Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 22

 

    "నా పిల్లలు రత్నాలు మిష్టర్ రాబర్టు తల్లిలేని పిల్లలవడం చేత నా కళ్ళులా  చూసుకుంటూన్నాను ఈ గుండెలపైన పెంచుకొంటూన్నాను" అన్నాడు జోసఫ్.

    "మీరుకూడా ఒక్కడే వుండొచ్చుగా" అడిగాడు రాబర్టు.

    "నేను  కలక్టరాఫిసులో  పనిచేస్తూన్నా బాబూ సర్వీసు మరో సంవత్సరం వుంది. అదికాక  అక్కడే అంటే ఏలూరులో సొంత ఇల్లు రెండెకరాల మాగాణిభూమి వుంది. అఆదపిల్లలు నా దగ్గర ఎంతకాలం వుంటారు. నిన్ను చూసేక తృప్తికలిగింది. నా బిడ్డ అధృష్టవంతురాలు" అన్నాడు జోసఫ్.

    రాబర్టు మాట్లాడలేదు.

    మేరీని తను  పెళ్లిచేసుకుంటానని ఆయన అనుకుంటున్నాడు.

    అది జరిగేదేనా? తన గురించీ ఏమీ తెలిదు వీళ్ళకి.

    పికవరకు ఊబిలో వుంది తన జీవితం

    "ఏమిటి బాబూ ఆలోచిస్తున్నావు!"  అడిగాడు జోసఫ్

    రాబర్టు తడబడ్డాడు

    "అబ్బే ఏంలేదు మీరెప్పడోచ్చారు?"

    "రెండు రోజులైంది. రాత్రికి వెళ్ళిపోతున్నా"

    మేరీ రెండు కప్పలలో టి తీసుకొచ్చి అక్కడ పెట్టింది.

    రాబర్టు టి తాగుతుంటే  అన్నాడు జోసఫ్.

    "నా పిల్లలీ మహానగరంలో మగదిక్కు లేకుండా వుంటున్నారు. వీళ్ళ బాధ్యత నీదే  నేను ఒప్పగించి వెళుతున్నా"

    "మీరేం వర్ర్రీ కావద్దు" అన్నాడు రాబర్టు, ఎనిమిదవుతుండగా రాబర్టు కీజోసఫ్ కీ  వడ్డించింది మేరీ.

    భోజనమ తర్వాత మళ్ళి వాళ్ళు కబుర్లలో పడ్డారు.

    తొమ్మిది కావస్తుండగా చిత్ర వచ్చింది ఇంటికి.

    రాబర్టు చూస్తూనే కళ్ళింత చేసుకొని అంది చిత్ర.

    "ఇన్ని రోజులు ఎక్కడికి పారిపోయావు"

    "నీకు భయపడి పారిపోయాను" అన్నాడు.

    "నువ్వు వెళ్ళిపోయి వుంటావని కంగారుపడ్డాను  డాడీ" అంది చిత్ర.

    చిత్రని చూసేక జోసఫ్ ప్రయాణం అయ్యాడు.

    ముగ్గురూ వెళ్ళి జోసఫ్ నీ బస్సెక్కించి వచ్చారు.

    చిత్రకి రాబర్టు పైన కోపంగా వుంది. మేరీ పైన చూపించే ఆత్మీయత కనిసం పదిశాతమైన తన పైన చూపించక పోవడంతో మనసు ఉడికిపోతోంది.

     రాబర్ట్ ఎంత  నిర్లక్ష్యం చేస్తున్నాడో అంతగా మానసవుతోంది చిత్రకి. అతను అక్క మేరీని పెళ్లి చేసుకుంటాడని  బాధపడ్డంలేదు చిత్ర  కానీ కనిసం ఒక్క సారి తనివితీరా అతని కౌగిలిలో కరిగిపోవాలన్నా ఓ కోరిక  ఆ అనుభవంలో కొన్ని నిమిషాలు బ్రతకాలని చిత్ర తాపత్రయం.

    మేరికి రాబర్టుతో వున్న సంబంధం  ఎలాంటిదో చిత్ర కళ్ళారా చూసి తరించిన సందర్చాలెన్నో  వున్నాయి.

    ఒక్కసారి అతని పక్కన తనుండాలి.

    నిజం చెప్పలింటే మేరీకంటే చిత్ర బాగుంటుంది.

    మేరీ  ఓ విధమ్తెన సాదా జీవితానికి అలావాటు పడిపోయింది. ఆమెకి పెద్ద కోరికలు కూడా లేవు.  చేస్తున్న ఉద్యోగం రాబర్టు తోడు ఆమెకి చాలు.

    నగల పైనగానీ, చీరాలపైన గానీ, వస్తు వాహనాల పైన గాని  ఆమెకి ఆసక్తిలేదు. రాబర్టు ఒక్కడు పక్కనుంటే తిండికూడా అవసరం లేదు మేరికి.

    చిత్ర అలాకాదు.

    గాలి మేడలు కట్టేసుకుంది. కాలేజిలో చదువుతున్న కారణం గానూ, స్వతహ  ఆర్టిస్ట్ కావడం తోనూ ఫాషన్ల పైన మోజుపడ్డం ఆమె విషయంలో తప్పుకాదు.

    రాబర్ట్ తో పూర్తి జీవితాన్ని పంచుకునే అవకాశం తనకి లేదని చిత్రకి తెలుసు అందుకే ఒక్కసారి. కనిసం ఒక్కసారి అవకాశం దొరికితే  తన ప్రయత్నం నెరవేరుతుందో లేదో తెలిదు కానీ, ఆశల్ని మాత్రం బలంగా పెంచుకొంటోంది చిత్ర.

    మంచినీళ్ళు గ్లాసు తో లోపలికి వెళ్ళబోతూ మేరి చిత్రని చూసి అడిగింది.

    "ఇంకా నిద్రపోలేదా?"

    "లేదు"

    "ఏం?" అడిగింది మేరి.

    "ఈ రోజు కాలేజి కాంపస్ లో నా పేరుని గోడలనిండా రాశారక్కా" అంది చిత్ర.

    గదిలో మంచంమీద పడుకున్న రాబర్ట్ ఉలిక్కిపడి లేచాడు. మంచంపైన పిడికిలిని బిగించి కొట్టాడు.

    అతని కళ్ళ కెదురుగా అర్జున నిలబడింది.

     *    *    *


    "మనిద్దర్నీ ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు" అంది  అర్జున .

    "ఎందుకు?" అడిగాడు విజయ్.

    "మనిద్దరి పేర్లు కాలేజి గోడల నిండా సినిమా స్కోపులో రాసే శారు  చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదనుకో" అంది అర్జున.

    ఆ మాటలకి విజయ్ ఉలిక్కిపడ్డాడు.

    "సిగ్గులేదూ! నువ్వసలు ఆడపిల్లవేనా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS