ఆమెతో ప్రేమ నటించి మెల్లగా తన వైపుకు తిప్పుకొని తన ప్లాన్ చెప్పాడు. బ్యాంకు డబ్బును దోచుకొని హాయిగా ఏ స్విట్జర్లాండో వెళ్ళి స్దిరపడాలన్నది వాళ్ళ ప్లాన్.
బ్యాంకులో డబ్బు గురించి,సేఫ్ లాకర్ల గురించి పూర్తి సమాచారం తెలిసిన డేవిడ్. పకపకడ్బందీగా ప్లాన్ వేశాడు. ఆ రోజు మెయిన్ బ్రాంచ్ కి డబ్బు తీసుకు వెళ్ళాలి. ఆ రోజు ఎక్కువ మంది గార్డులు డబ్బు తీసుకువెళ్ళే వ్యాన్ లో లేరు. ప్లాన్ ప్రకారం, సిటీ అవుట్ స్కట్స్ దాటేక ఒక గ్యాంగ్ వాళ్ళను ఆటకాయించింది. మారణాయుధాలతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో డేవిడ్ అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రమే బ్రతికిపోయారు.
అదీ వాళ్ళ ప్లాన్ లో భాగమే. డబ్బును వ్యాన్ లో నుంచి మరో కారులోకి మార్చేక డేవిడ్ వెళ్ళి కారులో కూర్చోబోయాడు. అప్పటికే ఆ గర్ల్ ఫ్రెండ్ హ్యండ్ బ్యాగ్ లో నుంచి రివాల్వర్ తీసి, డేవిడ్ కు గురి పెట్టింది. అతను షాక్ లో నుంచి తేరుకునేలోగా అతని మీద రెండు రౌండ్లు కాల్పులు జరిపింది. డేవిడ్ కిందపడిపోయాడు.
అతను చచ్చాడనుకొని జారులో ఉడాయించింది.
కొన ఊపిరితో ఉన్న డేవిడ్ చివరి క్షణంలో అప్రూవర్ గామారి, తమ పథకం మొత్తం పోలీసుల ముందు చెప్పేసాడు. సరిగ్గా దొంగతనం జరిగిన ఆరుగంటల్లో డేవిడ్ గర్ల్ ఫ్రెండ్ పట్టుబడింది.
జాకబ్ ను ఓ మామూలు వ్యక్తి అనే అనుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు. రోజూ ఉదయం బయటకు వెళ్ళేవాడు. ఒక్కోసారి చుట్టుపక్కల వాళ్ళకు కెక్స్, శాండివిచ్ బహుమతిగా ఇచ్చేవాడు. చిన్నపిల్లలకు చాకెట్లు పంచేవాడు.
తన పని తప్ప ఇతరుల విషయంలో జోక్యం చేసుకొని జాకబ్ అంటే అందరికి అభిమానమే. మేరీక్యూర్ అనే అమ్మాయికి మాత్రం అతని కదలికల మీద అనుమానం వుండేది. ఎదురు ప్లాటులో వుండే మేరియాక్యూర్ ఓ యాడ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్. చిన్నప్పట్నుంచి డిటెక్టివ్ అవ్వాలనే ఆశ ఆ అమ్మాయిది.
ఓ పదిహేనురోజుల పాటు జాకబ్ ను నీడలా అనుసరించింది. ఆమెకు అనేక ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి. ఓ రోజు జాక్ ట్ ఇంటికి వెళ్ళింది. డూప్లికేట్ కి సాయంతో ఆ ఇంటి స్టోర్ రూమ్ లో కూచుని ఉన్నాడు. ఆ స్టోర్ రూమ్ లో కొన్ని డెడ్ బాడిలు ఉన్నాయి.
బ్యాడ్ స్మెల్ రాకుండా కొన్ని ద్రావకాలు చల్లుతున్నాడు. రోజూ ఉదయమే వెళ్లి నట్లు వెళ్లి వెనుక డోర్ గుండా వచ్చి తన పని తాను చేసుకుపోతున్నాడు. డెడ్ బాడి లను అమ్ముతుంటాడు కూడా. తనను గమనించిన మేరిక్యూర్ ని చంపబోయాడు. అదృష్ట వశాత్తు తప్పించుకొచ్చింది. పోలీసులు ఆ ఇంటి మీద దాడి చేయగానే సూయిసైడ్ చేసుకున్నాడు జాకట్. అతనో మానసిక ఎన్నది అని విచారణలో తేలింది.
రాకేష్ మొహ్ర బ్రిలియంట్ స్టూడెంట్.తన పని తను చేసుకునే మెంటాల్టి అతనిది. ఎవ్వరితోనూ కలిసేవాడు కాదు. అనుకోకుండా ఓ అమ్మాయితో పరిచయం అయింది. మొదటిసారి ఆ అమ్మాయి అతనికి డ్రగ్స్ రుచి చూపించింది. అయిష్టంగా డ్రగ్స్ తీసుకున్న రాకేష్ మొహ్ర ఆ తరువాత అవి లేకుండా బ్రతకలేని స్ధితికి వచ్చాడు.
అప్పటివరకు చదువులో ఎంతో బ్రిలియంట్ గా వుంటూ వచ్చిన రాకేష్ మొహ్ర చదువు విషయంలో వెనుకబడిపోయాడు. మార్కుల్లో అందరికన్నా చివరకు వచ్చాడు. అతని స్నేహితులు కూడా రాకేష్ లో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయారు.
బ్రెట్ గా మాంచి ఫిజిక్ తో వుండే రాకేష్ రోజురోజుకూ శుష్కించిపోసాగాడు. కళ్లకింద నల్లటి చారికలు, మొహంలో అలసట. డ్రగ్స్ పడ్డప్పుడు హుషారుగా ఉండేవాడు. డ్రగ్స్ కోసం తన వాచీ, ఉంగరం, మెడలోని చెయిన్ అమ్మేసాడు. చివరికి చిన్న చిన్న నేరాలు చేయడం మొదలు పెట్టాడు.
చివరికి అతను ఎంతగా దిగాజారిపోయాడంటే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే దుస్ధితికి చేరిపోయాడు. ఓ కాన్వెంట్ పిల్లాడిని కిడ్నాప్ చేసాడు. లక్ష రూపాయలు డిమాండ్ చేసాడు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి అన్నంత పని చేసాడు. ఆ తరువాత తను కిడ్నాప్ చేసి చంపేసింది తన సోదరుడి కొడుకునేనని తెలిసింది. వేగంగా వచ్చే ర్తెలు కు ఎదురువెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాకేష్ లాంటి వాళ్ళను సంఘ విద్రోహక శక్తులుగా మార్చే ముఠాలు ఢిల్లీ, ముంబాయిలాంటి నగరాల్లో విస్తరించి ఉన్నాయి.
ఓ మనిషి చేసే నేరం వెనుక రకరకాల కారణాలు ఉంటాయని అంటున్నారు సైకాలజిస్టులు. వ్యక్తిగతమైన ద్వేషం, పరిస్ధితుల ప్రభావం, మత్తుమందులకు బానిసలవ్వడం...ఇవన్నీకాక కొందరిలో అబ్ నార్మల్ మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం.
పేరెంట్స్ ఎప్పుడు కీచులాడుకుంటూ ఉండడం, తండ్రి మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుని కన్నతల్లిని తన ముందే హింసించడం, చిన్నతనంలో పసి మనసులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించి అతని మెదడును పోల్యూట్ చేస్తుంది. అనాధలుగా పెరిగి రోడ్లపై బ్రతికే పిల్లలు చెడు సహవాసాలు చేసి ఆకలి కోసం చిన్న చిన్న నేరాలు చేసేవాళ్ళ లో ఆ నేర ప్రవృత్తి పెరిగి పెద్దయ్యే ప్రమాదం వుంది.
మత్తు పదార్ధాలకు అలవాటుపడిన వాళ్ళు ఆ ప్రభావంలో నుంచి బయటపడ్డం అంత తేలికకాదు. డ్రగ్స్ కోసం, వాళ్ళు ఏ నేరం చేయడానికైనా వెనుకాడరు.డిల్లీ , ముంబాయిలాంటి నగరాల్లో ఇలాంటి ప్రమాదం ఎక్కువగా వుంటుంది.
ఎవరైనా అబ్ నార్మల్ గా కనిపించినా , వాళ్ళ చూపుల్లో, ప్రవర్తనలో పెక్యులార్టి కనిపించినా వాళ్ళను అనుమానించాల్సిందే. హంతకులు మన పక్కనే వుంటారు. వాళ్ళను గమనించడానికి మనకు కాస్త పరిశీలన అవసరం.
క్రిస్టోఫర్ కు క్త్రేమ్ , సస్పెన్స్, హర్రర్ నవలలంటే విపరీతమైన ఆసక్తి. అతని చేతిలో ఎప్పుడు చూసినా ఏదో ఒక మిస్టరీ నవల వుంటుంది. న్యూస్పేపర్స్ లో క్త్రేమ్ కాలమ్స్ రెగ్యులర్ గా చదువుతూ వుంటాడు. ఓ రోజు ఆ ఇంట్లో డబ్బు మాయమ్తెంది. క్రిస్టోఫర్ పేరెంట్స్ ఇల్లంతా వెదికినా డబ్బు కనిపించలేదు.
క్రిస్టోఫర్ తన క్త్రేమ్ నవలల తెలివితేటలను ప్రయోగించి సర్వెంట్స్ ని ఇంటరా గేట్ చేసాడు. ఆ డబ్బు ఎవరు దోంగిలించారో తెలియడం కష్టమైంది. క్రిస్టోఫర్ ఓ రాత్రి సర్వెంట్స్ క్వార్టర్స్ కు వెళ్ళి పరిశోధన మొదలు పెట్టాడు. ఎడ్వార్ట్ అనే సర్వెంట్ ఆ డబ్బు దోంగిలించినట్టు అర్ధమ్తెంది. క్రిస్టోఫర్ ఎడ్వార్ట్ ని ఓ గదిలో బంధించి సీలింగ్ ఫ్యాన్ కు తలకిందులుగా వేలాడదీసి నిజం ఒప్పకొమ్మని బెదిరించాడు.
ఎడ్వార్ట్ నిజం ఒప్పుకున్నాడు. అతడ్ని పోలీసులకు పట్టిస్తానని క్రిస్టోఫర్ పేరెంట్స్ అంటే క్రిస్టోఫర్ మొదటి తప్పగా భావించి వదిలివేయమని చెప్పాడు. ఆ తరువాత వారంరోజులకు ఎడ్వార్డ్ ఆ ఇంట్లో పని మానేసి వెళ్ళిపోయాడు. అతని విషయం ఆ ఇంట్లో అందరూ మరచిపోయారు.
ఇది జరిగిన పదిహేనురోజులకు క్రిస్టోఫర్ ని ఎవరో కిడ్నాప్ చేసారు. కిడ్నాప్ చేసిన ఇరవై నాలుగు గంటలకు క్రిస్టోఫర్ డెడ్ బాడీని ఇంటికి పంపించారు. ఎడ్వార్ట్ మాత్రం పోలీసులకు దొరకలేదు.
హర్రర్ నవలలో గబ్బిలాల ప్రస్తావన తప్పనిసరిగా వుంటుంది. వాటి వాసన అదోకరకంగా వుంటుంది. వేంష్తేర్ బెట్ అనే గబ్బిలాలు మనుష్యుల రక్తాన్ని కూడా తాగుతాయట. ఏ భాగంలో రక్తాన్ని పిల్చాలో ఆ భాగాన్ని గబ్బిలం నాకు తుంది. అలా నాకడంవల్ల ఆ భాగం మొద్దుబారిపోతుంది. స్పర్శ తెలియకుండా పోతుంది. వెంటనే రక్తాన్ని పిల్చేస్తుంది. శరీరం నుంచి కారే రక్తం గడ్డ కట్టకుండా గబ్బిలం నోట్లో ఊరే లాలాజలం లో రక్తాన్ని గడ్డ కట్టకుండా నిరోధించే పదార్ధం వుంటుంది. ఈ గబ్బిలాలు జంతువులు, మనుష్యుల రక్తాన్ని ఆహారంగా తీసుకుని బ్రతుకుతాయి. ఒక్క రాత్రిలో నిద్రపోతున్న మనిషి నుంచి ముప్పయి గ్రాముల రక్తాన్ని తాగేస్తుంది గబ్బిలం.
వాటికి కొందరు దెయ్యాల గబ్బిలాలు అని అంటారు. క్షుద్ర మాంత్రికులు ఈ గబ్బిలాలు తమ మంత్రశక్తులకు ఉపయోగించుకుంటారన్న మూఢనమ్మకం కూడా ఉంది. ఈ గబ్బిలాలు అతి ప్రమాదకరం అయినవి.
హవాయి దీవుల్లో ఓ తెగవారు మనుష్యులను చంపడానికి ప్రయోగించే పద్ధతి రాక్షసంగా ఉంటుందట. దారితప్పి ఆ దివిలోకి ప్రవేశించిన వారిని రాత్రయ్యేవరకు అతిధిగా అన్ని మర్యాదలు చేసి పడుకోవడానికి ఓ ఇంట్లోకి పంపిస్తారు. చీకట్లోనే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి. తలుపు తెరిచి లోపలకు అడుగు పెట్టి నాలుగు అడుగులు వేసేకకాని ఆ అతిధికి అర్ధంకాదు. అర్ధంయ్యేలోపు అతను లోత్తేన కందకం లాంటి దానిలో పడిపోతాడు. ఆ గృహాన్ని మృత్యుగృహం అని కూడా పిలుస్తారు. పైకి సాదాసీదా ఇల్లులా కనిపించే ఆ మృత్యు గృహం లోపల కందకం లాంటిది వుంటుంది. కందకం లోపల ఇనుప తీగలు రాటుదేలి వుంటాయి.
దాదాపు ఇరవై అడుగులు వున్న ఆ కందకంలోకి పడగానే ఒళ్లంతా గీరుకుపోతుంది. పైకి రావడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. అతను వేసే హృదయాని దారక కేకలు ప్రయాసే. అలా అతను అరచి అరచి స్పృహ తప్పి చాచ్చిపడేవరకు అలాగేవుంచి చనిపోయాక కొక్కెం ద్వారా పైకి లాగి ఆ శావాన్ని ఆ మృత్యుగృహం యాజామని, అతని కుటుంబ సభ్యులు భుజిస్తారు. అలా ఆ దీనిలో చాలా మృత్యు గృహాలు ఉన్నాయిట.
వాళ్ళు మనుష్యులను వేటాడే పద్ధతి కూడా విచిత్రంగానే వుంటుంది. వింత వింత అరువులతో భయపెట్టి మనుష్యులను వేటాడి మృత్యుగృహల్లోకి పంపిస్తారు.
ఫ్రాన్స్ నగరంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఉదయమే ఆఫీసులకు బయలుదేరిన నలభయ్యేళ్ల వ్యక్తిని గుర్తు తెలియని అగంతకుడు తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే అతడ్ని హాస్పిటల్ తీసుకువెళ్లారు. డాక్టర్లు అతనికి ట్రీట్ మెంట్ చేసారు. ఇది జరిగిన నలభ్తే ఎనిమిది గంటల్లో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ల లో ఓ డాక్టర్ యాక్సిడెంట్ లో కాలు విరగ్గోట్టుకున్నాడు.
మరో డాక్టర్ కు బెదిరింపు ఫోన్ వచ్చింది. ఇంకో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంక్వయిరీ లో అతను ఆత్మహత్య చేసుకోలేదని, అతడ్ని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎవరో ప్లాన్ చేసారని తెలిసింది. ఆ కేసును ఓ ఇన్ స్పెక్టర్ టేకప్ చేసాడు. ఆ ఇన్ స్పెక్టర్ భార్యకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
ఇన్ స్పెక్టర్ ఆ ఫోన్ కాల్ ని ట్రాప్ చేసి ఆ అడ్రస్ ను పట్టుకుని వెళ్ళేసరికి ఆ ఫోన్ కాల్ ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి వచ్చినట్టు తెలిసింది. ఆ ఇన్ స్పెక్టర్ మొండిగా కేసు టేకప్ చేయడంతో అతడి వెహికిల్ లో బాంబు అమర్చారు. ఆ పేలుడులో ఆ ఇన్ స్పెక్టర్ రెండు చేతులు నుజ్జునుజ్జుయ్యాయి. ఆ తరువాత అగంతకుడ్ని గురించి సమాచారం మరుగున పడింది. ఆ కేసు ఇప్పటికి మిస్టరీనే.
రాజస్థాన్ లోని జాన్ ఘడ్ గ్రామంలో ప్రవేశద్వారం వద్ద సూర్యాస్తమయం తరువాత గ్రామంలోకి ప్రవేశించాకూడదన్న హెచ్చరిక బోర్డు కనిపిస్తుంది. టూరిస్టులు తప్ప ఎవరూ సూర్యాస్తమయం తరువాత ఆ వూళ్ళో కనిపించారు.
ఆ వూళ్ళో ఏ ఇంట్లోనూ మనుషులు ఉండరు. ఓ టూరిస్టు సాహసించి సూర్యాస్తమయం తరువాత ఆ గ్రామంలోకి అడుగుపెట్టాడు. అతనికే అద్బుతమూ కనిపించలేదు. అంతా భయం మాత్రమే అని కొట్టి పారేసి ఆ టూరిస్టు ఊరంతా తిరిగాడు.
సడెన్ గా పెద్ద గాలి వీచింది. ఆ టూరిస్టు కు మొదట ఏమీ అర్ధంకాలేదు. ఆ గాలి ఎక్కువైంది. సడెన్ గా ఏవేవో వింత వింత అరుపులు వినిపించాయి. ఆ టూరిస్టు కు ఆ అరుపులు ఎక్కడ్నించి వస్తున్నాయో అర్ధంకాలేదు. ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం అత్వని అరుపులు అతనికే భయంకరంగా వినిపించాయి.
ఆ రాత్రి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. తెల్లవారేసరికి అతని శవం ఆ వూరి నడిబొడ్డు కనిపించింది. దెయ్యాలే అతడ్ని పీక్కు తిన్నాయని అంతా అనుకున్నారు. అతని మరణం ఓ మిస్టరీ లా మారిపోయింది. ఆ వూళ్ళోకి వెళ్ళాలంటే టూరిస్టులు భయపడతారు. సాహసం చేసి వెళ్తే...?
అయిపోయింది
