Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 23


    చల్లటి నీడనిస్తున్న ఓ చెట్టుకింద పడుకున్నాడతను.

    సిగరెట్ వెలిగించి ఓచేతిని తలకింద పెట్టుకుని వెల్లకిలాపడుకున్నాడు పరుశురాం.

     అతని బుర్రలో ఎన్నో ఆలోచనలు. దేనికీ ఓ రూపం రావటం లేదు.

    మేడం మాటని  కాదని వచ్చేయడం తను చేసింది పొరపాటా?

    పదిరోజులపాటు ముక్కూ మొహం తెలీని తనని ఆమె ఎంతో ఆదరించింది.
   
     కానీ ఆమె ఆదరణ వెనుక స్వార్థం తనకి నచ్చేలేదు.

    ఒక విధంగా అది ఆమె స్వార్థం అనుకోవడానికి కూడా వీలులేదు.

    ఆమెది జూద ప్రపంచం.

    గాంబ్లి గ్ క్విన్ నందిని కమర్షియల్ గా ఆలోచించి తనతో ఒప్పందము కుదుర్చుకోడానికి , నచ్చచెప్పడానకీప్రయత్నించడం ఏ విధంగా ను తప్పు కాదు.   

    తన కిష్టం లేదు.

    వచ్చేశాడు. అంతే! దాని గురించి ఆలోచించడంగానీ, బాదపడటం గానీ అనవసరం అనిపించింది.

     చేతిలో సిగరెట్ చివరకు లాగి వేలు చుర్రుమనడంతో దానితో మరో సిగరెట్ వెలిగించి దాన్ని పక్కన విసిరేశాడు.

     నిజానికి   తను  ఆమె ఒప్పందాన్ని అంగీకరించకపోయినా ఆమె తనను యిల్లు విడిచి పొమ్మనలేదు.అలా అనేది కూడా కాదు. తనంటే ఆమె కెందుకో  అంత అభిమానం....

     మేడం పట్ల అతనికి గౌరవం చెక్కుచెదరలేదు.

     ఆరోజు ఊర్మిళకీ తను ఇల్లు విడిచి హెచించటం ఇష్టంలేదు. కానీ ఇల్లు విడిచిపెట్టక తప్పలేదు.   

      మేనమామ చెన్నకేశవులు పరువు కోసం నాలిక్కోసుకుంటాడు. మేనమామ అగ్గిరాముడైపోయాడు.

      " పరుశురాం! తల్లీ తండ్రి లేనివాడివని నిన్ను చేరదీసినందుకు నాకు గొప్ప కీర్తిని సంపాదించిపెట్టావురా! ఇంత గొప్పవాడిపోతావని నేను కలలో కూడా ఊహించలేదురా! నన్ను నలుగురికీ మొహం చూపించకుండా చేశావు. చాలురా చాలు! చాలా గొప్ప నిర్వాకం చేశావు.... ఫో... నా క్కని పించకు."

    "సిగ్గులేక నోరుమూసుకుంటావేరా?చేసినదాన్ని సమర్థించుకోవడమా అది?"

    నేను ఆడపిల్ల తండ్రిని.....

    నా జాగ్రత్తలో నేనుండాలి. నీలాంటి వాళ్ళకి ఆశ్రయమిస్తే తోడేలుని నమ్మి పసిపిల్లకి కాపలా పెట్టినట్లవుతుంది."

    ఆ మాటలకి తల కొట్టేసినట్టయి చివాల్న తలెత్తి చూశాడు పరుశురాం.

    "ఏమటిరా ఏమిటా చూపు? ఆ... అర్ధం అయిందిరా.... నువ్విప్పుడు ఎలాంటి కిరాతకనికయినా రెడీగా వున్నావు..... ఇక నిన్ను ఉపేక్షించకూడదు గెటవుట్" అరిచాడు చెన్న కేశవులు.

     గుమ్మం  పక్కనే నిలబడి పమిట  చెరుగును నోటికి అడ్డంపెట్టుకుని విలపిస్తోంది ఊర్మిళ.

     మేనమామ కోపం  ఎలాంటిదో అతనికి తెలుసు.ఇప్పుడు తనేం చెప్పినా వినే పరిస్థితిలో లేడాయనని అతనికి తెలుసు.

    "వెళ్తాను. కానీ వెళ్ళేముందు  ఒక్క మాట  మామయ్యా....!"అన్నారు పరుశురాం మెల్లగా.

     "ఛ...నువ్వు చెప్పడం నేను వినడమూనా! నథింగ్ బాబా నథింగ్- నీ ఫేస్ చూస్తుంటే నాకు ఒంటిపైన జెర్రులు పాకుతున్నాయి-

     "ఉరిశిక్ష విధించబడిన వాడికి కూడా ఏదన్నా చెప్పుకోడానికి ఒక అవకాశం యిస్తారు మామయ్యా!"

    "దానిక్కూడా నీకు అర్హత  లేదురా! నిన్ను నా కూతురితో సమానంగా కన్న కొడుకులా పెంచాను.

     ఓ  ఆడపిల్ల పైన  అత్యాచార ప్రయత్నం చేసిన నిన్ను మనిషిగా గుర్తించలేను. నీకూ నాకూ మధ్య వున్న రక్తసంబంధాన్ని ఈ రోజుతో తెంచేస్తున్నాను."

    " తెంచేస్తే తెగిపోతుందా మామయ్య మన అనుబంధం?" ఆవేదనతో అన్నాడతను.

    "సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నించకురా పరుశురాం.

     నాచేత అన్నింటికీ తిలోదకాలిప్పించేశావు. తిరిగి నేను గడపలోకొచ్చేసరికి నువ్విక్కడ నాక్కనిపించకుడదు" అని చెన్నకేశవులు బయటకి నడబోయాడు.

     విరక్తితో నవ్వాడు పరుశురాం.

     ఇక ఆ  ఇంటితో రుణం తీరిపోయిందని ఖచ్చితంగా అర్థమయిపోయింది.

     "అంతవరకూ అవసరం లేదు మామయ్యా! ఇప్పుడే వెళ్ళిపోతాను" అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోటానికి ప్రయత్నిస్తూ మెట్లు దిగాడు.

     గేటులోంచి బయటికి  ఆహ్వానిస్తాడని కాదు. ఊర్మిళని చూడాలనిపించింది.

     ఆమె తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుని బోరుమని ఏడుస్తోంది.

                                                                                 10

     రైల్వే స్టేషన్ సమీపంలో వున్న కాలువ గట్టు మీద కూర్చున్నాడు పరుశురాం.

     చిన్న చిన్న గులకరాళ్ళని నీళ్ళలోకి విసురుతున్నాడు.

     అతడి పక్కనే బోడెడన్ని సిగరెట్ పీకలు పడివున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS