Previous Page
Next Page
అతడు భార్య ప్రియుడు పేజి 25
" ఈ ఓల్డ్ బాండి కాట్ కి భార్యని ఉద్ధరించటం తెలీదు. అచ్చట ముచ్చట తీర్చటం తెలీదు. తనలోని బలహీనతని కప్పిపుచ్చుకోడానికి నేనేదో తప్పుచేసినట్లు హింసలు పెడ్తాడు. ఇలాంటి వాళ్ళని మగాళ్ళని ఎందుకంటారో నాకు తెలీదు. కొజ్జాలనాలి" ఆవేశంతో అంది.
జి.కె. ముఖ కవళికలు మారిపోయినయ్. మంచంమీంచి లేచి శక్తి ఉంటే ఈపాటికి ఆమె రక్తం కళ్ళచూసేవాడు.
నగామణి అక్కడ్నంచి విసురుగా వెళ్లిపోయింది.
* * *
జి.కె. సాధారణంగా ఏసుస్తీ చేయదు. కాస్త తలనొప్పిలాంటిది ఏదన్నా వచ్చినా ఓ అరగంట!
"అయ్యగారికి చాలా ఎక్కువైందమ్మా! చెప్పాడు మల్లన్న.
"సిస్టర్ దగ్గరే వుందిగా!
" ఆ"
డాక్టర్ చూసి వెళ్లారుగా!"
"చూశారమ్మా!"
" ఇక నేను చేసేదేముంది?" అంది.
" నిజమేనమ్మా!అసలా సంగతే మరిచిపోయాను."
" నువ్వెళ్లు"
"భోజనం వడ్డిస్తానమ్మా"
ఆమెకి చికాకుగా వుంది. ఏం తినాలనిపించడం లేదు.
"ఒద్దు గ్లాసు పాలు తీసుకురా" అంది.
ఓక్షణం పాటు ఆమె కేసి చూసాడు మల్లన్న.
"రోజుకు ఓ పూటన్న భోజనం చేయడం మంచిదమ్మా!"
"నాకు ఆకలిగా లేదు, పాలు చాలు."
అతను వెళ్లి గ్లాసుతో పాలు తీసుకువచ్చాడు
పాలు త్రాగి గ్లాసు అందించింది.
"మీరు విశ్రాంతి తీసుకోండమ్మా" అని వెళ్ళిపోయాడు.
నాగమణి నిర్వికారంగా నవ్వింది.
తనకి విశ్రాంతా?జి.కె. కొట్టే చావుదెబ్బలతో అలసిపోవడం తప్ప. ఆదెబ్బలు ఆరకముందే పచ్చి ఒంటిని తిరిగి అతను పచ్చి పుండును చేస్తుంటే ఇక విశ్రాంతి ఎక్కడిది?
రేపు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అతను తిరగి ఎలా టార్చర్ చేస్తాడో ఆమెకి తెలీని విషయం కాదు.
ఎత కష్టపెట్టినా.... హింసించినా, తను చేయాలనుకున్నది చేయడానికి నిశ్చయించుకుంది.
దెబ్బలతో మొండితనం వచ్చింది. భయం పోయింది.
సాయంత్రం ఆరుగంటలకి ముస్తాబయి మారుతీ కారులో ఒంటరిగా బుద్ధ పూర్ణమ గార్డన్ చేరుకుంది.
చిన్న కాంటీన్లోంచి మైకులో పాటలు వినిపిస్తున్నాయి.
ఎన్నో జంటలు .... పెద్ద చిన్న!
పిల్లలు......
హూస్సేన్ సాగర్ నుంచి చల్లని గాలి, గట్టుమీద వున్న సిమెంట్ బల్లపైన కూర్చుంది.
రోయింగ్ బోటుల్లో జంటలు....
ఆహ్లాదకరంగా వుంది వాతావరణం.
ఆమెకి వంటరితనంలో ఎక్కడలేని దిగులు కలిగింది.
ఓసారి తను కూడా అలాగే బోటులో కిరణ్ తో వెళ్ళింది. అతనితో ఎన్నోసార్లు అక్కడి కికొచ్చింది.
ఎన్ని కబుర్లు చెప్పేవాడు.
ఎన్ని మాయలు చేసేవాడు.
" చీట్"
ఆమె ఉక్రోషంతో క్రింది పెదవిని నొక్కుకుంది.
Previous Page
Next Page