Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 20

 

    రెండవుతుంది.

    ఏదో చప్పుడు ఇంకా వినబడుతోంది. అయిదు నిమిషాలు చూశాడు రాబర్టు.

    మోహిని రాలేదు. బాత్ రూం తలుపు తీసేవుంది.
   
    రాబర్ట్ ఒక్క క్షణం  ఆలోచించాడు. లేచి గది తలుపు దగ్గర కెళ్ళి లాగి చూశాడు.

    తలుపు రాలేదు.

    అటువేపు గొళ్ళెం పెట్టివుంది.

    మోహాని ఎక్కడి కెళ్ళినట్టు?

    కిటికీ దగ్గరగా వెళ్ళి కర్టెన్ తొలగించి చూసాడు.

    అక్కడ

    తోటలో__
   
    వెన్నెల వెలుగులో మాలి గొయ్యి తవ్వుతున్నాడు. మోహానీ పక్కనే నించుని వుంది.

    మోహినీ గొయ్యి ఎందుకు తవ్విస్తోంది? భర్తనిగానీ  చంపేసిందా?

    అతన్ని చంపడానికి అవకాశంలేదు. మాలి అతనికి విశ్వాస పాత్రుడని చెప్పింది.

    మరి?

    మాలి గోయ్యితవ్వి పైకి వచ్చి

    "అయిందమ్మా!" అన్నాడు.

    "మంచి నిద్రలోవున్నాడు. ఫినిష్ చేసేయ్" అంది మాలితో మోహిని.

    "ఓసి నీ దుంపదేగా ఎంత దొంగాముండవే నువ్వు అనుకున్నాడు రాబర్టు.

    మోహిని ఏమిటో ఇప్పడతనికి పూర్తిగా అర్ధం అయింది.

    భర్త అసమర్ధుడు కావడంతో అందమ్తెన కుర్రాళ్ళనిలా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పడుకొని చివరకి తనగుట్టు ఎవరికీ తెలియకుండా  చంపెస్తుందన్న మాట.

    ఇప్పుడెలా బయటపడాలి?

    బయట కుక్కల కాపలా, గుర్ఖా, మరి....ఇంకా ఎందరున్నారో తెలిదు.

    రాబర్ట్ కిందికి చూశాడు.

    మాలి చేతిలో గొడ్డలి వెన్నెల వెలుగులో తళ్ళుక్కుమని మెరిసింది.

    ఆ గొడ్డలితో మాలి  తనని  నరకడానికి వస్తున్నాడా?

    రాబర్టుకి వళ్ళు గగుర్పొడిచింది.

    అప్పటివరకూ  తనకి  స్వర్గ సౌఖ్యలని అందించిన మోహాని ఇప్పుడు అతని చంపించడానికి సన్నాహం చేస్తోంది.

    పళ్ళు పట  పటమని కొరికాడు రాబర్టు.

    తనకి ముందు ఈ బంగాళాలో ఎంతమంది  బలైపోయారో  పాపం!

    రాబర్టు  ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు.

    కిందికి చూసాడు మళ్ళి

    చెట్లు గాలికి ఊగుతున్నాయి.

    మాలి వస్తున్నాడు.

    వెనకే మోహిని.

    మాలి చేతిలో గొడ్డలి మెరుపులు....

    "ఇది మనిషి కాదు కామినీ పిశాచం" అనుకున్నాడు రాబర్టు.

    రాబర్టు గబ గబ మంచం దగ్గరకి నడిచాడు.

    రెండు దిళ్ళనీ నిలువు పెట్టి దుప్పటి కప్పాడు. దిండు కింద వున్న పిస్తోలుని చేతిలోకి  తీసుకొని గదిలోని బెడ్ ల్తెటు నీ ఆర్పేసి తలుపు పక్కకెళ్ళి నిలబడ్డాడు రాబర్టు.

    అతను చెవులు రిక్కించి వింటున్నాడు దూరంగా.

    బయట.

    అడుగుల చప్పుడు.

    వస్తున్నాడన్న మాట!

    ఊపిరి బిగపెట్టి నించున్నాడు రాబర్టు.

    గది బయట తలుపుకి దగ్గరగా అడుగుల చప్పుడు - ఆగి పోయింది.

    గొళ్ళెం తీస్తున్న శబ్దం.

    తలుపు మెల్లగా తెరుచుకున్నాయి.

    మాలి లోపలికొచ్చాడు. చీకటిలో స్తెతం గండ్రగొడ్డలి మెరుస్తోంది. మాలి చాలా అలవాటుపడిన  వాడిలా మంచం కేసి నడుస్తున్నాడు.

    రాబర్టు మెరుపులా బయటకొచ్చి తలుపులు వేసి గొళ్ళెం పెట్టేశాడు.

    రాబర్టు వెనక్కి తిరిగే లోనే

    "అగు" అన్నమాట వినిపించింది.

    రాబర్టు తేరుకుని చూశాడు.

    మోహిని గది తలుపు తెరవడానికి ముందకోస్తోంది.

    లోపల్నుంచి మలి తలుపు గుంజుతున్నాడు.

    రాబర్ట్ నవ్వుతూ పిస్తోలుని ఆమెకి గురిపెట్టాడు.

    మోహిని  భయంగా అతన్ని చూస్తూ ఆగిపోయింది.

    రాబర్ట్ ఆమె దగ్గరగా వెళ్ళి పిస్తోలుతో ఆమె గుండెలమీద  పొడిచి అన్నాడు.

    "మోహిని దొంగని దోంగేప్పడూ నమ్మడు నీ కధలన్నీనేను నమ్మానని భ్రమపడ్డావు. నీ నిజరూపం  ఎలాంటిదో నేను పూర్తిగా అర్ధం చేసుకున్నాను నాకు పాపభీతి లేదు. నిన్ను చంపాలంటే కుక్కను కాల్చినట్టు  కాల్చేయడానికి ఒకే ఒక గుండు చాలు"

    "వద్దు , ప్లీజ్ నన్ను చంపకు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS