Previous Page Next Page 
నారి నారి నడుమ మురారి పేజి 14

 

అబ్బా రేణూ. అవి మీ ఆడవాళ్లు ఒకరికొకరు ఇచ్చుకునేవి. ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు అన్నాడు బ్రతిమిలాడుతున్నట్లు.
మరేమిస్తారూ. పెన్సెట్ కొనిస్తారా అని హాస్యం చేసింది. 
ఎదో ఒకటి. అలాంటి ఆఫిసియల్ గిఫ్ట్ ఇస్తాలే. తరువాత నువ్వేదైనా ఇచ్చుకో అక్కడ . సరేనా అన్నాడు. 
సరేలెండి  అని ఫోన్ పెట్టేసింది రేణు.   
కొన్ని ముఖ్యమైన ఫోన్స్ మాట్లాడి రిఫ్రెష్ అయ్యి అక్కడున్న హాట్ వాటర్ మెషిన్, కాఫీ పొడి వాటితో కాఫీ కలుపుకుని తాగుతున్నాడు.
ఇంటర్కం మోగింది. ఏం చేస్తున్నారంటూ విద్య ఫోన్. 
చెప్పాడు.
బోరుగా ఉంది బయటికి వెళదామా అంది.
రెడీ అవ్వు. అరగంటలో వెళదాం అన్నాడు.
రూమ్ బెల్ మోగింది. డోర్ తీసాడు. ఎదురుగా విద్య. చక్కటి చుడీదార్ లో పొడి జుట్టు కు క్లిప్ పెట్టి సహజ సౌందర్యంతో మెరిసిపోతోంది. ఒక్కసారి చూపు మరల్చుకోలేకపోయాడు. అబ్బా ఏమి అందం అనుకున్నాడు మనసులో. 
నన్ను లోపలికి రానిస్తారా. అలానే చూపులతో తినేస్తారా అంది నవ్వుతూ.
రా విద్య. కూర్చో.  జస్ట్ టు మినిట్స్  అన్నాడు. జోనల్ మేనేజర్ కి , జనరల్ మేనేజర్ కి  ఫోన్స్ చేసి మీటింగ్ ఏర్పాట్లు వివరించి చెప్పాడు. 
పద ఇక వెళదాం అన్నాడు.
ఇద్దరూ లిఫ్ట్ లో కిందకి దిగారు. 
చాలా బాగుంది కదా హోటల్ అంది విద్య.
అవును. ఎక్కడికెళదాం అని అడిగాడు.
సెవెన్ అయ్యింది కదా.  బయటికెళ్లి చూద్దాం అంది. 
రిసెప్షన్ లో కీస్ హ్యాండోవర్ చేస్తుంటే సర్ నైట్ డిన్నర్ కాంప్లిమెంటరీ అంది రిసెప్షనిస్ట్. 
బయటికొచ్చి చూస్తే పక్కనే పెద్ద మాల్ కనిపించింది. మాల్ లో కాసేపు తిరుగుదామా అన్నాడు.
ఓకే అంది. 
రేణూ, మోహిత్ బర్త్ డే గిఫ్ట్స్ ఇచ్చారు నీకు. నేనే ఇవ్వలేదు. ఏమిచ్చేది అన్నాడు.
నాకా అంటూ కృష్ణకుమార్ మొహం వైపు చూసి అడిగింది. ఏమిస్తారు అని. 
నువ్వే చెప్పు నాకేం తెలుసు.
మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి అంది. ఫ్లైట్ లో ఆల్రెడీ ఇచ్చారుగా అనబోతు ఆగింది. సరదాకన్నా తను సీరియస్ గా తీసుకుంటాడు. 
రెస్టారెంట్ కనిపించింది. కాఫీ తీసుకుందాం అన్నాడు. 
అబ్బా ! ఎన్నిసార్లు తాగుతారు కాఫీ అంది.
జస్ట్ ఫోర్ టైమ్స్ ఏ డే అన్నాడు నవ్వుతూ. 
అవును గానీ నిన్నొకటి అడగాలి విద్యా ! నీ డెసిషన్ కరెక్టేనా విడాకుల గురించి. ఎందుకంటే జీవితంలో అతి పెద్ద నిర్ణయం కదా అది. మీ పిల్లలిద్దరూ ఏమన్నారు. అంతా హడావిడిగా జరిగింది. నేను కూడా నీతో వివరంగా డిస్కస్ చేయలేదు ఈ విషయం గురించి. జీవితంలో తోడు చాలా అవసరం. అందుకె మళ్ళీ అడుగుతున్నాను. ఏమీ అనుకోవద్దు అన్నాడు. 
నా నిర్ణయం కరెక్టే. నేను అంత తొందరగా నిర్ణయానికి రాను.  పెళ్ళైన మొదటి రోజు నుంచే నా కష్టాలు మొదలయ్యాయి. మా పిల్లలు కూడా చాలా నరకం అనుభవించారు అతని విషయంలో. అతనితో నా జీవితం ఒక పీడకలగానే భావిస్తాను. అంది. 
ఓకే ఓకే. లీవ్ ఇట్. నేను కరెక్ట్ గా చేస్తున్నానా అని చెక్ చేసుకునేందుకు అడిగాను. ఇవన్నీ పెద్ద నిర్ణయాలు కదా అందుకని. 
కాఫీ తాగి ఇద్దరూ లేచి ఒక్కో షాప్ చూస్తూ వెళుతున్నారు మాట్లాడుకుంటూ. 
ఎన్నో కబుర్లు, ఎన్నో జోక్స్ అలా సరదాగా రెండు గంటలు మాల్ లో తిరిగి హోటల్ కి వచ్చారు.
ఓహ్ టాబ్లెట్స్ మర్చిపోయాను అంది.
హోటల్ లోనే ఉందిగా ఫార్మసీ. ఏమి కావాలి చెప్పు నేను తీసుకొస్తాను అన్నాడు. 
ఫరవాలేదు నేను తీసుకుంటానులెండి డిన్నర్ అయినతరువాత అంది కంగారుగా.
ఓకే అన్నాడు. 
రెస్టారెంట్ కిందనే ఉంది. బఫె డిన్నర్ ముగించుకుని రూమ్ కి వెళుతూ పద ఫార్మసీ షాప్ కి వెళదాం నేనూ వస్తాను నీతో అన్నాడు.
మీరు వెళ్ళండి నేను తీసుకుని వస్తాను అంది.
నేనూ వస్తాను పద అన్నాడు. 
స్లీపింగ్ పిల్స్ మైల్డ్ డోస్ తీసుకుంది ప్రిస్క్రిప్షన్ చూపించి.
బయటికొచ్చేప్పుడు అడిగాడు ఎందుకు ఇలాంటి టాబ్లెట్స్ వాడే అవసరం అంటూ.
రాత్రిపూట భయంగా ఉంటుంది. నిద్ర పట్టదు. అందుకే అప్పుడప్పుడు వీటి అవసరం ఉంటుంది. వచ్చేప్పుడు మర్చిపోయాను తీసుకురావడం అంది.
అవి లేకుండా మేనేజ్ చెయ్యకూడదూ.
ఊహూ నావల్ల కాదు. ఈ ముప్పై ఏళ్ళ మారిటల్ లైఫ్ లో నన్ను ఈ టాబ్లెట్స్  చాలా సార్లు ఆదుకున్నాయి. దుఃఖం బలవంతంగా ఆపుకుంది . 
ఇక మాట్లాడలేదు కృష్ణకుమార్. 
తన రూమ్ లోకి వెళ్ళబోతూ అడిగాడు ఒంటరిగా పడుకోగలవా. లేకుంటే నా రూమ్ లో పడుకో. ఎలాగూ సెపరేట్ బెడ్స్ ఉన్నాయి కదా అన్నాడు. 
ఊహూ ఫరవాలేదు. ట్రై చేస్తాను. ఏమన్నా ఇబ్బందిగా ఉంటె మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను. ఏమనుకోవద్దు అంది. 
నాకేం ప్రాబ్లెమ్ లేదు. నువ్వు ఎప్పుడైనా ఇంటర్క్మ్ లో నాకు కాల్ చెయ్యి అన్నాడు.
థాంక్స్ అంది తన రూంలోకి వెళుతూ.
పొద్దున్నే ఐదింటికి లేచాడు కృష్ణకుమార్ తన రొటీన్ యోగ, ప్రాణాయామం చేసుకునేందుకు. రాత్రి ఫోన్ మోగలేదు అంటే మామూలుగానే నిద్రపోయి ఉంటుంది విద్య అనుకున్నాడు.
మొబైల్ చూస్తే రాత్రి మాల్ లో తీసిన కొన్ని ఫోటోలు వాట్సాప్ లో  పెట్టింది. తను ఎర్లీ గానే లేచింది అనుకున్నాడు.
మొదటి రోజు చాలా బిజీ గా ఉంది మీటింగ్. 
కంపెనీ వాళ్ళు తమ రిపోర్ట్స్ చూపించి వంద కోట్లకు లోన్ డిమాండ్ చేస్తున్నారు.
మీటింగ్ పూర్తయి డిన్నర్ చేసి అందరితో మాట్లాడి రూమ్ చేరేప్పటికీ పన్నెండు. డిన్నర్ ఐన తరువాత విద్య ను రూమ్ కు వెళ్ళమన్నాడు. తను మిగతా బ్యాంకర్స్ తో మాట్లాడుతూ లౌంజ్ లో కూర్చున్నాడు. మధ్యలో విద్య నుంచి వాట్సాప్ మెస్సేజ్. మీరు రూమ్ కి వచ్చినతరువాత మెస్సేజ్ ఇవ్వండి అని. 
పన్నెండప్పుడు ఎందుకులే మెస్సేజ్ ఇచ్చి డిస్టర్బ్ చెయ్యడం అని పడుకున్నాడు. మళ్ళీ మెస్సేజ్ విద్య నుంచి రూమ్ కి వచ్చారా అంటూ.
ఇప్పుడే వచ్చాను అని రిప్లై ఇచ్చాడు.
ఓకే గుడ్ నైట్ అంది.
రెండో రోజు విద్యావతి ప్రిపేర్ చేసి ఇచ్చిన పాయింట్స్ ఎక్స్ల్లెంట్ గ పనిచేసాయి. వాటిమీదే అంతా డిస్కషన్ జరిగింది. 
మిగతా బ్యాంక్స్ కొన్ని డౌట్స్ అడిగాయి. 
విద్యావతి లీడ్ తీసుకుని అన్నిటికీ ఆన్సర్ చేసింది. 
సాయంత్రం ఏడింటికి మీటింగ్ పూర్తయ్యింది. 
అందరికీ క్లారిటీ వచ్చింది. 
విద్యావతి స్పెషల్ థాంక్స్ రిసీవ్ చేసుకుంది అందరి దగ్గర నుంచి. 
సో ఇక మూడో రోజు ఏమీ లేదు. ఖాళీగా తిరగడమే అనుకున్నాడు కృష్ణకుమార్.
రూమ్ కి వస్తూ టుడే యూ డిడ్ మార్వెలస్ జాబ్  విద్యా అన్నాడు. నాకు కూడా చాలా పాయింట్స్ మీద క్లారిటీ వచ్చింది. వందకోట్ల లోన్ కదా. అందరికీ చాలా క్లారిటీ వచ్చింది.  థాంక్స్ ఏ లాట్  అన్నాడు మెచ్చుకోలుగా. 
వెల్కమ్ అంది. ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళదామా అంది.
బాడీ లో ఎదో కొంచెం తేడా గా ఉంది. ఇవాళ్టికి కాస్త రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. 
ఏమయ్యింది. ఎనీ ప్రాబ్లెమ్. ఫీవర్ ఏమైనా ఉందా. చెయ్యి ముట్టుకోవచ్చా అని అడిగింది.
కొంచెం ఉన్నట్లు తోస్తోంది. ఎందుకైనా మంచిది టాబ్లెట్ తెప్పించుకుంటాను అన్నాడు రూమ్ లోకి వెళుతూ.
నేను ఒక గంట తరువాత మీకు కాల్ చేస్తాను అంది విద్య తనూ రూమ్ లోకి వెళుతూ.
ఓకే అన్నాడు. రూమ్ కి వచ్చాడే కానీ శరీరం గాలిలో తేలుతున్నట్లుంది. విపరీతమైన పెయిన్స్. విద్య కు చెప్పలేదు. కంగారుపడి రేణు వాళ్లకి చెప్తే ఇంకా ప్రాబ్లెమ్ అవుతుంది. చూద్దాం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుందేమో అనుకున్నాడు. టాబ్లెట్ కి చెపుదాం అనుకుంటూనే పడుకుని నిద్రలోకి జారుకున్నాడు. ముందు రోజు రాత్రి మీటింగ్కి ప్రిపేర్ అవుతూ రెండయింది. సరిగా నిద్రలేదు. విపరీతమైన అలసటగా ఉంది. 
బెల్ మోగితే ఉలిక్కిపడి లేచాడు. టైం చూసుకున్నాడు. అమ్మో పదయింది. లేద్దామనుకుంటే బాడీ చాలా వీక్ గా ఉంది. మెల్లగా వెళ్లి తలుపు తీసాడు. 
విద్య నిలబడి ఉంది.
రండి అన్నాడు.
రెండు సార్లు ఇంటర్ కం లో ట్రై చేసాను. రిప్లై లేదు. అందుకే వచ్చాను. ఎలా ఉంది అని అడిగింది. ఇక లాభం లేదనుకుని నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది. కాలిపోతోంది. జ్వరం బాగా ఉన్నట్లుంది. తన బాగ్ లో చూసింది. జ్వరం టాబ్లెట్స్ ఉన్నాయి. వేసుకోమని ఇచ్చింది. ఏమన్నా తెప్పించేదా ? తింటారా అని అడిగింది. 
అబ్బా తినే ఓపిక లేదు విద్యా అన్నాడు. నువ్వు తిన్నావా అని అడిగాడు.
ఊహూ లేదు అంది.
ఓహ్ మై గాడ్. ఉండు నీకేమన్నా తెప్పిస్తాను అంటూ రెస్టారెంట్ కి రింగ్ చేసాడు. 
ఇద్దరికీ తెప్పించండి అంది.
నాకు తినాలని లేదు. ఒక చిన్న ఐటెం ట్రై చేస్తాను అని ఆర్డర్ చేసాడు.
ఏడైనా కలిపేదా కాఫీ, టీ, గ్రీన్ టీ అని అడిగింది.
గ్రీన్ టీ అన్నాడు. 
ఇద్దరూ గ్రీన్ టీ తాగుతుంటే ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి. 
అన్నీ ఓపెన్ చేసి రెండు ప్లేట్స్ లో పెట్టింది. 
కృష్ణకుమార్ కొంచెం చాలు అన్నాడు. 
అతనికి కొంచెం పెట్టింది ప్లేట్ లో. 
అన్నీ తనే సర్వ్ చేసింది.
అస్సలు ఒపిక లేనట్లు అతని మొహమే చెప్తోంది. 
ఇవాళ ఇక్కడే పడుకుంటాను అంది. 
ఎందుకు. నాకు బాగానే ఉంది అన్నాడు. 
బాగానే ఉంది అనిపిస్తే నేను వెళతాను లెండి. అప్పటివరకు ఉంటాను అంది.
ఎందుకు విద్యా. వెళ్ళు ప్లీజ్ అన్నాడు.
ఊహూ నో అంది. మిమ్మల్ని ఇలా వదిలి నేను వెళ్ళను అని భీష్మించుకుంది. రేణూ కి తెలిస్తే నన్ను ముందు అరుస్తుంది. మిమ్మల్ని కాదు అంది నవ్వుతూ. 
 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS