Previous Page Next Page 
అతడు భార్య ప్రియుడు పేజి 23

   
    "నన్ను కలుసుకోడానికా! జి.కె. ని చూడ్డానికా?"

     నరేంద్ర రెండు  క్షణాలు తటపటాయించాడు. " మీరు ఎలా అనుకున్నా ఫర్వాలేదు."

     " ఓ.కే."

    " వెళ్తాను మేడం!" అన్నాడు  నరేంద్ర.

     ఆయన వెళ్ళిపోయాక మల్లన్న అన్నాడు.

      " ఆయన గారికి వీడు కుడిభుజం. నమ్మడానికి వీల్లేదమ్మా. నక్క తెలివితేటలు.... నాకెందుకో అనుమానం!"

      "కుక్కలు మొరుగుతాయి. కరుస్తాయి. మరికొన్ని కుక్కలు బిస్క ట్లకి లొంగుతాయి.ఇతని సంగతి నేను చూసుకుంటాను" అంది.

     "అయ్యగారికి తెలిస్తే?"

     " ఆయన మంచం దిగకూడదనే నేను దేవుడ్ని  ప్రారిదిస్తున్నాను."

    " అదేమిటమ్మా!"

     " అలాంటి మొగుడున్నా, చచ్చినా  ఒకటే.  నీకు తెలీదేమో!నేను చాలా మొండిదాన్ని.ఒకవేళ  మీ అయ్యగారు చచ్చిపోతే నా బొట్టూ, గాజులూ, పువ్వులూ తీసివేయను. ఆయన కట్టిన మంగళసూత్రం ఒకటే తెంచి పడేస్తాను."

    నాగమణి మనస్సులో ఎలాంటి బాధ వుందో మల్లన్నకి అర్థం అయ్యింది.

     నిజమే, జి.కె.  గురించి తనకి తెలీదా!

    దుర్మార్గుడు.

     తన కళ్ళముందే ఎలాంటి ఘోరాలు  చేశాడో తెలీకపోతే కదా!

    జి.కె.  మంచంపై వుంటే తన జోలికి రాలేడు.

    ఒక విధంగా అదే తనికి రక్షణ.

    " ఓల్డ్ బాండీ కాట్" గొణుక్కుంది.

     మల్లన్న ఆ ఇంట్లో పేరుకి నౌకరే గానీ మంచీ చెడ్డా బాగా తెలిసిన వ్యక్తి. ఎవరి దగ్గరెలా. మసలుకోవాలో బాగా తెలిసిన మనిషి.

    ఏన్నో ఏళ్ళుగా  నమ్మకంగా   అతను జి.కె. ఇంట్లో పనిచేస్తున్నాడు.

    జి.కె. కి జ్వరం వస్తే ముందు డాక్టర్ కి తర్వాత సెక్రటరీకి ఫోన్ చేయడంలోనే అతని తెలివితేటలు వ్యక్తమవుతాయి. భాగ్యవంతుల ఇళ్ళలోని వ్యవహారాలలో ఎలా వుండాలో తెలిసిన వ్యక్తి. క్రొత్తగా ఆ ఇంట అడుగుపెట్టిన తనంటే అతనికి అభినానమే! తన తండ్రిలా  ప్రవర్తిస్తాడు.

     " జి. కె.ని వెళ్లి చూస్తే!"

     ఓసారి వెళ్లి చూసి రావటంలో తప్పేమిటి?

     తప్పేమ లేదు.

     కానీ.... మనస్సు ఒప్పుకోవద్దూ......

     ఒప్పుకోకపోయినా కొన్ని తప్పవు.

     జి.కె. బయట ప్రపంచంలో తనంటే ఎంతో ప్రేమ వున్నట్లు నటిస్తున్నాడు.  ఆసంగతి తనకి తెలుసు.

     అలాగే తనూ నటించాలి.

    ఈ అస్థికోసమైనా సరే!

    ఆస్థి!

      నవ్వుకొంది. ఆస్థి చేతికి చిక్కితే  ఏం చేయలో ఆమెకి బాగా తెలుసు.

    "ఒక్కసారి  అయ్యగార్ని చూస్తారామ్మా?" అన్నాడు మల్లన్న.

    తన మనస్సులో భావాన్ని చదివినట్లుగా అతననేసరికి విస్మయంగా చూసింది.

      "వెళ్దాం" అని లేచింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS