Previous Page Next Page 
మారణహోమం పేజి 100

 

    నిద్రలేమితో అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. కప్పుతో పాలు కలపని బ్లాక్ కాఫీ తీసుకొచ్చి అతనికి అందించింది అమూల్య.
    రెండు గుక్కల్లో దాన్ని తాగేసి నాప్ కిన్ తో పెదిమలు తుడుచుకొని అన్నాడు తరుణ్.
    "నిఖిల్ ఇండియా బోర్డరు దాటి వచ్చేశాడు. ఆర్మీతో దాగుడుమూతలాడుతున్నాడు.
    తన సంతోషం మోహంలో కనబడకుండా తల పక్కకి తిప్పుకుంది అమూల్య.
    "అంటే మీ ట్రాప్ లోకి అడుగు పెట్టడన్నమాట!"
    "ఎగ్జాక్ట్ లీ! ఇంక వాణ్ని పట్టేయ్యడం నిమిషాల మీద పని!"
    ఆవలించి చేతులు పైకి ఎత్తి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది అమూల్య. "నాకు నిద్దరొచ్చేస్తోంది! మీకు ..........." మళ్ళీ అవల్;అవలించింది. "మీకు నిద్ర రాదా ఏమిటి?"
    నిజానికి తరుణ్ కి నడుం వాల్చి ఒక్క అరగంట అయినా విశ్రాంతి తీసుకోవాలని ఉంది. కాని ఇది సమయంకాదు.
    ముందు నిఖిల్ ని పట్టుకోవాలి.
    తర్వాతే నిద్ర!

 

                                                        * * *


    గిరిజనుల మేకప్ లో ఉన్న నిఖిల్, రాదా భారత్ కల్చరల్ ట్రూపులోని మిగతా మెంబర్సుతో కలిసి, ఒక మిలటరీ క్యాంపు దగ్గర దిగారు. అల్పాహారాల తర్వాత ఎక్కువ వ్యవధి లేకుండానే ప్రోగ్రాం మొదలయింది. ఒక కామెడీ నాటకం, మిమిక్రీ, దేశభక్తి గీతాలు చివరి ఐటం గా గిరిజన నృత్యం.
    ఆ క్యాంపు అధికారి మేజర్ సుదర్శనం రసహృదయుడు. ప్రోగ్రాం ని బాగా ఎన్ జాయ్ చేస్తున్నాడు. అతను, తన ఆఫీసర్లు, జవాన్లతో కలిసి.
    అప్పుడు వచ్చింది అతనికి ఒక వైర్లెస్ మెసేజ్. లేచివెళ్ళి , రిసీవ్ చేసుకోవడం మొదలెట్టాడు.
    ఆ మెసేజ్ పంపుతున్నది తరుణ్. అతని పక్కన ఒక సేనీయర్ బ్రిగేడియర్ కుర్చుని ఉన్నాడు. అయన అనుమతితో చెప్పడం మొదలెట్టాడు తరుణ్.
    "నిఖిల్ అనే మనిషి, రాధ అనే అమ్మాయితో కలిసి బార్డర్ క్రాస్ చేసి మనదేశంలోకి వచ్చాడు. చాలా డేంజరస్ పెర్సన్స్ వాళ్ళు. మోస్ట్ అన్ డిసైరబుల్ పీపుల్. సీరియస్ సేక్యురీటీ రిస్క్! మీ పక్క క్యాంపు నుంచి అంబులెన్సు దొంగలించి పారిపోతున్నారు. చివరిసారిగా కనబడినప్పుడు అతను యాంబులెన్స్ డ్రయివర్ వేషంలో ఉన్నాడు. ఆ అమ్మాయి గర్భవతిగా నటిస్తోంది.
    కానీ వాళ్ళు ఇంకా అదే వేషాల్లో ఉండి ఉంటారని ఉహించడానికి వీల్లేదు.
    వాళ్ళు ఇద్దరూ ఇద్దరే. గొప్ప కిలాడీలు . జాగ్రత్త!"
    "యస్సర్! వాళ్ళను గురించిన మెసేజ్ పక్క క్యాంపు నుంచి ఇంతకుముందే అందింది. పదిమంది జవాన్లను అదే డ్యూటీ మీద ఉంచాను. వెదుకుతున్నారు వాళ్ళు" అన్నాడు మేజరు సుదర్శనం.
    "వాళ్ళు వదిలేసి వెళ్ళిన యాంబులెన్సు ఒక్క అరగంట క్రితమే మీ క్యాంపుకి వచ్చేదారిలో దొరికింది" అన్నాడు తరుణ్.
    మేజర్ సుదర్శనం గొంతులో ఆదుర్దా కనబడింది. "ఈజిట్ సో? అయితే వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉంటాము సార్! ఇక్కడ కల్చరల్ ప్రోగ్రాం ఒకటి జరుగుతోంది. దాన్ని కూడా కాన్సిల్ చేయించి మొత్తం అందరినీ ఇదే డ్యూటీ మీద ఉంచుతాను."
    నిటారుగా కూర్చున్నాడు తరుణ్.
    "కల్చరల్ ట్రూపా? అదేమిటి?"
    "బాంబే నుంచి ఒక కల్చరల్ ట్రూపు జవాన్లకు వినోదం కలగజేయ్యడానికి ఇక్కడికి వచ్చింది సార్!"
    "దానిలో ఈతొడు దొంగలిద్దరూ కలిసిపోలేదని రూడీ చేసుకున్నారా?"
    మేజరు సుదర్శనం కొద్ది క్షణాలపాటు నిరుత్తరుడయ్యాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు. "సారీ సార్! నేను ఆ యాంగిల్ లో నుంచి ఆలోచించలేదు."
    "దయచేసి కన్ ఫర్మ్ చేసుకుని ఏ సంగతీ నాకు ఇప్పుడే చెప్పండి. నేను ఇక్కడే కాచుకు కూర్చుని ఉంటాను."
    "తప్పకుండా సార్!" అని, కొద్దిగా పాలిపోయిన మొహంతో ప్రోగ్రాం జరుగుతున్న చోటికి వచ్చాడు మేజర్ సుదర్శనం.
    ప్రోగ్రాం చివరికి వచ్చేసింది. ఆఖరి ఐటమ్ , గిరిజన నృత్యం ప్రారంభం కావాలి ఇంక.
    అప్పటిదాకా ఉత్తేజకరంగా సాగింది ప్రోగ్రాం. జవానులు బాగా ఎన్ జాయ్ చేస్తున్నారు. మళ్ళీ తెర ఎప్పుడెప్పుడు లేస్తుండా అని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా.
    అయిదు నిమిషాలు గడిచాయి.
    కానీ తెరలేవలేదు.
    పది నిమిషాలు గడిచాయి.
    అందరూ చాలా అసహనంగా ఫీలవుతున్నారు.
    కానీ వాళ్ళందరూ సుశిక్షితులయిన సైనికులు కావడం వల్ల క్రమశిక్షణతో, నిశ్శబ్దంగా కుర్చుని ఉన్నారు.
    స్టేజివెనకగా, ఏర్పాటు చేసిన గ్రీన్ రూంలోకి వెళ్ళాడు మేజర్ సుదర్శనం.
    అక్కడ నిప్పుతొక్కిన కోతిలా అడిపోతున్నాడు ట్రూపు మేనేజరు.
    "ఏమయింది?" అన్నాడు మేజరు సుదర్శనం కంగారుగా.
    "గిరిజన నృత్యంలో పాల్గొనవలసిన ఆర్టిస్టులు ఇద్దరు కనబడటం లేదు సార్!"
    సుదర్శనం మొహం రందులు మారింది.
    ట్రూపు మేనేకరు చెబుతూనే ఉన్నాడు. "బుద్ది గడ్డితిని ఈ కొత్త వాళ్ళను ఇద్దరినీ చేర్చుకున్నామండీ! దుంపదెంపేస్తున్నారు! ఇంతకుముందు క్యాంపులో బయలుదేరినప్పుడు ఇంతే! ప్రకృతి ఆరాధన అని వంకబెట్టుకుని అందరితో బాటు రాకుండా ఇద్దరూ సపరేట్ గా బయలుదేరారు . దార్లో మళ్ళీ వీళ్ళు దొరికేదాకా రాకుండా చచ్చాంసార్! మళ్ళీ ఇప్పుడు అంతర్ధానమై పోయారు! సార్! మీకు తెలిసే ఉంటుంది! డాన్సు అంటే మీ మిలటరీ కవాతులాంటిది. ట్రూపులో ఇద్దరు మిస్సయి పోయారంటే గడియారంలో మెయిన్ స్ప్రింగు తెగిపోయినట్లే! చెప్పండి సార్!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS