"శివశివా..." అన్నారు రాంపండూ, బ్రహ్మాజీ.
ఇన్స్ సెక్టార్ అయోమయం ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాడు.
"కొంపదీసి మీరు శివసేన పార్టీవాళ్ళా?" అని అడిగాడు.
"అబ్బా!"...." ఏడుకొండలు టోపి మీద గుద్దుకున్నాడు. "వాళ్ళు అవేమీ కాద్సార్... మన స్టేషన్ ఆవరణంలో అనుమానస్పద స్థితిలో తచ్చాడుతుంటే పట్టుకుని మీ దగ్గరకి తెచ్చాను."
అయోమయం హాఠాత్తుగా లేచి నిలబడి బెల్టుకున్న కేసులోంచి రివాల్వర్ తీసి ఇద్దరకీ గురిపెట్టి "చెప్పండి...ఎవరు మీరు? అక్కడేం చేస్తున్నారు? బాంబులు పెట్టి మా స్టేషన్ని పేల్చి పారేయ్యాలని చూస్తున్నారా? అంతకంటే ముందే నేను కాల్చి పారేస్తా" అన్నాడు.
"ఏమండీ... మేము సాధారణ పౌరులం... అంతేకానీ టెర్రరిస్టులమో, నక్సలైట్లమో కాదు" అన్నాడు రాంపండు బాధగా.
"ఓహొ... కంప్లైంట్ యివ్వాలని వచ్చారా? కూర్చోండి" అన్నాడు ఇన్స్ సెక్టార్ అయోమయం తను కూర్చుంటూ.
రాంపండు, బ్రహ్మాజీ తాని ముందు కూర్చ్గున్నారు.
"ఊ... ఇప్పుడు చెప్పండి ఏంటి మీ కంప్లైంట్? మీ ఇంట్లో చోరీ జరిగిందా? బంగారం ఏమైనా పోయిందా?" అడిగాడు ఇన్స్ సెక్టార్ అయోమయం.
బంగారం ఏంటండీ బాబూ! బంగారంలాంటి అమ్మాయ్ పోయింది. వీళ్ళా విడ తప్పిపోయింది" అన్నాడు బ్రహ్మాజీ.
"తప్పిపోవడం కాదండీ! మా ఆవిడా కనిపించటంలేదు" బ్రహ్మాజీ వాక్యాన్ని సరిదిద్దుతూ అన్నాడు రాంపండు.
"కనిపించకపోతే కళ్ళద్దాలు పెట్టుకుని చూడండి. హహహ" నవ్వాడు ఇన్స్ సెక్టార్ అయోమయం
"చూశావా! కనిపించటం లేదని అంటే అలా అంటాడని నేను చేపానా లేదా?" రాంపండు చెవిలో అంటూ డొక్కలో మోచేత్తో పొడిచాడు బ్రహ్మాజీ.
"సార్! మా ఆవిడ కనిపించక నేను బాధ పడుతుంటే మీరిలా అనడం అన్యాయం సార్" అన్నాడు రాంపండు.
"ఒక్కే..ఒక్కే...నేనిక సీరియస్! చెప్పండి మీ ఆవిడా ఎప్పుడు నుండి కనిపించడంలేదు?" నవ్వాపుకుంటూ అన్నాడు ఇన్స్ సెక్టార్ అయోమయం.
"ఈ వేళ ఉదయం లేచినప్పటినుండీ కనపడ్డంలేదండీ" చెప్పాడు రాంపండు.
అది వినగానే కాని స్టేబుల్ ఏడుకొండలూ, ఇన్స్ సెక్టార్ అయోమయం మోహమోహాలు చూసుకుని భళ్ళున నవ్వారు.
"చంపేవ్ కదయ్యా బాబూ! ఈ వేళ ఉదయం నుండి కనిపించటంలేదా? ఇంకానయం. ఓ గంట క్రితం నుండి అన్నావ్ కాదు. ఉదయం నుండీ కనిపించడం లేదని అంటే ఏ చూట్టాలింటికో, ప్రెండ్స్ యింటికో వెళ్ళి వుంటుంది. మరో రెండురోజులు కనబడకపోతే అప్పుడు కంప్లైంటు యివ్వడానికి రా" అన్నాడు అయోమయం.
"లేద్సార్! మా ఆవిడ ఎప్పుడు ఎక్కడికీ వెళ్ళకపోవచ్చేమోగానీ ఈ వేళ వెళ్ళాలని అనిపించిందేమో. అందుకే రెండు రోజుల తర్వాత రా."
"ప్లీజ్! న మాట వినండి సార్! ఆమెకి తెలిసిన వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి అడిగాను. రాలేదని చెప్పారు. విజయవాడలో వాళ్ళింటికి కూడా ఫోన్ చేశాను. అక్కడకీ రాలేదని తెల్సింది. ప్లీజ్! మీరు కేస్ రిజిస్టర్ చేసుకోండి సార్" దీనంగా అన్నాడు రాంపండు.
"సరే! కంప్లెయింట్ రాసివ్వు చూద్దాం"అన్నాడు ఇన్స్ సెక్టార్ అయోమయం.
రాంపండు కంప్లైంట్ రాసి సంతకం పెట్టి ఇంటి ఆడ్రస్ రాసి ఇన్ స్పెక్టర్ కి యిచ్చాడు.
ఆమెది రీ సెంట్ ఫోటోగ్రాఫ్ ఏదైనా వుందా?" అడిగాడు అయోమయం.
అతను చొక్కా జేబులోంచి ఓ కవరు తీసి అందులోంచి రాజీ ఫోటోతీసి యిచ్చాడు.
ఇన్స్ సెక్టార్ అయోమయం ఫోటోవంక దీక్షగా చూడసాగాడు. కాని స్టేబుల్ ఏడుకొండలు కూడా ముందుకి వంగి ఫోటో వంక చూశాడు.
ఇన్స్ సెక్టార్ ఫోటో ని చూస్తూ పెదవి విరిచాడు.
రాంపండు గుండెల్లో పీచుపీచుమంది.
"ఏం సార్ అలా పెదవి విరుస్తున్నారు? కొంపదీసి మా ఆవిడగానీ మీకు కనిపించిందా? ఆమెకేమీ ప్రమాదం జరగలేదు కదా?" అడిగాడు కంగారుగా.
"నేను పెదవి విరించింది అందుక్కాదు. ఈ ఫోటో ఎవడు తీశాడో గానే అంత బాగా తియ్యలేదు" అన్నాడు అయోమయం. తర్వాత కానిస్టేబుల్ ఏడుకొండలు వైపుకి తిరిగి "ఈ ఫేసు చూశావా? కాస్త యిటు టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదూ?" అన్నాడు.
"అవున్సార్! కేమెరా యాంగిల్ కూడా సరిగ్గా లేదు. క్రింద నుండి తీశాడు పైనుండి తీస్తే బాగుండేది" అన్నాడు ఏడుకొండలు కూడా ఫోటో వంక దీక్షగా చూస్తూ.
"లైటింగో? ఛండాలంగా వుంది. ఆ బ్యాక్ గ్రౌండ్ లో కర్టెన్ చూశావా? పువ్వుల పువ్వుల కర్టెన్ వేశాడు దానికంటే ప్లెయిన్ ది వేసి వుంటే బాగుండేది. ఇలాంటి ఫోటో స్టూడియో వాళ్ళని కాల్చి పారెయ్యాలి."
"సార్!" దీనంగా పిలిచాడు రాంపండు.
ఇన్స్ పెక్టర్, కాని స్టేబుల్ ఇద్దరి తలలూ అతని వైపుకి తిరిగాయ్.
"ఇంతకీ ఆ ఫోటో మా ఆవిడ్ని వెతకడానికి పనికోస్తుందా లేదా సార్?"
"పని కొస్తుందనుకో. అయినా యింకోసారి ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళకు" అని ఫోటో టేబుల్ సొరుగులో పడేశాడు ఇన్స్ స్పెక్టర్ అయోమయం.
"మేమింక వెళ్ళొచ్చాండీ?" అడిగాడు బ్రహ్మాజీ.
"ఒయ్యాస్! మీ ఆవిడని ఎక్కడున్నా వెతికి పట్టుకుని కాల్చిపారేస్తాం."
"అదేమీటండీ?" అయోమయంగా అడిగాడు రాంపండు.
"మరి అమ్తెనయ్యా! మొగుడికి చెప్పకుండా యిల్లు వదలిపెట్టి వెళ్ళిపోతే యిమ్కేం చెయ్యాలి?"
"అలా కాల్చి పారేయ్యాడాలూ, పేల్చి పారెయ్యడాలూ వద్దుగానీ నకు అప్పగించండి చాలు!"
"సరేలే... మీ రెళ్ళండి!"ఇద్దరూ లేచి గుమ్మం వైపు అడుగులు వేశారు.
"చూడు జాంపండూ!" పిలిచాడు ఇన్స్ పెక్టర్.
"జాపండు కాదండీ! రాంపండు" చెప్పాడు పండు.
"ఏదో ఒక పండులేవయ్యా! ఓ నిమిషం అడగడం మర్చిపోయాం మీరిద్దరూ ఏమయినా దెబ్బలాడుకున్నారా?"
"మేమిద్దరమా? అబ్బే లేదే- ఏరా బ్రహ్మాజీ! మనిద్దరం దెబ్బలాడుకున్నామాఎప్పుడయినా?" అడిగాడు రాంపండు.
"అబ్బే! మేమిద్దరం ఎప్పుడూ దేబ్బలాడుకోలేదు ఇన్స్ స్పెక్టర్ ఏమనుకుంటున్నారో ఏమో_ నేనడుగుతుమ్దినువ్వూ, నీ పెళ్ళాం అన్నాడు ఇన్స్ స్ప్ర్క్తర్ అయోమయం.
"లేదు ఇన్స్ స్పెక్టర్ ! మేమిద్దరం కూడా ఎప్పుడూ దేబ్బలాడుకోలేదు" అబద్దం చెప్పాడు రాంపండు.
