"నోర్ముయ్....!" చెయ్యి ఎత్తాడు రాంపండు. పెళ్ళయిన తర్వాత మొదటిసారిగా.
"ఊ... కొట్టూ! పెళ్ళాన్ని కొట్టి నీ మగతనం నిరూపించుకో....!! నీతో నేను కనుక కాపురం చేస్తున్నా... వేరే ఏ ఆడదీ చెయ్యలేదు."
"ఓహొ అలగా... అంత కష్టపడి కాపురం ఏమీ చెయ్యనక్కర్లేదు గానీ... నువ్వు నన్ను వదిలిపెట్టేసి మీ ఇంటికెళ్ళి హాయిగా కూర్చో!"
"మిమ్మల్ని నలుగు లక్షలు పెట్టి కొనుక్కున్నాను. అంత ఈ జీగాఎలా వదలిపెట్టిసి పౌరషంగా అంది రాజీ.
రాజీ మాట్లాడే ఒక్కొక్క మాటా రాంపండుకి పిచ్చెక్కించేస్తుంది.
"మాట్లాడ్తె నాలుగులక్షలూ, నాలుగు లక్షలూ అంటావేం? మీ డబ్బు అంత వేస్టయిందని అనుకుంటే నాలుగు లక్షల మీద లాభం వేసుకుని నన్ను ఎవరికైనా అమ్మేయ్." జుట్టు పీక్కుంటూ అన్నాడు రాంపండు.
"మా నాన్న తెలివితక్కువవాడు కాబట్టి నిన్ను నలుగు లక్షలు పెట్టి ఎవతికొంటుంది?" ఎత్తి పొదుపుగా అంది రాజీ.
"హబ్బ!" నెట్టి కొట్టుకుంటూ బాధగా అరిచాడు రాంపండు.
* * * *
రాత్రి చాలాసేపు ఘర్షణపడి... ఆ తర్వాత ఆలోచనలతో కొట్టుమిట్టాడి ఎప్పుడో రాత్రి రెండు గంటల తర్వాత పడుకున్నాడు రాంపండు. మెదడు అలసిపోయి బాగా నిద్రపట్టేసింది.
అతనికి మెలుకువ వచ్చింది. బద్దకంగా ఒళ్ళు విరుచుకున్నాడు మంచం మీద పడుకునే ప్రక్కకి తిరిగి చూశాడు.
రాజీ లేదు... ఎప్పుడు లేచి వెళ్ళిందో కూడా అతనికి తెలీదు.
అంత డీప్ గా నిద్రపోయాడు. తలత్రిప్పి గూట్లోని గడియారం వంక చూశాడు.
టైం పడి గంటలు కావొస్తుంది.
మనసులోనే 'బాబోయ్' అని అరిచి మంచంమీద నుండి గబుక్కున లేచాడు.
ఆఫేసుకు టైమైపోయింది. ఇప్పుడు ఎలా? ఉన్న ఫళాన పాచి ముఖంతో బయలుదేరినా ఆలస్యం అయినట్టే. ఇంకా మొహం కడుక్కుని కాఫీ త్రాగి, స్నానంచేసి, భోంచేసి ఆఫేసు కెళ్ళేసరికి పన్నెండు గంటలసేపువుతుంది. ఈ టైముకెళితే యింకేమైనా వుందా? ఆ సర్వోత్తమరావు ఏంటి నీ వ్యవహారం అని చడామడా వాయిమ్చి పారేస్తాడు. ఇంట్లోనూ మనశ్శాంతి లేక, ఆఫీసులోనూ మనశ్శాంతి లేకపోతే ఇంక అయినట్టే. ఈరోజు శలవు పెట్టెయ్యడమే వుత్తమం అనుకున్నాడు.
మంచం దిగి మెల్లగా అడుగులు వేసుకుంటూ బ్రాత్రూంలోకి వెళ్ళాడు.
పళ్ళు తోముకుంటున్నప్పుడు అనుకున్నాడు. 'ఎలాగూ యీ వేళ శెలవు కదా! పోనీ రాజీని ఏ సినిమాకో, రెస్టారెంట్ కో తీసికెళ్తే? అని కానీ అతనికి రాత్రి జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది.
రాత్రి అంత గొడవ చేసింది.... అలాంటప్పుడు దాన్ని బయటికెందుకు తీసుకెళ్ళాలీ... న్యూస్ పేపర్ చదువుకుని భోంచేసి ముసుగెట్టిపడుకుని సాయత్రం బ్రహ్మాజీ యింటికెళ్ళి కావాలనే అక్కడ రాత్రి తొమ్మిది గంటలదాకా గడిపి ఆలస్యంగా ఇంటికి రావాలి!" అనుకున్నాడు రాంపండు.
'అవునూ... ఇంట్లో అస్సలు ఏ మాత్రం అలికిడి అవడం లేదు. రాజీ ఏం చేస్తుంది? అ... వంట గదిలో పీటమీద ఓ మూల కూర్చుని వుండి వుంటుందిలే!"
పళ్ళు తోముకోవడం అయిపోయాక హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని చేతిలోకి న్యూస్ పేపర్ తీసుకుంటూ "కాఫీ" అని అరిచాడు రైల్వేస్టేషన్లో ప్లాట్ ఫామ్ మీద కాఫీ అమ్ముకునేవాడిలా.
లోపల్నుండి ఏ విధమైన సమాధనం లేదు. ఏ అరనిమిషంపాటు గ్యాపిచ్చి 'కాఫీ' అని మళ్ళీ అరిచాడు. ఈసారి ఇంకస్తా గట్టిగా.
ఊహూ... అయినా జవాబు లేదు.
'ఓహొ.... సహాయ నిరాకరణోద్యమమా?' అనుకున్నాడు రాంపండు కి చికాకు కలిగింది.
నేనేదో పెద్ద నేరం చేసినట్టు ప్రవర్తిస్తుందేమిటీ? చెప్పిన రోజు సినిమాకి తీసుకెళ్ళాలేకపోతే మొగుడు విలనైపోతాడా? అలాగైతే పెళ్ళాన్ని అనుమానింఛీ, చీటికీ హింసింఛీ, పెళ్ళాం మంగళసూత్రంను సైతం అమ్మేసి త్రాగి పెకాటలూ అదే మేగుళ్ళని ఏమనాలి? వాళ్ళల్లో ఏ ఒక్కరి క్రిదకీ రాను కదా నేను? అయినా చీటికీ మాటికీ కట్నం గురించి ఎత్తుతుందేమిటీ. ఇదేమైన లవ్ మ్యారేజా కట్నం లేకుండా చేసుకోవడానికి. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళలో కట్నాలూ, లంచానాలూ పెద్దవాళ్ళు చూస్తున్నారు. నేనేమైనా అడిగానా... న్యూస్ పేపర్ విస్సుగా టీపాయ్ మీదేసి కొడుతూ సోపాలోంచి లేచి వంటగదివైపు అడుగులు వేశాడు రాంపండు.
"హు! బోడి కాఫీ నేను పెట్టుకుని తాగాలేనా?"
వంట గదిలోకి అడుగు పెట్టాడు అతను. అక్కడ రాజీ లేదు. బెడ్ రూమ్ లో లేదూ, బాత్రూంలో లేదూ, హల్లో లేదూ, వంట గదిలో లేదు... మరి రాజీ యింకేక్కడ వుందబ్బా?
గబగబా రెండంగల్లో పెరట్లోకి వెళ్ళాడు. ఆమె అక్కడా లేదు.
అప్పుడు రాంపండు లో కాస్త భయం మొదలయింది. ఇంటి చుట్తో గిర్రున పరుగెత్తాడు. ఆమె జాడ లేదు.
ఏమైంది? ఎక్కడకెళ్ళింది??
కాస్సేపు అలానే శీలప్రతిమలా నిలబడిపోయాడు.
ఇంత ప్రొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది? అసలు ఆమె ఎవరింటికీ వెళ్ళే మనిషి కాదే! మరి ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో అర్జంటుగా కాఫీ పొడి, చక్కేరో, ఏ కందిపప్పో అయిపోతే షాపు కెళ్ళిందేమో!!
ఇలా అనుకునేసరికి అతని మనసు నెమ్మళించి ఇంట్లోంకెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇప్పుడు రాంపండుకి తను కాఫీ త్రగాలేదన్న ఆలోచన కూడా లేదు. ఆమె ఎక్కడికెళ్ళిందో తెలిసేదాకా అతనికి మనశ్శాంతి వుండదు.
టైం గడుస్తుంది....
పావుగంట... అరగంట... గంట.
అయినా ఆమె రాలేదు.
కిరానా షాపులో ఏమైనా కొనాలంటే ఇంతసేపు ఎందుకవుతుంది. కాబట్టి కిరణాషాప్ కి వెళ్ళలేదు.
మరి ఎక్కడికెళ్ళింది? జుట్టు పీక్కున్నాడు అతను.
ఒక నిర్ణయానికి వచ్చి డ్రెస్ చేసుకుని బూట్లేసుకుని ఇంటికి తాళం పెట్టిబయట పడ్డాడు.
ఫస్టు సత్యవతి యింటికి వెళ్ళాడు.
"మీ ఆవిడా... రాలేదు" అంది సత్యవతి అతనితో.
ఇంకా ఆ కాలనీలో రాజీ కోసం వచ్చే ఆడాళ్ళు నలుగురైదుగురి యింటికెళ్ళి అడిగాడు.
ఎవర్నీ అడిగినా ఆమె తమ యింటికి రాలేదని చెప్పారు వాళ్ళు.
అతనికి లేనిపోనీ సందేహాలు కలిగి చాలా భయం వేసింది.
ఎక్కడకి వెళ్ళివుంటుంది? కొంపదీసి నా మీద కోపం వచ్చి ఏదైనా అఘాయిత్యమో చేసేంత గోడవేమీ రాత్రి జరగలేదు కదా?అయినా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళలేదు కదా?
ఈ ఆలోచన అతన్ని వణికించేసింది.
ఏ అఘాయిత్యమో చేసేంత గోడవేమీ రాత్రి జరగలేదు కదా? అయినా ఆమెది అంత వీక్ మైండ్ కాదు.
మరైతే రాజీ ఏమైనట్టు?
అతను కాళ్ళీడ్చుకుంటూ ఇంటికెళ్ళి సోఫాలో కూలబడ్డాడు. వారం రోజులనుండీ తిండీ తినని వాడిలా చచ్చేంత నీరసంగా వుండి అతనికి. ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా సోఫాలోనే పడుకుండిపోయాడు.
మళ్ళీ కళ్ళు తెరిచేసరికి గోడ గడియారం అయిదు గంటలు కొట్టింది. అతను చట్టుక్కున సోఫాలోంచి లేచి ఇల్లంతా వెతికాడు. రాజీగానీ వచ్చిందేమోనని! ఉహు... ఆమె రాలేదు.
