వరదరాజులు ఆదరాబాదరగా నాకు ఎదురు వచ్చాడు.
"రావయ్యా బాబూ... ఏవిటీవేళ ఆఫీసునుండి ఇంతాలశ్యంగా వచ్చావ్?" అన్నాడు ఆయసపడ్తూ.
"ఏవండీ... ఏవిటి సంగతి?" అని అడిగాను.
"కూ....కూ..."
లోపలి గదిలోంచి శబ్దం వినబడింది.
"ఏమిటండీ అది?"
"దాని గురించే... పద చెప్తా" అంటూ యింట్లోకి లాక్కెళ్ళాడు వరదరాజులు. లోపల హాల్లో మధ్యపాపిడి తీసుకుని అడ్డనామాలు పెట్టుకుని ఉన్న మధ్య వయస్కుడయిన ఒకాయన ప్లూటు వాయించుకుంటున్నాడు.
"ఈయన పేరు పీతాంబరం. గొప్ప సంగీత విద్వాంసుడు. ఈ అబ్బాయి బుచ్చిబాబు. అద్దెకు ఉంటున్నాడు" అంటూ పరిచయాలు చేశాడు వరదరాజులు.
"నమస్తే" అన్నాను.
"కూ కూ కూ..." అతను ప్లూటు వాయించాడు.
అంటే నమస్తే అని అర్థం అన్నమాట ఒక్కొక్కప్పుడు ఆయన మాటలకి బదులుగా ఇలా ప్లూటునే ఉపయోగిస్తాడు. అందుకే ఆయనకి "సంగీత వీరమణి" అనే బిరుదును కూడా ఇచ్చారు.
పరీక్షలు సరిగ్గా నెలరోజుల్లో ఉన్నాయి. చదవడానికి అ రోజునుండే ముహూర్తం పెట్టుకున్నాను.
ఎకౌంటెన్సీ పుస్తకం తీశాను
"కూ....కూ...కుక్కు కూ..."
నాకేదో అనుమానం వచ్చింది.

గబగబ వరదరాజులు పోర్షన్ లోనికి వెళ్లి తొంగి చూశాను. వరదరాజులు గది మధ్యలో బాసిపట్టు వేసుకుని కూర్చుని ప్లూటుతో అవస్థలు పడుతున్నాడు.
నన్ను చూడగానే సంతోషంగా గావు కేకపెట్టాడు..."
ఏమేప్... నా మొదటి శ్రోత వచ్చేశాడు...."
ఏమేప్ వచ్చింది.
"రా బాబూ... రా కూర్చో..."
"అబ్బే ఏం లే
దండీ..." అన్నాను,
"ఇంతకీ ఇది మీకు ఎక్కడిదండీ" నీరసంగా అడిగాను నేను.
"ఈయన తెగ ముచ్చటపడుతుంటే మద్రాసెళ్ళేముందు ఆయన ఇదిడ్ ఇచ్చివెళ్ళారు బాబూ!"
నాకు చిర్రెత్తుకొచ్చింది.
'కదోయ్... కాస్త వచ్చింది కదూ?" సంబరపడిపోతూ అడిగాడు.
నేను నీరసంగా అవునన్నట్టు తల ఊపాను.
"ఇప్పుడు చూడు...కు కు కీకీ కూ"
నాకు ఎగ్జామ్స్ గుర్తుకు వచ్చి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
హర్రే... నేను కరుణ రస రాగం వాయిస్తున్నానని నీకెలా తెల్సూ? చూశావే... ఇతని కళ్ళలో నీళ్ళు తిరిగాయ్... త్వరలో నేనూ సంగీత విద్వాంసుణ్ని అయిపోతూ."
అలా నన్ను ఓ గంటసేపు చిత్రహింస పెట్టాడు వరదరాజులు.
కాకా కీకీ కూకూ అంటూ అతను ప్లూటు వాయిస్తుంటే "క" గణితం లాగా ఉంది.
"ఇహ నే వస్తానండీ" అంటూ లేచాను.
గదికి వెళ్లి ఉదయం అయిదు గంటలకు అలారం పెట్టుకుని పడుకున్నాను.
ఉదయం అలారం మ్రోగగానే లేచి పుస్తకం పట్టుకున్నాడు.
"కూ..."
వరదరాజులు పోర్షన్లోంచి వినబడింది.
నా నవనాడులూ క్రుంగిపోయాయ్.
కుకూ...కుక్కూకూ..."
పుస్తకం విసరికొట్టి లైటార్పి పడుకున్నాడు.
మళ్ళీ ఏడుగంటలకు లేచి బ్రష్షు తీసుకుని కొళాయి దగ్గరికి వెళ్ళాను.
వరదరాజులు కూడా అప్పుడే ముఖం కడుక్కుంటున్నాడు.
"ఇంకా పూర్తిగా తెల్లారకముందే మీ యింట్లోంచి కూ కూ అని వినిపించింది. ప్లూటు ప్రాక్టీసు చేస్తున్నారా?"
.jpg)
"అవునోయ్... చీకటితోనే లేచి సంగీతం సాధన చెయ్యడం మంచిదట! పీతాంబరం చెప్పాడు."
అ రోజు సాయంత్రం ఆఫీసు నుండి చంచల్రావు ఇంటికి వెళ్ళాను.
"అలా బయటికిరా నీతో మాట్లాడాలి. నీ సహాయం కావాలి" అన్నాను.
ఇద్దరం ఓ హోటల్లో మూలనున్న టేబులు దగ్గర కూర్చున్నాం.
"చెప్పు ఏమిటి నీ సమస్య?"
