Previous Page Next Page 
అతడు భార్య ప్రియుడు పేజి 37

   
    జి. కె. మంచంపైన వున్నాడు, లేవలేడు,  లేచినా కళ్లు తిరిగి కింద పడతాడు. పనివాళ్లు మేడం గదిలోకి అనవసరంగా  రారు.

    "ఇంతకంటే అవకాశం ఏమిటి?"

    ఆమె తనని కావాలనే గదిలోకి పిలిచింది. లేకపోతే కింద హాల్లోకే వచ్చేది కదా.

    " నేనడిగిందానికి సమాధానం చెప్పలేదు" అంది క్రీగంట చూస్తూ.

    "ఏమిటి?"

    "నేనోసారి మాట్లాడితే వెంటనే పాయింట్ ని కాచ్ చేయాలి నరేంద్ర! బాస్ ఏం చెప్పారో నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు!"

    అతను నిర్ఘాంతపోయాడు.

    "నువ్వు నా గురించి ఏం వివరాలు సేకరించావు?"

    అతను మాట్లాడలేదు.

    ఆమె మళ్ళీ నిలబడింది. అటూ ఇటూ తిరిగింది.

    "నాకు నువ్వంటే ఓ అభిమానం. అందుకే పిలిచాను, ఇంతసేపు మాట్లాడాను. నాకు బాస్ వూహించే గతం ఏదీ లేదు. వై దే ఆఫ్ బర్త్ ఐ మే బి పూర్ మిష్టర్ నరేంద్రా! కారెక్టర్ విషయంలో నేనిప్పటివరకు నిప్పునే!"

    ఆ మాటల కతను నిప్పుమీద నీళ్లు పోసినట్లు చల్లారిపోయాడు.

    బిక్కుబిక్కుమంటూ ఆమెకేసి చూశాడు.

    ఆమె అతని వెనకగా వచ్చి  వంగి అతని భుజాలమీద చేతులు వేసింది. పూలబంతులు మెత్తగా అతని తలకి తగులుతున్నాయి.

    "నా గురించి నువ్వేం తెలుసుకున్నావో  వినాలని క్యూరియాసిటీగా వుంది. చెప్పవూ" అడిగింది.

    ఆమె ధోరణి అతనికి అర్దం కావడంలేదు. తనని ఎటు తీసుకుపోతుందో అంతకంటే తెలీడంలేదు.

    కానీ తను చెప్పకపోతే ఆమె ఊరుకోదు. ఆమెకి తను సేకరించిన వివరాలు చెప్పినట్లు తెలిస్తే జి. కే. తనని కాల్చిపారేస్తాడు.

    అతను లేచి నించున్నాడు. ఆమె అతనికి ఎదురుగా వచ్చి దగ్గరగా నించుంది.

    ఆమె ఊపిరి చందనపు పరిమళంలా వుంది.

    అతని నడుంపైన చేతులు వేసింది నాగమణి.

    "చెబితే నా అండ నీకుంటుంది.  చెప్పకపోతే... నువ్వు నన్ను రేప్ చేయబోయావని  అరిచాననుకో... సింపుల్ గా జైలుజీవితం అనుభవించాల్సి వస్తుంది. జి. కె ని నమ్ముకుంటే నీకు దక్కేది మిగిలేది బూడిద మాత్రమే." అతను ఊహించని రీతిలో అతని తలని ముందుకు వంచి చెంపపైన ముద్దుపెట్టుకుంది.

    నాగమణిలాంటి సౌందర్య దేవత ముద్దుని ప్రసాదిస్తే ఈ ప్రపంచాధినేత అయినా కూడా దాసోహం అవాల్సిందే! ఈ నరేంద్రలాంటి సామాన్యు డెంత?

    "మేడం" అతను గుటకలు మింగాడు.

    ఆమె నవ్వింది.

    "పెళ్లి కాకపోయినా వయసొచ్చిన వాడివి. అడ్డదారులు తొక్కి వుండకపోతే ఇదే నీకు  ఓ ఆడదిచ్చిన  ముద్దు కావచ్చు."

    "ముద్దేం కర్మ. నువ్వు నాకు సహకరిస్తే ...."

    ఆర్దోక్తిగా ఆగిపోయింది ఆమె.

    అతను ఉద్రేకంగా ఊగిపోతూ ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు.

    ఆమ అతని చెంపపైన చెళ్లుమని కొట్టింది.

    ఆమె చర్యలు అర్దంకాక దోషిలా నిలబడిపోయాడు.

    "తొందరెందుకు? ఎప్పుడు ఎలాంటి కానుకలు నీకియ్యాలో నాకు  తెలుసు. అప్పుడే తీసుకోవాలి. ఓకే? నువ్వు చెప్పడానికి భయపడుతున్నావో సందేహిస్తున్నావో నాకు అనవసరం. నా గురించి తెలుసుకుంటే బాస్ నీకేం ఇస్తానన్నాడు?" అడిగింది నాగమణి.

    "పది వేలు! చెప్పాడు.

    ఆమె విస్మయంగా చూసింది.

    "టెన్ తౌజండ్. ఆఫ్ట్రాల్ పదివేలు!"

    ఆమె పక పకా నవ్వేసింది.

    అతను చెంప సవరదీసుకుంటూ పిచ్చిగా చూస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS