Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 19

    "అయితే ఇంటాయన పేరు వరదరాజున్నమాట!" అన్నాడు చంచల్రావు.

    "అనుకుంటా... నేనూ ఆ బోర్డు ఇప్పుడే చూశాను."

    "మరి ఆవిడ పేరో?"

    "ఏమో... నాకు తెలీదు. బహుశా ఏమేప్ అనుకుంటా" అన్నాను.

    చంచల్రావు కళ్ళప్పగించి చూశాడు నా వైపు.

    "ఆయన ఆవిడని అలానే పిలుస్తాడు."

    గాడి సర్దడం పూర్తయింది.

    ఇంతలో ఇంటాయన వరదరాజులు చెవికి ట్రాన్సిష్టర్ ఆనించుకుని లోపలికి వచ్చాడు. ట్రాన్సిష్టరులో వెస్ట్రస్  మ్యూజిక్ వస్తుంది.

    జించిక్ జించిక్ జించిక్ .... టక్ టక్.... దడ దడ... జించిక్...."

    ఏవబ్బాయ్. గాడి సర్దడం పూర్తయిందా?"

    పూర్తయిందన్నట్టు తల ఊపాను.

    "ఇక్కడ నీకు సౌఖ్యంగానే ఉంది కదూ?"

    "సౌఖ్యంగానే ఉందండీ..."

    "ఏవంటున్నావో తెలీడంలేదబ్బాయ్... కాస్త గట్టిగా చెప్పు"

    "ఆ దిక్కుమాలిన ట్రాన్సిస్టరు చెవిలో పెట్టుకుంటే ఎలా వినబడుతుంది?" అప్పుడే గదిలోకి వచ్చిన ఇంటావిడ వరదరాజులు చేతిలోని ట్రాన్సిస్టరు లాక్కుని కట్టేసింది.

    "ఆయనకి సంగీతం అంటే వల్లమాలిన ప్రేమ అబ్బాయ్" అంది ఆవిడ నాతో.

                                          

    మరుక్షణం ఆవిడ చూపులు చంచల్రావు మీద పడ్డాయి.

    ఆవిడ ముక్కు పుటాలు అదరడం మొదలు పెట్టాయి. పెదాలు వణకసాగాయి కళ్ళలో నీళ్ళు తిరగసాగాయి.
                                                

     "వదలండి... వదలండి... ఛీ.... ఏమిటిదీ?"

    చంచల్రావు ఓ నిమిషంపాటు గింజుకుని ఆవిడ పట్టునుండి వదిలించుకో గలిగాడు.

    "పాపం ఆవిడను మరోలా అనుకోకురా, మన వయస్సున్న కుర్రాళ్ళని ఎవర్ని చూసినా ఆవిడకి వాళ్బబ్బాయే గుర్తుకు వస్తాడుట!" అని నచ్చ చెప్పాను చంచల్రావుకి.
                                                  

    అవును బాబూ... ప్రస్తుతం మా అబ్బాయి మిలిట్రీలో వున్నాడు" అన్నాడు వరదరాజులు!

    "ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు?" కళ్ళు తుడుచుకుంటూ అడిగింది ఆవిడ.

    "ఇఅతను నా స్నేహితుడండీ... పేరు చంచల్రావు. ఈయన మా యింటాయన వరదరాజులుగారు, ఆవిడేమో ఏమేప్ గారూ-"

    పరస్పరం పరిచయం చేశాను.

    "ఉండండి బాబూ... టిఫిన్ తెస్తాను....." అంది ఆవిడ వెనక్కు తిరుగుతూ.

    "అబ్బే ఇప్పుడెందుకండీ టిఫిన్లూ గట్రా..." చంచల్రావు మొగమాటపడ్తూ అన్నాడు.

    "మా వాడూ అంతే బాబూ... నీలాగే మొగమాట పడేవాడు..."

    ఆవిడ చంచల్రావును చూస్తూ అంది. ఆవిడ ముక్కుపుటాలు అదురుతున్నాయ్....

    నేను రాబోయ్ ప్రమాదం పసిగట్టాను. చటుక్కున రెండుచేతులు బారచాపి చంచల్రావుకి అడ్డుగా నిలబడుతూ "అబ్బే వాడలాగే అంటాడు.... మీరు వెళ్ళండి త్వరగా టిఫిన్ తీసుకురండి ఏమేప్ గారూ అన్నాను.

    ఆవిడ భారంగా కదిలి వెళ్ళింది.

    నువ్వు చాలా అదృష్టవంతుడివి సుమా! అన్నట్లు చూశాడు చంచల్రావు మరేమను కున్నావ్ అన్నట్టు గర్వంగా తల పంకించాను నేను.

    రోజులు గడుస్తున్నాయ్.

    చంచల్రావు నా గదికి అప్పుడప్పుడూ వచ్చిపోతున్నాడు. మా ఇంటావిడ నాకు టిఫిన్లూ, కాఫీలూ ఇస్తుంది. అప్పుడప్పుడు భోజనం కూడా పెడ్తుంది, చంచల్రావు ఉంటే నాతోబాటు వాడికీ సకల మర్యాదలు జరుగుతున్నాయ్.

    అంతా బాగానే ఉందిగానీ ఎటొచ్చీ ఆవిడకి మిలట్రీలో ఉన్న వాళ్ళబ్బాయి గుర్తు కొచ్చినప్పుడే నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

    ఆరోజు మా ఆఫీసులో డిపార్టుమెంటల్ ఎగ్జామ్ కి సంబంధించిన సర్క్యులర్ వచ్చింది. అ పరీక్షకి కూర్చుని పాసవుతే ప్రమోషను వస్తుంది.

    "ఈసారి ఎలాగైనా పరీక్ష పాసవాలి!!"

                                                

      వెంటనే అప్లికేషను ఇచ్చేశాను. ఆఫీసు నుండి చంచల్రావు యింటికి వెళ్ళి వాడికి విషయం చెప్పాను.

    "ఇకనేం - ఈ రోజునుండీ చదవడం మొదలుబెట్టు. నువ్వు అలిసిపోతే టీ చేసి పెట్టడానికి మీ మమ్మీ కూడా "మా యింటావిడ) ఉందిగా అన్నాడు" వాడు.

    కాస్సేపు వాడితో కాలక్షేపం చేసి నాగదికి వెళ్ళాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS