"ఓ! అలాగా? అయితే కేసు మరీ కాంప్లికేటేడ్ గా తయ్యరయిందన్నమాట...మీరు దేబ్బలాడుకునీ, ఆమె కనబడలేడంటే అలిగి ఎక్కడికైనా వెళ్లిందని అనుకోవచ్చు. అలా జరగలేదంటే, ఆమెని ఎవరయినా కిడ్నాప్ చేసి వుండవచ్చు, లేదా ఏదయినా యాక్సిడెంట్ కెయినా అయివుండొచ్చు. నువ్వేం వర్రీ కాకు. నేను పరిశోధిస్తాగా! యాక్సిడెంట్ కేసయితే ఏమీ చెయ్యలేనుగానీ కిడ్నాపింగ్ కేసయితే ఆ కిడ్నాఫర్స్ ని పట్టుకుని కాల్చి పారేస్తా" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ అయోమయం.
* * * *
బ్రహ్మాజీ డోర్ బెల్ నొక్కాడు. అప్పుడు రాత్రి దాదాపు పదకొండు గంటలైంది ఫోలీసుస్టేషన్లో కంప్లయింట్ యిచ్చిన తర్వాత "ఏం కాదులే! మీ ఆవిడ దోరుకుతుంది. ఎక్కడో క్షేమంగా వుంది వుంటుంది అని" రాంపండుకి ధైర్యం చెప్పి యింటికోచ్చేసరికి ఆ టైం అయింది.
మరోసారి బెల్ నొక్కి ఏం పుట్టిందో ఏమో! హుషారుగా పాటందుకున్నాడు బ్రహ్మాజీ.
"చోళీకే ఫీచే క్యాహై... చోళీకే ఫీచే..."
తలుపులు భళ్ళున తెరుచుకున్నాయ్. అడురుగ్గా దుర్గా! అతని వంక సీరియస్ గా చూస్తూ_
"ఏంటీ? చోళీకే పేచే క్యాహైనా? చోళీకే ఫీచే?! ఏం హుషారు."
"అబ్బే... నిన్ను కాదె బాబూ! ఏదో పాటపాడుకుంటున్నానంతే" భయం భయంగా అన్నాడు అతను.
ఆ రాంపండు పెళ్ళాం కనబడకుండా పోయిందిగానీ_ ఇది ఎక్కడికైనా అలా పోరాదూ అని మనసులో అనుకున్నాడు.
"చోళీకే ఫీచే కాదు గానీ.... పైటాకే ఫీచే ఏముందో చూపిస్త..."
కొంగుచాటు నుండి అప్పడాల కర్ర తీసింది దుర్గ. "రండి లోపలకి!"
"ఇప్పుడు అదెందుకు తీశావే?!"
అప్పడాలకర్రవంక భయంగా చూస్తూ అడిగ్డు అతను.
లోపలకి రమ్మంటే సిగ్గుపడ్తావెంటీ? రద్దూ!" అని జబ్బు పట్టుకుని ఒక్క గుంజు గుంజి కదిలింది దుర్గ.
ఆ దెబ్బకి అతను అక్కడి నుండి హాల్లోకి, హాల్లోంచి గదిలోకి, గదిలోంచి బెడ్ రూమ్ లోకి రివ్వుమని ర్కెట్ లా వెళ్ళి బెడ్ మీద బోర్లాపడి ముక్కు ఛీదక్కోట్టుకున్నాడు.
మంచం మీద నుండి వెనక్కి తిరిగితే ఎదురుగా దుర్గ.
"చెప్పండి! ఏ బ్రోతల్ హొస్ కి వెళ్ళారు?" గద్దిస్తూ అడిగింది.
"బ్రోతల్ హౌస్ కి వెళ్ళడం ఏంటే బాబూ... అయినా ఇంతమంచి పర్సనాల్టీ వున్న నువ్వుండగా నకు బ్రోతల్ హౌస్ కెళ్ళే అవసరం ఏంటే బాబూ?" అన్నాడు బ్రహ్మాజీ గడగడలాడుతూ.
"మీరేం చెప్పకండి... మీరు బ్రోతల్ హౌస్ కి వెళ్ళారు... అక్కడ రెయిడ్ జరిగింది. అప్పుడు ఫోలీసులు మిమ్మల్ని పోలీసు స్టేషన్ కి లాక్కెళ్ళారు. మీరేమో వాళ్ళకి డబ్బులు పారేసి యింటికోచ్చారూ....అవునా?"
"నేను ఇంటికి రావడం కాస్త అలస్య్తం అయింది కదా... అందుకని నువ్వు మంచం మీద పడుకుని వుంటావు... నీకు తెలీయకుండానే నిద్రపట్టేసి వుంటుంది... అప్పుడేమో ఈ పోలీసుల రెయిడ్ కల కనుంటావు ఆ కలే నిజంగా జరిగిందని భ్రమపడుతున్నావు... అంతేనా? యమి కరెక్టు?! హహహ...." బలవంతంగా నవ్వు తెప్పించుకుంటూ హుషారుగా అన్నాడతను.
కలా నా బోందా? మీరు పోలీసు స్టేషన్ కి వెళ్ళానని నీ కెవరు చెప్పారు?" అడిగాడు తేరుకుని.
"చూశావా చూశావ... అయితే ఫోలీసు స్టేషన్ కి వెళ్ళడం నిజమేనన్నమాట!"
"అసలు ఆ విషయం ఎవడు చెప్పాడు?!"
"ఎవరో ఒకరు నా శ్రేయోభలాషీ చెప్పాదులే."
"నేను బ్రోతల్ హౌస్ వెళ్ళినట్టు కూడా వాడే చెప్పాడా?" బాధగా అడిగాడు.
"అలా అని అతను చెప్పలేదు గానే మిమ్మల్ని ఓ చిన్న కాని స్టేబుల్ జుబ్బ పట్టుకుని ఫోలీసు స్టేషన్ లోకి తీసుకెళ్ళడం చూసి చెప్పాడు. అలా పావులేసులు ఎందుకు పట్టుకేళతారు?.... దొంగతనం, జూదం మిగిలింది వ్యభిచారం!"
"హబ్బా!".... జుట్టు పీక్కున్నాడతను. "అయినా వ్యభిచారం నాకు అలవాటు వుందనా నీ వుద్దేశ్యం? నన్ను చూసిన వాడు న ప్రక్కనే ఉన్న రాంపండుని చూళ్ళేదా?"
"ఓహొ!.... అయితే ఇద్దరూ కలసే బ్రోతల్ హౌస్ కి వెళ్ళారన్న మాట?" కళ్ళు ఎగరేస్తూ తల వూగించింది దుర్గ.
"అది కాదు... అసలు మేం ఫోలీసు స్టేషన్ కి ఎందుకెళ్ళామంటే_?"
"చాలు... ఇంకేం కధలూ చెప్పొద్దు..." అప్పడలా కర్ర ఉన్న చేతిని పైకెత్తింది దుర్గ.
* * * *
రాంపండు వేగంగా యింటి వైపు అడుగులు వేస్తున్నాడు. అతని మనసులో ఎన్నెన్నో ఆలోచనలూ. భయాలూ....
అతనికి ఇన్స్ స్పెక్టర్ అయోమయం అన్నా మాటలు గుర్తుకొచ్చాయి.
అతనన్నట్టు అవరైనా రాజీని కిడ్నాప్ చేశారా...? ఎందుకు? బొంబాయి తీసుకెళ్ళి ఏదైనా బ్రోతల్ హౌస్ అమ్మెయడానికా...
నో..నో... అల జరక్కూడదు... వాళ్ళు అందుకొసం కిడ్నాఫ్ చేసుండరు.
మరెందుకోసం?
లక్ష రూపయలిస్తావా మీ ఆవిడని ఖతం చేయమంటావా? అంటూ బేరం పెట్టాడానికా?
బాబోయ్ లక్షలు డిమాండ్ చేస్తే ఎక్కడి నుండి తేవాలి. ఏదో అయిదరోందలు అయితే అర్జస్టు చేయొచ్చుగానీ...
అయినా అయిదారోందలు కోసం ఎవరైనా కిడ్నాప్ చేస్తారా?
లేకపోతే రాజీకి యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా?!"....
నో...నోనో... అలా జరిగితే నేను భరించలేను.... అనుకున్నాడు.
అతను ఇల్లు సమీపిస్తుండగా తలెత్తి చూసి వులిక్కిపడ్డాడు.
ఇంట్లో అన్ని గదుల్లో లైట్లు వెలుగుతున్నాయి.
రాజీ వచ్చేసిందా లేకపోతే యింట్లోగానీ దొంగలు పడ్డారా?
రాంపండు యింటి వైపు పరుగుపెట్టాడు.
* * * *
రాత్రి పన్నెండు గంటలైంది.
"ఉదయం నుండీ నువ్వు కనిపించకపోసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా?" రాజీని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు రాంపండు.
"నిజంగా?!" రాజీ గొంతులో కాస్త వ్యగ్యం.
"అబద్దం నేనెందుకు చెప్తాను?.... నీకు తెలిసిన వాళ్ళందరి యిళ్ళకీ వెళ్ళాను... విజయవాడకి కూడా ఫోను చేశాను."
"కొంపదీసి మా వాళ్ళకిగానీ చెప్పావా?"
"లేదు... అనవసరంగా వాళ్ళనెందుకు కంగారుపెట్టాలి!నువ్వు వున్నావో లేదో తెలుసుకుందామని ఫోను చేశాను. మీ నాన్నగారు నువ్వెలా వున్నావ్ అని అడిగేసరికి నువ్వక్కడికి వెళ్ళలేదని తెలిసింది.... ఎంత భయపడ్డానో తెల్సా? ఫోలీసులకు కంప్లంయిట్ కూడా యిచ్చాను!"
"ఎందుకని?"
"నిన్నైవరైనా కిడ్నాప్ చేశారేమో, లేకపోతే నువ్వేమైన అంటూ ఆగాడు.
