Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 12

    బకెట్ తో నీళ్ళు తెచ్చి గది శుభ్రం చెయ్యసాగింది. ఓపిగ్గా కడుగుతూ తెలెత్తి చూసింది. ఆ యువకుడు తన వంక చూడటం గమనించి ఉలిక్కిపడింది.
    "నీ పేరేమిటి?"
    "అర్చన."
    "నిన్ను ఇబ్బంది పెట్టాను కదూ..." అన్నాడతను.
    అర్చన సమాధానం చెప్పకుండా గదిని శుభ్రం చెయ్యడం ముగించి బకెట్ తీసుకెళ్ళి బాత్ రూమ్ లో పెట్టి చేతులు కడుక్కుని వచ్చింది.
    "ఇలా వచ్చి కూర్చో..." చెప్పాడతను.
    "అన్నం తిన్నారా?" అడిగింది అర్చన.
    ఆమె మొహం వంక కొన్ని క్షణాలపాటు చూసి చెప్పాడు.
    "లేదు."
    "అన్నం తింటారా?"
    "తినను..."
    "రెండు ముద్దలు తినండి..." చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా ప్లేటు తీసుకొచ్చింది. ప్లేటులో సగానికి అన్నం, రెండు కూరలు ఉన్నాయి. చౌకరకం హోటల్ నుంచి తెచ్చినట్టు కనిపిస్తున్నాయి పదార్ధాలు.
    అతను ఇబ్బందిగా కదిలాడు.
    "అన్నం తిననంటారేమిటి? మా భోజనం తినకూడదా?
    "కాదు."
    "మరి! దేశంలో ఎంతోమంది తిండిలేక మాడిపోతున్నారు మీకు తెలుసా?" ఎంతో కష్టపడి ఆ విషయాన్ని కనుక్కున్నట్టు అడిగింది.
    అతని పెదాలపైన చిరునవ్వు కదలాడింది ఏదో ఆలోచన వచ్చినట్టు.
    "అనం తింటాను.....అయితే నువ్వోపని చెయ్యాలి." అన్నాడు.
    "చేస్తాను."
    "మాట వెనక్కి తీసుకోకూడదు."
    "అలానే."
    ఏం చెయ్యాలో అతను చెప్పాడు.
    ఆమె నిటారుగా నిలుచుంది. అతను అలా అడుగుతాడని ఆమె ఊహించలేదు. అతని పెదాలపై కదులుతున్న చిరునవ్వు గమనించింది. అంతవరకూ సాధారణ విషయంలా పరిగణించిన ఆమెలో పట్టుదల పెరిగింది. చకచకా బట్టలు విప్పేసి అతని ముందు నగ్నంగా నిలబడింది.
    అతను విస్తుపోయి లేచి కూర్చున్నాడు. ఆమెను ఏడిపించడానికి బట్టలు విప్పేసి నిలబడమని అన్నాడు. నిజంగానే ఆమె బట్టలు విప్పేసరికి అంతవరకూ అతన్ని క్రమ్మేసిన చీకటి క్రమంగా విచ్చుకోసాగింది.
    తన వ్యక్తిగత విషయాలు ఆ రాత్రి ఆమెకు చెప్పాడు.
                                                           *    *    *    *    
    రాజమ్మ కంపెనీ ముందు రెండు రిక్షాలు ఆగాయి. ఒక దానిలో అర్చన, సత్యవతి కూర్చున్నారు. మరో రిక్షాలో లక్ష్మి, బ్రోకరు కూర్చున్నారు. రిక్షాలు బయలుదేరాయి.
    అర్చన మొదటిసారి బయటకొచ్చింది. ఆమె కళ్ళకి పరిసరాలు అందంగా కనిపించాయి. ముందు రోజు అర్చన అడగటం వల్ల సినిమా కెళ్ళటానికి అంగీకరించింది రాజమ్మ అవినాష్ బలవంతం వల్ల రాజమ్మని అడిగింది అర్చన. అతను చాలాసార్లు అర్చనకోసం వచ్చాడు. వచ్చినప్పుడల్లా అక్కడ నుంచి బయటపడటం గురించి చెప్పేవాడు. ఆమెకు ధైర్యం చాలకపోవడం వల్ల అన్ని రోజులు పట్టింది.
    రెండు రిక్షాలు సినిమా హాలు చేరుకున్నాయి. నలుగురూ లోపలకు నడిచారు. బ్రోకర్ టిక్కెట్లు తేవడానికి బుకింగ్ దగ్గరకు వెళ్ళాడు. తను చదువుకునే రోజుల్లో ఆ థియేటర్ కి ఎన్నిసార్లు వచ్చిందో సత్యవతితో చెప్పసాగింది లక్ష్మ
 వాళ్ళ సంభాషణ గురించి పట్టించుకోకుండా నిలబడింది అర్చన. ఆమె గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. తనతో వచ్చిన వాళ్ళని గమనిస్తోంది. బ్రోకర్ క్యూలో నిలుచున్నాడు. అతని ముందు పదిమంది ఉన్నారు. సత్యవతి, లక్ష్మి మాటల్లో పడి తనని గమనించక పోవడంతో గబగబా నడిచి గేటు దగ్గరకు వచ్చింది. అక్కడా నుంచి వెనక్కి చూసింది. అప్పుడే సత్యవతి తనని చూడటం గమనించి, ఏ మాత్రం తొట్రుపడకుండా అటుగా వెళుతున్న ఓ యువకుడ్ని పలకరించింది.
    "మీరు రమేష్ కదూ?"
    "కాదు, ణా పేరు వెంకటేష్..." చెప్పాడతను.
    అతనికి ఇరవై ఉంటోంది వయసు. ఆమె తనని పలకరించడంతో ఆశ్చర్యం కలిగింది.
    "మీరు నన్నెప్పుడయినా చూశారా?" అడిగింది.
    అతను సమాధానం దాటవేసి అడిగాడు.
    "సినిమాకొచ్చారా?"
    "అవును." చెప్పి సత్యవతివైపు వారగా చూసింది.
    ముందు అనుమానించిన సత్యవతి ఆమె ఒక యువకుడ్ని పలకరించడం చూసి చిన్నగా నవ్వుకుంది. వాళ్ళు మాట్లాడుకోవడాన్ని లక్ష్మికి చూపించింది.
    "టిక్కెట్ తీసుకోనా?" అడిగాడా యువకుడు. అప్పటికే అతని మొహంలో ఉత్సాహం చోటు చేసుకుంది.
    "మీరు కూడా సినిమాకేనా?" తెచ్చి పెట్టుకున్న ఆసక్తితో అడిగింది.
    "అవును."
    "నిజం చెప్పండి, మీ పేరు రమేష్ కదూ?" తిరిగి అడిగింది.
    గేట్ కి జారబడి థియేటర్ వైపు తిరిగి మాట్లాడుతోంది అర్చన. అలా చెయ్యడం వాళ్ళ అతనితో మరికొంతసేపు మాట్లాడుతుందని, అతను ఆమెకు బాగా తెలిసినవాడని చూసేవాళ్ళకి అనిపిస్తుంది. సరిగ్గా ఆమె ఊహించినట్టుగానే భావించారు సత్యవతి, లక్ష్మిలు. తిరిగి తమ సంభాషణలో మునిగిపోయారు. అప్పటికి బ్రోకరు ముందు ఇద్దరే ఉన్నారు క్యూలో.
    "నా పేరు రమేష్ కాదు, వెంకటేష్! మీకు కూడా టిక్కెట్ తీసుకోనా?" అడిగాడు.
    అందమైన అమ్మాయితో కలిసి సినిమా చూసే ఆవకాశం వచ్చినందుకు అతని మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఆమెను తీసుకుని థియేటర్ లోకి వెళ్ళిపోవాలని మనసులో ఉంది. సినిమా హాలులోకి వెళ్ళిన తరువాత ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాడు.
    "డబ్బులు ఇవ్వనా?" అడిగింది అర్చన.
    బుకింగ్ నుండి టిక్కెట్ తీసుకుని బయటకొచ్చాడు చివరి వ్యక్తి. బ్రోకర్ కౌంటర్ లో చెయ్యి పెట్టాడు.
    "భలే వారే..." అంటూ ఓ నవ్వు అర్చన మీదకు విసిరి బుకింగ్ వైపు గబగబా నడిచాడు.
    అర్చన ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా గేటు దాటి పదడుగులు నడిచి ప్రక్క సందులోకి తిరిగింది. ఆమె రావడం చూసి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు అవినాష్. అర్చన కూర్చోవడం మోటార్ సైకిల్ బయలుదేరడం క్షణాల్లో జరిగింది.
                                                                *    *    *    *    
    ఇసుక తోట దగ్గర తను అద్దెకు తీసుకున్న బిల్డింగ్ లో ఒకరోజు పార్టీ ఏర్పాటు చేశాడు అవినాష్.
    ఆ పార్టీకి ముగ్గురే అతిధులు వచ్చారు. పార్టీ మొదలు కావడానికి ముందు తన స్నేహితులైన అతిధులకు అర్చనని పరిచయం చేశాడు. ఆమెను తను పెళ్ళి చేసుకున్న విషయం చెప్పాడతను.
    ఇద్దర్నీ వాళ్ళు అభినందించారు.
                                         5
    రోజులు తొందరగా గడవసాగేయి.
    అవినాష్ ది చంటి పిల్లవాడి మనస్తత్వం. తను అనుకున్నది చేసే వరకూ నిద్రపోడు. కలిసి జీవించడం ప్రారంభించిన తరువాత అతని గురించి మరింత వివరంగా తెలుసుకుంది అర్చన. భార్య చేసిన ద్రోహం ప్రత్యక్షంగా చూసిన తరువాత కూడా అతను నిగ్రహించుకుని వెనక్కి రావడం చిన్న విషయం కాదు.
    అతని మనసుకు తగిలిన గాయం అతనిలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. శిల్ప పట్ల పేరుకున్న కసి వల్ల దాని నుండి బయట పడటానికి త్రాగుడు నేర్చుకున్నాడు. ఆ సంఘటన తరువాత అతను శిల్పనెప్పుడూ చూడలేదు. ఆమె సామాన్లు మొత్తం ఓ లారీలో వేసి మామగారి ఇంటికి పంపించాడు. ప్రియునితో కలిసి ఉండగా భర్త చూడటం వల్ల శిల్ప మానసికంగా దెబ్బతింది. అక్రమ సంబంధం ఉందని అనుమానించే భర్తతో వాదించడానికి అవకాశముంది. కాని ప్రియునితో కామకేళిలో తేలుతూ భర్త కంట్లో పడితే వాదనకి అవకాశమే ఉండదు. అసలు భర్త ముందు నిలబడటానికే ధైర్యం సరిపోదు. ఇవన్నీ ఆలోచించి శిల్పపై చదువులకు విదేశాల కెళ్ళిపోయింది.
    నాలుగు నెలలు అవినాష్ తో కలిసి జీవించిన తరువాత అర్చన తేరుకుంది. ఎప్పుడైనా తన చీకటి జీవితం గుర్తొచ్చినా దానిని మనసు నుండి ప్రక్కకు నేట్టేసేది.  ఇప్పుడామెకు జీవితం పైన ఆశలు చిగురించాయి. అవినాష్ లాంటి మనిషి దొరకడం అదృష్టమనుకుంది.
    ఒక రోజు డ్యూటీకి వెళ్ళిన అవినాష్ కొద్ది సేపటికి తిరిగొచ్చాడు. అతని మొహంలో దిగులు చోటు చేసుకుని ఉండడం గమనించింది అర్చన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS