కానీ ఆ భావన కేవలం అభిమానించే వరకే. అంతకు మించి ఒక్క అడుగు ముందుకు నేను వెయ్యలేను. నా సిద్ధాంతాలకు నేను ఎప్పుడూ కట్టు బడి ఉంటాను. కొందరికి అది చాదస్తం అనిపించవచ్చు. అయినా నేను లెక్క చెయ్యను. నేనింతే. ఇలానే ఉంటాను ఎప్పుడూ అన్నాడు.
థాంక్యూ . మీ మనసులో మాట చెప్పారు. మీ అభిమానం పొందిన నేను చాలా అదృష్టవంతురాలిని. చాలా చాలా థాంక్స్ మీకు, రేణుకు అంది. ఇంతకూ పదేళ్ల క్రితం మిమ్మల్ని థ్రిల్ చేసిన ఆ సంగతేంటో కాస్త చెప్తారా అంది నవ్వుతూ.
ఇదే. ఈ కొంటె తనమే నీలో నాకు బాగా నచ్చేది. ఆఫ్ కోర్స్ చలాకీతనం, స్ఫురద్రూపి, చక్కటి పర్సనాలిటీ. ముఖ్యంగా ఆ పెద్ద వాలు జడలో పైనున్న ఆ పిల్ల జడ. టెక్నికల్ గా దాన్నేమంటారో నాకు తెలీదు కానీ నాకు చాలా ఇష్టం అన్నాడు.
అబ్బో చాలా కనిపెట్టారు నాలో అంది ఆశ్చర్యంగా. పైకి కనపడరు గానీ బాగా లోతైన మనిషి మీరు అంది.
నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను. లేకుంటే నా ఫీలింగ్స్ నాలోనే పదిలంగా ఉండేవి. సరే ఇక వెళదాం విద్య. ఆల్రెడీ అందరూ వెళ్లారు. మనమే లాస్ట్. మనకోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్ లో ఒక గంట టైం ఉంటుంది. బోలెడు విషయాలు మాట్లాడుకోవచ్చు పద అన్నాడు.
పదండి అని ఇద్దరూ లేచారు.
ఫ్లైట్ ఎంట్రన్స్ లో ఎయిర్ హోస్టెస్ అందరికీ వెల్కమ్ చెప్తోంది చిరునవ్వుతో.
కృష్ణకుమార్ తనని గుర్తుపట్టాడు. తనూ అతన్ని గుర్తించింది.
వెల్కమ్ సర్ హౌ ఆర్ యూ అంది.
హాయ్ పూనమ్ ఐ యాం ఫైన్ థాంక్యూ, హౌ ఆర్ యూ అన్నాడు లోపలి వెళుతూ.
ఇద్దరి సూట్ కేసెస్ పైనున్న లగేజ్ పాకెట్ లో పెట్టాడు. విండో సీట్ లో విద్య కూర్చుంది. తను ఆమె పక్క సీట్ లో కూర్చున్నాడు.
టు సీటర్ లైన్స్ రెండు ఉన్నాయి. ఎకానమీ ఫ్లైట్ కదా. ఫోర్ రౌస్ ఉన్నాయి సీట్స్.
ఎవరు తను అడిగింది విద్య.
ముంబై లో ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ కి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకునేవాడిని మన బ్యాంకు తరఫున. అప్పుడు ఈ అమ్మాయి ఆ ట్రైనింగ్ బ్యాచ్ లో ఉంది. పబ్లిసిటీ కోసం మన బ్యాంకు కొన్ని ట్రైనింగ్స్ స్పాన్సర్ చేసేది. మన స్టాఫ్ వెళ్లి కొన్ని క్లాస్స్ చెప్పేవాళ్ళం.
ఓహ్ నైస్ అంది.
పాటలు వింటారా అంటూ ఇయర్ ఫోన్ ఒక సైడ్ ఇచ్చింది.
ఆమ్మో నువ్వన్నీ ప్రేమ సాంగ్స్ పెడతావు. నాకొద్దు అన్నాడు నవ్వుతూ.
మీకేంకావాలో చెప్పండి అంది.
ఏదన్నా క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ పెట్టు. విందాం. అదైతే హాయిగా ఉంటుంది అన్నాడు.
తనకు ఇష్టమైన మరుగేలరా ఓ రాఘవా పాట వీణపై వాయించినది పెట్టింది తన గాలెరీ లో సెలెక్ట్ చేసి.
ఓహ్ చాలా బాగుంది అన్నాడు.
ఫ్లైట్ డోర్స్ క్లోజ్ చేశారు. అనౌన్స్మెంట్ ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి.
పూనమ్ వచ్చింది. సర్ ఇవి మీకోసం అంటూ డ్రై ఫ్రూప్ట్స్ పాకెట్స్ ఇచ్చింది కృష్ణకుమార్ కి.
తెలుగు నేర్చుకున్నావా అన్నాడు.
అవును సర్. తెలుగు, కన్నడ కూడా నేర్చుకున్నాను.
ఓహ్ గ్రేట్ . థాంక్యూ పూనమ్ నీ హాస్పిటాలిటీ కి అన్నాడు.
వెల్కమ్ సర్. నేను మళ్ళీ వస్తాను అంటూ తనూ బిజీ అయ్యింది అటూ ఇటూ తిరుగుతూ.
ఈ ఫ్లైట్ లో నువ్వొక్కదానివి మల్లెపూలు పెట్టుకున్నట్టున్నావు అన్నాడు విద్య తో.
ఏం మీకు నచ్చలేదా అంది.
పూల పరిమళం మత్తు గొలుపుతోంది విద్యా. అంతకంటే ఏం లేదు.
తీసెయ్యమంటారా అంటూ జడ ముందుకేసుకుంది.
ఓహ్ వద్దు అవి ఫీల్ అవుతాయి. నన్నో విలన్ గా చూస్తాయి.
ఏవి పూలు అన్నాడు ఏటో చూస్తూ.
ఇటు తిరిగి చెప్పొచ్చు. మిమ్మల్నేమీ నేను ఊరించను లెండి.
సరదాకి అన్నానులే. అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉండాలి. లేకుంటే నాకు అస్సలు రొమాంటిక్ టచ్ లేదు అనుకునే ప్రమాదం ఉంది.
మంచిదే. మీ సరదాలు నాతో కూడా పంచుకోవచ్చు అంది.
ఎకానమీ ఫ్లైట్స్ కావడంతో సీట్లు ఇరుకుగానే ఉన్నాయి. హ్యాండ్ ఆర్మ్ మీద ఇద్దరు చేతులు పెడితే ఒకరి చేతులు ఇంకొకళ్ళకి తగులుతున్నాయి. అది గమనించి విద్య తన చేతులు ఒళ్ళో పెట్టుకుంది.
ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఒక గంట ప్రయాణం.
ఫ్లైట్ పైకి వెళ్లి స్టెబిలైజ్ అయ్యింది.
మూవ్మెంట్ లో ఎయిర్ పాకెట్స్ ఎక్కువ ఉన్నట్లున్నాయి.
చిన్న ఫ్లైట్ కావడంతో బాగా ఊగుతోంది.
ఎయిర్ హోస్టెస్ లు కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని వారి సీట్స్ లో కూర్చున్నారు. ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ ఇస్తోంది.
ఎయిర్ పాకెట్స్ వలన కొంచెం టర్బులెన్సు ఉంది. కంగారు పడకండి అని చెప్తోంది.
టర్బులెన్సు మరీ ఎక్కువగా ఊగుతుండటంతో విద్య కంగారుపడి కృష్ణకుమార్ చెయ్యి గట్టిగాపట్టుకుని అతని భుజంపై తల వాల్చింది భయంగా ఉంది అంటూ.
ఏమి ప్రాబ్లెమ్ లేదు విద్య. డోంట్ వర్రీ అన్నాడు. అలా ఊగుతుండటంతో అతనికి కూడా కంగారుగానే ఉంది. అది పైకి కనపడనీకుండా విద్య కు ధైర్యం చెపుతున్నాడు.
తలతిప్పి పక్కకు చూస్తే తన భుజంపై వాలిన విద్య మొహం దగ్గరగా కనిపిస్తోంది. ఆమె ఊపిరి వెచ్చగా తన మెడకు తగిలి గిలిగింతలు పెడుతోంది. ఆమె ముంగురులు అతని ముఖాన్ని తాకుతూ అల్లరి చేస్తున్నాయి. పైలట్ చెపుతున్నాడు. ఫస్ట్ టైం వాతావరణం కొంచెం గాలితో కూడి ఇబ్బందిగా ఉంది. ఎవ్వరు భయపడద్దు. సేఫ్ గానే తీసుకు వెళుతున్నాను అని హామీ ఇస్తున్నాడు.
ఉన్నట్టుండి పెద్ద కుదుపు రావడంతో కంగారులో ఆమె వైపు చూసిన కృష్ణకుమార్ మొహం వంగి అతని పెదవులు విద్య పెదవులను అద్దినట్టుగా తగిలాయి.
యాదృచ్చికంగా జరగడంతో కృష్ణకుమార్ ఆ చర్యకు ఇంకా కంగారుపడి ఇటు జరగబోయాడు.
భయంతో ఉన్న విద్య అతని చేతిని వదలలేదు.
ఇంకా అతనివైపుకు జరిగి గట్టిగా పట్టుకుని అతని భుజం మడతలోతన తలను అలానే ఉంచింది.
కృష్ణకుమార్ కు మటుకు మనసులో కొంచెం అలజడిగానే ఉంది.
తను కావాలని అలా చెయ్యకపోయినా ఆమె ఎలా ఫీల్ అయ్యిందో అనుకుంటూ ఇబ్బందిగా ఉన్నాడు.
కొంచెం సేపటి తరువాత వాతావరణం కాస్త మామూలుగా మారింది.
ఫ్లైట్ ఊగడం తగ్గి నిలకడగా వెళుతోంది.
పైలట్ హ్యాపీ గా అనౌన్స్ చేస్తున్నాడు. డేంజర్ నుంచి బయటపడ్డాము అని.
మెల్లగా అతని చేతుల్లోంచి తన చేతిని తీసుకుని సర్దుకుని కూర్చుంది విద్య.
కృష్ణకుమార్ ఆమె మొహం వైపు చూసేందుకు కొంచెం మొహమాటపడ్డాడు.
విద్య అతని వైపుకు వంగి చెవిలో చెప్పింది మీరు అలా చెయ్యరని తెలుసు. మీరేమీ ఇబ్బంది పడకండి అంది.
హమ్మయ్య అనుకున్నాడు.
అప్పటిదాకా ఆమె ఫీలింగ్స్ ఏంటో, తనని ఎలా అనుకుందో అని తెగ మదనపడిపోయాడు.
****
ఫ్లైట్ పదినిముషాలు లేట్ అయినా లాండింగ్ మామూలుగా అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎలా ఉన్నావు, ఓకే నా అడిగాడు విద్యని.
నౌ ఓకే. ఇందాక చాలా కంగారు అనిపించింది.
కొన్నిసార్లు గాలి తీవ్రతకు అలా ఊగుతుంది ఫ్లైట్.
పైలట్ చాలా చక్కగా మేనేజ్ చేసాడు అన్నాడు.
ఫ్లైట్ నుంచి బయటికొచ్చేప్పుడు పూనమ్ విజిటింగ్ కార్డు అడిగింది కృష్ణకుమార్ ని.
జేబులోనుంచి తీసి పూనమ్ కు ఇచ్చాడు.
మీ ఫాన్స్ మిమ్మల్ని వదలట్లేదు అంది విద్య నవ్వుతూ.
ఈ జనరేషన్ వాళ్ళు చాలా తెలివిగా ముందుకెళుతున్నారు అంటూ పూనమ్ ని మెచ్చుకున్నాడు కృష్ణకుమార్.
హోటల్ కారు డ్రైవర్ కృష్ణకుమార్ పేరుతో ప్లకార్డు పట్టుకుని ఉన్నాడు విజిటర్స్ లాంజ్లో .
అది గమనించి అటువైపు దారితీశారు ఇద్దరూ.
పదకొండవ అంతస్తులో రెండు రూమ్స్ పక్క పక్కనే అల్లాట్ చేశారు ఇద్దరికీ.
ఫార్మాలిటీస్ అయ్యాక చెక్ ఇన్ అయ్యారు.
మీటింగ్స్ కి లీడ్ బ్యాంకు తరఫున కృష్ణకుమార్ హెడ్ చేస్తాడు.
మిగతా నాలుగు బ్యాంక్స్ వాళ్లలో ఒకరు లోకల్ బ్యాంకు మేనేజర్. అతను రేపు డైరెక్ట్ గా మీటింగ్ కి వస్తాడు మిగతా ముగ్గురూ ఇంకా చెక్ ఇన్ కాలేదు.
కంపెనీ వాళ్ళు రేపు మీటింగ్ కి డైరెక్ట్ గా వస్తారు.
మొదటి రోజు కంపెనీ తో అన్ని బ్యాంకులకు మీటింగ్ ఉంటుంది.
రెండో రోజు బ్యాంకర్లు మాత్రమే మీటింగ్.
ఆరోజు సరిపోకుంటే మూడో రోజు మీటింగ్ ఉంటుంది.
సో మూడో రోజు కేవలం కుషన్ కింద పెట్టారు.
అందరిని కృష్ణకుమార్ కోఆర్డినేట్ చెయ్యాలి.
తమ బ్యాంకు లీడ్ చేస్తోంది కనుక కృష్ణ కుమార్ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు.
విద్య కంపెనీ కి సంబింధించిన అంశాలలో హెల్ప్ చేస్తుంది. ఇబ్బందేమీ ఉండకపోవచ్చు అనుకున్నాడు.
విద్య ఆ లోన్ కి సంబంధించి ఒక పెద్ద రైట్ అప్ ఇచ్చింది.
అది అంతా కవర్ చేస్తుంది. ఆ రిపోర్ట్ అన్నివిధాలా సహాయపడుతుంది అనుకున్నాడు.
టైం సాయంత్రం ఆరయ్యింది. కాసేపు రేణూ తో మాట్లాడాడు.
ఏమండి ! గుడ్ న్యూస్. వెబ్ సిరీస్ వాళ్ళు అగ్రిమెంట్ పేపర్స్ పంపారు. మీరు వచ్చిన తరువాత చూద్దురుగాని. మీకు మెయిల్ కూడా చేస్తాను అంది. కథ ఎండింగ్ మీరే డిసైడ్ చెయ్యాలి అంది.
అలాగే రేణూ, రేపు పొద్దున్న పది గంటలకు మీటింగ్. కంపెనీ వాళ్ళు వస్తారు. ఈ మూడు రోజుల బాగా బిజీ. నేను వచ్చిన తరువాత తీరికగా డిస్కస్ చేద్దాం సరేనా అన్నాడు.
అవును. మీరు విద్యక్కకి బర్త్ డే ప్రెసెంటేషన్ ఏమి ఇస్తున్నారు అని అడిగింది ఉత్సాహంగా.
ఏమో ఇంకా ఏమీ డిసైడ్ చెయ్యలేదు.
తన ముక్కుకు ముక్కు పుడక చాలా బాగుంటుందండీ. అక్కడ దొరికితే అది కొనివ్వండి అంది.
