అదే , ఆడపిల్లను కన్న సగటు కుటుంబంలోని ఆడపిల్ల తండ్రి బలహీనత.
ఆ బలహీనతే వరునిలోని దుర్గుణాలను గమనించదు....
పెళ్ళి కొడుకు ఘోర ఆకలిని విస్మరిస్తుంది....
అతని గొంతెమ్మ కోరికలను చచ్చినట్టు భరిస్తుంది.
పెళ్ళి అయితే చాలుననీ, తాను గడపదాటి, వాళ్ళ గడప ఎక్కితే చాలుననే ఆరాటంతో ఆడపిల్ల ఆరాటాన్ని తాత్కాలికంగా మరచిపోతారు.
అలాంటి ఒక ఆడపిల్ల వ్యధకు ప్రతిరూపమే ఈ సుశీల కూడా....
గది నాలుగు గోడల మధ్య తను ఇంతకాలం అనుభవించిన నరకయాతన నంతా ఏకరువు పెట్టసాగింది సుశీల. కేవలం అందాన్ని చిందించే వక్షద్వయం అని మాత్రమే కాదు, దొండపండు పెదవుల నుంచి ఆధారాలను సయితం వికృతంగా మాడ్చి వేశాడతను. తొడలపై నీలిమచ్చలు.....ఒక్కటేమిటి? శరీరంలో ఏ చోటు అతనికి అభ్యంతరంగా కనిపించలేదనేది సరిగ్గా సరిపోతుందేమో?
ఆమె చెప్పడం పూర్తీ కాగానే మగవానిలో శాడిజం అంత ఘోరంగా వుంటుందా అనే అనుమానం ధీరజకు అప్పుడు తొలిసారిగా కలిగింది.
ఒకవేళ పిల్లలు లేరు కాబట్టి ఆ అక్కసును అలా చూపిస్తున్నాడనుకోవడానికి అయినా శోభనం రోజు నుంచే తనదయిన బాణీలో ప్రవర్తిస్తున్నాడనే చెబుతున్నది సుశీల. అంటే అతని తత్వం అంతేనా? ఎందుకలా శాడిస్టుగా మారిపోయాడో?
"మేడమ్ ....కేవలం పడకగదిలో తప్ప మిగిలిన సమయాలలో చాలా బాగుంటాడు. నేనంటే చాలా ప్ర్రేమను కురిపిస్తాడు! అసలు రాత్రి జరిగిన విషయమే పగటిపూట యెత్తడు. దాంతో నేనూ యాంత్రికంగా అతనికి శరీరాన్ని అప్పగించడానికి అలవాటు పడిపోయాను. రాత్రి వచ్చిందంటే భయం. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఏదురు చూస్తుంటాను.
"ఆయనకు కోపం కలిగించే పనులుకానీ, అయిష్టం కలిగించేలా కానీ ప్రవర్తించను. అయన ఇంటికి రానిదే, వచ్చి భోజనం చేసి వెళ్ళనిదే నేను అన్నం కూడా తినను. ఆయనకు పెట్టిన తరువాతనే నేను తింటాను. కనీసం అది కూడా గుర్తించడు అయన. తను మాత్రం తిని చేయి కడుక్కుని వెళ్ళిపోతాడు తప్ప నువ్వు తిన్నావా అని కనీసం మాట వరుసకయినా అడగడు. అదేమ ఖర్మమో నాకంతు బట్టడం లేదు." బాధగా చెప్పింది సుశీల.
"చూడు సుశీల ---నువ్వు చెప్పింది వింటుంటే నా గుండె తరుక్కుపోతుంది. అలాంటి వాడిని మనిషిగా పిలవకూడదు. మృగం అంటేనే బాగుటుంది. నిన్ను అంత హింసించినా ఇంకా కట్టుకున్న భర్తగానే గౌరవిస్తున్నా వంటే నాకు నీ పట్ల -----అసలు ఈ జాతి పట్ల జాలి కలుగుతోంది.
"ఏం చేయమంటావు మేడమ్ . నేనూ అందరిలాంటి ఆడపిల్లనే కదా భర్త తోటిదే లోకం అనుకునే ఈ సమాజంలో ఎడురీదలేను కదా. అందుకే నా అత్మభిమాన్ని చంపుకుని అతని రాక్షసత్వానికి బలిపశువుగా మిగిలిపోయాను!" ఆమె కంఠం బొంగురు పోవడంతో తరువాత మాటలు పెగలలేదు.
ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య వివాహ బంధాన్ని ముడిపెట్టే మూడు ముళ్ళు వాస్తవానికి ఎంతో ప్రాశస్తాన్ని సంతరించుకున్న వైదిక సంప్రదాయం.
కానీ నేడు అది అపహస్యమై పోయింది.
జీవిత భాగస్వామినిగా వచ్చిన పార్టనర్ ను సహృదయంతో అదిరించ వలసినది పోయి , కళ్ళు కానని కామంతోనో, విచ్చలి విడి శృంగార కార్యకలపాలతోనో వివాహ వ్యవస్థ కే సవాల్ గా నిలిచినా రాక్షస ప్రవృత్తి కలిగిన మగవాళ్ళ పైశాచిక ఆనందానికి పరాకాష్ట ఎప్పటికో!
భార్య భర్త లిరువురూ కలిసి పరస్పర అవగాహనతో జీవనం సాగింఛినప్పుడు వున్న సంతోషం, అనందం చెప్పనలవి కాదు. మనసెరిగి మసలు కున్నప్పుడు సుహృద్భావ వాతావరణంలో ప్రేమాభిమానాలు వెల్లి విరుస్తాయి. అపోహలను పెంచుకుని, ద్వేషంతో వ్యవహరిస్తే అడుగడుగునా అపశ్రుతులే ఎదురవుతాయి.
ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, ఒకరినొకరు నిందించుకుంటూ, విమర్శించుకుంటూ ఆవేశాలతో పరస్పర అవగాహన లేని విధంగా ప్రవర్తించినప్పుడే జీవితంలో అశాంతి బయలుదేరుతుంది. అరమరికలు లేకుండా, ఆప్యాయతతో మనసు విప్పి మాట్లాడుకుంటే భార్య భర్తల హృదయాలు చేరువయ్యే అవకాశం వుంటుంది. ఒకరి హృదయం మరొకరి సన్నిహితాన్ని పొందినప్పుడు జీవితంలో ఏర్పడిన అపోహలు వాటంతటవే తొలగిపోతాయి.
కానీ, ఇలా ఒకరినొకరు అర్ధం చేసుకుని జీవనాన్ని సాగిస్తున్న లోఫ్ పార్టనర్స్ అందరికీ లభిస్తున్నరను కోవడం అవివేకమే అవుతుంది.
అందుకు నిదర్శనం ఎదురుగా వున్న సుశీల జీవితమే.
సుశీల జీవితాన్ని చక్కబరచడం తన చేతిలో వున్నది అనుకునే కంటే ఆమె అదృష్టం ఎలా వుంటే అలా జరుగుతుందనుకోవడం మంచిదేమో!
"మేడమ్-----"
ఆమె పిలుపుతో ధీరజ తన ఆలోచనల నుంచి బయటపడింది.
ఏమిటన్నట్లు సుశీల వేపు చూసింది.
"మేడమ్ , తమ కాంట్రాక్ట్ చేస్తున్నారు . అందుచేత రైల్వే ఎంప్లాయిస్ దృష్టిలో వారి పరువు పోకుండా వుండేలా అతనిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయండి. అంతేతప్ప నేను వచ్చి మీకు కంప్లయింట్ చేసినట్టు అసలే తెలియకూడదు. తెలిసిందంటే నా బ్రతుకు మరింత నరకం అవుతుంది. సాటి ఆడదానిగా నా సమస్య అర్ధం చేసుకుంటారనే వుద్దేశ్యంతో ఇంతవరకూ ఎవరికీ చెప్పుకొని నా వ్యధనంతా మీ ముందు వెళ్ళగాక్కను" ప్లీజ్ మేడమ్ .....నేను చెప్పిందంతా మీ మనసులోనే వుంచుకోండి. సాధ్యమయినంత వరకూ నాకు న్యాయం జరిగేలా చూడండి. అయినా మీ ప్రయత్నం ఫలించలేదను కోండి. నా నుదుటి రాత అంతేనని సరిపెట్టుకుంటాను" గుడ్ల నీరు గ్రక్కుకుంటూ వాపోయింది సుశీల.
"చ.....ఛ! బాధపడకు సుశీల..... నీకు తప్పనిసరిగా మంచిరోజులు వస్తాయి. నా పరిధిలో నేను న్యాయం చేయడానికే ప్రయత్నిస్తాను. ఒక ఉద్యోగిగా కాకపోయినా సాటి మహిళ గా నయినా నా సానుభూతి వుంటుంది. కనీసం ఆ భావనతో నయినా మీ ఆయనలో మార్పు తేవడానికి ట్రై చేస్తాను" హామీ ఇచ్చింది ధీరజ.
కళ్ళు తుడుచుకుంటూ బ్లౌజ్ బటన్స్ పెట్టుకుని , భుజం మీదుగా చీర కప్పుకుని వెళ్ళిపోయింది సుశీల.
ఆమె వెళ్ళిన చాలాసేపటి వరకూ ఇన్ స్పెక్టర్ ధీరజ మాములు మనిషి కాలేకపోయింది.
* * *
వైజాగ్ సిటీ పోష్ లోకాలిటీ.....
ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త బంగ్లాలో....
ఫోన్ రింగ్ అయింది....
ఆఫీస్ కు బయలుదేరబోతున్న సమయలో ఫోన్ మోగడంతో రిసీవర్ తీశాడు అతను.
ఎప్పుడు వినని గొంతు వినిపించింది.
"గీతా.....నీకే ఫోన్...." అంటూ భార్యను పిలిచాడు.
వచ్చి, రిసీవర్ అందుకుందామె.
"హల్లో నైట్ క్వీన్ గారూ.....రాత్రి ఎలా గడిచిపోయింది....పూర్తిగా ఎంజాయ్ చేశారా లేదా? అవునూ ....ఇందాక ఫోన్ చేసింది ఎవరూ....మీ ఆయనేగా.... వెరీగుడ్....అటు ప్రియుడు.....ఇటు మొగుడు.....అబ్బ నీ సుఖమే సుఖం కదూ.....ఏమంటావు డియర్....."
ఇంకా ఏదో వినిపిస్తూనే వున్నది.
ఆమెకు ఊహించని షాక్....
టక్కున ఫోన్ పెట్టేసింది....
కన్నులు తడబడుతున్నాయి.....పెదవులు అదురుతున్నాయి ..... శరీరం వణుకుతుంది.
"ఎవరోయ్ అది...."
భర్త యధాలాపంగా ప్రశ్నించాడు.
'అదా......అది.....రాంగ్ నంబర్...."
"అదేంటి అంత ఖచ్చితంగా నీపేరు అడిగితేనూ...."
"వాళ్ళకు కావలసిన గీతాదేవిని నేను కాదు....ఎవరికో చేయవలసింది మనకు చేశారు' తడబాటును కప్పిపుచ్చుకుంటూ ఎలాగో సర్ది చెప్పిందామె.
"సరేలే.... జాగ్రత్తగా తలుపులు వేసుకో"
వెళుతూ వెళుతూ ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచెత్తి బయటకు వెళ్ళిపోయాడు ఆమె భర్త.
అదే ఇంకొక సందర్భంలో అయితే ఆ ముద్దుల రుచిని అనుభవించి వుండేది.....దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్న భర్తను ఒకపట్టాన వదిలి వుండేది కాదు..."
ఇప్పుడు ఆమె మనసిక స్థితి అలాలేదు.
ముక్కూ మొహం తెలియని ఎవరో వ్యక్తీ గడచిపోయిన రాత్రి గురించి ప్రశ్నిస్తూన్నాడూ అంటే తన రహస్యం మూడవ కంటికి తెలిసి పోయింది అన్నమాట. ఈ విషయం తన ప్రియునికి తప్ప ఇంతవరకూ మరొక వ్యక్తికీ తెలియదు.....
కానీ ఇప్పుడు....
మరలా ఫోన్ మోగుతుంది....
గీతాదేవిలో ఉలిక్కిపాటు.....
బహుశా వాడే అయి వుంటాడు....
తీయాలా వద్దా? తన భర్త ఎటూ ఇప్పటిలో రాడు కాబట్టి వాడు ఎవడో ఏమిటో అసలు అతనికి ఎంతవరకు తెలుసో తెలుసుకోవడం తనకు చాలా ముఖ్యం. అందుకే ముందూ వేనుకలూ ఆలోచించకుండా రిసీవర్ అందుకుంది గీతాదేవి.
