Previous Page Next Page 
అతడు భార్య ప్రియుడు పేజి 36

   
    "నీపెళ్లెప్పుడు?" అడిగింది.

    "జి. కె. గారు ఒప్పుకొన్నప్పుడు!"

    అతని సమాధానానికి ఆమె నొసట్లు ముడిపడినాయి.

    "ఆయన  ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోవా?"

    ఆమె చెయ్యి పువ్వులా అతని భుజంపైన పడింది. అతను ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.

    "మాట్లాడవే?"

    "ఆయన మాటకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఉద్యోగంలోంచి తీసేస్తాడు."

    "ఉద్యోగం పోతుందని ముసలివాడివయ్యేవరకూ  పెళ్ళిచేసుకోవా?" అప్పుడు నువ్వు కూడా జి. కె. లానే అయిపోతావు."

    "అంటే" అయోమయంగా అడిగాడు.

    అతని భుజాన్ని నొక్కి విడిచిపెట్టింది.

    "ఉద్యోగం పోతే మళ్లీ ఉద్యోగం  సంపాదించుకోవచ్చు నరేంద్రా! కానీ వయసు పోతే మళ్లీ జన్మఎత్తేవరకూ దాన్ని  సంపాదించుకోలేవు."

    ఆమె మాటల్లో నిజాన్ని అతను గ్రహించాడు.

    "అయిదువేలు జీతం, స్కూటరు ఇవన్నీ నాకెలా వస్తాయి."

    ఆమె వేళ్ళు అతని మెడని తాకాయి!

    అతని శరీరంలో  ఉష్ణోగ్రత పెరుగుతోంది.

    సన్నగా అతని శరీరం కంపించడం నాగమణి పసికట్టింది.

    ఆమె పళ్ళమధ్య కింది పెదిమని బిగించింది.

    "జి. కె. చనిపోతే నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను. అప్పుడేం చేస్తావ్?"

    అతను వులిక్కిపడ్డాడు.

    "మేడమ్!"

    ఆమె వక్షోజాలు పూలబంతుల్లా కళ్ళకి దగ్గరలో, చేతులకి అందుబాటులో.....

     టెన్షన్ ... చచ్చిపోతున్నట్లుగా వుంది.....

    అతని ఊపిరి అతనికే వెచ్చగా పోతోంది.

    "జి. కె. చాలా త్వరలో చచ్చిపోతారు నరేంద్ర. అప్పుడు నేనే కదా సర్వాధికారిణిని."

    "యస్ మేడం!"

    "గుడ్. కనీసపు జ్ఞానం వుంది. కానీ నీకింకా జ్ఞానోదయం కాలేదమో!"

    "అవును మేడమ్!"

    "రియల్లీ యూ ఆర్ గుడ్ నరేంద్ర. అందుకే బాస్ చెప్పిన పిచ్చి పనులన్నీ చేస్తున్నావు" బెడుసుగా అంటూ సోఫా వెనక్కి వచ్చి రెండు చేతులతో అతని చెంపలని స్పృశించింది.

    అతను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు.

    ఆడది తలుచుకొంటే మగాడ్ని కుక్కని ఆడించినట్టు ఆడించగలదనడానికి అంతకంటే నిదర్శనం అక్కర్లేదు.

    అతని శరీరం అగ్నిగుండం అవుతోంది.

    ఏదో తొందరపాటు....

    మనసులో హోరు.....

    ఆమెని గట్టిగా కౌగిలించుకోవాలనీ, మంచంమీద ఆమె పక్కన చేరాలనీ, మళ్లీ మళ్లీ అంత చేరువలో ఆమెతో మాట్లాడే అవకాశం దొరుకుతుందో లేదో......

    అతను  లేచి నిలబడబోయాడు. ఆమె అతని భుజాలని పట్టి గుచ్చి లేవకుండా కూర్చోబెట్టింది.

    " తొందరేమిటి? గలగలా నవ్వి   వెళ్లి అతనిముందు కాలుమీద కాలువేసుకు కూర్చుంది.

    రెండు ఆకులమధ్య చీలకలా..... నైటీ విడిపోయి.... ఆమె కాలి పిక్కలు, తొడలు.....

    నున్నగా ఒళ్లు,........

    అతను కళ్లు ఆర్పుకోలేక పోతున్నాడు.

    ఆమె అన్న మాటకి అర్దం ఏమిటి?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS