Previous Page Next Page 
చెంగల్వ పూదండ పేజి 13


    శుభ్రంగా స్నానం చేసేను. గడ్డం గీసుకోవటం ఇష్టంలేదు. అది వుండటంవల్లే ప్రియమిత్రులైన ఇస్మాయిల్ కూడా నన్ను గుర్తుపట్టలేదు.

    సాయంత్రం లేచి, బంగారుకొట్టుకి వెళ్ళేను. ఉంగరం అమ్మితే నాలుగువందలు వచ్చింది. డబ్బు తీసుకొని లాడ్జి  కొచ్చేసరికి నా కోసం గుమాస్తా ఎదురు చూస్తున్నాడు.

    "ఏం కావాలి?" అడిగాను.

    "మీ రూం పక్క రూంలోకి షిప్టు చేసేం సార్" అన్నాడు కొద్దిగా అరవయాతనతో.

    "ఎందుకు?"

    చేతులు నులుముకుంటూ ఏదో నసిగాడు. అయినా దాని గురించి అంతగా పట్టించుకోకుండా కొత్త రూమ్ లోకి వెళ్ళిపోయేను.

    సాయంత్రం ఆరున్నర, ఏడూ అవుతూ వుండగా బోయ్ వచ్చేడు. పదేళ్ళ కుర్రవాడు, హుషారుగా వున్నాడు. పలకరింపుగా నవ్వి, "మందుకావాలా సార్?" అన్నాడు. నా కర్థంకాలేదు. "అంటే?" అన్నాను జూలో జంతువుని చూసినట్టు చూసి. "మందంటే.........అదే సార్.... అదే" అన్నాడు.

    అర్థమయింది.

    "వద్దు" అన్నాను. వాడు వెళ్ళిపోయేడు.

    అలసటగా వుండి కళ్ళు మూసుకొన్నాను. ఎంతసేపు గడిచిందో తెలీదు బయట తలుపుమీద ఎవరో తట్టినట్టయింది.

    "ఎవరు?" అన్నాను.

    కొంచెంసేపు నిశ్శబ్దం. మళ్ళీ చప్పుడు.

    "ఎవరంటే మాట్లాడరేం?" అంటూ ఒక్క అంగలో విసురుగా వెళ్ళి గడియతీసి షాక్ తగిలినట్టు అడుగు వెనక్కి వేసేను.

    నా ముందు ఓ ఇరవై రెండేళ్ళ అమ్మాయి నిలబడి వుంది. తెల్ల చీరె, గుండ్రటి మొహం పెద్ద పెద్ద కళ్ళూ, చిన్న నోరూ,చీరె రంగుతో పోటీ చేస్తున్నట్టు శరీరం..... తలుపు తీయగానే మల్లెపూల పరిమళం నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టింది. పరాయి స్త్రీని అంత దగ్గరిగా చూడదం అదే  మొదటిసారి.

    "నన్ను లోపలికి రానియ్యారా ఏమిటి?" అంది నవ్వుతూ. అప్రయత్నంగానే పక్కకి తొలిగేను. ఆమె చప్పున లోపలికి వచ్చి తలుపు గడియవేసింది.

    "ఏ....ఏమిటిది?" అన్నాను తడబాటుతో. నా గొంతులో తడారిపోయింది.

    నేను గుమ్మం దగ్గిర నుంచి కదలకపోవటం చూసి, టేబిల్ ప్రక్కనున్న కుర్చీలో కూర్చుంటూ "ఏమిటంటే ఏం చెప్పను? ఇలా వచ్చి మీరే చెప్పాలి-" అంది.  

    స్త్రీ గురించి నాకు తెలుసు. కానీ నాకు  తెలిసిన స్త్రీ వేరు. అదీగాక లాడ్జిలో ఇలా రూము తీసుకుంటే రాత్రవగానే ఒక అమ్మాయిని వాళ్ళంతట వాళ్ళే పంపుతారో లేక దీనికి సెపరేట్ గా చార్జి చేస్తారో నాకు సరీగ్గా తెలియదు. ఇలా పంపినందుకు రేపు లాడ్జీవాళ్ళు ఇంకో వంద యిమ్మంటే నా పని చాలా కష్టం అవుతుంది. సోషల్ బిహేవియర్ లో ఠాకూర్ ఇలాటి  సమస్యల గురించి చెప్పనందుకు తిట్టుకొన్నాను.

    ఇంతలో ఆమె లేచి నా దగ్గరగా వచ్చింది. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ భుజంమీద వేసుకోండి. ఆమె ఊపిరి వెచ్చగా నా చెంపలకు తగిలింది. ఆమె వక్షోజాలు మెత్తగా నా చేతికి నొక్కుకున్నాయి-

    అడుగు వెనక్కి వేసి నెమ్మదిగా "నా దగ్గిర డబ్బులేదు" చెప్పాను.

    ఆమె మొహం వాడిపోయింది. "అసల్లేవా?" అంది హీనమైన కంఠంతో.  సిగ్గుతో తల వంచుకున్నాను.

    "ఇరవయ్యో ముప్పయో అంతే" అన్నాను.

    ఆమె చప్పున నా చేతిని పట్టుకొని "చాలు" అంది. ఆ మొహంలో తళుక్కున మెరిసిన మెరుపుకి విచలితుణ్నయ్యేను. అదేకంగా ఆమెవైపు చూస్తూ వుండటం గమనించింది. "ఏమిటి అలా వుండిపోయారు?" అంది మెడచుట్టూ చేతులు వేస్తూ.

    "అంత అద్భుతమైన సౌందర్యానికి ఖరీదు ఇరవై రూపాయలా" అన్నాను. నాలో నేనే అనుకొంటున్నట్టు. నా కళ్ళలోకి సూటిగా చూసి, 'కొత్తా' అంది. తలెత్తి చూడటం వల్ల ఆమె కళ్ళు మరింత విశాలంగా కనబడుతున్నాయి. కంటికి క్రిందుగా దిద్దిన కాటుకరేఖ లోయల మధ్య వయ్యారంగా వంపు తిరిగిన సెలయేరులా వుంది. తలూపేను. ఆమె పెదవులు బిగించి నవ్వింది. ఆ నవ్వునాలో పురుషత్వాన్ని రెచ్చగొట్టింది. నడుము చుట్టూ చేతులువేసి బలంగా దగ్గిరకు లాక్కొన్నాను. నడుము క్రిందనుంచి విల్లులా వింగిన శరీరంతో అదిమిపెట్టి గాలి కూడా చొరవనంతగా అల్లుకుపోయింది. తలవంచి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. మునికాళ్ళ మీద ఆమె కొద్దిగా పైకిలేచి, పై పెదవిని మునిపళ్ళ మధ్య పట్టుకొని కొరికి, సుతారంగా నాలుకతో రాసి నావ్వి "ఎలా వుంది?" అంది.

    అంతే చటుక్కున ఆమెని  వదిలేశాను. పార్వతి జ్ఞాపకానికి వచ్చింది. ఇలాగే  ఇలాగే, ఇలాగే.

    నేను అకస్మాత్తుగా విర్లిప్తం అవటం చూసి "ఏమైంది?" అంది. వడివడిగా పెట్టె దగ్గరకు వెళ్ళి అందులోంచి ఇరవైరూపాయలు తీసి ఇస్తూ "వెళ్ళిపో" అన్నాను.

    ఆమె తీసుకోలేదు. అర్థం కానట్టు నా వైపు చూసి "అప్పుడేనా?" అంది.

    "ఇంకేవీ అడక్కు ప్లీజ్-!" అన్నాను అభ్యర్థిస్తున్నట్టు. ఆమె వెళ్ళి కుర్చీలో కూర్చుంది. నా వేపు చూసి నవ్వుతూ- "ఇంతేనా?" అంది. రోషంగా తలెత్తి "ఏమిటి నీ ఉద్దేశ్యం?" అడిగాను.

    కవ్విస్తున్నట్టు "ఇంతదానికే ఇరవై రూపాయలా" అంది. విసురుగా పక్కమీద నుంచి లేచి ఆమె రెక్క గుచ్చిపట్టుకుని బలంగా లేవదీసి "వెళ్ళు" అన్నాను. తూలి పడబోయి ఆగి నా వైపు చూస్తూ మొండిగా "వెళ్ళను" అంది.

    "అయితే వెళ్ళకు. రాత్రంతా ఇక్కడే వుండు" అన్నాను మొహం చిట్లించి. ఆ చనువుతో ఆమెకి ధైర్యం వచ్చినట్టుంది.

    "అసలేమయింది మీకు?" అంది.

    నా ప్రవర్తనకి నాకే సిగ్గేసి "ఏమీ అవలేదు. ఏవో జ్ఞాపకాలు అంతే, వెళ్ళిపో ప్లీజ్' అన్నాను.

    "మీ జ్ఞాపకాలు మీ దగ్గరకు రాకుండా చేస్తాను, సరేనా" అంటూ నా దగ్గరగా వచ్చింది. "ఈ సారి అంత తొందరగా చప్పబడి పోనివ్వను లెండి-"

    ఛేళ్ళున  చరిచినట్టయింది, "ఏమిటి నీ ఉద్దేశ్యం?" అన్నాను తలెత్తి.

    కనపడీ కనబడనట్టు కన్నుకొట్టి, "అర్థంకాలేదా?" అంది.

    "నువ్వు నా గురించి  ఏమనుకుంటున్నావో తెలీదు! కాని నువ్వనుకొనేటంత నిగ్రహం లేనివాణ్ని కాదు-"

    "హొయ్....హొయ్...." అంది తలెగరేస్తూ. చూపుల్తో కాల్చేద్దామన్నంత కోపాన్ని నా కళ్ళల్లో గమనించి, తనకేవీఁ లెక్కలేనట్టు నవ్వి "పందెమా!" అంది.

    "ఏమిటి?" అన్నాను.

    "నేను మీ దగ్గరికి రాకుండానే మీ నిగ్రహాన్ని పొగొట్టగలను."

    నా ముందున్న ఈ అమ్మాయి ఊరికే డబ్బు తీసుకోవటం ఇష్టం లేక నన్ను కవ్వించటానికి పూనుకొందని అర్థమైంది. ఆ సిన్సియారిటీ అర్థం కాగానే ఆమె మీద జాలి, అభిమానమూ కలిగాయి. కానీ వాటిని కప్పిపుచ్చుకుంటూ "సరే. ప్రయత్నించు చూద్దాం" అన్నాను.

    "అలా అంటే కాదు. పందెం ఏమిటో చెప్పాలి."

    "నేను ఓడిపోతే నా దగ్గర వున్నదంతా నీ కిచ్చేస్తాను - మరి నువ్వోడిపోతే?"

    "నేను ఓడిపోవటం అన్న ప్రసక్తే లేదు." గర్వం తొణికిసలాడింది ఆమె కంఠంలో-

    నీళ్ళలో మునిగి పది నిముషాలు వుండటం సాధన చేసినవాణ్ని - ఒక్కసారి ఇంద్రియాల్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటే ఈమే కాదు - రంభ వచ్చినా ఈ నిగ్రహం చెడదు - అని నాకు తెలుసు.

    "ఏం రెడీయా?' అంది.

    "నేను రెడీయే-"

    "ఏ మాత్రం మీలో కదలిక కనిపించినా ఓడిపోయినట్టే సుమా-"

    "ఓ.కే." అంటూ కుర్చీలో వెనక్కివాలేను - ఆమె నా వైపు చూసి సన్నగా నవ్వి అటువేపు తిరిగింది - ఆ తిరగటంలో భుజంమీద నుంచి పైట నేల మీదకు జారింది. భుజాల క్రిందుగా నడుము సన్ననై ఎక్కుపెట్టిన విల్లులా వుంది. తెల్లటి జాకెట్టు, చీరలమధ్య శరీరం మరింత తెల్లగా ప్రతిబింబిస్తోంది. ప్రకృతి ఘనీభవించి ఆ గది మధ్య ఆకృతి  దాల్చుకొన్నట్టుంది. యౌవనం ఆమె శరీరంలో చాలా  అందంగా  యిమిడిపోయింది. యుగయుగాలుగా సముద్రపు అంచున నిలబడి, అలల  తాకిడికి సున్నితత్వాన్ని ఆపాదించుకున్న శిలల మనువును ఆమె వీపు సంతరించుకుంది. జాకెట్ వెనుక హుక్ తియ్యటానికి రెండు చేతులూ  వెనక్కి చేర్చింది. ఓ కాంతి కిరణం చేతుల మధ్య సందుచేసుకొని రహస్యాల్ని శోధించటానికి ప్రయత్నం  చేస్తుంది. జడలోంచి మల్లెపూవు ఒకటి జారి నేలమీద పడింది- హుక్స్ లో చిక్కుకొన్న వెంట్రుకాని మెడనుంచి తొలగించింది- గుర్తు తెలియని చిత్రకారుడు గీసిన  బొమ్మలా వుందామె. వంకర గీతల్లో అందం బ్రహ్మకి బాగా  తెలుసులా వుంది. కొండల మధ్య కిన్నెర సానిలా జడకదులుతోంది- జాకెట్ దూరంగా పడింది. ప్రకృతి తలంటు పోసుకున్నట్టుంది. వేల వేల సంవత్సరా చీకటి గుహల బంధిఖానాలోంచి ఒక్కసారి సూర్యుణ్ని చూడడానికి వచ్చిన సుకుమారత్వం ఆ భుజాల్లోల  ప్రతిబింబింది. తల పక్కకి  తిప్పి నావైపు చూసింది. ఆ చూపులు మమ్మేలియన్ గ్లాండ్స్......అద్భుతమైన సౌందర్యానికి నిజాన్ని  ఆపాదిస్తే అంతే-

    అత్యంత నేర్పుతో ఆమె కుచ్చిళ్ళు తప్పించటం గమనించేను. పొరలు పొరలుగా చీరే ఆమె చుట్టూ వలయంలా పడుతోంది. పాము కుబుసం  కదుల్తున్నట్టుంది. సౌందర్యం కోసం సామ్రాజ్యాలు కోల్పోయిన గ్రీకు రాజులా  ఆమె ముందు  పడి వుంది చీరె. ఇప్ సీనో - హెన్రీ మూనో చెక్కిన శిల్పంలా వున్న ఆమె శరీరం మీద దీపపు కాంతి విశ్లేషణం చెందుతోంది.

    "తిరగనా?" అట్నుంచి వినిపించింది.

    మాట్లాడలేదు నేను. జడలో చిక్కుపడిన మల్లెదండమీంచి వెన్నెముక మీదుగా నునుపైన కాళ్ళమీదకు జారింది నా చూపు. నెమ్మదిగా నావేపు తిరిగింది. ఆమె కాలి బొటనవేలి ఎర్రరంగు తక్కువయింది. చూపు పాదాలమీద నుంచి పైకి పాకి - అందాన్ని దాచుకొన్న చేతుల క్రాస్ ను దాటి - పల్చటి కడుపు మీదుగా పయనించి .....ప.....య....నిం....చి.

    ఎత్తయిన పర్వతాల మధ్యనుంచి లోయలోకి పడ్డ హిమశిఖరం, వేయి ప్రక్కలై - పఠేలున పగిలి - ఆకాశం కృంగి....ఏదో ఆక్రందించిన గుండెల్లోంచి బయటికి రాలేక - గుండెల్లో ఆగలేక, ప్రవాహంలో కొట్టుకుపోతున్న అనుభూతి!

    విధిని వెక్కిరిస్తున్నట్టూ....

    పార్వతికి నేనిచ్చిన లాకెట్, ఆమె రొమ్ముల మధ్య అటూ ఇటూ వూగుతోంది. పిడికిళ్ళు బిగించి ఒక్క అంగలో ఆమెను చేరుకొని లాకెట్ ని గట్టిగా  పట్టుకొని లాగుతూ "ఎక్కడిది ఎక్కడిదిది చెప్పు" అరిచేను. ఆమె బిత్తరపోయింది. భూజాల్లోకి గోళ్ళు దిగిపోతాయా అన్నంతగా  గుచ్చి పట్టుకుని ఊపేస్తూ, "జవాబు వెంటనే కావాలి నాకు. చెప్పు" కీచుగా అరిచేను. నా కంఠం నాకే వికృతంగా వినబడింది. ఆమె నుంచి సమాధానం రాలేదు. వెనుకనున్న అద్దంలో నా ప్రతిబింబం చూసుకొని ఉలిక్కిపడ్డాను. కళ్లు ఎర్రటి గోళాల్లా వున్నాయి. మొహం ఆవేశంతో ఉబ్బింది.

    ఒకటి - రెండు - మూడు- నాలుగు- లెక్క పెట్టసాగేను.

    షాక్  తగిలినట్టు అచేతనంగా నిలబడిపోయి ఆమె కళ్ళప్పగించి నా వైపే చూస్తుంది. ఏ క్షణంలోనైనా స్పృహ తప్పి పడిపోయేలా వుంది. నేను వెంటనే సర్దుకోవటం చాలా మంచిదయింది.

    ఇరవై అయిదు లెక్కపెడుతూ వుండగా వాతావరణం ప్రశాంతమయినట్లు తోచింది. ఆమె వైపు చూసి స్నేహపూర్వకంగా నవ్వేను.

    "బట్టలు కట్టేసుకో - ఓడిపోయేను" అంటూ ముప్ఫయ్ అందించేను. నావైపు అనుమానంగా చూస్తూ అందుకొంది. ఆమె బట్టలు కట్టుకునేవరకూ మౌనంగా ఉండిపోయేను. అ మాత్రం సమయం ఇవ్వడం చాలా అవసరం.

    ఆమె వెళ్ళబోతూ వుంటే "నన్ను క్షమించు, పిచ్చిగా ప్రవర్తించేను" అన్నాను.

    "పర్లేదులెండి" అంది.

    దగ్గరగా వెళ్ళి "నీ అందాన్ని చూస్తే మతిపోయింది. నిజంగా అద్భుతమైన అందం నీది" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS