Previous Page
Next Page
అతడు భార్య ప్రియుడు పేజి 27
" జ్వరంగా వుంది... అయినా ఆయన ఎక్కడికీ వెళ్ళరు"
విజయ్ ఐస్ క్రీం తెప్పించాడు.
"నాకు తోచక వచ్చాను" మెల్లగా అంది.
అతను సిగరెట్ పేకెట్ తీసి "మీకు అభ్యంతరం లేకపోతే?" అన్నాడు.
"నో ప్లీజ్... కారీ ఆన్" అంది.
తనభర్త సిగరెట్ వెలిగిస్తే తనని కాల్చడానికే. మామూలుగా కాల్చుకునేవాడిని తనెందుకు ఆభ్యంతరం పెడుతుంది? తనకి పెద్దగా పట్టింపు కూడా లేదు.
విజయ్ సిరరేట్ వెలిగించాడు.
అతనంతట అతనే వచ్చి పరిచయం చేసుకున్నాడు. మాట్లాడాడు. అతన్ని ఎదురుగా కూర్చోమంది. సిగరెట్ కాల్చాలని అడిగితే అభ్యంతరపెట్టలేదు.
తెలిస్తే జి.కె. ఎంత గొడవ చేస్తాడు?
అతని ఆకర్షణకి తను లొంగిపోతున్నాదా?
తను క్లబ్బుకి వచ్చినట్లు తెలిస్తే అగ్గిమీద గుగ్గిలం అవుతాడు.
స్విమ్మింగ్ పూల్ వద్ద కొందరు ఆడవాళ్ళు ఈత కొడుతున్నారు.
అతనటు చూస్తుంటే అడిగింది నాగమణి.
"ఏంటలా చూస్తున్నారు?
నాకింకా పెళ్ళి కాలేదు" అంటూ నవ్వాడు.
అతనా సమాధానం ఎందుకిచ్చినట్టు? తను ఆ విషయం ఆడగలేదే! కిరణ్ నీ తను ఆడగలేదు. అతనూ చెప్పలేదు. అదే పొరపాటు.
లేకపోతే చనువిచ్చేది కాడు. కిరణ్ గుర్తుకి వస్తే గుండెని ముల్లుకోపొడిచిన్లుగా వుంటుంది.
ఎంత మోసం!
" మీకు స్విమ్మింగ్ వచ్చా!" అడిగాడు విజయ్.
ఆమె నవ్వింది.
"కొద్దిగా"
Previous Page
Next Page