Previous Page Next Page 
శశిరేఖ పేజి 11

 

కృష్ణు - ఇవ్వాళ చెప్పకపోతే మాత్రం డాక్టరుకి తెలీకుండా వుంటుందా?
సుంద - సరే, తేలసిందిలే.
శశి - ఇదేనా చెప్పననడం?
కృష్ణు - నేను చెప్పినానా? ఎమన్నా నిప్పుడు ?
శశి - నేను వెళ్ళిపోతున్నాను.
సుంద - వద్దు, వెళ్ళినారంటే కృష్ణుడు ఆ సంగతి ప్రశ్నలే వేసి చంపుతాడు నన్ను.
కృష్ణు - సరికాని, యీవాళా పౌర్ణమి. డింగిమీద షికారు వెడదాం.
శశి - వెడదాం, మళ్ళి వద్ధనకూడాదు.
సుంద - నేను వద్ధననిస్తానా?
కృష్ణు-  సుందరరావు కూడా ఇక్కడే భోంచేస్తాడు.
శశి - అసలు కాలవదగ్గిరే భోంచేద్దాం. నేనన్నిపట్టుకువస్తా.
సుంద - బలువ్తేనవన్నినన్ను మోయ్యనిస్తేనే  కాని నేను దానికి వోప్పకోను.
శశి - బలువ్తేనవేమి లేనే లేవు. ఎంత బలువ్తేనా మోయ్యగలను.
సుంద - అట్లా మొయ్యడానికి  వీల్లేదు.  కావలిస్తే కృష్ణుణ్ణి  అడిగండి.
శశి - ఎందుకు వీల్లేదు?
కృష్ణు - డాక్టరు చేపుతోవుంటే వినితిరాలి.
శశి - అదే, మళ్ళి  మాట్లాడుతున్నారూ?  అయితే  నేను వెళ్ళిపోతాను.
సుందరరావును, ససిరేఖయు అన్నమును తీసుకొని వచ్చిరి.కృష్ణునకు పనియనిన మిగుల బద్ధకము ఇంకెవరన్న పనిచేసి పెట్టిన యెడల అతని ప్రాణము హయి అనిపించును. అందుచే ఎక్కువసార్లు సుంధరరావును,  శశిరేఖయు కలిసి పనిచేయుట తటస్దించుచుండెను. అందరును భోజనమునకు కూర్చుండిరి.
కృష్ణు - ఓహ, ఏం మహా బాగా చేశావు యీ కూర?
సుంద - నువ్వు చేద్దూ అంతకంటే బాగా, చూస్తాను.
శశి- మీకు తెలిదాండోయి. కృష్ణుడు వంట చాలా బాగా చేస్తాడు.
సుంద - వాడికి నాకూ యిన్నాళ్ళు చేసేపనేముంది వంట నేర్చు కోకపోతే!మిమ్మల్ని అనకపోతే వాడే చెయ్యరాదూ, చేతయినవాడు?
శశి - మొగాళ్ళు  వంట చేస్తారా యేం?
సుంద - ఎందుకు చెయ్యకూడదు?  వంట ఆడవాళ్ళు మొహనేరాసుందా?
కృష్ణు - మొగాళ్ళు సంపాయిస్తారు. ఆడవాళ్ళు ఇంట్లో పనిచూసుకుంటారు. అట్లా భావించుకోవాలి  పని.
సుంద - అట్లాకదా అని, ఆడది ఎంత కష్టపడుతోన్నా మొగాడు తనికి పనివున్నా  లేకపోయినా యింట్లో కూచుని చూస్తో వూరుకోడమా?యింట్లో పని ముట్టుకోడమంటేనే కొందరికి నామోషి.జబ్బుగా వున్న భార్యకు మందు ఇయ్యడం పరువు తక్కువనుకుంటారు కొందరు.ఆడది అంత నిచ మెందుకయిందో తెలిదు.
శశి - పోనీండి కాని, మాటల సందున పులుసంతా తాగేస్తున్నారు.
కృష్ణు - ఒంతరిగాళ్ళ కేం తెలుసు?వాళ్ళ  పొట్టలు నిండితేసరి.
సుంద - మీరు మాత్రం? ఒకరిపోట్ట నిండిందో లేదో ఒకరు చూసుకుంటారు.మూడు వాడేమ్తేనా సరే.
శశి - ఆకుల సందులోంచి చందమామ  పరమాన్నం రుచి చూస్తోంది .
సుంద - లేకపోతే యీ చెట్లకింద ఇంకో చందమామ ఎక్కడి దిరా అని చూస్తోందేమో!
శశి -పోండి!
భోజనమయిన తరువాత ముగ్గురునూ పడవలో నేక్కినారు. సుంధరరావును, కృష్ణుడును ప్రవాహమునకు  ఎదురుతేడ్లు వేయుచుండిరి. శశిరేఖ దిండ్లు వైచుకొని  కూర్చుండెను. వెన్నెల ముఖమునంతనుతడుపు చుండగా,ప్రకాశించు కండ్లతో చల్లనిగాలి కౌగిలింతకు పులకరించు శరీరముతో, చీరె యిటునటు లోబడక ఎగురుచుండగా, వెండ్రుకలు ముఖమున  నాడ, ఆ పడవ నానుకొని, సౌందర్య దేవతాయనుంట్లు కానవచ్చు చుండెను. పడవ వేగమున చెట్లు వెనుకకు పరువెత్తుచున్న -ట్లున్నవి. దూరపు పొలముల నుండి కిచుమను శబ్ధములును, తెడ్లవలని నీటి శబ్దము మాటి మాటికి     నిశ్శబ్ధమును  భేదించుచుండెను. కట్ట పై  నుండి చెట్లక్రింద నీడలు వెన్నెల గంభిరత్వమును నినుమడించుచుండగా,    కదలుచున్న నీటిలో
చంధ్రకిరణములు  వేయి విధముల మెరయుచుండెను.
సుంద - మీరు క్లియోపాట్రా. నైలుమీద  నెట్టుచుండు బానిసలముమేము.
కృష్ణు - మన వాళ్ళల్లో ఎవర్నన్నా చెప్పరా అల్లాంటి వాళ్ళని.
 సుంద - మనవాళ్ళలో  పురుషుణ్ని  స్వాధీనం చేసుకొన్నస్త్రికూడా వుందంటావాయేమిటి?
కృష్ణు - ఛా, నువన్ని యిట్లానే అంటావు. మహాపతివ్రతలుండగా అట్లా అంటావేం?
సుంద - నేననేది అదే. అందరూ పతివ్రలేకాని పత్ని వ్రతం చేయించుకొన్నవాళ్ళు వోక్కళ్ళూ లేరని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS