"చూశావా ప్రాణం అంటే ఎంతతిపో అర్ధం అయిందా మోహినీ పద"
"ఎక్కడికి"
"నన్ను కారులో గేటు దాకా వదిలిపెట్టు లేదా ఇందులో ఆరు గుళ్ళు న్నాయి ఒకటి నీకు రెండోది మాలిగాడికి మిగిలిన నాలుగు నాలుగు కుక్కల్ని చంపడానికి సరిపోతాయి"
పరిస్ధితి పూర్తిగా విషమించిందని గ్రహించింది మోహిని
మోహిని వెనక్కి తిరిగింది పిస్తోలు పట్టుకుని అతను ఆమె వెనకే నడుస్తున్నాడు.
మేడదిగి హాలులోంచి సింహద్వారం దగ్గరకి నడిచి తలుపు తెరిచింది మోహిని
పోర్టికోలో పార్క్ చేసి వున్న కారు దగ్గరికి వెళ్ళాక.
"ఉ! ఎక్కు!" అన్నాడు.
"తాళాలు లేవు" అంది మోహిని.
రాబర్ట్ ఎగతాళిగా నవ్వాడు.
"నాకు తెలుసు నువ్వీమాట అంటావని అందుకే నేనే తెచ్చాను" అన్నాడు ఇగ్నిషన్ కీని ఆమెకి అందిస్తూ.
మోహిని కారెక్కాక రెండోవేపు నించి ఆమె పక్కనే కూర్చుని
"పోనియ్ " అన్నాడు.
కాంపౌండ్ వాల్ మెయిన్ గేటు దగ్గర గూర్ఖా ముందుకొచ్చి చూసి తలుపు తీశాడు.
కారు బయట రోడ్డుమిదికొచ్చింది.
"ఆపు"
మోహిని కారు ఆపింది.
"మోహిని నిన్ను చంపడం నాకో లెక్క కాదిప్పుడు. కానీ కొంతసేపు నితో పొందిన ఆనందానికి మరిచిపోలేని సుఖాన్ని నా కిచ్చావు కనక నిన్ను వదిలిపెడుతున్నా కారుదిగు" అన్నాడు.
మోహిని అరక్షణం పాటు అతని కేసి చూసి కారుదిగింది. అతను డ్తెవింగ్ సీట్లోకి జరిగి స్టార్టు చేశాడు.
"మోహినీ,, మెయిన్ రోడ్డు ఎక్కగానే కారుని వదిలేస్తాను. నీ మనుషుల్ని పంపించి తీసుకెళ్ళు" అంటూనే మెరుపులా దూసుకెళ్ళి పోయాడు రాబర్టు.
అనుకొని సంఘటనకి విస్తుపోతూ నించుండి పోయింది మోహిని. మాలి గొడ్డలి పట్టుకొని రోప్పతూ పరుగెత్తుకొచ్చాడు.
అప్పటికే రాబర్టు వాళ్ళకి అందనంత దూరం వెళ్ళిపోయాడు.
* * *
మర్నాడు సాయంత్రం రాబర్టు మేరీ ఇంటికి వచ్చాడు.
మేరీ కిటికీలోనుంచి చకోర పక్షిలా ఎదురు చూస్తూ నించుంది
"మేరీ" అని పిలిచాడు రాబర్టు.
ఆ పిలుపు కోసమే ఎన్నో యుగాల నించీ ఎదురు చూస్తున్న దానిలా ఒక్క పరుగులో వచ్చి అతని గుండెలపైన వాలిపోయింది మేరీ. ఆమెకి దుఃఖం ఆగలేదు, బావురుమంది.
ఆమె వీపుపైన ఆప్యాయంగా తడుతూ ఓదార్చాడు రాబర్టు.
"మరి ఇంత సెంటిమెంటల్ అయితే ఎలా? వచ్చేశానుగా" అన్నాడు.
మేరి తలెత్తి అతని మొహంలోకి చూసింది.
"ఎక్కడికెళ్ళావు. మళ్ళీ రావనుకున్నాను" అంది కన్నీళ్ళతో .
అతను ఆమె కన్నీటిని తుడిచాడు "ఏడవకు పనిమీద ఊరెళ్ళాను చెప్పి వెళ్ళే టైం లేకపోయింది" అన్నాడు.
"నాకు చెప్పి వెళ్ళేంత టైం నీకు లేకపోయిందా రాబర్టు" అంది మేరీ.
కానీ రాబర్టు ఆమె కేమని చెప్పగలడు? దొంగతనం నేరంకింద ఆరునెలలు జైలులో శిక్ష అనుభవించి వచ్చానని ఎలా చెప్పుగలడు?
అసలు తను నేరం చెయ్యలేదంటే నమ్ముతుందా?
మేరీకి సెంటిమెంట్స్ ఎక్కవ. చిన్న విషయానికి సైతం బాధ పడిపోతుంది.
రాబర్టుకి అలాంటివి గిట్టవు.
నీతి, నియమాలులేవు. అన్నింటిని ఎప్పుడో వదిలి పెట్టేశాడు.
"చిత్రలేదా?" మాట మార్చాలని అడిగాడు రాబర్టు.
"లేదు. రవీంద్రభారతిలో ఏదో నాటకం వుందని వెళ్ళింది" అంది మేరీ.
రాబర్టు మంచంమీద కూర్చున్నాడు మేరీ అతని ఒడిలో తల పెట్టుకుని పడుకుంది.
"నువ్వు ఏమైపోయావో అని ఎంత భయపడ్డానో తెలుసా?" అంది.
ఏమైపోతాను?" అన్నాడు.
"నీకే అలాగే చేపోతావు. ఇది సిటీ బయటికి వెళ్ళినవాడు తిరిగి ఇంటికొచ్చే వరకు ఎంత భయం వేస్తుందో తెలుసా?" అంది అతని చేతి పైన ముద్దు పెట్టుకుంటూ.
తలుపుకొట్టిన చప్పదయింది మేరీ వెళ్ళి తలుపు తీసింది.
జోసఫ్ లోపల కొచ్చాడు. రాబర్టునీ చూస్తూనే జోసఫ్ చిరు నవ్వుతో విష్ చేశాడు.
"నేను మేరీ తండ్రి జోసఫ్ నీ మీరు రాబర్టు అనుకుంటాను" అన్నాడు.
"నమస్కారం" అన్నాడు రాబర్టు
"మేరీ నీ గురించీ చెప్పింది?" అన్నాడు జోసఫ్. చేతిలోని వంచిని హంగర్ కి తగిలిస్తూ.
రాబర్టు మేరీ కేసి చూశాడు ఆమె ఏం చెప్పిందో తేలీక.
మేరీ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది.
"పిచ్చిపిల్ల!" అంటూ జోసఫ్ నవ్వుకున్నాడు.
రాబర్టు శృతి కలిపేడు.
