Previous Page Next Page 
నారి నారి నడుమ మురారి పేజి 11

 

తెలీదు. అది నీవు చెప్పే తీరు, తర్కాన్ని బట్టి ఉంటుంది. ప్రయత్నించి చూడు. నా దృష్టిలో అయితే బంధాలు గొప్పవి. అవి జీవితాంతం పెనవేసుకుని ఉంటాయి. మనం ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మనకంటూ ఒక ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఉంటె అది జీవితాన్ని సఫలం చేస్తుంది అంటూ తన వాదన వినిపించాడు కృష్ణకుమార్. 
ఓహ్ మీ వాదన చాలా బాగుంది. ఆలోచిస్తాను. మీరు బెంగుళూరు నుంచి వచ్చిన తరువాత నా నిర్ణయాన్ని చెప్తాను అంది. 
 వెబ్ సిరీస్ వాళ్ళు నీ నవలను సీరియల్ గా తీయడం ఎంత వరకు వచ్చింది అని అడిగాడు. 
నా నవల వాళ్లకు బాగా నచ్చింది. కమర్షియల్స్ గురించి డిస్కస్ చేస్తామని చెప్పారు.
ఓహ్ గుడ్. చాలా ప్రొఫెషనల్ గా మారావు నీవు. వెరీ నైస్ అని మెచ్చుకున్నాడు.
ఏదో ఒకటి ఇంట్లో నే ఉంటాను కదా నేను. నాకు కాలక్షేపం కావాలి కదా అంది. ఈ మధ్య చాలా వెబ్సైట్ వచ్చాయండి. అవి కొన్ని భాషల్లో ఆన్లైన్ లో రచనలను పబ్లిష్ చేస్తున్నాయి. ఫ్రీ గా నే అనుకోండి. చాలా మంది రాస్తుంటారు వాటిల్లో. రాయడం ఫ్రీ నే. చదవడం ఫ్రీ నే.  పాఠకులు కూడా ఎక్కువే ఉంటారు. కొంతమంది రచయితలూ రచయిత్రుల రచనలు సీరియల్స్ కు, కధలకు వాటిల్లో బాగా డిమాండ్ ఉంది. పాఠకులు ఎక్కువ మంది చదువుతూ ఉంటారు వాళ్ళ రచనలను. అంతే కాకుండా రేటింగ్ సిస్టం, సమీక్షలు రాయడం వంటివి కూడా ఉన్నాయి. ఇది నా ఫ్రెండ్ మల్లేశ్వరి చెప్తే తెలిసింది. నేనూ రాద్దామని అనుకుంటున్నా. అందులోనే రైటింగ్ పాడ్ ఉంటుందట. ఇంగ్లీష్ లో టైపు చేస్తుంటే మనం సెలెక్ట్ చేసిన లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తుందట. చూడాలి. నా ఫ్రెండ్ ఇంకోటి కూడా చెప్పింది. ఎవరో పర బాషా రచయిత తెలుగు మీద ద్వేషంతో తన రచనలకి కావాలని  అన్ని రచనలకు రేటింగ్ 'ఒక' మార్క్ వేస్తున్నాడట. దాంతో తెలుగు వారు బాగుంది అని రేటింగ్ 'ఐదు' వేసినా అది నాలుగు కి పడిపోతుంది. అలాంటి మూర్ఖులు, పోకిరీలు కూడా ఉన్నారు ఇటువంటి వెబ్సైట్ లో. మా ఫ్రెండ్ చాకచక్యంగా వాళ్ళను ఐడెంటిఫై చేసి వెబ్సైట్ మేనేజ్ చేసేవాళ్లకు చెప్పిందట వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. లేకుంటే వాళ్ళు అందరిని ఇబ్బంది పెడతారు ముఖ్యంగా ఆడవాళ్లను అల్లరిచేసేందుకు ఇదొక మార్గం. రచయిత్రులు ఎంతో కష్టపడి తమకు మిగిలే కొద్దీ టైం లో అందరినీ ఆహ్లాదపరచాలని రచనలు చేస్తుంటారు. సమాజానికి ఉపయోగపడే మంచి సీరియల్స్ రాస్తుంటారు. వారి వారి రచనా శక్తిని బట్టి వారి రచనలు ఉంటాయి. అందరూ ఆదిలోనే గొప్ప రచయిత్రి అనిపించుకోలేరు కదా. మెచ్చుకోనక్కర్లేదు,  కనీసం కష్టపెట్టకుంటే అదే పదివేలు. ముఖ్యంగా రచయిత్రులను అణగదొక్కేందుకు ఇలాంటి పోకిరీలు ఫేక్ ప్రొఫైల్స్ చాటున రకరకాల నీచపు పనులు చేస్తుంటారు. అవి రచయిత్రులకు ఎంతో మనోవ్యధ కలగచేస్తుంటాయి. బాగుంటే చదివి రేటింగ్ ఇవ్వండి. అసలు చదవకుండానే కావాలని ఇలాంటి వెధవ పనులు చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పింది మా ఫ్రెండ్.     ఏంచేద్దాం. అలా ఉంది లోకం తీరు.  అందుకే నేను మల్లేశ్వరి కి చెప్పాను. పొరపాటున కూడా తన ప్రొఫైల్ లో మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అడ్రస్ లాంటివి ఇవ్వొద్దని. అలాంటి మూర్ఖులు ఇవన్నీ చూసి ఆడవాళ్లు కదా అని ఇంకేమన్నా నీచపు పనులకు పాల్పడవచ్చు . రచయిత్రులకు అది మరీ డేంజర్ కూడా అంటూ చెప్తోంది రేణుక.  అలాంటి పోకిరీలు, వెధవలు వలన రచయిత్రులు ఇలాంటి వెబ్సైట్ లో రాసేందుకు కూడా భయపడతారు మున్ముందు అంది. 
ఓహ్ ఇంత రీసెర్చ్ చేస్తున్నావా నీ రచనల కోసం అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణకుమార్. 
అలాంటి పోకిరీలు, వెధవలను వదిలిపెట్టకండి. వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకుని పోలీస్ వారి చేత భరతం పట్టిస్తే సరి. ఇంకెవ్వరి జోలికి రారు. అప్పుడు తిక్క కుదురుతుంది అలాంటి వెధవలకి అన్నాడు కోపంగా కృష్ణకుమార్.
అవునండి. మీరు చెప్పింది ముమ్మాటికీ కరెక్ట్ . అందుకే నేను మా రచయిత్రి ఫ్రెండ్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటాను. వాళ్ళు ఇలాంటి ముఖ్యమైన విషయాలు చెప్తుంటారు. రచయిత్రులం కదా మమ్మల్ని మేము  కాపాడుకోవాలి కదా అంది ఆరిందాలా. 
సూపర్బ్ రా రేణూ. టైం ని చక్కగా ఉపయోగిస్తున్నావు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నావు అని మెచ్చుకున్నాడు. అది సరే కానీ నీకు చెప్పానుగా రేపు బెంగళూరు కి విద్యావతి కూడా వస్తోంది. తను మా బ్రాంచ్ లో ఆ లోన్ చూస్తోంది కాబట్టి తనని కూడా తీసుకెళ్లామన్నారు జోనల్ మేనేజర్ సహాయంగా ఉంటుందని. నేను ఆవిడకు చెప్పాను తనకి ఇబ్బంది అయితే ఇంకెవరినైనా తీసుకు వెళతానని. ఫరవాలేదు వస్తాను అంది. అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ లో మీటింగ్ మరియు వసతి ఏర్పాటు చేశారు అని చెప్పాడు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లైట్. రెండు గంటలకు నేను తనని ఇంటిదగ్గర పిక్ అప్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళతాను. మళ్ళీ బుధవారం సాయంత్రం ఆరుగంటల ఫ్లైట్ కి బయలుదేరి ఏడుగంటలకు హైదరాబాద్ లో ఉంటాను అన్నాడు.
అలా అయితే తనని రేపు పొద్దున్నే ఇక్కడికి రమ్మని చెప్తాను. లంచ్ చేసుకుని ఇటునుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్లొచ్చు అంది రేణుక. 
వాళ్ళ సిస్టర్ కూడా పైన ఉంటుంది రేణూ. పిలిచేటట్లుంటే ఇద్దరినీ పిలువు అన్నాడు.  
ఓకే. తన నెంబర్ నా దగ్గర ఉంది. ఇప్పుడే వాట్సాప్ మెస్సేజ్ ఇస్తాను అంది. 
ఓకే అన్నాడు కృష్ణకుమార్. 
****
హైదరాబాద్ లో ఉన్నాడంటే కృష్ణకుమార్ ఇంట్లో ఉండే టైం చాలా తక్కువ. అతనికి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంది. 
అటు చిన్నప్పటి ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్, బ్యాంకు లో చేరిన తరువాత స్టాఫ్ ఇలా చాలా మంది హైదరాబాద్ లో నే ఉండేవాళ్లున్నారు. 
వీళ్లందరినీ కలుపుతూ బోలెడన్ని సాంఘిక కార్యక్రమాలు, సంఘ సేవ చేస్తుంటాడు. ఆర్ఫనేజ్ కి చందాలు, వస్తువులు కలెక్ట్ చెయ్యడం, వృద్ధాశ్రమాలకు ఇతోధికంగా హెల్ప్ చెయ్యడం ఇలాంటి పనులు చాలా ఇష్టంగా చేస్తుంటాడు. 
అతని స్నేహితులు కృష్ణకుమార్ ని లైవ్ వైర్ అని పిలుస్తారు. 
ఎప్పుడూ ఎదో ఒక మంచి పని చేస్తూ ఉండడం అతని నైజం. 
తమ బ్యాంకు కు కూడా ఎంతోమంది కస్టమర్స్ ని తీసుకొచ్చాడు. బిజినెస్ బాగా డెవలప్ చేసినందువల్ల పైవారిదగ్గర కూడా మంచి గుర్తింపు ఉంది.
రేణూ ఇంట్లో పనితో బిజీ అనడం తో శనివారం బయటే బిజీగా గడిపి రాత్రి తొమ్మిదింటికొచ్చాడు ఇంటికి.
వస్తూనే రేణుక చెప్పింది. ఆదివారం వచ్చేందుకు విద్యావతిని బలవంతంగా ఒప్పించినట్లు. ఆమె అక్క బయటికి ఎవరిళ్ళకు రాదు అని చెప్పింది. 
ఓకే లే అన్నాడు కృష్ణకుమార్.  
ఆదివారం పదకొండింటికి కారు పంపించాడు విద్యావతిని తీసుకు వచ్చేందుకు. 
మామూలుగా చీరలో చూసే విద్యావతి ఆ రోజు చుడీదార్ లో దర్శనమిచ్చింది. 
లగ్గేజ్ ఏదీ అని అడిగాడు. 
కారులోనే ఉంచాను. చిన్న సూట్కేసు కదా. కేబిన్ లగ్గేజ్ లో పెట్టొచ్చు అంది. 
ఓహ్ గుడ్. నేను కేబిన్ లగేజ్ సూట్కేసు తెచ్చుకుంటాను, కన్వేయర్ దగ్గర వెయిట్ చెయ్యక్కర్లేదు అన్నాడు కృష్ణకుమార్. 
రేణూ కి విద్యావతి బాగా ఫ్రెండ్ అయ్యింది. 
తనని చూడగానే రేణూ మొహం విప్పారింది. 
ఇక ఇద్దరూ మామూలే. కబుర్లలో పడ్డారు. అక్క అంటూ రేణు, రేణూ అంటూ విద్య చక్కగా అక్కా చెల్లెళ్లలా మాట్లాడుకుంటున్నారు. 
రేణూ విద్య కంటే నాలుగేళ్లు చిన్నది. 
ఇద్దరూ బాగా కలిసిపోయారు. 
రేణు కి కూడా తను ఒక్కతే కూతురు కావడంతో తోబుట్టువులు ఎవరూ లేరు. ఇలా తన అనురాగాన్ని విద్య తో పంచుకుంటోంది  అనుకున్నాడు. 
ఏవో ఫోన్స్ వస్తుంటే అటెండ్ అవుతున్నాడు కృష్ణకుమార్.
సూట్ కేసు సర్దుతుంటే రేణూ ని పిలిచి చెప్పాడు విద్యావతి బర్త్ డే బుధవారం అని. 
బీరువాలోనుంచి తను పండక్కి కొనుక్కున్నకొత్త చీర తీసి చూపించింది ఇది పెడతాను ఆవిడకి అని.
నీ ఇష్టం అన్నాడు.
కిచెన్ లో రేణూ, విద్య ఇద్దరూ మాట్లాడుతూనే వంటలన్నీ రెడీ చేశారు.
అందరి భోజనాలు అయ్యాయి. 
విద్యావతి మోహిత్ తో చాలా సేపు మాట్లాడింది అన్నం తినేప్పుడు. 
ఆమె డాటర్ ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్ ఇచ్చింది. 
తన డాటర్ శ్రీష కూడా ఐ టి సబ్జెక్టు  లోనే ఎం ఎస్ చదువుతోంది యూనివర్సిటీ అఫ్ సిన్సినాటి లో. 
మోహిత్ కూడా ఐ టి లోనే ఎం ఎస్ చదివేందుకు కొద్దీ రోజుల్లో అమెరికా కు వెళతాడు. 
శ్రీష బాగా గైడ్ చేస్తుంది అని చెప్పింది. తను హైదరాబాద్ సి బి ఐ టి లో బి టెక్ చేసింది.  ఆ అమ్మాయి కూడా మొదటినుంచి రాంక్ స్టూడెంట్ అట.
టైం రెండు అయ్యింది. అప్పటికే వెబ్ చెక్ ఇన్ చేసాడు ఇద్దరి టికెట్స్. 
అన్ని ఒకసారి చూసుకుని ఇక బయలుదేరేందుకు రెడీ అయ్యారు.
రేణుక విద్యావతిని సోఫా లో కూర్చోబెట్టి, బొట్టుపెట్టి చీర ఇచ్చింది. 
ఇప్పుడు ఇవెందుకు రేణూ అంది విద్యావతి మొహమాటపడుతూ.
ఈ చీర బుధవారం కట్టుకో.
అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విషెస్ అక్కా  అంది రేణు ఆమె నుదుటిన ముద్దు పెడుతూ. 
నా బర్త్ డే నీ కెలా తెలుసు రేణూ అంది ఆశ్చర్యంగా.
ఆయన చెప్పారు ఇందాక అంది. 
కృష్ణకుమార్ కి ఎలా తెలిసిందో అర్ధమయ్యింది విద్యావతికి. చాలా  సంతోషమేసింది ఆమెకు. 
చాలారోజుల తరువాత మళ్ళీ అనురాగం, ఆప్యాయతలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 
కళ్ళలో కొంచెం తడి మెరిసింది కూడా . 
విద్యావతి జడలో మల్లెలు తురిమింది రేణు. 
ఆంటీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అంటూ ఫైవ్ స్టార్ చాకోలెట్స్ ఇచ్చాడు మోహిత్.
థాంక్స్ రా అంది విద్యావతి.
నేను బెంగుళూరు లో చెప్తాను అన్నాడు కృష్ణకుమార్ తననే చూస్తున్న విద్యావతి తో.
కళ్ళతోనే ఓకే అన్నట్లు నవ్వింది.
ఇద్దరూ లిఫ్ట్ లో దిగి కారు ఎక్కారు.
డ్రైవర్ రాముకు చెప్పాడు. బుధవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ కి రావాలి అని.
సరే సర్ అన్నాడు.
 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS