Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 12

 

    "హల్లో డియర్ ....ఏమిటి నేను మట్టడుతుండగానే ఫోన్ పెట్టేశావు బహుశా నీ మొగుడ్ని బయటకు పంపించి వుండాలి. యామ్ ఐ రైట్...."
    అదే గొంతు...
    అదే హెచ్చరిక....
    "గీతాదేవి షాక్ తిన్నావా?"
    "ఎవరు నువ్వు?"
    "అదీ ప్రశ్న.....ఇప్పుడు నచ్చావు నాకు...."
    "షటప్.....అసలు ఎందుకు ఫోన్ చేశావు."
    "ఎందుకో నీకు తెలియదా? నీకు తెలుసునని నాకు తెలుసు. నాకు తెలుసునని నీకు తెలుసు"
    "పిచ్చివాగుడు కట్టిపెట్టు మిస్టర్....హూ ఆర్ యూ?"
    "అంత కోపం పనికి రాదు గీతాదేవి ..... కట్టుకున్న మొగుడిని ఆఫీసుకు పంపి ప్రియునితో సుఖ భోగాలను అనుభవిస్తున్న ఓ పతివ్రత గారూ.....మీ అయన తిరిగి ఆఫీసు నుండి ఎప్పుడు వస్తారో కాస్త చెబుతాడా?"
    "ఎందుకు?"
    "ఎందుకేమిటి పిచ్చి ప్రశ్న.... అయన గారి భార్యామణి రాసలీలలు ఎలా ఉంటాయో ఆయనతో ముచ్చటిద్దామని"
    ఆమెలో అంతవరకూ ఉన్న గాంభీర్యం సదలిపోయింది.
    "ప్లీజ్ అసలు నీకేం కావాలి"
    'అదీ.....అలా అడిగావు బాగుంది..... ముందు నాకు ఏం తెలుసో చెప్పమంటావా ....అదే నువ్వు.....రాత్రి"
    "వద్దు.....మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే విషయం ఎత్తుతావు?"
    "ఒకే! నాకు తెలిసిన విషయం నాతోనే ఉండిపోవాలన్నా నీ మొగుడికి చెప్పకుండా వుండాలన్నా కొంచెం ఖర్చు అవుతుంది మరి"
    అవతల వేపు నుంచి నవ్వు....
    'అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా?"
    "నువ్వు ఎలా అనుకున్నా సరే అమ్మడూ ఈ రహస్యం బయట పడితే నీ కాపురం కూలిపోతుంది కాబట్టి నేను చెప్పినట్టు చేయక తప్పదు. అడిగింది ఇచ్చావనుకో అసలు విషయం ఎవరికీ తెలిసే అవకాశం వుండదు. లేదూ అంటే పెదవి దాటుతుంది. ఆ తరవాత నువ్వు రోడ్డున పడక తప్పదు."
    "సరే ఎంత కావాలి?" పళ్ళ బిగువున ప్రశ్నించింది గీతాదేవి.
    "ఇరవై వేలు"
    "అంత డబ్బు నా దగ్గిర లేదు. మావారిని అడిగితె ఎందుకో చెబితే తప్ప ఇవ్వరు. బ్యాంకులో పదివేలకు మించి లేవు. ప్లీజ్ నా మాటలను నమ్ము...."
    ఒక నిమిషం నిశ్శబ్దం.....
    "సరే ....నీ బాధ నాకు అర్ధం అయింది. బ్యాంక్ లో ఎంతవుంటే అంత డ్రాచేసి పట్టుకురా....అలా అని నన్ను మోసం చేయాలని ప్రయత్నం చేయకు. నువ్వు బ్యాంక్ కు వెళ్ళే సరికే నీ ఖాతాలో ఎంత వుందో ఎంక్వయిరీ చేయడం జరుగుతుంది. నిన్ను నమ్మి నీకు అవకాశం ఇస్తున్నాను. డ్రా చేసిన మొత్తాన్ని చిన్న హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని నేను చెప్పిన చోటుకి రావాలి అర్ధం అయిందా?"
    "సరే!
    ఫోన్ కట్ అయింది.
    గీతాదేవి ఉస్సురుమంటూ కూలబడిపోయింది.
    బ్లాక్ మెయిల్ పద్దతి చూస్తుంటే ప్రొఫెషనల్ కాదని అర్ధమైంది. అంటే ఎవరో తన రంకుతనాన్ని చాటుగా అబ్జర్వ్ చేసి తనను బెదిరిస్తూన్నారు.
    ఇప్పుడు అతను ఎవరో తెలిసిపోతుంది కాబట్టి తను ఎలా అతనికి దొంగలా పట్టుబడిందో తెలుసుకోవచ్చు. సాధ్యమయినంత వరకూ తను ప్లాట్ వదిలి బయటకు వెళ్ళడం జరగదు.
    ప్రియునితో ఎలాంటి సుఖాలు అనుభవించినా ఈ గది నాలుగు గోడల మధ్యనే.....
    అలాంటిది అతనికి ఎలా తెలిసింది?
    ఉన్నట్టుండి ప్రియుడు గుర్తు రావడంతో ఆమె నరాలు తీయగా మూలిగాయి.
    అంతవరకూ పడిన టెన్షన్ మరచిపోయింది.
    తనకు కావలసిన నంబరుకు ఫోను చేసింది.
    ఎంగేజ్ డ్....
    మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే వుంది.
    అయినా అదే శభ్దం....
    గీతాదేవి విసుగనిపించి ఫోన్ పెట్టేసింది.
    భర్త ఎటూ రాడు కాబట్టి .....ప్రియుని పిలిపించుకుని అతని కౌగిలి లో కరిగిపోవాలని వుంది, కానీ వీలుపడడం లేదు.... ఫోనులో అతను కలవడం లేదు?
    ఎక్కడకు వెళ్ళాడో.....ఏం చేస్తున్నాడో....
    ఆ సమయంలో ఆ ఫోను ప్రక్కనే మరొక సుందరాంగిని అంద చందాలను ఆస్వాదిస్తున్నాడని , డిస్త్రబెన్స్ లేకుండా వుండడానికి రిసీవర్ తీసి ప్రక్కన పెట్టేశాడని గీతాదేవికి ఎలా తెలుస్తుంది?
    యాంత్రికంగానే బ్యాంక్ కు వెళ్ళి పదివేలు డ్రా చేసింది.
    ఎక్కడకు వెళ్ళి ఇవ్వాలో బ్లాక్ మెయిలర్ చెప్పలేదు.
    ముందే చెబితే తను జాగ్రత్త పడతాను అనుకున్నాడో లేక అతనికి తగిన స్థలం దొరకలేదేమో.
    ఆమె ఆలోచనలలో ఉండగానే ఫోన్ మోగింది.
    "గీతాదేవి.....డబ్బు రడీ చేశావా?"
    "రడీగానే వుంది.....ఎక్కడకు తీసుకురావాలి"
    'ఇది ఇప్పుడు చెప్పడం కుదరదు. నీకు ఇబ్బందేమీ లేని పద్ధతినే చెబుతాను. నీ మొగుడు రాత్రి వరకూ రాడు. నువ్వు ఫోన్ చేసి పిలిస్తే  తప్ప నీ ప్రియుడు నీ ప్లాట్ కు రాడు. ఎక్కడకు రావాలో సాయంత్రం లోపే ఫోన్ చేసి చెబుతాను.'
    ఫోన్ పెట్టేశాడు అతను.
    అంటే ---! తన గురించి పూర్తిగా తెలుసుకున్నాడన్నమాట.....వాళ్ళు చెప్పింది నిజమే. తను అవసరమయినప్పుడల్లా ప్రియునికి ఫోన్ చేసి పిలిపించుకుంటుందే తప్ప అతనంతత అతను రాడు......తను బయటకు వెళ్ళదు.
    అందుకే ఎంతో కాలం నుంచీ రహస్య ప్రణయం నిరాటంకంగా సాగిపోతూ వచ్చింది.
    కానీ.....అదే ఇప్పుడు బట్టబయలు అయింది.
    కరెక్ట్ గా మధ్యాహ్నం రెండు గంటలకు బ్లాక్ మెయిలర్ ఫోన్ చేశాడు.
    గీతాదేవి అతను చెప్పినట్టుగానే కాష్ బాగ్ తో బయల్దేరింది.
    నగరానికి దూరంగా ఉన్న ఒక కాలనీలో పాడుబడినట్టున్న భవంతి లోపలకు కారును తీసుకు వెళ్ళి ఆపింది.
    లోపల అన్నీ చెట్లు.....
    చెట్ల మధ్యలో పురాతనమయిన భవంతి?
    ఎవరయినా కనిపిస్తారేమోనని దిక్కులు చూస్తూ ముందు గదిలోకి అడుగు పెట్టింది.
    "వెల్ కమ్ గీతాదేవి....."
    ఆమె ఉలిక్కిపడింది.
    "ఖంగారు పడకు..... డబ్బు తెచ్చావా లేదా?" పక్క గదిలో నుంచి వస్తూ అడిగాడు అతను.
    "తె....తెచ్చాను."
    అంటూనే ఎదురుగా వున్న వ్యక్తిని గుర్తుంచే ప్రయత్నం చేసింది.
    ముఖానికి మంకీ కాప్ ధరించి వుండడం వలన అతనిని పోల్చుకోలేక పోయింది.
    ఉన్నట్టుండీ ఆమె భుజంపై అతని చేయి పడింది.
    "ఏమిటిది?" కీచు గొంతుతో అరిచింది.
    "ఏమిటో నీకూ తెలియదు.....! నువ్వు కోరుకునే సుఖం ....నీకు కావలసిన సుఖం.....నీ ప్రియునితో నువ్వు పొందే సుఖం....." ఒక్కసారిగా కౌగలించుకుని పెదాలపై ముద్దు పెట్టుకుంటూ అన్నాడు అతను.
    "డబ్బు తెమ్మని అడిగి ఇలా చేయడం అన్యాయం. డబ్బు తీసుకుని నన్ను వదిలి పెట్టండి." గీతాదేవి గింజుకుంటూ అన్నది.
    'అలాగాలే....! ఆ డబ్బుతో పాటు నువ్వు కూడా కావాలి" అంటూ కాష్ బాగ్ లాక్కున్నాడు.
    "ప్లీజ్! నన్ను వదిలిపెట్టు...."
    "వదిలి పెడతాను. కానీ పని అయిపోయిన తరువాత."
    "ఏమిటిది? నేనేమయినా వేశ్యను అనుకుంటున్నావా....? నువ్వు అడగగానే పడక సుఖాన్ని అందించడానికి" కోపంతో అన్నదామె.
    "అదేదో నీకే తెలియాలి..... ఇరవై వేలు అడిగాను. కానీ సగం డబ్బు మాత్రమే తెచ్చావు. మిగిలిన సగం బదులు నిన్ను పంచుకుంటున్నాను. నువ్వు నీ మొగుడితోనే పడుకుంటావో.....నీ ప్రియునితోనో సుఖ భోగాలను అనుభవిస్తావో లేక ఇంకెందరి విటులతో వుంటున్నావో నాకు అనవసరం నువ్వు ఇల్లాలివో, వెలయాలివో నీకే తెలియాలి."
    ఆమె చీర కుచ్చేళ్ళు పట్టి ఒక్క లాగు లాగాడు.
    కొరడా పెట్టి చరిచినట్టు గీతాదేవి హృదయం విలవిల్లాడిపోయింది.
    ఇప్పుడు ఆమె ప్రతి ఘటించే ప్రయత్నం చేయడం లేదు. చేసినా ప్రయోజనం లేదనీ ఉండదనీ తెలుసు కాబట్టి మౌనంగా శరీరాన్ని అప్పగించింది.
    తనను నడిపించుకు వెళ్ళి ఒకేవైపు పరచి వున్న చాపపై పడుకోబెట్టి బట్టలన్నీ వూడదీసి తనను ఆక్రమించుకోవడం తెలుస్తూనే వున్నది.
    మరొక పది నిమిషాల తరువాత....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS