"నీ ఇష్టం సునీల్ ...... నీ కౌగలిలో వాలిపోవడం వరకే నాఇష్టం..... తరువాత నా అణువణువూ నీ స్వంతమే! నువ్వేం చేసినా కాదనేది లేదు....."
ఎంతో కాలం నుండి సెక్స్ సుఖం రుచి ఎరుగనట్టు తమకంతో ఒకరినొకరు అల్లుకుపోయారు.
మెత్తని పరుపు ఆ ఇద్దరినీ మరింత మెత్తగా తనలో ఇమడ్చుకున్నది ------
కాలం ఎలా కరిగిపోతున్నదో వాళ్ళకు తెలియడం లేదు.....
సృష్టిలో తాము ఇద్దరమే ప్రేమక జీవులం అన్నట్టు సుఖ భోగాలతో తేలియాడుతున్నారు.....
ఎప్పటికో అలసి సోలసిపోయిన శరీరాలు సేద తీరుతున్నాయి.
"మంగళా డార్లింగ్ ! ఇప్పుడే వస్తాను. ఈలోపు నువ్వు ఫ్రెష్ గా స్నానం చేయి" అంటూ బట్టలు వేసుకుని బయటకు వెళ్ళాడు సునీల్.
రిసెప్షన్ లోకి వెళ్ళి తనకు కావలసిన నంబరు కోసం డయల్ చేశాడు అతను.....
గదిలో వున్న మంగళ బాత్ రూమ్ కు వెళ్ళడానికి లేచి నిలబడింది ...... తలుపు వేసుకోబోతూ బట్టలు బయటనే వుండిపోవడంతో వెంటనే తలుపు తీసుకుని బయటకు వచ్చింది.
మరుక్షణం అదిరిపడింది.
ఎదురుగా కనిపించిన ఆకారాన్ని చూసి కెవ్వున కేకవేసింది.
కిందపడిన బట్టలను అందుకుంటూనే అనుమానంగా తలుపు వైపు చూసింది. వేసిన తలుపు వేసినట్టు వుంది కానీ , అతను లోపలకు వచ్చాడూ అంటే ఎప్పటి నుండో అతను లోపలే వున్నాడన్న మాట.
అలా అనుకోవడంతో ఏదో తెలియని భీతి ఆమె ఆణువణువూనూ వణికించి వేసింది. గాభరాగా బట్టలను తన నగ్న శరీరానికి అడ్డుగా వుంచుకుంటూ బాత్ రూమ్ లోకి పరుగు దీసి తలుపు వేసుకోబోయింది.
అప్పటికే అతను చేరుకున్నాడు.
మంగళ తనను చూసింది.
తన విషయం సునీల్ కు చెబుతుంది.
అలా చెప్పకుండా వుండాలంటే ఆమె నోటిని శాశ్వతంగా మూయించాలి.
ఆమె వెనుకనే ఒకే ఒక్క అంగలో అతను కూడా బాత్ రూం లోకి జొరబడ్డాడు.
నోరు తెరచి కేక పెట్టె లోపలే సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ నుండి రెండు బుల్లెట్లు చప్పుడు చేయకుండా దూసుకు వెళ్ళాయి. ఆమె వక్షోజాల మధ్యగా ఎర్రటి నెత్తురు జలజలా కారింది.....
చిన్నగా మూలుగుతూ మంగళ కుప్ప కూలిపోయింది.
తన ఉనికిని పసిగట్టిన ఆమె ప్రాణాలు అనంత వాయువులలో కలిసి పోయాయని గ్రహించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయటపడ్డాడు ఆ ఆగంతకుడు.
రిసెప్షన్ లో ఇంకా ఎవరితోనో మాట్లాడుతూనే వున్న సునీల్ దూరంగా ముఖ ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు.
అతను జానీ వాకర్!
ఎందుకు వచ్చాడో ---- ఎందుకు వెళుతున్నాడో!
ఫోన్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళాడు సునీల్.
తలుపు దగ్గరకు వేసి వుండడంతో , బోల్టు వేసుకోకుండా బాత్ రూంలో వుందేమిటి అనుకుంటూనే బాత్ రూము తలుపు కూడా కొద్దిగా తెరిచి వుండడం గమనించి సునీల్ ఆశ్చర్యపోయాడు.
"ఏయ్ మంగళా!" అంటూ లోనికి అడుగుపెట్టబోతూ ఖంగారుగా బయటనే ఆగిపోయాడు.
ఎదురుగా రక్తపు మడుగులో పది వున్న మంగళ నగ్న దేహం....
ఆ ఘోరం ఎలా జరిగిందో అతనికి అర్ధం కాలేదు.....
తను ఫోన్ చేయడానికి బయటకు వెళ్ళిన సమయంలో ఏదో జరిగిందని వూహించాడు . ఆమె పట్ల శత్రుత్వం వున్నవాళ్ళు ఎవరో సమయం కోసం కాచుకుని వుండి ఆమెను అనుసరించి వచ్చి హత్య చేసి తప్పుకుని వుండాలి..... ఆ హత్య నేరం తనపై రుద్దాలి అని వాళ్ళ వూహ కావచ్చు.... మంగళ ఎందుకు చెప్పినప్పటికీ హోటల్ గదిని మారుపేరుతో బుక్ చేయడం తనకు మంచిదే అయింది. అసలు మంగళ ఇక్కడకు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది మిస్టరీగానే వుండిపోయింది. ఎందుకంటె వచ్చింది బురఖాలో వచ్చింది కాబట్టి తను ఖంగారు పడవలసిన అవసరం లేదు.
ఇలాంటి సందర్భంలో తను ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అనుకుంటూ తనకు సంబంధించిన వస్తువులతో పాటు, ఆమె వేసుకుని వచ్చిన బురఖా కూడా తీసుకుని బయటకు వచ్చి సునీల్ తలుపును లాక్ చేశాడు.
తను తప్పు చేయలేదు .....ఎందుకు భయపడాలి?
సునీల్ మనస్సులోని ఆరాటం అప్పుడు తగ్గింది.
పాపం మంగళ పాడు సెక్స్ కోసం వచ్చి బలై పోయింది.
ఆమె గుర్తుకు రావడంతో సునీల్ హృదయం నిండా జాలి పేరుకు పోయింది.
హోటల్ దాటి బయటకు వచ్చాక కానీ అతని గుండె దడ తగ్గలేదు....
* * *
ఇన్ స్పెక్టర్ ధీరజ.....సీతాపతి పనిచేసే ఆఫీసు ముందు జీప్ దిగింది.
ఆమె అంతకుముందు ఒకసారి వచ్చి వుండడం వలన మేనేజర్ గుర్తుపట్టి సాదరంగా ఆహ్వానించాడు.
"మీ ఆఫీసులో కిశోర్ అనే వ్యక్తీ పనిచేస్తున్నాడు కదూ...."
"ఎస్ మేడమ్ .....అతనూ, సీతాపతి మంచి స్నేహితులు కూడా"
ఆమె అడగకుండానే తనకు తెలిసిన సమాచారాన్ని అందించాడు మేనేజర్.
"దట్స్ రైట్.....అతనిని ఒకసారి పిలవండి"
బోయ్ ను కేకవేసి కిశోర్ కు కబురు పెట్టాడు మేనేజర్.
రెండు నిమిషాల తరువాత మేనేజరు గదిలోకి అడుగుపెట్టిన కిశోర్ అక్కడ పోలీసులను చూసి ఆశ్చర్యపోయాడు..... ఖంగారు పడిపోయాడు కూడా.
"మిస్టర్.....మీకు సీతాపతి బాగా తెలుసు కదూ...."
"అవును....." భయంతోనే చెప్పాడతను.
"ఈ లెటర్ ను కమీషనర్ గార్కి మీరే పోస్టు చేశారు కదూ...."
ఉత్తరాన్ని చూపిస్తూ ప్రశ్నించింది ధీరజ.
"అవును.....ఆ.... కాదు.....నాకు ఏం తెలియదు."
ఖంగారు పడిపోతున్నాడతను."
"కిశోర్ నువ్వే ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేశావనీ......సీతాపతి కనిపించక ముందు చాలా రోజుల క్రితమే అతను ఈ ఉత్తరాన్ని నీకు ఇచ్చాడని తెలుస్తుంది. అసలు నీకు ఏం తెలుసో అది ఉన్నది వున్నట్టు చెప్పు."
ధీరజ నచ్చచెప్పే ప్రయత్నం చేసింది.
మేనేజర్ కూడా అతనికేమీ కాదు అని అభయం ఇచ్చాడు.
అప్పటికి కిశోర్ మెత్తబడ్డాడు.
"ఆగండి మేడమ్........ నాకు తెలిసినంతవరకూ చెబుతాను"
"సీతాపతికి ఆమె భార్య లలిత పైనే అనుమానం వున్నట్టు ఉత్తరంలో వ్రాసుకున్నాడు. ఆమె అతనిని ఏదయినా చేసి వుండవచ్చు అంటారా?"
"చాలాసార్లు సీతాపతి ఈ మాటలను నాతొ చెప్పాడు. తన మాటను భార్య లక్ష్య పెట్టదనీ , తను లేనప్పుడు పరాయి మగవాళ్ళతో తిరుగుతుందని బాధపడేవాడు. దానికి తోడు ఆమె తన స్నేహితులతో ఎప్పుడు అయినా తనను చంపిస్తుందేమో అనే అనుమానం రానురానూ పెరిగిపోతూ వచ్చింది"
"తన నడవడిక తప్పుదారిలో వుందని తెలిసినా భారిస్తున్నాడు కాబట్టి ఆమె అతనిని చంపించి వుంటుందని నేను అనుకోవడం లేదు.... కాకపోతే ఏ చిన్న గొడవ జరిగినా అదిగో అది నన్ను చంపించాలని చూస్తుంది అని సీతాపతి పదేపదే ఉలిక్కిపడే వాడు " అన్నాడు కిశోర్.
"అంటే లలిత చేసివుండక పోవచ్చునంటారు...."
'అవును మేడమ్...."
"రాధాదేవి మీద మీఆభిప్రాయం ఏమిటి?"
"సీతాపతి ఆమెను రెండవ పెళ్ళి చేసుకున్నాడు. లలితకూ అతనికి మనస్పర్ధలు వచ్చిన నేపధ్యంలో ఆమెను పెళ్ళి చేసుకున్నాడు.....అతనికి మొదటి భార్య మీద కన్నా రెండవ భార్య మీదే ప్ర్రేమ ఎక్కువ. ఎప్పటికయినా తన శేష జీవితాన్ని రాధాదేవి దగ్గరే గడుపుతానని అంటుండేవాడు."
"ఆమెతో మీకు పరిచయం వుందా?"
"వుంది.....ఆమె మా బంధువుల అమ్మాయి.....నేనే వాళ్ళ ఇద్దరు రిజిస్టర్ మారేజ్ చేసుకున్నప్పుడు సాక్షి సంతకం చేసింది కూడా....."
"ఐసీ.... సీతాపతిని ఆఖరి సారిగా మీరు ఎప్పుడు చూశారు.."
జూన్ ఒకటవ తేదీన"\
"అంటే అదేరోజు నుంచి సీతాపతి కనిపించడం లేదు కదూ"
"అవును, ఆరోజు రాధాదేవి కూడా వైజాగ్ లోనే వుంది. ఉదయమే ఆమెను తీసుకుని మాఇంటికి వచ్చాడు సీతాపతి. వైజాగ్ లో తనకు పని వుండి వచ్చిందనీ పని చూసుకుని సాయంత్రం ట్రెయిన్ లో వెళ్ళి పోతుంది అంతవరకూ మీ ఇంటిలో వుండనివ్వు ....అని చెప్పి ఆమెను మా ఇంటి వద్ద దిగవిడిచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నుండీ అతను కనిపించడం లేదు..... ఆరోజు ఆమె ఎప్పుడు వెళ్ళిపోయిందో నాకు తెలిసే అవకాశం లేకుండా నేను ఆఫీసులో వున్నాను. రాత్రి ఇంటికి వెళ్ళేసరికి ఆమె లేకపోవడం చూసి వెళ్ళిపోయి వుంటుందని సరిపెట్టుకున్నాను. మీ పోలీసులు వచ్చి ఎంక్వయిరీ చేస్తుంటే అప్పుడు తెలిసింది అతనిని ఎవరో హత్య చేశారని....అందుకే నా దగ్గర వున్న ఉత్తరాన్ని కమీషనర్ గారికి పోస్ట్ చేశాను."
