ష్...మాట్లాడొద్దు నేపధ్యం...
ఈ సంఘటన యూరప్ లో జరిగింది. 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన.
డగ్లాస్ అనే వ్యాపారి ఓ ఖాళీ స్ధలాన్ని కొని, ఆ స్ధలంలో చెక్కలతో ఓ యిల్లు నిర్మించుకున్నాడు. అతను చేసే వ్యాపారం ఏమిటో ఎవరికీ తెలియదు. పొద్దున్నే వెళ్ళిపోయేవాడు. ఏ అర్ధరాత్రో ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతను వెళ్ళడంగాని, రావడంగాని చూసినవాళ్ళు అరుదు. ఆ ఇంట్లో నుంచి అప్పడప్పడు అర్ధరాత్రుళ్ళు కేకలు వినిపించేవి. ఆ చుట్టుపక్కల వాళ్ళలో కాస్త ధైర్యస్దులు ఎవరూ లేక పోవడంవల్ల భయంతో బిగుసుకుపోయేవారు. ఒకరోజు ఆ ఇంటి ఎదురుగా నివసించే మోనియార్ అనే పధ్నాలుగేళ్ళ పిల్లాడు నిద్రపట్టక బయటకు వచ్చాడు.
అదే సమయంలో డగ్లాస్ నల్లకారులో తన ఇంటికి వచ్చి, కారు డిక్కీలో నుంచి ఒక వ్యక్తి భుజం మీద వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. డిక్కీలో ఉన్న వ్యక్తి ప్రాణాలతో లేడనే అనుమానం కలిగింది. మోనియర్ ఆ విషయం తనతల్లిదండ్రులను లేపి చెప్పినా వాళ్ళు నమ్మలేదు. మోనియర్ లో క్యూరియాసిటి పెరిగింది. ఒక రోజు రాత్రి ఎవరూ చూడకుండా ఆ చెక్క ఇంట్లోకి ప్రేవేశించాడు.
ఆ ఇంట్లో అతనికి విభ్రాంతికరమైన దృశ్యాలు కనిపించాయి. ఆ చెక్క ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ఆపరేషన్ ధియేటర్ కనిపించింది. మనుష్యులు శవాలు కొక్కిలకు వ్రేలాడుతూ కనిపించాయి. భయంతో స్పృహ కోల్పోయినంత పనైంది. అయినా దైర్యం కోల్పోక, ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఇలాంటి గొడవలు మనకెందుకు మందలించినా, వినకుండా తనే స్వయంగా పోలీసులకు ఈ విషయం తెలియజేసాడు.
పోలీసులు ఆ చెక్క ఇంటి మీద రైడింగ్ చేశారు. చిత్రంగా ఆ యింట్లో ఏ సాక్ష్యమూ లేదు. అదో పిల్లచేష్టగా కొట్టిపారేసారు. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత మోనియర్ అదృశ్యమయ్యాడు. మరో వారం రోజుల తరువాత అతని డెడ్ బాడి ఒక పొదలో కనిపించింది. అతని మెదడు భాగాలు, కిడ్నీలు మిస్ అయ్యాయి.
అదే రోజు మోనియర్ తల్లిదండ్రులు డగ్లాస్ మీద అనిమానం వ్యక్తం చేశారు. పోలీసులు మరోసారి ఆ ఇంటిమీద రైడింగ్ చేసేలోగా, ఆ రోజు రాత్రి పోలీసులు ఒక్క ఇంటికి సమీపించడానికి అరగంట ముందే చెక్క ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి, ఆ ఇల్లు బూడిదగా మారింది. డగ్లాస్ కూడా ఆ మంటల్లో చనిపోయాడని భావించారు.
ఆ కేసు తాలూకు మిస్టరీ అలానే ఉండిపోయింది.
దక్షిణాఫ్రికా అడవుల్లో సియోంరా అనే ఆటవిక జాతి వుంది. ఈ జాతిలో కొందరు 'నరమాంసం' ను ఆహారంగా స్వీకరిస్తారు. వీళ్ళు మనుష్యులను వేటాడే పద్ధతి విచిత్రంగా వుంటుంది. అడవుల్లోకి ప్రవేశించిన వారితో స్నేహం నటించి వారిని తమ ఇళ్ళలోకి ఆహ్వానిస్తారు.
మత్తు కలిపిన పానీయాన్ని తాగిస్తారు. మంచి రుచిగా వుండే ఆ పానీయంలో ఛాంగు లాంటిది కలుపుతారు. వాళ్ళు నిద్రపోయిన తరువాత కాళ్ళు, చేతులు కట్టేసి, స్పహ తెప్పించి వాళ్ళని చంపేసి, వాళ్ళ మెదళ్ళను మంటల మీద కాల్చుకుని తింటారట.
ఒక విధంగా వాళ్ళను నరమాంస భక్షకులు అని అనవచ్చు. వాళ్ళ వేషధారణ కూడా నరమాసం భాక్షకులనే పోలి వుంటుంది. దాదాపు ఆరున్నర నుంచి ఏడడుగులుక్ వుండే ఆ జాతి మనుష్యులు, మనుష్యుల మాంసం దొరకనప్పుడు పులులను వేటాడి ఆ మాంసం తింటారట.
మనుష్యుల మాంసం వింత వింత శక్తులను కలిగిస్తుందని వాళ్ళ (మూఢ) విశ్వాసమాట.
కేట్ విన్స్ లేట్ పేరు గుర్తుందా? పోనీ టైటానిక్ హీరోయిన్ పేరు గుర్తుందా? ఆవిడ పేరే ఈ కేట్ విన్స్ లేట్. ఇంగ్లాండ్ లోని డింటాజిల్ ప్రాంతంలో ఓ యిల్లు కొనేసింది. ఇల్లు కొన్న తరువాత ఆ ఇంట్లో కొన్ని సంఘటనలు జరిగాయట.ఆ యింట్లో ఒక ప్రేతాత్మ సంచారిస్తోందన్న 'పొగ' వార్త పత్రికలను చుట్టుముట్టింది. ఆ యింట్లో ఓ ప్రేతాత్మ సంచారిస్తోందని 'ది డైలా టెలిగ్రాఫ్' పత్రిక పేర్కొందిట.
అయితే ఆ ఆత్మ ఎవరికీ కీడు చేయడం లేదని, అందరితోనూ బాగానే ఉంటుందని చుట్టుపక్కల వాళ్ళ కథనం. ఆ ఇంటి సమిపంలోప్ వున్న కామెలాట్ హొటల్ లో 70సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఉద్యోగం చేసేవాడని అతనిదే ఆ ఇల్లు అని టెలిగ్రాఫ్ పత్రిక కథనం.
ఇదంతా కేట్ విన్స్ లెట్ మాత్రం తేలిగ్గా కొట్టిపారేస్తుంది. తన ఇంటికి మార్పులు, చేర్పులు చేసే ప్రయత్నంలో ఉంది.
అక్టోబర్, 2002
ఒక్కసారి అమెరికా రాజధాని వాషింగ్టన్ లో గగ్గోలు. ఇరవై ఐదు శాతం వ్యాపార లావాదేవీలు పడిపోయాయి. పిల్లలు రోడ్డు మీదకి రావడానికి భయపడుతున్నారు. తమ పిల్లలను బయటకు పంపించాలంటే పేరెంట్స్ కు కూడా భయంగానే వుంది.
బార్ లో కూచొని బయటకు రాగానే ఏ క్షణం తమ మీద ఎటాక్ జరుగుతుందో నన్న భయం. కారు అద్దాలు ఏ క్షణం బాధ్ధల్తేపోతాయోనని కార్లలో ప్రయాణించడానికి జంకుతున్నారు. షాపింగ్ కాంప్లెక్సు లూ, రైల్వేస్టేషన్లూ ఒక్కటేమిటి...ఎక్కడ చూసినా భయానక వాతావరణమే.
ఈ భయోత్పాతానికి కారణం ఓ అగంతకుడు. బహిరంగ ప్రదేశాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరపడమే. పదకొండు మందిపై ఆ ఆగంతకుడు కాల్పులు జరిపితే, తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. భారాత్ కు చెందిన ప్రేమ్ కు మార్ వాలేకర్ కూడా ఈ ఆగంతకుడి దౌష్ట్యానీకి బలైపోయారు. అమెరికా నిఘా సంస్ధ ఎఫ్ బిఎ కి చెందిన మహిళా ఉద్యోగి కూడా ఆగంతకుడి దౌర్జన్యానీకి బలై అసువులు బాసింది.
అతడు ఉన్మాది అని, ఉగ్రవాది అని, ప్రొఫెషనల్ కిల్లర్ అని రకరకాల వ్యాఖ్యానాలు ఊపిరిపోసుకున్నాయి. వాషింగ్టన్ ని వణికించిన ఈ ఉదంతం అమెరికాను అతలాకుతలం చేసింది. ఈ పరిస్ధితి అక్కడ రెడ్ ఎలర్ట్ ప్రకటించే వరకూ వచ్చింది. చివరికి అక్కడ హంతకుడున్నాడు జాగ్రత్త అనే పోస్టర్లు కూడా దర్శనమిచ్చాయి.
దాదాపు ఇరవైయ్యేళ్ళ క్రితం బొంబాయిలో జరిగిన సంఘటన. (అప్పటి కింకా ముంబాయ్ కాలేదు) ఓ స్లమ్ ఏరియా..ఆ ఏరియాలో ఓ పాడుబడిన ఇల్లు. ఆ యింట్లో దెయ్యాలు తిరుగుతున్నాయని వదిలేశారు. ఆ యింటి ఓనర్ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సరిగ్గా ఆ యింట్లో కి గృహ ప్రవేశం చేసినారో జున ఆ యింటి యాజమాని భార్యకు మతిస్దిమితం తప్పింది. ఆ కుటుంబం ఒక యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు. అప్పట్నుంచీ ఆ యిల్లు ఖాళీగా ఉంది.
ఆ యింటిని పట్టించుకునే నాధుడు లేక ఆలనా, పాలనా లేకుండా వుండటం వల్ల పిచ్చిమొక్కలు పెరిగి, పాడుబడిపోయింది. రాత్రుళ్ళు ఆ యింటి నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయని యిరుగు పారుగు భయపడి అటువైపు చూడటమే మానేసారు.
సరిగ్గా అప్పడే ఆ పాడుబడిన యింట్లోకి ఒక ఆగంతకుడు ప్రవేశించాడు. చింపిరి జుట్టు, చిరుగుల కోటు, చూడడానికే భయంకరంగా ఉన్న ఆ ఆగంతకుడిని చూసి ఆ ఏరియా మనుష్యులు భయపడిపోయారు. ఆ ఆగంతకుడు ఉదయమంతా ఎక్కడికో వెళ్ళి అర్ధరాత్రి ఆ యింట్లో పడుకునేందుకు మాత్రం వచ్చేవాడు. రాత్రంతా ఆ పాడుబడిన ఇంట్లో దీపం వెలుతురు ఉండేది.
సరిగ్గా సంవత్సరం తార్వత ఆ ఆగంతుకుడు ఒక రోజు రాత్రి ఆ పాడుబడిన యింట్లోకి వెళ్ళి పడుకున్నాడు. నాలుగైదు రోజుల తరువాత ఆ యింట్లో నుంచి దుర్వాసన రావడం మొదలైంది. ధైర్యం చేసి కొందరు యువకులు ఆ యింట్లో కి ప్రవేశించి చూస్తే ఆ ఆగంతకుడు చనిపోయి వున్నాడు. అతని పక్కనే వున్న గోనే సంచిలో మనుష్యుల మెదళ్ళు వున్నాయి. ఆ కేసు మిస్టరీ అలాగే వుండిపోయింది.
డెన్మార్క్ లో పీటర్సన్ ధి చిత్రమైన మనస్తత్వం. అతను ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఎవరైనా పలకరింపుగా నవ్వించే వాళ్ళ వంక సీరియస్ గా చూసేవాడు. అతని మనస్తత్వం ఎవ్వరికి అర్ధమయ్యేది కాదు. అతని కుటుంబ సభ్యులు అతడ్ని దాదాపు వేలివేసినంత పనిచేశారు.
సైక్రియాట్రిస్టులకు కూడా అంతుచిక్కని అతని ప్రవర్తనతో విసిగిపోయి సిటీ చివర వున్న ఒక గెస్ట్ హౌస్ లో అతడ్ని ఉంచేసారు. పీటర్సన్ గేస్ట్ హౌస్ లోనే రోజంతా గడిపేవాడు. ఎవరైనా పలకరించడానికి వెళ్ళినా తలుపు తీసేవాడు కాదు.
ఇదిలా ఉండగా, గెస్ట్ హౌస్ కు సమీపంలో ఉండే శ్మశానంలో నుంచి శవాలు మామమవుతూ వచ్చాయి. పాతి పెట్టబడిన శవాలు కనిపించక వారి తాలూకు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాధి తవ్వినట్టు కనిపించడంతో వారికి ఏం చేయాలో తోచని స్ధితి ఏర్పడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలీసు జాగిలాలు పీటర్సన్ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. పోలీసులు తలుపులు బాదినా లోపల వున్న పీటర్సన్ తలుపులు తెరువలేదు. బలవంతంగా తలుపులు కొట్టి లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాకయ్యారు.
ఎంతో అనుభవం, ఎన్నో విచిత్రమైన కేసులు చూసిన పోలీసులే భయంతో వణికిపోయారు. పీటర్సన్ శావాల మాంసం తింటున్నాడు. అతని పిచ్చి చేష్టలు, ఆ వాలకం చూసిన ఒక పొలిసు స్పృహ తప్పి పడిపోయాడు.
పీటర్సన్ ని పోలీసులు అరెస్టు చేశారు. అదేరోజు రాత్రి సెల్ లో తన గొంతు తనే నులుముకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ కేసు మిస్టరీ మాత్రం అలాగే ఉండిపోయింది.
ఫ్లోరిడాలో కెథలినాకు బోల్డన్ని ఆస్తులున్నాయి. ఏరికోరి మైకేల్ ని పెళ్ళి చేసుకుంది. కొన్నేళ్ళ వరకూ వాళ్ళ కాపురం సజావుగానే సాగింది. ఆ తరువాత ఏమైందో ఏమో వాళ్ళిద్దరి మధ్య అన్యోన్నత కొరవడింది. ఇద్దరూ బద్ధశత్రువుల య్యారు.
మైకేల్ అప్పటినుంచి కెథలినాకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ కెథలినాతో కలిసి క్లబ్ లకు, డిస్కోలకు వెళ్ళే మైకేల్ ఒక్కడే వెళ్ళడం మొదలు పెట్టాడు. కొంతకాలం తరువాత గర్ల్ ప్రెండ్స్ ని వెంటపెట్టుకుని వెళ్ళడం ప్రారంభించాడు.
కెథలినాకు ఈ విషయం తెలిసి భర్తకు చెప్పి చూసింది. అయినా అతనిలో ఎటు వంటి మార్పు రాలేదు. వార్నింగ్ ఇచ్చినా లాభం లేకపోయింది. లాయర్ ని సంప్రదిస్తే విడాకులే శరణ్యమని తేల్చి చెప్పాడు. అతనికి విడాకులిచ్చి వదిలించుకోవడం కెథలినాకు ససేమిరా ఇష్టంలేదు.
సీరియస్ గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ తరువాత తన నిర్ణయాన్ని అమలులో పెట్టింది. అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.
ఈ క్రింద ఫోటోలోని వ్యక్తి కనిపించడంలేదు. అప్పగించిన వారికి భారి పారితోషికం అని ప్రకటించింది. దానితో మైకేల్ పని కుడితిలో పడిన ఎలుకలా మారింది. గర్ల్ ఫ్రెండ్స్ తో మైకేల్ ఎక్కడికి వెళ్ళలేని దుర్బర పరిస్ధితి నెలకొంది. కెథలినాకు అప్పగించడం మొదలు పెట్టారు.
ఎన్నిసార్లు కెథలినా నుంచి తప్పించుకున్నా అదే పరిస్ధితి మళ్ళీ నెలకొనడం మొదలైంది. చివరికి మైకేల్ కు విసుగొచ్చి తన భార్యతో కాంప్రమైజ్ అయిపోయాడు.
బ్యాంకాక్ లో జరిగిన గ్రేట్ రాబరీ...ఓ బ్యాంకులో క్యాషియర్ జాబ్ డేవిడ్ ది. అతనికి డబ్బు మిద విపరీతమైన ఆశ. ఎప్పడూ బ్యాంకుకు ఖరిధైన కస్టమర్స్ వస్తూ ఉండేవాడు. అలాంటి వారిని తన పరిచయాలతో ఆకట్టుకోవాలని విపరీతమైన ప్రయత్నాలు చేసేవాడు.
అతనికి పెళ్లయింది. తనకు పెళ్ళి కాలేదని చెప్పి ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసి విడివిడిగా కాపురాలు కూడా పెట్టాడు. అంతటి ఘనుడతను. రోజూ లక్షల కొద్ది డబ్బు తన కళ్ళముందే కనిపిస్తూ ఉండడం అతని ఆశ (దురాశ)కు మరింత ఆజ్యం పోసింది.
ఎలాగైనా బ్యాంకులోని డబ్బును తన స్వంతం చేసుకుంటే బావుండుననే ఆలోచన వచ్చింది అతనికి. ఓ అమ్మాయి పరిచయం అయింది. ఆమె మాటకారితనం, చలాకీతనం ఇట్టే ఆకర్షించింది.
