Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 13

 

    "గీతా దేవి .....? ఎలాంటి అరమరికలు లేకుండా డబ్బుతో పాటు నీ అందమయిన శరీరంతో కూడా విందు చేశావు. నాకు కావలసింది దొరికింది . ఇక నా బెడద నీకు వుండదు. ... ప్రియునితోనే కులుకుతావో, నీ మొగుదితోనే సరిపెట్టుకుంటావో నీ ఇష్టం.....నీ జోలికి నేను రాను...." అంటూ బయటకు వెళ్ళిపోయాడు అతను.
    ఆమె మనస్సు బాధతో విలవిల్లాడిపోయింది.
    నిజమే....
    తను ఊబిలో అడుగు పెట్టనే కూడదు....పెట్టాక వెనక్కు రావాలంటే చాలా కష్టమయిన విషయమే....పతనం కావడమంటూ జరిగితే దానికి ఎల్లలు వుండవు.
    అధో పాతాళానికి దిగాజారక తప్పదు.
    ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో పట్టపగలే జరిగిపోయిన దారుణాన్ని ఎలా మరచిపోవాలో అంతుబట్టక మౌనంగా బయటకు నడిచింది గీతాదేవి.
    మరు నిముషంలోనే ఆమె కారు సిటీ వైపు సాగిపోయింది.
    ఆమెను అనుభవించిన అగంతుడు, మాటున దాగివున్న అతని మిత్రుడు ఇద్దరూ క్యాష్ ను చెరిసగం పంచుకున్నారు.


                                                       *    *    *


    శైలజ దియేటర్.....
    విజయవాడ నగరం నడిబొడ్డున వున్న ఆ దియేటర్ లో ఆ రోజే రిలీజ్ అయిన కొత్త పిక్చర్ వుండడం వలనేమో జనం చాలామంది వున్నారు.
    లేడీస్ కూడా ఎక్కువగానే రావడం వలన స్వప్న కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు సుందరం.
    తన పక్కనే ఎవరో దగ్గినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి వెనుదిరిగాడు అతను.
    స్వప్న పక్కగా వెళుతూ కనిపించింది.
    ఆమె దగ్గింది అని గ్రహించాడు సుందరం....నోరు తెరిచి ఏదో అనబోయే అంతలో అతనిని చూడనట్టే ముందుకు సాగిపోయింది.
    బహుశా తనను చూడలేదేమో అనుకున్నాడు.
    "స్వప్నా....." అంటూ వెగంగా నడుచుకుంటూ వెళ్ళి ఆమె భుజం పై చేయి చేశాడు సుందరం.
    చివ్వున వెనుదిరిగిందామె.
    "ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? రెండు టిక్కెట్లు తీసుకునే వుంచాను...? పద సినిమాకి వెళదాం" అంటూ ఇంకా ఏదో  అనబోతూ మిగిలిన మాటలను నోటిలోనే మింగేశాడు.
    కారణం ఆమె పక్కనే సింహాచలం.
    ఆమె తనను రమ్మని పిలిచి ....భర్తతో సినిమాకు ఎలా వచ్చిందో సుందరానికి అర్ధం కాలేదు.
    "ఏం కూశావురా......! నా భార్యను సినిమాకు రమ్మంటావా పై పెచ్చు భుజం మీద చేయి వేసి మరీ అడుతుతావా? అప్రాచ్యుడా.....' సింహాచలం కోపంతో అరిచాడు.
    "నేనేం పిలవలేదు....మీ ఆవిడే నన్ను రమ్మన్నది, కావాలంటే ఆమెను అడుగు" ఏమనాలో తోచక బింకంగా అన్నాడు సుందరం.
    'అయ్యో రామ.....! నేను పిలవడమేమిటండి....?" బుగ్గలు నొక్కుకుంటూ వాపోయింది స్వప్న.
    "నోరు ముయ్యరా వెధవా.....! నిన్ను ఎందుకు రమ్మంటుంది..... నా భార్య ఏమయినా తిరుగుబోతు అనుకున్నావా ఎవళ్ళతో పడితే వాళ్ళతో సినిమాకి రావడానికి."
    "ఏమో ఎవరికి తెలుసు.....! రంకు బయటపడే వరకూ అందరూ ప్రతివ్రతలుగానే కనిపిస్తారు."
    'అమ్మో.....! ఎంత మాటలంటున్నాడండీ....?  నేను ప్రతివ్రతను కాదా?" స్వప్న శోకాలు తీసింది.
    "రేయ్..... తప్పుడు మాటలు వాగావంటే నీ నాలుక చీరేస్తాను. నేను రమ్మంటేనే నా భార్య ఈ సినిమాకు వచ్చింది. నువ్వేమో నిన్ను రమ్మన్నది అంటున్నావు. నిజం ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నావా....? ఓరి మిత్రద్రోహి ....నేను నీకేం అన్యాయం చేశానని ఇంత అభాండం వేస్తున్నావురా?"
    "నా మాట నమ్ము సింహాచలం. నేను చెప్పేది నిజం. నీ భార్య చాటుగా సాగించే వ్య్యవాహారం నీకు తెలియకపోవచ్చు. నా కంటితో నేను చూశాను...."
    'ఛ.... నోర్ముయ్యి.....అదే ఇంకొకరు అయితే ఒళ్ళు హూనం అయిపోయేది. నీలాంటి వాడిని స్నేహితునిగా భావించడం కూడా తప్పే.....ఈరోజు నుంచీ నన్ను పలకరించకు.....' ఆవేశంతో అన్నాడు సింహాచలం.
    "నా మాటలను నమ్మడం లేదు నువ్వు. ఇది సినిమా హాలు అయిపొయింది. పెద్దగా మాట్లాడితే నలుగురు పోగు అవుతారు, పోయేది నీ పరువే.....అందుకే నీతో వాదించడం లేదు. నువ్వు నమ్మినా నమ్మక పోయినా నేను చెప్పేది నిజం . నీ భార్య నువ్వు అనుకుంటున్నట్లు పతివ్రత కాదు.
    "కావాలంటే నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళను ఎంక్వయిరీ చేసి చూడు. నా మాటలు ఎంత నిజమో నీకే తెలుస్తాయి. నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని చాతుమాటున సాగించే రహస్య శృంగార ప్రేమ కలాపాలను నేను ఎన్నో సార్లు చూసి కూడా నీతో చెప్పలేకపోయాను. నామాలు నమ్మకపోవడం నీ ఖర్మ! ఇప్పుడు కాకపోయినా రేపు ఎప్పుడయినా నిజం తెలియక మానదు. అప్పుడయినా కళ్ళు తెరిస్తే మంచిది."
    గిర్రున వెనుదిరిగి వెళ్ళిపోయాడు సుందరం.
    సింహచలానికి తల కొట్టేసినట్టుగా వుంది.
    "స్వప్నా.....? అందరూ మనల్నే చూస్తున్నారు.... పద వెళ్ళిపోదాం.....సినిమా వద్దు ఏమీ వద్దు." అని విసవిస నడిచి వెళ్ళి రిక్షా ఎక్కాడు సింహాచలం.
    స్వప్న మౌనంగానే వెళ్ళి అతని పక్కనే కూర్చుంది.
    రిక్షా కదిలి వెళ్ళిపోయింది.
    సుందరాన్ని దాటుకుంటూనే వెళ్ళింది రిక్షా.
    అతనికి కాళిదాసు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
    "పట్టపగలు కాకి అరుపులకే ఉలిక్కిపడిపోయే ఇల్లాలు....అర్ధరాత్రి వేళ మొసళ్ళు సంచరించే యమునా నదిని ఒంటరిగా తెప్ప ద్వారా దాటుతూ ఆకలితో కమ్ముకుంటున్న మొసళ్ళకు మాంసపు ముద్దలను ఆహారంగా వేస్తూ ఆవలి తీరంలో ఉన్న ప్రియుడిని కలుసుకోవడానికి వెళుతుంది---"
    అంటే ఎలా నమ్మశక్యం కాకుండా వుంటుందో ...ఇప్పుడు ఈ మహా ఇల్లాలు స్వప్న చేసే రంకుతనం తను చెప్పినా పాపం వినే స్థితిలో లేడు.....అనుకున్నాడతను.
    తన స్నేహితునికి అజ్ఞానానికి తనలో తనే బాధపడిపోతూ సాగిపోయాడు సుందరం.


                                                         *    *    *

    విశాఖపట్నం లాంటి ఒక స్టార్ హోటల్లో.....
    ఏ.సి. రూమ్ ....లో....
    గదిలో చల్లని ఎసి పరుచుకుని వున్నా ఆ ఇరువురి శరీరాలపై మాత్రం చిరుచమట్లు పట్టి వున్నాయి.
    ఫోం బెడ్ పై వున్నా ఆ మెత్తదనం తనకు చాలదు అన్నట్టు అతని గుండెల పై పడుకుని వుంది ఆ యువతి.... ఇద్దరూ నగ్నంగానే వున్నా యెవరూ సిగ్గుపడడటం లేదు---
    "సునీల్ ,,,, ఈ అనందం నాకు ఎప్పటికీ కావాలి..... గోముగా అంది వకుళ.
    "వకుళా డియర్... అది జరగదు అని నీకు తెలుసు.... నీకు పెళ్ళి అయింది. భర్త పిల్లలు ఉన్నారు. నాకంటావా ఎవరూ లేరు. నాకు ఉన్న ప్రియురాళ్ళలో నువ్వు ఒకదానివి మాత్రమే. హైక్లాస్ సొసైటీ లేడీస్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో నీకు తెలియనిది ఏముంది చెప్పు.....కావాలనుకుంటే కోరి అందలం ఎక్కిస్తారు , అనవసరం అనుకుంటే అవసరం తీరిందని విసిరి పారేస్తారు . అందుకే సెంటిమెంట్లకు తావు ఇవ్వకూడదు."
    "అబ్బ .....సెక్స్ మూడ్ లో కూడా ఇంత కుండ బద్దలు కొట్టినట్టు ఎలా మాట్లాడుతున్నావు డియర్."
    "అనుభవం డార్లింగ్.....అనుభవం నేర్పింది....ఎవరికి యెలాంటి అవసరం కలిగినా దానికి సంబంధించిన వ్యక్తికీ ఫోన్ చేసి ఆ అవసరాన్ని తీర్చుకుంటున్నట్టే నేనూ నా మగతానాన్ని నీలాంటి సెక్స్ పిచ్చి వున్న అతివలకు అంకితం చేశాను. అందుకే నా లిస్టులో వున్న ఏ యువతి ఫోన్ చేసి పిలిచినా లేదు అనకుండా వెళ్ళి వాళ్ళ శరీర తాపాలను చల్లార్చి వస్తున్నాను." అన్నాడు సునీల్.
    "ఊరికే ఏం చేయడం లేదుగా.....అంతకు అంత డబ్బు ఇస్తున్నాం కదా.....?"
    "అవును.....ఒకవిధంగా మీకు నేను అమ్ముడు పోయినట్టే....మా మొగాళ్ళ ద్వారా తీరని సుఖాలను అడ్డదార్లు తొక్కి రకరకాల వ్యక్తులతో తీర్చుకుని పతనమయ్యే కన్నా ఒక్కడితో అయితే గుట్టుగా సాగిపోతుంది.  అవసరం వున్నంతకాలం నన్ను రానిస్తారు. రంకుతనం తెలిసిపోయింది అనుకో.... లేక ఇంతకన్నా సుఖాన్ని మరొక రూపంలో మరిగినప్పుడు నా అవసరం వాళ్ళకు వుండదు ఏమంటావ్ వకుళా డార్లింగ్....నేను చెప్పింది నిజమే కదూ....
    "అబ్బ.....ఆ గొడవంతా ఇప్పుడు ఎందుకు?" తన శరీరాన్ని అతని బలిష్టమయిన బాహువుల మధ్యకు చేర్చి మత్తుగా కౌగాలించుకుంటూ విసుక్కుంది.
    కొన్ని నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య మాటలు కరువయ్యాయి...
    తీయని , వెచ్చటి నిట్టుర్పులతో ఆ గది నిండిపోయింది.
    పరువాలతో పొంగి పొర్లుతున్న ఆ యువతి బలహీనత ఏమిటో తనకు తెలుసు అన్నట్టు అతను విజ్రుంభించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS