కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగింది.
అక్కడ కూర్చోబుద్ది కాలేదు.
క్లబ్బుకి పోనిచ్చింది కారుని.
ఆమెకి మనస్థిమితం పోయింది.
కిరణ్ గుర్తుకొస్తేనే అంత!
తనదే తప్పేమో!
పరిచయాన్ని స్నేహంగా , స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంది.
అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ముందుకి వెళ్ళడం తనదే తప్పు. మగాడికేం? ఆడది తేరగా దొరికితే సరదా తీర్చుకుంటాడు.
తనని ఎలా పడితే అలా ముట్టుకునేవాడు.
ఎలాగూ పెళ్ళి చేసుకుటాడు కదాని నమ్మింది.
అతన్ని పెళ్లి చేసుకుంటే ఇంట్లో తల్లీ తండ్రికి భారం తగ్గుతుందని ఆశించింది. తను రెగ్యులర్ గా ఫోన్ చేసి అతనితో మాట్లాడేది! ఆఫీసు గేటు దగ్గరకొన్ని నించునేవాడు. లేకపోతే తనింటికి దగ్గర్లో వున్న బస్ స్టాప్ దగ్గరికి తన వెహికల్ పైన వచ్చేవాడు. దానిపైన ఇద్దరూ వెళ్ళేవాళ్ళు.
ఎందుకొస్తున్నాయి ఈ ఆలోచనలు.
ఆ రాస్కెల్ గురించి తను ఆలోచించడమే తప్ప.
క్లబ్ లో సందడిగా వుంది.
ఆమె స్విమ్మింగ్ పూల్ దగ్గరికి నడిచి ఓకుర్చీలో కూర్చుంది. అస్థవ్యస్థమైన ఆలోచనలు... కార్చిచ్చులా ఆమెని దహించి వేస్తున్నాయి.
ఒటరితనం ఎంత భయంకరమైనది.
తను ఓ భర్త వుండీ ఒంటరిదే.
పిల్లలు లేరు. ఆ భర్త వల్ల పిల్లల్ని పొందలేదు. ఇక ఈ ఒంటరి బ్రతుకింతేనా!
అందమైన జీవితం పొందే యోగం తనకి లేదు. ఇక ఈ ఒంటరి బ్రతుకింతేనా!
"రాస్కెల్" ఉద్రేకంతో ఆమె పెదవులు వంకర్లు తిరిగాయి.
" హలో"
తలెత్తి చూసింది.
ఆరడుగుల ఎత్తైన విగ్రహం. పెదాలపై చిరునవ్వు, వుంగరాల జుట్టు,విశాలమైన నుదురు, మోటైన పెదవుల.మళ్ళీ ఒకసారి చూడాలనిపించే ఆకర్షణీయ ముఖం.
సభ్యత కోసం "హలో" అంది. అతనెవరో తెలీకపోయినా.
" మీ ఏకాంతాన్ని భగ్నం చేసానా?" అడిగాడతను.
" నథింగ్. మీరు....?" అంది అర్ధోక్తిగా.
" అయాం మిష్టర్ విజయ్.... ఆటోమోబైల్ ఇంజనీర్ని"చెప్పాడతను.
" ఐ. సీ" అంది.
"ఇక వేరే మీ గురించి నాకు చెప్పనవసరం లేదు. మీరు మిసెస్ జి.కె. అని చాలా మందికి తెలుసు..... బై దిబై, నేను మీ కంపెనీలోనే పనిచేస్తున్నాను." అన్నాడు.
" కూర్చోండి" అంది ప్రక్కకుర్చీ చూపిస్తూ.
క్లబ్బుల్లోనూ , పబ్లిక్ ఫంక్షన్ లోనూ సాధారణంగా పరిచయాలు కలుగుతాయి.
"ఒంటరిగా వచ్చారా?" అడిగాడు.
ఆ కళ్ళలో ఆకర్షణలకి తట్టుకోలేకపోతోంది.ఆమె చురుగ్గా చూసింది.
"అవును"
" బాస్?"
