Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 23


    "నేను నిజంగానే మీ అభిమానినండీ! మీకూ, మీ పత్రికకీ కూడా! అప్పుడప్పుడు కధలు రాస్తూ ఉంటాను." అని చెప్పింది హరిణి.
    వెంటనే చురుగ్గా చూశాడు ఎడిటరు. అతని మోహంలో సందేహం కనబడుతోంది.
    ఇదొక జిమ్మిక్కా! ముందు లాయరు నోటీసు చూపించి తర్వాత తనే దాన్ని చింపేసి ఇప్పుడు తను రచయిత్రినని కధలు రాస్తానని చెప్పడం.......ఇదొక రకం బ్లాక్ మెయిలింగా!
    తను రాసిన కధలు ప్రచురించకపొతే, లాయరు నోతీసుతో మళ్ళీ కోర్టుకు వెళతానని నర్మగర్భంగా బెదిరిస్తోందా! ఈ అమ్మాయి? దిస్ కిడ్! అలర్టుగా అయిపోయాడు ఎడిటరు.
    ఆ అమ్మాయిది పాదరసం లాంటి మెదడు. అతని మనసులోమేదులుతున్న ఆలోచనలను కనిపెట్టేసినట్లు త్వరత్వరగా అంది.
    "సర్! ఈ లాయరు నోటీసుకి, నేను మీ పత్రికలో కధలు రాయలనుకోవడానికీ ఏ మాత్రం సంబంధం లేదు. మీరు బెదిరింపులకి భయపడే మనిషి కారని నాకు తెలుసు. అయినా బెదిరిపులతో పని ఏముంది సర్! మీరు ఇదివరకే నా కధ ఒకటి ప్రచురించారుగా!"
    "అది మీ పేరుతొ......" అనబోయాడు ఎడిటరు.
    చిరునవ్వు నవ్వింది హరిణి.
    "హరిణి అన్న పేరుతొ ప్రచురితమైన కధ నేను రాసింది కాదు ఎవడో రాశాడు. నేను "రచన' అన్న పెన్ నేమ్ తో ఒక కధ రాశాను. అది కిందటి నెల మీరు ప్రచురించారు."
    వెంటనే ఎడిటర్ కి గుర్తొచ్చింది.
    "డామిట్! కధ అడ్డం తిరిగింది! అన్న కధేనా?"
    "అదే!" అంది హరిణి నవ్వుతూ.
    ఎడిటర్ కి నవ్వొచ్చింది. ఉదయార్కర్ కూడా నవ్వాడు. ఆ గదిలో రిలాక్స్ డ్ అట్ మాస్ ఫియర్ చోటుచేసుకుంది.
    "నేనూ చదివాను ఆ కధ! చాలా బాగా రాశారు" అన్నాడు ఉదయార్కర్ మెప్పుదలగా.
    కదూ" అన్నాడు ఎడిటరు ఏకీభవిస్తూ.
    హరిణి మోహంలో సంతోషం కనబడింది. "కదల విషయంలోనే మిమ్మల్ని కలిసి మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను."
    ఆమెని అంచనా వేస్తున్నట్లు కాసేపు చూశాడు ఎడిటరు. షీ. ఈజ్ ఏ క్యురియాస్ మిక్స్ చర్ ఆఫ్ సో మెనీ వైకబుల్ క్వాలిటీస్! మాటకారితనం, చొరవ, సమయస్పుర్తీ, ధైర్యం వీటన్నిటికి తోడు రాయడం చేతనయి ఉండడం!
    ఇలాంటి వాళ్ళే ట్రెండ్ వ్రైటర్స్ అవుతారు ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డులో!
    ఒక అయిడియా తట్టింది అతనికి.
    "ఒక మంచి పీచరు చెబుతాను చెయ్యగలరా!" అన్నాడు.
    ఉత్సాహంగా ముందుకు వంగింది హరిణి "చెప్పండి!"
    "యూత్ ప్రాబ్లమ్స్ మీద కొన్ని ఇంటర్య్వులు చెయ్యాలి. కాలేజ్ స్టూడెంట్స్ తో మొదలెట్టండి." అని వివరాలు చెప్పి "ముందు ఒక ఇంటర్యు రాసుకురండి. దానిని బట్టి తర్వాత ప్రొసీడ్ కావచ్చు.' అన్నాడు.
    "థాంక్యూ సర్! థాంక్యూ సోమచ్"
    "రెగ్యులర్ గా రాయగలగాలి! డిలే చెయ్యకూడదు. టైమ్ ఫాక్టర్ ఇన్ వాల్వోడ్ ఇక్కడ"
    "డిలేనా! సర్! నేనెలాంటి దాన్నో తెలుసా! ఎక్కడికయినా ఇవాళ బయలుదేరితే నిన్నే చేరిపోతానన్న మాట! అంత సూపర్ స్పీడు" అంది హరిణి. నవ్వాడు ఎడిటరు "బెస్టాఫ్ లక్"
    మళ్ళీ థాంక్స్ చెప్పి గబగబ వెళ్ళిపోయింది హరిణి.
    "నేనూ వెళ్ళివస్తాను" అన్నాడు ఉదయార్కర్.
    "ఎక్కడికి?"
    "బ్రహ్మచారి దగ్గరికి."
    "ఎప్పుడు! ఇప్పుడేనా?"
    "అవును"
    ఆశ్చర్యంగా చూశాడు ఎడిటరు. "ఒకరోజు రెస్టు తీసుకుని రేపు వెళ్ళకూడదు?"
    "వర్క్ ఫస్ట్, రెస్ట్ నెక్ట్స్ సర్" అన్నాడు ఉదయార్కర్ స్థిరంగా. కాసేపు సందేహించి, "సరే అయితే! అల్ ద బెస్ట్" అన్నాడు ఎడిటరు కరస్పర్శ కై చేయి జాపుతూ-
    "మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చేది?"
    "బహుశా ఎల్లుండి" అంటూ బయటికి నడిచాడు ఉదయార్కర్. అతను వెళ్ళినవైపే సాలోచనగా చాలా సేపు చూస్తూ ఉండిపోయాడు ఎడిటరు.

                                         *     *    *    *

    ఇంటికి వెళ్ళాక ఒకగంట రెస్టు తీసుకున్నాడు ఉదయార్కర్. తర్వాత లేచి తన రాక్ పాక్ లో కావలసిన వస్తువులూ , బట్టలూ, పెట్టుకుని దాన్ని స్కూటరు వెనక కట్టి మాచర్ల బయలుదేరాడు.
    స్కూటరు మీద గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళి పోగాలిగితే దాదాపు నాలుగు గంటల ప్రయాణం మాచర్లకి. ఉదయార్కర్ కి బస్సులనీ, రైళ్లనీ నమ్ముకోవడం అంటే చిరాకు. సాధ్యమైనంత వరకూ తన స్కూటర్ మీదే ప్రతిచోటికి వెళ్ళిపోతుంటాడు. స్కూటర్ అయితే ఇంకో సౌలభ్యం కూడా ఉంది. అవసరమైతే మధ్య దారిలో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంతసేపు కావాలంటే అంత సేపు ఆగి పరిసరాలు గమనించవచ్చు. తన యిష్టం వచ్చినప్పుడు మళ్ళీ బయలుదేరవచ్చు.
    బస్సుల్లో, రైల్లో అయితే అలాంటి వీలు ఉండదు. హైవే మీద స్పీడుగా పోతూ ఉంటె గాలి రివ్వున చెవులకి తాకుతోంది. ఎండ తగ్గుముఖం పడుతోంది అప్పటికే.
    మాచర్ల అనుకోగానే ఉదయార్కర్ ఎక్కడో చదివిన ఒక విషయం గుర్తువచ్చింది. ఏ ఊరి పెరులోనైనా 'చర్ల' అని గనక వస్తే సాధారణంగా ఆ ఊళ్ళో భూమిలో నిక్షిప్తమయిన దేమన్నా ఉంటుందని సూచనట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS