Previous Page Next Page 
అతడు భార్య ప్రియుడు పేజి 22

   
      నరేంద్ర అన్నాడు. " బాస్ కి సుస్తీ చేసిందని తెలిస్తే పలకరించటానికో, చూడటానికో  వస్తారు. బాస్ కి విశ్రాంతి లేకుండా పోతుంది. అందుకని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు" అన్నాడు.

    "చెప్పకపోతే ఎలా? అయ్యగారు రాకపోతే అందరికీ తెలిపోదా?"  అన్నాడు మల్లన్న.

     "కాంప్ కెళ్లారని చెబుదాం"

     " అసలేమీ చెప్పకపోతే ఎవరడగుతారు?" ఏకంపెనీకి వెళ్లారో! ఏ మీటింగులో వున్నారో అనుకుంటారు,"

    మల్లన్న మాటలకి ఆదోలా చూశాడు నరేంద్ర . ఈపాటి ఆలోచన తనకెందుకు రాలేదూ!

     " అమ్మగార్కి తెలుసా?"

     "తెలీదు"

     "  పద వెళ్ళి చెబుదాం!"

     "నేను   చెపుతాలే బాబు!" అన్నాడు. మల్లన్న కి తెలుసు సెక్రటరీతో అమ్మగారు మాట్లాడిందని తెలి్స్తే జి.కె. అగ్గిబరాటా  అవుతాడు. మళ్ళీ పిచ్చికొట్టుడు కొడతాడు.

      " నేను మాట్లాడతాను."

    మల్లన్న ఇంకేం మాట్లాడలేదు.

     నాగమణి గది దగ్గరికి నడిచి గుమ్మం దగ్గర ఆగి  "మే ఐ కమి న్ మేడమ్" అన్నాడు.

     నాగమణి  మంచం దిగి సోఫాలో కూర్చుంటూ  "రండి"  అంది.

    లోపలికొస్తూ ఆమె కేసి చూశాడు. నరేంద్ర.

     అపర  రతీదేవిలా వుంది నాగమణి.

     "  నమస్తే మేడం!" ఆమె ముందు నించున్నాడు.

    "కూర్చోండి"

    కూర్చుంటూ  చెప్పాడు "జి.కె.  గారికి ఒంట్లో బాగొలేదు."

    "  ఏమైంది?" భృకుటి ముడి వేస్తూ అడిగింది.

      "జ్వరం"

     " హర్టెటాక్ కాదుగా"

     " మేడం!" అన్నాడు కంగారుగా.

      " ఏ.... మేడం  అలా అడిగిందే అని ఆశ్చరంగా వుందా?"

      "అది కాదు, ఆయాన్న కొంచెం జాగ్రత్తగా చూడాలని డాక్టర్ గారు చెప్పారు."

     "ఐ.సీ!"

     "మీరు దగ్గరుండి..... అతని చూపు అదోలా వుంది.

    నాగమణి నవ్వింది.

      "నేను ఆయ దగ్గర లేకపోతే మంచిది.... డాక్టర్లు అలాగే చెపుతారు."

    " అలా అంటే ఎలా మేడం,ఆయన....."

    నాగమణి  నవ్వింది.

     "జి.కె. లాంటి వాళ్ళకి నౌకర్లు, స్నేహితులు, సెక్రటీలు చాలు. ఓ పదిమంది డాక్టర్లకి చూపించండి. ఓ  పాతికమంది నర్స్లను పెట్టండి. నేను వస్తే మీ బాస్ పిచ్చికుక్క అయిపోతారు" అంది.

    నరేంద్రకి కథ చాలావరకు అర్థం  అయింది.

    ఆయన తన భార్య గురించి  వివరాలు తెలుసుకొమ్మాన్నాడు.

    ఈమె మొగుడికి జబ్బు చేస్తే వందమంది డాక్టర్లని, వెయ్యిమంది నర్స్ల్ లను పెట్టమంటోంది.

     మొత్తానికి కథ రసకందాయంగానే వుంది.

     " ఓ. కె. మేడం. మీరు ఆయన ఆరోగ్యం గురించేమీ కంగారు పడకండి. అదే సర్దుకుంటుంది."

     "ఆందేళనా! ఎవరిక్?" అంది.

     నరేంద్ర చిరునవ్వుతో చూసాడు.

     " మీరు  వేరే మూడ్  లో వున్నారు. మళ్ళీ వస్తాను.ఆపీసులోకొన్ని ముఖ్యమైన పనులున్నాయి. అవి చూసుకుని వస్తాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS