Previous Page Next Page 
అతడు భార్య ప్రియుడు పేజి 31

   
    "ప్రతి వాళ్ళకి ఎన్నో ఆశలు, కోరికలు వుంటాయి. కొందరికి అవి తీరతాయి. మరి కొందరికి  ఎండమావులవుతాయి"

    అమె నిశ్శబ్దంగా వింటోంది.

    అమెకి అసహనంగా వుంది. కాని తన చిరాకుని బయటికి కనిపించనీయకుండా జాగ్రత్త పడింది.

    " నా అదృష్టం బాగుంటే నీ అంత కూతురుండేదమ్మా! అందుకే నిన్ను చూసినప్పటినుంచి అభిమానంతో, ప్రేమతో నా గుండె నిండిపోయిందమ్మా. ఆ అభిమానమే నాచేత ఇలా వాగిస్తోందమ్మా!గత రెండు రోజులనించి ఆయనగారిలో మార్పు కనిపిస్తోందమ్మా! ఆయన  నీకు అన్యాయం చేస్తారేమోనని భయంగా వుంది"

    అతని మాటలకి ఉలిక్కిపడింది నాగమణి." అన్యాయం చేయడమంటే ఏం చేస్తాడు? ఇంట్లోంచి గెంటుతాడా?"

    " కొంచెం ఉద్రేకంగా అంది.

    "అది కాదమ్మా! మొన్న లాయరుగార్ని పిలిపించి రెండు గంటల సేపు మాట్లాడారు. కాగితాలు ఏవో రాయమన్నారు. బహుశా వీలునామా రాస్తారేమో!"

    వీలునామా!"

    ఇప్పుడు దాని అవసరం వచ్చినట్లు జి.కె గ్రహించాడా?

    ఎవరున్నారని రాస్తాడు?

    తనే కదా వుంది!

    ఏం రాయమన్నాడో  ఎలా తెలుస్తుంది!

    అమెకి నీరసం ముంచుకొచ్చేసింది.

    "నీ మీద అనుమానం కదమ్మా! అందుకే నీకేమి చెందకుండా చేస్తాడని భయంగా వుంది". అన్నాడు మల్లన్న.

    "నాకేదో నష్టం జరుగుతుందని నీకెందుకు బాధ!" అంది.

    "చెప్పాను కదమ్మా! నువ్వు నా బిడ్డలాంటిదానివి."

    అమె విని వూరుకుంది. అతన్నించి సమాచారం తెలసుకోవాలే తప్ప తను బయటపడకూడదు.

    తను ఆశించింది వేరు.

    డబ్బుని తను కట్టుకుపోవాలని కాదు. దాన్ని సద్వినియెగం చేయాలి.

    డబ్బులేక తను పడిన కష్టాల్లాంటివి ఇంకెవరికి వుండకూడదంటే ఏదో ఒకటి చేయాలి. నలుగురికి సాయపడాలి. బీదవిద్యార్దుల్ని చదివించాలి. పేదింటి అడపిల్లల పెళ్ళిళ్ళకి సాయపడాలి. ఇంకా  ఇలాగే ఎన్నో ఆలోచనలు....

    ఆశయాలు మంచివే, కాని మధ్యలో మనసు రేపే కోరికలు కాష్టంలా కాలిపోతుంటే భరించలేక దారితప్పుడు ఆలోచనలు.

    వెంకటపతిరాజుగారు రాజకీయాల్లో దిగమంటే తను అశించింది కూడా అదే. చేతిలో అధికారం వుంటే తోచిన సాయం చేయగలదు.

    తనదసలే డిస్ట్రబ్ లైఫ్.

    అది మరచిపోడానికైనా ఏదైనా చే.యాలనుకొంటుంది.

    కాని డబ్బు, అధికారం లేకుండా్ తనేమీ చేయలేదు.

    జి.కే. ఎన్నివిధాల హింసించినా ఓర్పుతో భరించింది ఎందుకు?

    జి,.కె కోట్ల అస్తికోసం.

    అసలు మల్లన్న చెప్పేది నిజమేనా?

    అతని గురించి తనకి బాగా తెలుసు. తన పట్ల అతని గల అభిమానం ఎలాంటిదో అమెకి తెలుసు. కానీ మల్లన్న జి.కె. దగ్గర ముప్పై యేళ్ళుగా పనిచేస్తూ అతని ఉప్పు తినేవాడు. అలాంటివాడు జి,.కె.కి సంబంధించిన విషయాలు తనకి ఎందుకు చెబుతాడు. జి.కె. అతనితో నాటకం అడించడం లేదుకదా. అన్న అనుమానం కలుగకపోలేదు.

    మల్లన్న కింద గడ్డిలో కూర్చున్నాడు.

    "అమ్మా, బాధపడనంటే మరో విషయం వుందమ్మా?"

    "ఏమిటది?" ఆసక్తిగా అడిగింది.

    "ఈ మధ్య చాలాసార్లు...."

    "చెప్పు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS