు చాలాకాలంగా పెళ్ళి కాకుండా బాధపడుతున్నారా? పెళ్ళి చూపులకి వచ్చేవారు పెట్టె రకరకలా కండిషన్లకీ, కట్నం కాకుండా ఆశకొద్దీ డిమాండ్ చేసే పై లంచనాలకీ విసుగెత్తిపోయారా? అయితే అమ్మాయిలూ, ఇదిగో మీకు సదవకాశం. మీ కోసం రెడీగా, రెడిమేడ్ మొగుడు దొరుకుతాడు. నా మొగుడ్ని అమ్మకానికి పెడ్తున్నా, ఎత్తు అయిదడుగుల ఎనిమిదంగుళలు, చామనచాయ, మంచి ఉద్యోగం, (ఉద్యోగం,జీతంతో సహా అమ్మబడును) మీరు అత్తగారి యింటికి వెళ్ళనవసరం లేదు.ఆడపడుచుల బాధ అసలే రెడీమేడ్ మొగుడ్ని కొనుకున్నా వెంటనే హాయిగా యింటికి తీసుళ్ళోచ్చు! ఇష్టమున్నవారు క్రింద అడ్రసుని సంప్రదించండి."
"బాపరే!" గుండెల మీద చేయ్యేసుకున్నాడు రాంపండు. కలికాలం అంటే ఇదే! మొగుడుని పెళ్ళాం అమ్మేయటం ఏంటి? ఇదేవతో గుండెలతీసిన మంతులా వుండే, లేకపొతే ఆ మొగుడేవడో చచ్చుసన్నాసీ, చవటదద్దమ్మ అయి వుంటాడు!! అనుకున్నాడు.
"రాజీ..." ఒక్కసారిగా గావుకేక పెట్టాడు రాంపండు.
"ఏంటి? ఎందుకలా అరిచావు?" వంట గదిలోంచి పరుగున వచ్చింది రాజీ.
"పేపర్లో ఈ ప్రకటన చూశావా ఎంత విచిత్రంగా వుందో?" అన్నాడు అతను.
"ఏం ప్రకటన అది?" అడిగింది ఆమె.
