చిగిర్చిన వసంతం
ఈరోజు తన పుట్టినరోజు. ఆ విషయం భోజనం వడ్డిస్తూ అతనితో అంది రాధారాణి. 'ఓహో అలాగా' అన్నాడతను.
తన ఉత్సాహం ఒక్కసారిగా నీరు కారిపోయింది. అతనెంతో వింతగా కనిపిస్తాడు తనకు. అతన్నర్థం చేసుకోలేదు తను.
తన పుట్టినరోజు పండగలా చేసుకోవటం అలవాటు తనకు. ఈ రోజు సినిమాకు వెడదామనీ, కొత్తచీర కొనుక్కోమని ఎన్నో అంటాడని ఆశించింది తను. కానీ, భోజనంచేసి వెళ్ళిపోయాడు అతను. తన మనసు ఒక్కసారి చిన్నబోయింది.
అతనికి ఇష్టం లేదులా వుంది - అతనికి ఇష్టంలేని సరదాలు తనకెందుకు? సరదాకి ఒక్కమాట అంటే తనకెంత గర్వంగా, సంతోషంగా ఉండేది! మాటలురాని వాడు కాదుకదా? ఇంతకీ అతనికి తనమీద ప్రేమలేదు అంతే.
పోస్టుమాన్ పడేసిన కవరులో గ్రీటింగ్ కార్డు పల్కరించింది. అన్నయ్య మరచిపోలేదు ఈ రోజు. అన్నయ్య పెట్టన నీలిరంగు జరీచీర పెట్టెలోనే వుంది. తనీరోజు ఎందుకు ఆ కొత్తచీర కట్టడం మానేయాలి? కానీ ఆ చీర అతనికిష్టమనేగా కొన్నది - ఈ రోజు ఆ చీర కడితే ఆనందించి, అభినందించే వ్యక్తి ఏడీ - తన భర్తకు తనమీద ప్రేమ లేదు! ప్రేమెరుగని జీవితంలో కూడా ఈ పెరుగుదల దేనికి?! జానకి చాలా నిరాశగా, నిస్పృహగా ఆ గ్రీటింగ్ కార్డు బల్లమీద ఉంచి లేచింది.
అద్దం ముందు కూచుంది ఆమె. తన అన్నను, ఒదినను చూచింది. వాళ్ళ అనురాగాన్ని, అన్యోన్యతను చూచి మురిసిపోయింది__
ఇలా చాలాసేపు ఆలోచించాక, మెఱపులాటి ఆలోచన కలిగిందామెకు.
__నిజానికి అతని స్వభావమే ఇదేమో!!
ఇంట్లో కావలసిన వన్నీ చూస్తున్నాడు. తను చేసినవన్నీ తింటున్నాడు - తనను ఏనాడూ కొట్టలేదు, తిట్టలేదు .... తనే పొరబాటు పడుతున్నదేమో .... తనమీద ప్రేమలేదని ఎందు కనుకోవాలి?!
__సముద్రపు ఆటూ పోటూలా వుంది ఆమె మనసు. భార్యను ప్రేమించలేకపోవటం స్వభావమెట్లాగ? నిజంగానే అతనికి ప్రేమలేదు. ఆ రోజు అన్నయ్య ఇంటికి వెళ్ళినపుడు, నువ్వు లేకపోతే ఇల్లు చిన్నబోయింది. రమ్మ'ని వ్రాస్తాడనుకుంది. నువ్వు లేకపోతే బ్రతకలేను అనే వ్యక్తి కావాలని ఆమె కోరిక, ఆ కోరిక తీరనేలేదు__
చివరకు తనే వచ్చేసింది, అలాంటి ఉత్తరం అతని దగ్గరనుంచి రాదని తెలిసి. ఈ విధంగా ఆమె ఆలోచనలు విపరీతంగా పెడత్రోవలు త్రొక్కి వెఱ్ఱితలలు వేసాయి. ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంది.
తన బాధ ఒకరితో పంచుకుంటే కాని తనకు శాంతి ఉండదు. నా ఆవేదన ఎందుకు దాచుకోవాలి? శారద నా ప్రాణ స్నేహితురాలు.
ఉత్తరం పూర్తయింది. హృదయంలో ప్రతి ఒక్కభావం, ఆవేశం, ఉత్తరంలో రూపం దాల్చి పరవళ్ళు త్రొక్కింది. అతనికి నేనంటే ప్రేమ లేదు.... అతను నా కర్థంకాడు....నా ఆశలు, ఆశయాలు అన్ని చంపుకుని ఇలా అసంతృప్తితో ఎంతకాలం బ్రతకటం? ఈ జీవితం ఇలాగే మరుగున పడి మ్రగ్గిపోతుంది. ఓరోజు నువ్వే వింటావు- నీ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుందని - ఈ ధోరణిలో జరిగింది ఉత్తరం ముందుకి.
గడియారం అతను వచ్చేవేళను చెప్పింది. ప్రాణంలేని ప్రతిమలా కూర్చునిపోయింది జానకి. తన ఉనికి గుర్తించి, తను లేకపోతే బ్రతక లేననే వ్యక్తి కావాలని కోరింది తను - కానీ....
అతను వచ్చేస్తాడు. ఆమె గబగబా లేచి ఉత్తరాన్ని గదిలో పరుపుకింద పడేసింది.
అతను ఆఫీసునించి వచ్చాడు. ఆమె కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆమె ముఖంలోకి చూచాడు.
'అట్లావున్నావేమీ' అన్నాడతను. ఆమె మాట్లాడలేదు.
"తలనొప్పిగా వుందా" అన్నాడు.
అవును అంది ఆమె ఎటో చూస్తూ, అంతే!
పరుపుకింద దాచిఉంచిన ఉత్తరం ఒకసారి గుర్తొచ్చింది. ఎందుకో భయమేసింది. ఒక్కసారి మళ్ళా చదవాలనుకుంది. కానీ ఆ పరుపుకింద రోజూ ఉండే డైరీ ఆమెను ఎక్కువగా ఆకర్షించింది. అది రోజూ అక్కడే వుంటుంది. కానీ ఏనాడూ ఆమె దాన్ని చదవలేదు.
ఏముంటుంది దానిలో, అతనికి తనంటే వున్న అయిష్టతను పేజీల్లో నింపుకుని వుంటాడు. ఇతరులతో చెప్పుకోడంకన్నా డైరీ రాసుకుంటే బాగుంటుందేమో మరి! తనకన్నా తెలివైనవాడు - కవరు పక్కనపడేసి, డైరీ తిరగేయటం మొదలెట్టిందామె.
ఆవేశంలో పేజీలు బాగానే ముందుకు జరిగాయి. ఒక్క పేజీ మాత్రం ఆమె కళ్ళనుండి తప్పించుకుపోలేదు.
'రోజుకన్నా ఈరోజు బావుంది. రోజూకన్నా ఈరోజు బావున్నావు. నా కిష్టమని తెలిసేనా వుంది నీలం జరీచీర కట్టుకున్నావు. నాకు కవిత్వమొస్తే, నీ అందాన్ని, నా అదృష్టాన్ని ఎన్ని పద్యాలలో రాసేవాణ్ణో!
నన్ను అమ్మ నీకు ఇచ్చేసింది ....' జానకి కళ్ళను నమ్మలేక పోయింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు నిలచాయి. ఒక్కక్షణం ఆమె స్తంభించి పోయింది. ఆవేశంతో చాడువుతున్న పేజీ సగంలో ఆపేసి మళ్ళా వెనక్కు తిప్పింది పేజీలు . 'ఒక్కరోజు నువ్వు లేకపోతే నాకు గడవదు. ఇన్ని రోజులు మీ అన్న దగ్గర ఉండిపోతే నేనేమవాలి? నేనూ మీ అన్నయ్య ఇంటికి రావాలని అనుకున్నాను, ఒక్కడినీ ఉండలేక. కానీ మీరంతా నవ్వుతారని మానేశాను. నాకు తెలుసు నువ్వూ అక్కడ నేను లేకుండా ఉండలేవని' - బల్లమీద ఉంచి లేచింది.
అద్దం ముందు కూచుంది ఆమె. ఆమె రూపం ఆమెకే గర్వం కలిగించింది. పచ్చని ఒంటిమీద నీలం జరీచీర మహానప్పింది. తన పెద్ద కళ్ళు నొక్కుల జుట్టు.... ఇంత అందమయిన భార్య వున్నందుకు ఎంత గర్వపడాలి.... కానీ జానకి ముఖంలో విషాద ఛాయలు క్రమ్ముకున్నాయి అంతలోనే.
ఆమె అద్దం ముందునించి లేచింది.
ఈ రోజయినా ఒక్క పది నిముషాలు ముందు ఇంటికి రాకూడదూ!
అతనికి తనమీద ప్రేమ లేదు అసలు! అది నిజం!
ఆఫీసు నించి వచ్చి బూట్లు విప్పాడతను. కాఫీ తెచ్చి బల్లమీదుంచింది ఆమె. ఉత్తరాలు వచ్చాయా అన్నాడు అతను. గ్రీటింగ్ కార్డు చూపింది ఆమె. అతను చూసాడు అంతే. ఆమె మాట్లాడకుండా కాఫీ గ్లాసు తీసుకు వెళ్ళిపోయింది. వెనక్కు తిరిగిపోతున్న ఆమెను ఒక్కసారి చూసి పేపరు చదువుతూ కూర్చున్నాడతను.
ప్రేమించలేని వ్యక్తితో బ్రతకటమెలా? ఇష్టంలేకుండా చేశారేమో పెళ్ళి; అతని మనసు ఎవరికోసమో దాచుకున్నాడు, అందుకే తన ఉనికి గమనించినట్లుండడు, ఇక తన ఆశలు, ఆశయాలు చంపుకు బ్రతకవలసిందే తను-
తన బాధ ఒకరితో పంచుకుంటే కాని తనకు శాంతి ఉండదు. తన బాధ గుండెల్లో దాచుకుని కృంగిపోవటం రాదు తనకి. ఇరుగుపొరుగులతో భర్తను గురించి చెప్పుకుని వాళ్ళ సానుభూతి పొందడం అవివేకమవుతుంది. జానకి అంతరాత్మలో వుండి, తనను పెంచి పెద్ద చేసిన అన్నయ్య ఒక్కసారి కళ్ళముందు నిలచాడు. అన్నాయి మూర్తీభవించిన అనురాగం! తనను, తన ఆవేదనను గుర్తించి కడుపులో పెట్టుకోగల వాడు అన్నయ్య!
జానకి నాలుగు వాక్యాలు అన్నయ్యకు వ్రాసింది. కానీ, తనూ, తన భర్త అన్యోన్యంగా వున్నామని తలుచుకొని మురిసిపోతున్న అన్నయ్యకు, ఈ ఉత్తరం అగ్ని వర్షించిన మేఘమవుతుంది రాసిన కాగితం చించివేసింది జానకి.
శారదకు తనకు మధ్య రహస్యాలు లేవు. తనకు చిన్ననాటి స్నేహితురాలు. ఎన్నో విశేషాలతో ఉత్తరాలు వ్రాస్తుంది ఈ రోజుకీ శారద. ఈ మధ్య వ్రాసిన ఉత్తరంలో, మీ అయన విశేషాలేమిటి అని వ్రాసింది_ఏం వ్రాయాలి, జానకి కళ్ళలో నీళ్ళు నిలచాయి. ఒక్కక్షణంలో ఆమె మనసులో ఆవేదన గోరంత. కొండంత అయింది.
తలనొప్పిగా వుందా అన్నాడు.
అవును, అంది ఆమె ఎటో చూస్తూ, అంతే!
అతను కాసేపు పేపరు చదివాడు మళ్ళా.
కాసేపు పక్కవాటా ఆయనతో రాజకీయాలు మాట్లాడాడు.
కాసేపు భోజనం చేసాడు.
కాసేపు వెన్నెట్లో చల్లగాలిలో పడుకున్నాడు.
అంతే.... కాసేపట్లో రాత్రి, తెల్లవారింది హాయిగా.
ఆమెకు!!?__
మనసు విరిగితే మళ్ళా అతకదంటారు. గాజు ముక్కలాటిది మనసు. మల్లెపూవు లాటిది మనసు. సున్నితంగా చూచుకోవాలి_
ఇంతకీ అతనికి తనమీద ప్రేమలేదు - కలత నిద్రలో తెల్లవారిందామెకు.
ఆ రోజు ఆదివారం. అతను భోజనం చేసి పుస్తకం చదువుకుంటూ నిద్రపోయాడు.
మూడు గంటలకీ కాఫీ తాగి స్నేహితుడింటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆదివారం మరి! సెలవు దినం!
జానకి విసుగ్గా లేచి మంచం మీద పడుకుంది. ఆమెకు ప్రపంచం గాఢాంధకారంలా అనిపించింది. బ్రతుకు శూన్యంగా అనిపించింది. అంతలోనే మళ్ళా ఆ డైరీ తీసి పేజీలు తిప్పింది. "నాకు తెలుసు నువ్వూ అక్కడ నేను లేకుండా వుండలేవని" - జానకి ముఖం పాలిపోయింది. ఎవరో వీపుమీద చరచినట్లయింది.
ఆ సగం చదివిన పేజీ చదవటం మొదలెట్టింది. 'నాకు పదిమందిలా మాటలు చెప్పటం రాదు, అది నా స్వభావం.... నువ్వు లేకపోతే ఒక్క రోజు ఉండలేను....నీ పుట్టినరోజు రాని సంవత్సరం ఒక్కటీ నా కళ్ళ పడనీయకు జానకీ!__'
అది విచారమో, సంతోషమో చెప్పలేని స్థితికి వచ్చేసింది ఆమె. కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. ఏదో విజయగర్వం ఆమె కళ్ళలో మెరిసింది.
అతనికి తనంటే అంత ప్రేమ ఉందా! తను లేకపోతే బ్రతకలేని వ్యక్తి ఒకడున్నాడీ ప్రపంచంలో తనకు! చాలు. అదిచాలు!! మేఘాలు పోయిన వినిర్మలాకాశంలా అయింది ఆమె మనసు. డైరీ పరుపు కింద దాస్తుంటే, ఆనాటి ఉత్తరం వెక్కిరించింది. జానకి ఒళ్ళు భయంతో ఒక్కసారి కంపించి పోయింది.
అతను ఆ ఉత్తరం చూసాడేమో! ఏమో!!
ముక్కముక్కలై నలిగి కింద పడింది ఉత్తరం.
గడియారం వంక చూచింది ఆమె. అతను వస్తాడిక........
ఏదో తెలియని ఆనందంతో ఆమె ఒళ్ళు పరవశించింది.
ఏదో తృప్తి ఆమె కళ్ళల్లో దాగి కూచుంది.
'అతనెంతో మంచివాడు నిజంగా' అనుకుంది అద్దంలోకి చూస్తూ, ఎవరు కాదన్నారు?__ ఎదురు ప్రశ్న వెక్కిరించింది జానకి.
ఆమె బుగ్గల్లో సిగ్గు మొగ్గలు తొడిగింది. ఆమె అద్దంముందు నుంచి లేచింది. అలంకరణ పూర్తయింది.
రోజులాగా అతడు ఆఫీసునించి వచ్చాడు.
ఆమె తలుపు తీసింది.
ఈ రోజు కొత్తగా కనిపించిందతనికి.
'ఎక్కడికైనా వెడుతున్నావా?' అన్నాడు ఆమెను చూస్తూ.
'లేదు' అంది నవ్వుతూ ఆమె.
ఆ నవ్వులో దాగివున్న అనంతార్థాలు అతనికేమి ఎరుక!
ఆ నవ్వులో చందమామ చోటు చేసుకున్నాడని అతనికేమి తెలుసు!
ఆ నవ్వు అమృతాన్ని గుమ్మరించిదని అతనెట్లా గ్రహించగలడు? కానీ-
ఆమె నవ్వింది. అతనూ నవ్వాడు ఎందుకో!
అతడు పెదవి విప్పాడు 'ఈ రోజు పోయిన బంగారం దొరికినట్లుందే నీకు' అన్నాడు. ఆమె ముఖంలో హద్దులు దాటిన ఆనందాన్ని ఆస్వాదిస్తూ.
'అవును దొరికింది' - అతని కళ్ళల్లోకి చూస్తూ ఆమె నవ్వింది- చిగిర్చిన వసంతంలో కోటిమల్లెలు విరసినట్లు.*
