Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 20

    అతనికి ఏడుపోచ్చింది.

    తల్లీ నువ్వు ఇంటికి రా తల్లీ! నిన్ను వారం రోజులపాటు రోజుకో సినిమాకి తీసుకేళ్తా... అనుకున్నాడు. మనసులోనే అందరు దేవుళ్ళకీ మొక్కుకున్నాడు.

    అంతకుమించి ఏం చెయ్యగలడు? ఆ మహానగరంలో ఆమె గురించి ఎక్కడని వేతకగలడు?

    రాత్రి ఏడున్నర గంటలకి టీవీలో వార్తలు వింటున్నాడు. వార్తలు చదివే అతను ఓ యాంగిల్ పారేసి చిరునవ్వులు చిరునవ్వులు చిందిస్తూ యీ రోజు మధ్యాహ్నం హుస్సేన్ సాగర్ లో ఓ స్రీ శవం తేలడం చూసిన జనం పోలీసులకు ఆ విషయాన్ని తెలియచేశారు" అన్నాడు.

    ఉలిక్కిపడి సోఫా అంచుకు జరిగికూర్చుని టీవీ వంక గుడ్లప్పజెప్పి చూశాడు.

    "దేవా...దేవా...దేవా... అది రాజీ కకూడదు" అనుకున్నారు టీవి వంక చాలా టెన్షన్ గా చూశాడు.

    నీళ్ళలోంచి వెలికి తీసిన శవం మీద ఎర్రగుర్రం చీర, జాకెట్ వున్నాయ్.

    రాత్రి రాజీ ఏ రంగు చీర కట్టిందా అని ఆలోచించాడు రాంపండు. కానీ ఆ కంగారులో రాంపండుకి ఏమీ గుర్తు రాలేదు.

    మరణించిన స్రీ నల్లగా, పొట్టిగా వుంది. వయస్సు సుమారు యాబై సంవత్సరాలు వుంటాయ్."

    రాంపండు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. సడెన్ గా అతనికి ఓ ఆలోచన వచ్చింది. 'నా మీద అలిగిన రాజీ వాళ్ళ పుట్టింటికి గాని వెళ్ళి పోయిందేమో.... ప్రొద్దున్న తొమ్మిది గంటల బస్సుకి బయలుదేరితే సాయత్రం నాలుగ్గంటల కల్లా విజయవాడ చేరుకుంటుంది!'

    ఇంకేమీ ఆలోచించకుండా టీవీ కట్టేసి ఇంటికి తాళం వేసి దగ్గర్లో వున్న ఎస్ టి డి బూత్ వెళ్ళాడు రాంపండు.

    విజయవాడలోని వాళ్ళ మామగారింటికి ఫోను చేశాడు రాంపండు. ఫోను అతని మామగారే ఎత్తారు "ఏవండీ మామగారూ... బాగున్నారా?" అని అడిగాడతను.

    "బాగానే వున్నాం బాబూ... మా అమ్మాయ్ ఎలా వుంది?" అవతలనుండి అడిగాడు అయన.

    రాంపండు గతుక్కుమన్నాడు అంటే రాజీ అక్కడ కూడా లేదన్నమాట!

    "బా...బా...బాగానే వుంది" అన్నాడు తడబడ్తూ.

    "ఎంటంత  హఠత్తుగా ఫోను చేశావు?" అడిగాడాయన.

    "ఏం లేదు.... ఈ మధ్య మీరూ, అత్తయ్యగారూ ఊర్కూర్కే మాకల్లోకోస్తుంటే ఎలా వున్నారో కనుక్కుందామని ఫోను చేశాను.'

    "చాలా సంతోషం బబూ... అయినా మా అమ్మాయికి ఇంకా విశేషం ఏమీ లేదా?"

    మనిషే గల్లంతవుతే విశేషం అట? నెత్తిమీద కసిగా మొట్టుకున్నాడు. "అబ్బే... ఇప్పుడుప్పుడే ఏం లేదులెండి" అన్నాడు.

    "అలా అంటే ఎలా బాబూ.... వయసంతా గడచిపోతూ వుంది... ఇప్పుడు కాకపోతే నలబై ఏళ్ళు వచ్చాకా..." లోడ లోదా మాట్లాడుతున్నాడు అయన అవతల నుండి.

    ఓ అయిదు నిమిషాలపాటు మాట్లాడి ఫోను పెట్టేసి "హే భగవాన్!" అని జుట్టు పీక్కున్నాడు రాంపండు.

    "ఏం సార్... బీర్ చాలా ఎక్కువైందా?" అని అడిగాడు ఆపరేటర్ రాంపండు వంక అయోమయంగా చూస్తూ.
    లాభం లేదు... ఇంకా ఫోలీసుల్నే అశ్రయించాలి!

    డబ్బులు చెల్లిస్తూ అనుకున్నాడు రాంపండు.
   
                                                                 *    *    *    *
   
    "నా కెంటో భయంగా వుందిరా బ్రహ్మాజీ" ఫోలీసు స్టేషన్ ఆవరణలో అడుగుపెడ్తూ అన్నాడు రాంపండు.

    "ఎందుకూ భయం.... మీ ఆవిడని నువ్వేం హత్య చేయ లేదు కదా? మా ఆవిడ తప్పిపోయిందని కంప్లయింట్ ఇస్తావు...అంతే!" అన్నాడు బ్రహ్మాజీ.

    "తప్పిపోవడం ఏమిట్రా...? లేచిపోయిందని యిస్తావా...?" అడిగాడు బ్రహ్మాజీ.

    రాంపండు బ్రహ్మాజీ వంక సీరియస్ గా చూశాడు.

    "మరి లేకపోతే ఏంట్రా పండూ... మా ఆవిడ యిల్లు విడిచిపెట్టి పోయిందని చెప్పానే అనుకో.... ఎందుకు దెబ్బలాడుకున్నారు?... నువ్వేమైన మీ ఆవిడని కొట్టావా? లేదా ,మీ ఆవిడని చంపేసి ఎక్కడో పారేసి నీ మీద అనుమానం రాకుండా వుండడానికి మాకు కంప్లైయింట్ యివ్వడానికి వచ్చావా? అంటూ లేనిపోని తిక్కతిక్క ప్రశ్నలేసి నిన్ను చావాగోడ్తారు. ఆ తర్వాత నీ యిష్టం" అన్నాడు బ్రహ్మాజీ.

    "కానీ మరీ తప్పిపోయింది అని అంటే ఏం బాగుంటుంది చెప్పుపోనీ కనపడ్డం లేదు అని అంటేనో?" అడిగాడు రాంపండు.

    "మంచి కళ్ళద్దాలు వేయించుకో అంటారు!"

    "ఏయ్... ఎవరు మీరు? ఏం చేస్తున్నారిక్కడ?"

    రాంపండూ, బ్రహ్మాజీ తలలు త్రిప్పి చూశారు. ఓ కానీస్టేబుల్ వీళ్ళిద్దరివంకా క్రూరంగా చూస్తూ నిలబడి వున్నాడు.

    "మేమూ...? మేమేం చేస్తాం...? ఇక్కడ డిస్కస్ చేసుకుంటూన్నాము ఏం చేయాలా అని!" తడబడ్తూ అన్నాడు బ్రహ్మాజీ.

    "ఏంటి? నేరం ఒప్పుకుని లొంగిపోదామా వద్దా అనా? పదండి మిమ్మల్ని సార్ దగ్గరకి తీసుకేళతా" అన్నాడు బ్రహ్మాజీ జబ్బ పట్టుకుని.

    నేరం ఏంటీ?  లొంగిపోవడం ఏంటీ?" అన్నాడు బ్రహ్మాజీ.

    "చూడు బాబూ.. నువ్వు అనుకుంటున్నట్లు మేమేం నేరస్థులంకాము" అన్నాడు రాంపండు.
    "సరే సరే... మీరు దోంగలో, హంతకులో, నక్సలైట్లో... సార్ దగ్గరే చెప్పుకోండి" అంటూ బ్రహ్మాజీ జబ్బు పట్టుకుని ముందు నడిపించాడు కానిస్టేబుల్ ఏడుకొండలు.

    అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలైంది.

    కాని స్టేబుల్ ఏడుకొండలు రాంపండు, బ్రహ్మాజీలను ఇన్ సెక్టర్ అయోమయం గదిలోకి తీసుకెళ్ళాడు.

    ఎవరు వీళ్ళు.... జేబులు కొట్టేవాళ్ళా?....కాల్చిపారేస్తానంతే" కానీ స్టేబుల్ ఏడు కొండలుతో అన్నాడు రాంపండు, బ్రహ్మాజీలను చూస్తూ.

     వాళ్ళిద్దరకీ ఒళ్ళుమండింది. ఏంటి మేమేమైన జేబులు కొట్టేవాళ్ళలా కనిపిస్తున్నామా అనుకున్నారు.

    "వీళ్ళు ఆ బాపతు కాద్సార్..." అంటూ ఏడుకొండలు ఏదో చెప్పబోయాడు.

    "ఓహొ... అయితే బ్రోతల్ హౌస్ నడిపేవాళ్ళా? అయినా సరే కాల్చిపారేస్తా!" అన్నాడు ఇన్స్ సెక్టార్ అమోమయం ఇద్దర్నీ క్రూరంగా చూస్తూ.

    "హబ్బా...! బాధగా నెత్తి కొట్టుకుంటూ అన్నాడు బ్రహ్మాజీ

    "రామరామ..." అన్నాడు రాంపండు.

    ఇన్స్ సెక్టార్ అయోమయం నిటారుగా కూర్చున్నాడు.

    "సార్... మీరు బిజెపి పార్టీ నాయకులా సార్" మర్యదుగా అడిగాడు రాంపండుని.

    "కాదు యేం?" హాఠాత్తుగా అతనిలోని మార్పుకు ఆశ్చర్యపోతూ అడిగాడు రాంపండు.

    "మరి రామరామ అని అన్నారు?"

     "అదా?... బాధ భరించలేక అరిచాను" అన్నాడు రాంపండు.

    ఇన్స్ సెక్టార్ అయోమయం మళ్ళీ క్రిందకి జారి కూర్చున్నాడు.

    "హౌస్ అంతేనా? రామరామ అంటే ఇంకా మీరు బిజెపి పార్టీ వాళ్ళేమో అనుకున్నా.... అయినామాకు ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళయినా భయం లేదనుకో.... కాల్చిపారేస్తా! ఏమ్మో...ఇద్దరూ తెగ బాధపడిపోతు న్నారూ? ఏం.... ఆడపిల్లలతో వ్యాపారం చేస్తే బాగానే వుందిగానీ పట్టుబడినప్పుడు వచ్చిందా బాధ? కాల్చిపారేస్తానంతే..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS