Previous Page
Next Page
అతడు భార్య ప్రియుడు పేజి 34
నాగమణి నిట్టూర్చింది.
"ఈ చరిత్ర నాకు ముందే తెలిస్తే ఎంతో బాగుండేది!"
" ఈముసలినక్కకి ఆహారం అయ్యేదాన్ని కాదు" అమె ముక్కుపుటలు ఎగిసిపడినాయి.
"దేవయాని ఎక్కడుంది తెలీదా?"
" తెలీదమ్మా!" ఎటోచూస్తూ చెప్పాడు మల్లన్న.
"సరే, నువ్వెళ్ళు" అంది నాగమణి.
అతను వెళ్ళిపోయిక ఆలోచనలో పడిపోయింది నాగమణి.
జి.కె.కి కూతురు వున్నదంటే వీలునామా బయటకు అమె పేరునే వస్తుంది. అమె వారసురాలు అవుతుంది.
మరి తను?
అతను పెళ్ళాడిన వ్యక్తిగా తనకి కూడా హక్కు వుంటుంది.
కానీ జి.కె. ఇష్టపూర్వకంగా తీసుకొనే నిర్ణయాన్ని తను సవాలు చేయలేకపోవచ్చు.
ఆ క్షణంలో ఎందుకో అమెకి విరక్తిలాంటిది ఏదో కలిగింది.
తను అశించింది ఏమిటి? జరుగుతోంది ఏమిటి? అస్తవ్యస్తమైన ఆలోచనలు అమెని దహించసాగాయి.
ముందు వీలునామా సంగతి తెలుసుకోవాలి.
ఆ నరేంద్రగాడినే ఆ అస్త్రంగా వాడుకోవాలి. ఆలోచనలతోనే ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది నాగమణి.
* * *
"మే ఐ కమీన్" గది గుమ్మం దగ్గర కర్టెన్ వెనక నిలబడి అడిగాడు నరేంద్ర.
"కమాన్" వీణ మీటినట్లు పలికింది లోపలి కంఠస్వరం.
గదిలో అడుగుపెట్టాడు నరేంద్ర
గదిలో పరిమళ సౌరభానికి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ చూశాడు.
అది నాగమణి బెడ్ రూం.
మంచంమీద పట్టుపరుపు పైన కూర్చొని వుంది నాగమణి అపర రతీదేవిలా
ఆ గదిని చూస్తుంటే అతని కళ్లు చెదిరిపోయినాయి
గోడలపైన పెయింటింగ్స్.... ప్రవరాఖ్యుడిని సైతం రెచ్చగొట్టేలా వున్నాయి.
ఓ అడుగు వెనక్కి వేస్తూ.
"పిలిచారట మేడం!" అన్నాడు నీళ్లు నములుతూ
అమె వయ్యారంగా ఓ పక్కకి కదులుతూ చిన్నగా నవ్వింది.
జి.కె. జబ్బుతో మంచంపైన వుండగా, అతని భార్య పడగ్గదిలోకి తను అడుగుపెట్టడం ఎంత ప్రమాదమో అతనికి తెలుసు
అంతకంటే జి.కె. గురించి బాగా అర్దం అయిన వాడు.
తను పెళ్ళిచేసుకొని సుఖపడ్డంకూడా జి.కెకి ఇష్టంలేదు. అలాంటి సాడిస్టు వెధవ. అదీకాక తన భార్య గురించి వివరాలే సేకరించమని తనని నియమించిన బ్రూట్.
అతని దగ్గర పనిచేసే ఉద్యోగిగా తనకి తప్పడంలేదు. తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి అంతకంటే మార్గంలేదు.
అమె మనోహరంగా నవ్వింది.
"నిలబడి.తే ఎలా? బాస్ కి అంతరంగికుడివి. కూర్చోవచ్చు" అంది మునిపంటితో కింది పెదిమని కొరుకుతూ.
అమె ఒంటిపైన పల్చటి నైటీ, లోపల బ్లాక్ కలర్ బ్రా. తొడలకి అతుక్కున్న పాంటీ.....
అమె జగదేక సుందరిలా వుంది.
కళ్ళార్పకుండా అమెనే చూడాలని వుంది. కనురెప్ప పడితే ఆ సౌందర్యాన్ని క్షణంపాటు ఎక్కడ మిస్ అవుతానో అనిపించేలా- అమె.
కాని భయం....
ఎందుకొచ్చానా అని ఓ పక్క... ఇంత అందాన్ని అరాధించే అవకాశం తనకే దొరికినందుకు ఓ పక్క ఆనందం
గోడలపైన ప్రాణంలేని బొమ్మలు మనసుని రెచ్చగొడుతున్నాయి. ఎదురుగా వున్న ప్రాణం వున్న బొమ్మ మతిని పోగొడుతూ పిచ్చెక్కిస్తోంది.
Previous Page
Next Page