Previous Page Next Page 
నారి నారి నడుమ మురారి పేజి 10

 

అవును మీకు ఎలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా. 
రోజు తెచ్చే మీ కారేజ్ బాగ్ లేదుగా ఇక్కడ అంది ఆమాత్రం కనిపెట్టలేనా అన్నట్లు పోజ్ పెట్టి.
ఓహ్ అదా అవును. మీకు కూడా ఏమన్నా చెప్పమంటారా అన్నాడు. 
ఏమీ అక్కరలేదు. ఇద్దరికీ తీసుకొచ్చాను మీ ఫేవరిట్ ఉప్మా, దోస  అంది తన బాగ్ టేబుల్ పై పెడుతూ.
థాంక్యూ. కూర్చోండి అంటూ జోనల్ మేనేజర్ ఫోన్ విషయం చెప్పాడు. బెంగళూరు లో మీటింగ్ సంగతి చెప్పాడు.   
మీకు ఇబ్బంది అయితే వేరే ఎవరినన్నా తీసుకువెళతాను అన్నాడు. 
నాకు ఇబ్బంది ఏమీ లేదు. నేను వస్తాను అంది. 
మూడు రోజులు మేడం, ఫరవాలేదా అని చెప్పాడు.
ఫరవాలేదు. మీరూ ఉంటారుగా పక్కనే అంది నవ్వుతూ .
సరే అయితే,   ట్రావెల్స్ వాళ్లకి చెప్పి సండే ఈవెనింగ్ ఫ్లైట్ బుక్ చెయ్యమంటాను. సోమవారం పొద్దున్నే మీటింగ్ కి అటెండ్ కావొచ్చు. అయినా మూడు రోజులెందుకు మీటింగ్ అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చాడు.  
సార్ నాకు ఫ్లైట్ ఎలిజిబిలిటీ లేదు అంది విద్యావతి.
నేను జోనల్ ఆఫీస్ పర్మిషన్ తీసుకుంటాను లెండి. అదేం ప్రాబ్లెమ్ కాదు అని జోనల్ ఆఫీస్ కి ఫోన్ చేసాడు పర్మిషన్ కోసం . 
వాళ్ళు పర్మిట్ చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ లో మీటింగ్, అక్కడే వసతి కూడా అని మెయిల్ ఇచ్చారు జోనల్ ఆఫీస్ వాళ్ళు. 
రెండు రూమ్స్ బుక్ చేశారు. 
ముందు టిఫిన్ తినండి. చల్లారి పోతుంది అంది విద్యావతి.
ఓహ్ అంటూ చేతులు కడుక్కుని వచ్చాడు.
రెండు ప్లేట్స్ లో ఇద్దరికీ వడ్డించింది.
నోట్లో పెట్టుకుని ఓహ్ అమృతం అన్నాడు.
అంతొద్దు లెండి. రేణుక గారి కంటే నేనేమీ ఎక్స్పర్ట్ కాదు అంది.
చాలా బాగున్నాయి. అతిశయోక్తి కాదు అన్నాడు. 
అయితే థాంక్యూ అంది. 
రేణుక కు ఫోన్ చేసాడు. బెంగళూరు ట్రిప్ గురించి చెప్పి మూడు రోజులు వీలవుతుందా తనతో వచ్చేందుకు అని అడిగాడు. 
ఆమ్మో ! మోహిత్ ని వదిలిపెట్టి రాను అని ఖచ్చితంగా చెప్పింది రేణుక.
ట్రావెల్స్ వాడికి ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పాడు. 
తనది, విద్యావతిది వివరాలు చెప్పాడు. 
కిరణ్ వస్తున్నాడు. వాడు చెప్పిన డాక్యుమెంట్స్ తెచ్చారా అని అడిగాడు.
ఎస్ సర్ అంటూ బాగ్ లోనుంచి తీసింది. 
అన్నీ ఒక ఫోల్డర్ లో చక్కగా పెట్టున్నాయి.
ఆ డాక్యుమెంట్స్ తీసుకుని చూసాడు కృష్ణకుమార్. ఒక దాని మీద డేట్ అఫ్ బర్త్ ఉంది. తనకంటే ఒక సంవత్సరం చిన్న విద్యావతి . బర్త్ డేట్ చూసాడు. ఇంకో మూడు రోజులలో ఆమె  బర్త్ డే, అంటే బుధవారం అన్నమాట. ఆ రోజు తాము బెంగళూరు లో ఉంటారు . ఓహ్ అయితే తన బర్త్ డే బెంగళూరు లో సెలెబ్రేట్ చెయ్యాలన్నమాట. అవేమీ అంత చూడనట్లు నటించి టేబుల్ పైన పెట్టాడు.
కిరణ్ వచ్చాడు హాయ్ రా అంటూ. 
కిరణ్, విద్యావతి ఇద్దరికీ పరస్పరం పరిచయం చేసాడు కృష్ణకుమార్.
విద్యావతి ఇచ్చిన ఫోల్డర్ కిరణ్ కి ఇచ్చాడు చూడమని.
కిరణ్ అన్నీ వెరిఫై చేసాడు. తను ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్నీ ఉన్నాయి అందులో. 
గుడ్ అంటూ తను తెచ్చిన పేపర్స్ బయటికి తీసాడు. వాటిలో కొన్నిటి మీద సంతకం తీసుకున్నాడు.
మెమొరాండం అఫ్ డివోర్స్ డీడ్ కూడా ప్రింట్ చేసి తెచ్చాడు. 
అందులో మూర్తి  ,  విద్యావతి ఇద్దరి సంతకాలు కావాలి. డివోర్స్ మంజూరు అయ్యేంతవరకూ వాళ్ళు ఆ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఎవ్వరూ వెనక్కి వెళ్ళకూడదు. అందుకోసం ఆ డీడ్. 
దాని మీద విద్యావతి సంతకం తీసుకున్నాడు. ఎలాగూ మూర్తి  తన ఆఫీస్ కి వచ్చినప్పుడు అతని సంతకం దానిమీద తీసుకుంటానని చెప్పాడు. విట్నెస్ గా కృష్ణకుమార్ సంతకం తీసుకున్నాడు. ఇంకొక విట్నెస్ తన ఆఫీస్ లో చేయిస్తానన్నాడు.
ఈలోగా వేడి వేడి కాఫీలు, స్నాక్స్ వచ్చాయి. 
కృష్ణకుమార్ ని బాగా మెచ్చుకున్నాడు కిరణ్. భలే మేనేజ్ చేసావుట కదరా ఆ రోజు . ఇన్స్పెక్టర్  అన్ని విషయాలు  చెప్పాడు నాకు. 
సార్ !  అక్కడికి మీడియా కూడా వచ్చింది. మీ ఫ్రెండ్ వాళ్ళని చాకచక్యంగా మేనేజ్ చేసి పంపాడు అని  చెప్పాడు. ప్రౌడ్ అఫ్ యు రా కృష్ణ అని భుజం తట్టాడు కిరణ్.  
విద్యావతి వైపు తిరిగి వీడు చిన్నప్పటినుంచి ఇంతే మేడం. ఎవరికన్నా సహాయం అంటే ముందుంటాడు. దానివల్ల ఎంత రిస్క్ అన్నా భయపడడు. మా స్నేహ బృందంలో వీడు జెమ్ అన్నాడు కిరణ్, కృష్ణకుమార్ ని మెచ్చుకుంటూ .
ఒరేయ్ ఆపరా. ఎదో నాకు తోచింది నేను చేస్తాను. అంతే కదా. దాంట్లో అంత పొగిడేదానికేముంది అన్నాడు సిగ్గుపడుతూ కృష్ణకుమార్. 
అన్నీ ఒక మారు వెరిఫై చేసుకుని సరేరా నేను బయలుదేరుతాను. పిటిషన్ వచ్చే వారంలో ఫామిలీ కోర్ట్ లో ఫైల్ చేస్తాను. అప్పుడు మేడం ఒక సారి రావాలి అన్నాడు కిరణ్. 
మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు కోర్ట్ కి వస్తాను సర్ అంది విద్యావతి.
మీకు ఎక్కువ ఇబ్బంది ఉండదండి. రెండే రెండు సార్లు కోర్ట్ కి అటెండ్ అయితే చాలు అన్నాడు కిరణ్.
తప్పకుండా సర్ అంది.
మేడం ! రేపు, ఎల్లుండి మనకు సెలవు. మీటింగ్ కు సంబంధించి ఇవాళే మీరు స్టేట్మెంట్స్, ఇన్ఫర్మేషన్ రెడీ చేసి నాకు ఫైల్ ఇస్తే ఒకమారు నేను ఇంట్లో స్టడీ చేస్తాను. సండే సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లైట్. మీరు రెడీ గా ఉంటె రెండు గంటలకు మీ ఇంటికి వచ్చి పిక్ అప్ చేసుకుంటాను అన్నాడు. 
సరే సర్ అంటూ లేచింది విద్యావతి. సార్ మీరు లేచి ఇటు నిలబడతారా అంది.
ఎందుకు అన్నాడు కృష్ణకుమార్.
ఒక్క మారు రండి అంది.
కృష్ణకుమార్ లేచి టేబుల్ పక్కగా నిలుచున్నాడు ఎందుకా అనుకుంటూ.
విద్యావతి పాదాలు తాకబోయింది. 
వెనక్కి జరిగాడు కృష్ణకుమార్. 
ఏంటి మేడం ఇదంతా. నాకు ఇలాంటివి అస్సలు నచ్చదు అన్నాడు. అయినా ఎందుకు ఇంత ఎమోషన్ మీరు అన్నాడు ఇబ్బంది పడుతూ .
ఫస్ట్ టైం నా జీవితంలో ఒక పెద్ద పరిష్కారం మీ వల్ల జరిగింది సర్. అందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాను అంది. 
అబ్బా ఏంటి మేడం మీరు కూడా. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు మాట్లాడుతారు.
ఇది మీకు విడమరచి చెప్పలేను సర్. అంత నరకం అనుభవించాను నేను ఇన్నేళ్లు. ఇప్పుడు ఒక్క వారంలో అదీ మీ వల్ల నాకు ఉపశమనం కలగబోతోంది. అది పెద్ద అదృష్టం నాకు అని రెండు చేతులు జోడించింది మర్యాదపూర్వకంగా.  
****
నెలలో రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులకు సెలవు కావడంతో ఆరోజు శనివారం చాలా పనులు పెట్టుకున్నాడు కృష్ణకుమార్. 
ఇవాళ ఎక్కడికైనా వెళదామా రేణూ అన్నాడు పొద్దున్నే కాఫీ తాగుతూ.
మోహిత్ కి  లాస్ట్ సెమిస్టర్ దగ్గరలో ఉందిగా. వాడు బాగా బిజీ. వాడితో నేను ఉండాలి అందుకే నేను బిజీ అంది నవ్వుతూ.
సరీ పోయింది. నీకోసం నేను ముంబై నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే నీ అపాయింట్మెంట్ దొరకటం లేదు నాకు. ఇలా అయితే నేను ముంబై వెళ్ళిపోతా అన్నాడు సరదాగా.
వెళ్ళోద్దులెండి. రెండు నెలలు ఓపిక పడితే వాడి ఎగ్జామ్స్ అవుతాయి. అప్పుడు మీరు ఎక్కడికంటే నేను అక్కడికొస్తా. సరేనా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ.
ఓకే మేడం. మీరు ఎలా చెప్తే అలా. అవును నువ్వు నాతో బెంగళూరు రావొచ్చుకదా. వాడు మూడు రోజులు సర్దుకుంటాడులే. లేకుంటే మా ఫ్రెండ్స్ ఇళ్లలో ఎక్కడో ఒకచోట ఉంచుతాను అన్నాడు. 
అబ్బా కుదరదండీ. ఒక్క రెండు నెలలు ఓపిక పట్టండి మహాప్రభో అంటూ రెండు చేతులు జోడించింది.
సరే సరే అన్నాడు. 
మీరు ఇవాళ నాకు రెండు గంటలు టైం ఇవ్వాలి అంది రేణుక టిఫిన్ పెడుతూ.
ఎందుకో. అమ్మాయిగారికి మూడ్ వచ్చిందా అన్నాడు నవ్వుతూ.
అబ్బా. అందుకు కాదులెండి. నేను మొదలెట్టబోయే నవల థీమ్ గురించి మీతో డిస్కస్ చెయ్యాలి అంది. 
ఎప్పుడు కూచుందాం అన్నాడు 
మీరు ఇప్పుడు ఫ్రీ అంటే ఇప్పుడే అంది.
ఓకే డన్. హాల్లో కూర్చుందామా అన్నాడు.
ఓకే అంటూ పేపర్స్  తెచ్చుకుంది రేణుక. 
మొదలు పెట్టు. నువ్వు అంతా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. నేను విని నా అభిప్రాయాలు చెప్తాను అన్నాడు.
రేణుక చెప్పడం మొదలు పెట్టింది. ఇది మిడిల్ ఏజ్ ట్రయాంగల్ లవ్ స్టోరీ అండి అంటూ చెప్తోంది. 
అది సాంతం వింటుంటే అందులో పాత్రలు తను, రేణు, విద్యావతిని ప్రతిబింబిస్తున్నాయి. 
ఒక గంట సేపు ఏకబిగిన చెప్పింది. ఇప్పుడు చెప్పండి భర్త భార్య ను వదిలేసి ప్రియురాలిని చేసుకుంటాడా, లేక భార్యే తనకు ముఖ్యమని ఆమెతోనే జీవిస్తాడా. ఇక్కడ అందరికి పిల్లలు కూడా ఉన్నారు అంది. ఒక వెరైటీ గా రాద్దామని ప్రయత్నం. ఎలా ముగింపు చెప్తే పాఠకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సంశయం నాకు అంది.
రేణూ, నవల కోసం అయితే ఎలా అయినా వ్రాయి నీ ఇష్టం. నా ఒపీనియన్ అయితే మన హిందూ సంస్కృతి ప్రకారం భర్త భార్యల బంధం విడదీయరానిది. నేను దానికే ఎక్కువ విలువ ఇస్తాను. ఎంత వెస్ట్రన్ కల్చర్ మనం చూస్తున్నా నాకెందుకో మన సంసృతే గొప్పది అని నమ్మకం. యుక్త వయసులో బాహ్య కోరికలుంటాయి. అప్పుడు ప్రేమలో పడటం అది సహజం. కానీ ఒకసారి పెళ్ళైన తరువాత పక్క చూపులు చూడటం అంటే ఎందుకో నాకు నచ్చని పని.  నువ్వు నీ నవలలో ఎన్ని మలుపులు తిప్పినా చివరకు పెళ్లి బంధం గొప్పది అన్న విషయాన్ని నిరూపించు. అలా కాదు ప్రేమబంధం గొప్పది అని ప్రియురాలితో కలిపితే అది ఎందుకో నాకైతే నచ్చలేదు. మరి పాఠకులు ఎలా రియాక్ట్ అవుతారో నాకు 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS