Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 11

 

    నువ్వంటే నాకు ...."
    "అసహ్యం! అవునా?"
    "చ, ఛ ౧ చాలా ఇష్టం"
    "కోయ్"
    "నిజం సుజాతా!' లాలనగా అన్నాడు.
    సుజాత సాగర్ భుజం మీద చెయ్యి వేసింది. తల అతని వళ్ళో వుంచింది . ఈసారి గట్టిగా బ్రేక్ వేస్తె డాషు బోర్డు మీదకు కాదు, కిందకే దొర్లుతుంది . తిక్క కుదురుతుంది.....సాగర్ ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. కారు వేగంగా నడుపుతున్నాడు.
    "యూ! పూలిష్ ఫెలో!" సుజాత సాగర్ కు దూరంగా జరిగింది.
    సాగర్ కు కొరడాతో చరిచినట్టయింది . ఎందుకు హటాత్తుగా ఇలా అన్నది? నిజంగానే సాగర్ వెర్రి మొహం వేశాడు.
    "నీ నటన అంతా నేను నమ్మాననుకుంటున్నావా?" కసిగా అన్నది సుజాత.
    "నటనా! నేను నిజంగా నిన్ను...."
    "స్టాపిట్! నువ్వనేది నిజమైతే నీ ఒళ్ళు ఎందుకు చల్ల బడుతుంది."
    సాగర్ బిత్తరపోయాడు. సుజాత తను అనుకున్నంత తెలివి తక్కువది కాదు! ప్రియుడి వళ్ళో ప్రేయసి తల వుంచితే ప్రియుడి వళ్ళు వేడెక్కాలని సుజాత అంచనా! అలా అవలేదని తను  చెప్పేవన్నీ గాలి కబుర్లని తేల్చేసింది.
    "బట్ యు సి!"
    "ఐ హావ్ అల్ రడీ సీన్"
    "నో! నో! సుజా! నా వళ్ళు చల్లబడటానికి కారణం నీ నుదుటి మీద దెబ్బ! నా కారణంగా నీకింత దెబ్బ తగిలిందని నేను చాలా బాధ పడుతున్నాను."
    "నిజమే నిన్ను చూస్తుంటే తెలుస్తూనే వుంది.....నీవెంత బాధపడుతున్నావో!"
    "నిజం సుజా. ఇప్పటికయినా నన్ను అర్ధం చేసుకొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది."
    "పిచ్చి సాగర్! నీ సంగతి తెలియదా?"
    "మనసులు చదవకల్గిన శక్తి నీకున్నదని నాకు తెలుసు సుజా!"
    సైకాలజీ డాక్టరేట్ చేస్తున్న నీకు అవతలవాళ్ళు మనసులు చదవడం ఒక లేక్కేమిటి?"
    సాగర్ ఉబ్బిపోసాగాడు.
    "కానీ......"
    "ఏమిటి సుజా, కానీ అంటున్నావు?"
    "అదేనోయ్ , నా నుదుటికి తగిలిన దెబ్బ! పోలీసాఫీసరయినా మీ నాన్నగారి కెక్కడ చూపిస్తాననే కదా నీ బాధంతా."
    సాగర్ చేతి వ్రేళ్ళు స్టీరింగ్ మీద వణికాయ్.
    "ఈమాత్రం అర్ధం చేసుకోలేని దద్దమ్మననుకున్నావ్ అవునా?"
    "సుజాతా! ప్లీజ్!"
    ఎందుకోయ్ మానసిక శాస్రంలో డిగ్రీలు పుచ్చుకున్నావ్! డాక్టరేట్ అందుకోబోతున్నావ్? దండగ....ఐ నెవర్ ఎక్స్ పేక్టేడ్...."
    "యస్. ఐయామ్ రియల్లీ...."
    "యు సిల్లీ బాయ్!"
    "కాదు ఫూల్ అను బాగుంటుంది"
    కారు డాక్టరు గారి ఇంటి గేటు ముందు వచ్చి ఆగింది. సాగర్ దిగి, తిరిగి వచ్చి డోర్ తెరిచే ముందే సుజాత కారు దిగి నిలబడింది.    
    "సుజా! మీ నాన్నగారు నొసట మీద దెబ్బ చూసి ఖంగారు పడతారు.....
    "అయన ఖంగారు పడతారని నువ్వు ఖంగారు పడతావెందుకోయ్?"
    "అది కాదు సుజాతా! మీ నాన్నకు తెలిస్తే మా నాన్నకు నేను ఇంటికి వెళ్ళకముందే ఫోన్ చేసి చెప్పేస్తారు."
    "మరి చెప్పాలి కదా!"
    "సుజాతా! సుజాతా! ప్లీజ్ నా మాట విను, నేను చెప్పినట్లు చెప్పు ప్లీజ్!"
    "ఏం చెప్పమంటావు?"
    "ఏదో చ=ఒకటి చెప్పు...." బుర్ర గోక్కున్నాడు సాగర్.
    "అంత తెలివితేటలు నాకేక్కడున్నాయి? ఏం చెప్పాలో ఎలా  చెప్పాలో  నువ్వే చెప్పు"
    "మన కారుకు హటాత్తుగా ఏదో అడ్డం వచ్చిందని"
    "ఏదో అంటే?" దీర్ఘం తీసింది సుజాత.
    "అదే ఓ కురాడు అడ్డం వచ్చాడు, వాడి ప్రాణం రక్షించడానికి సడెన్ గా బ్రేక్ వేయాల్సి వచ్చింది, అప్పుడు నీ తల వెళ్ళి...."
    "ఆగాగు ....ఎవరడ్దోచ్చారు?"
    "ఓ కుర్రాడు.....కుర్రాడు!"
    "ఆహా! మన దారికి ఓ పిచ్చిది అడ్డొచ్చింది అప్పుడు నువ్వేమో...."
    "మన దారికి పిచ్చిది అడ్డం వచ్చిందా?" సాగర్ బుర్ర తిరిగిపోయింది. హరిబుల్ సుజాత ఎవరిని గురించి మాట్లాడుతున్నది? మాధవి పిచ్చిదా?
    "సుజాతా...." నోరెండిపోయింది సాగర్ కు.
    "అవును? మన దారికి పిచ్చిది అడ్డం వచ్చింది.... అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిపొయింది! ఇదిగో శాశ్వతంగా నొసట మీద ఈ గుర్తు మిగిలిపోయింది" సుజాత కంఠం వణికి పోతున్నది గిర్రున తిరిగి గేటు తీసుకుని సుజాత పరుగు తీసింది.
    సుజాత గుమ్మం మెట్లెక్కేదాకా సాగర్ గగేట్ ముందే నిలబడ్డాడు.
    ఇంట్లోకి వెళ్ళబోతూ సుజాత వెనక్కు తిరిగింది. చెయ్యి వూపి "గుడ్ నైట్" అన్నాది.
    సాగర్ గొంతు పెగల్లేదు. చెయ్యి పైకి లేవలేదు. నీరసంగా వచ్చి కారులో కూర్చున్నాడు. కారు స్టార్టు చేసాడు.
    సుజాత ఈ సంగతి తప్పకుండా డాక్టరు గారికి చెపుతుంది. అయన నాన్నకు చెప్తాడు. మెల్లగా అమ్మకు తెలుస్తుంది.
    రామనాధం గారికి తెలుస్తుంది. నాగరత్నంగారికి - చివరకు మాధవికి తెలుస్తుంది. ఇప్పటికి అస్తవ్యస్తంగా వున్న సున్నితమైన మాధవి మనసులో తను చేసిన పని ఏ ప్రభావాన్ని కలిగిస్తుందో?


        
                                                              6


    సాగర్ కు ఆలోచించిన కొద్దీ లోతు తెలియని అగాధం లోకి జారిపోతున్నట్టయిపోతున్నది. మాధవిని వీళ్ళంతా కలిసి నిజంగానే పిచ్చిదాన్ని చేస్తారేమో? ఈరోజు జరిగిన సంఘటనతో మాధవి మానసిక స్థితి అయిన వాళ్ళకు, కాని వాళ్ళకు అందరికి తెలిసిపోయింది. అది తెలిసి మాధవి ఇంకా క్రుంగి పోతుంది. మాధవి మస్తిష్కంలో చెలరేగుతున్న ఉప్పెన కెరటాలను అధ్యయానం చేయగల మానసిక శాస్త్ర వేత్త కావాలి! ఇంతవరకు జరిగిన ప్రతి సంఘటననూ నిశితంగా పరిశీలించి అన్వయించగల నేర్పు ప్రతిభ వున్న మేధావి మాత్రమే రక్షించగలడు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS