Previous Page Next Page 
భవ బంధాలు పేజి 9


    "మీరోజుల్లో అలా అల్లరి చేస్తే అంతమందిని ఎలా కంట్రోల్ చేసేవారు బామ్మా చెప్పు" అన్నాడు నిజంగా తెలుసుకోవాలనే.
    "ఇంట్లో సమిష్టి కుటుంబాలు, పదిమంది పిల్లలు, వాళ్ళలో వాళ్ళు అడుకునేవారూ, దెబ్బలాడు కునేవారు, మళ్ళీ కల్సి పోయేవారు. ఆడపిల్లలు అంతా చింత పిక్కలు, గవ్వలు,తొక్కుడు బిళ్ళలు...మగపిల్లలు చెడుగుడు, బంతాటలు, పెరళ్ళ లోనో, వీధుల్లో నో పరిగెత్తి ఆడేవారు. అసలు అన్నాలు పెట్టాం అని పిలిస్తేనేగాని వచ్చేవారు కాదు. పొద్దుటే స్నానాలు చేయించి తలలు దువ్వేస్తే , చల్ది అన్నాలు పెట్టేస్తే మా పని అయిపోయేది. చిన్న పెద్ద పిల్లలు వాళ్ళ ఆటలు పాటలు మరీ చంటి పిల్లలు తప్ప రెండేళ్ళ పిల్లలు వాళ్ళ ఆటలు చూస్తూ కూర్చునేవారు. ఆకలేస్తే నే మా దగ్గర కొచ్చేవారు. దెబ్బలు తగిలించుకుని వస్తే ఇంత టించరు రాసేవాళ్ళం . కంప్లయింట్లు వినేవాళ్ళం కాదు. కల్సి ఆదుకోండి అని చెప్పేవాళ్ళం. పెద్దయ్యాక బడిలో వేసాక ఏం చెప్పేవారో ....ఏం చదివేవారో పట్టించుకునే వాళ్ళమే కాదు. అలా పెరిగేవాళ్ళు. మీరా ఈ నాజూకులు అపురూపాలు మేము ఎరగం. తప్పు చేస్తే స్కూల్ అయినా, ఇల్లయినా , రెండు దెబ్బలు వేసేవాళ్ళు తండ్రులు టీచర్లు. ఆ భయ భక్తులు ఎక్కడ ఈనాడు" అలా చెప్పుకు పోతుంది అనసూయమ్మ "అయితే మా పెంపకా లోపమే అంటావా."
    "అవుననే అంటాను ప్రేమలు మమకారాలు, గుండెల్లో దాచుకుని అగు అంటే ఆగాలి. నాన్న ఏమంటాడో , టీచరు చదవకపోతే ఏమంటారో అనే భయం ఉండాలి పిల్లలకి."
    "ఈ జెనరేషన్ పిల్లలు మీ టైం పిల్లల్లా కాదు. వాళ్ళు వయసుకి మించిన నాలెడ్జి తో లా పాయింట్లు తీసి వాదించి మనలని వప్పిస్తారు" అన్నాడు చైతన్య.
    "అందుకే మొక్కగా ఉండగానే వంచాలి. మంచి చెడ్డ చెప్పితే ఓహో అనుకుంటారు. ఇది మంచి అది చెడ్డ ఎలా వుండాలో ఎలా వుండ కూడదో కధల్లో చెపితే వాళ్ళ చేత మనస్సులో ముద్ర పడుతుంది. ఇదివరకు పెద్ద వాళ్ళు దగ్గర కూర్చో పెట్టుకుని నీతి కధలు చెప్పి బోధపరిచేవారు" అంది మనవడిని చూస్తూ.
    "అయితే మాదే తప్పు అని తెల్చేసావన్న మాట."
    "నిస్సందేహంగా అవునంటాను. ఆ పసిపిల్లలకి చెప్పే విధంగా చెపితే అర్ధమవుతుంది. చిన్నప్పటి పెంపకం సరిగా వుంటే ", "ఈ పాఠం గుర్తు వుంచు కుంటాను లే" నవ్వాడు మనవడు" గుర్తుంచుకోడం కాదు. ఈసారి వచ్చేసరికి ముగ్గురు రావాలి" అంది దబాయింపుగా అనసూయమ్మ.
    "బాబోయ్ టైం లిమిట్లు పెట్టకు" అన్నాడు దండం పెడుతూ.
    "మీ ఇష్టం వచ్చినప్పుడు కార్లు, ఇల్లు , ఫర్నిచార్లు సమకూర్చుకుని కంటాం అంటే ఇదేమి రైస్ కుక్కర్ కాదు అన్నం తయారు అయిపోడానికి కావలసినపుడు కనడానికి ఇంకా మందులు రాలేదు" అంది.
    నవ్వి లేచి లోపలికి వెళ్ళాడు చైతన్య.
    బామ్మా కోరిక తీర్చాలనే కాక వాళ్ళకే ఒకటి రొటీన్ ఆఫీస్ పని, వండుకోవడం, తినడం, ఎంతసేపు ఒకరి మొహం ఒకరు తప్ప ఇంట్లో ఇంకో మొహం కనపడక వాళ్లకి మార్పు కావాలనిపించింది. ఇటు అటు కూడా రెండేళ్ళ యింది చాలు కనే ఒకర్లో ఇద్దర్నో కనేయండి ఆలస్యం చేయకుండా అనే ఒత్తిడి ఫోన్లు వస్తుండడం తో ఏదో ఆపని కానిచ్చేద్ద్దాం అన్న నిర్ణయానికి వచ్చారు చైతన్య దంపతులు.
    కాని వాళ్ళ బామ్మ అన్నట్టు , రైస్ కుక్కర్ స్విచ్ వేసినంత సులువుగా వారు కోరుకున్న వెంటనే కావాలను కున్నప్పుడు పిల్లలు పుట్టరు అన్నది తెలిసేసరికి ఎన్నర్ధం గడిచి పోయింది.
    "ఫామిలీ ప్లానింగ్ మాత్రలు పెళ్ళయిన దగ్గర నించి వాడుతున్నారు కనక మూడు నాలుగు నెలలు గ్యాప్ ఇవ్వాలి సిస్టం నార్మలు అయేవరకు మాత్రలు మానేసినా, ఇతర మేధడ్స్ వాడి, ప్రేగ్నన్సీ రాకుండా చూసుకోండి. తరువాత ఆరు నెలలోపల ప్రేగ్రేన్సీ రాకపోతే కలవాలి డాక్టర్ని. నార్మల్ గా సంసారం చేసేటప్పుడు ఆరునెలల లోగా గర్భం రావాలి. అలా కాకపొతే టెస్టులు చేస్తాం. రిజల్టు చూసి ఇద్దరిలో లోపాలు గుర్తిస్తాం. ముందు మాత్రలు ఆపేసి నేనుచేప్పునట్టు చేయండి. ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు డ్రింకు లు తాగకండి" అన్తూంని సవిస్తరంగా బోధపరిచి, నెలలో ఏ డేట్స్ లో ప్రెగ్నెన్సీ చాన్సులు ఎక్కవ వుంటాయో అన్ని రాసి బోధ పర్చింది డాక్టరమ్మ.
    "బాబోయ్ ఎంత తతంగం పిల్లలు కనడానికి" భయం నటిస్తూ నవ్వాడు చైతన్య భార్యతో.
    "నో డ్రింక్స్ డియర్ లేట్ అజ్ స్టార్ట్ ఫ్రం టుడే" అన్నాడు యుద్దానికి వెళ్ళాడానికి సంసిద్దుదవుతూ , నవ్వింది భవ్య.
    నవ్వినట్టు కాదు పిల్లని కనడం, అంత మీ చేతుల్లో ఉన్నట్టు ఊహించుకోకండి నేనొకడ్ని వున్నా పైన అన్నట్టు ఆరు నెలలు కాదు ఏడాది పైన మూడు నెలలైనా ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి , గాభరా , భయం మొదలై డాక్టర్ దగ్గరికి పరిగెట్టారు ఇద్దరు. డాక్టర్ ఇద్దరికీ అన్ని టెస్ట్ లు చేయించి చావు కబురు చల్లగా చెప్పింది. "స్పేరం మొటిలిటీ తక్కువగా వుంది. కౌంట్ కూడా కొంచెం తక్కువే. అయినా భయం లేదు. మందులతో సరి చేయవచ్చు" అంటూ కొన్ని ఇంజక్షన్ లు, మందులు రెండు నెలలు వాడి మళ్ళీ రండి . ఆవిడకి అన్ని ఫర్ ఫెక్ట్ వున్నాయి" అంది డాక్టర్. చైతన్య మొహం వాడింది.
    "మందులతో సరిగా అవుతుందా" అన్నాడు కంగారుగా. "లేట్ అజ్ వెయిట్ అండ్ సి" అని ధైర్యం చెప్పి పంపింది" భార్య భర్త ఇద్దరూ మాట్లాడుకుని ఎవరితో ఏం చెప్పద్దు చూద్దాం అన్న నిర్ణయానికి వచ్చారు.
    అనుకున్నవి అనుకున్నట్టు అయితే ఇంకేం అన్నట్టు రిజల్ట్ లో మొబిలిటీ లో తేడా లేదు.
    "ఈ ఐటి ఉద్యోగాలోచ్చాక చాలామంది మొగాళ్ళ కి ఈ ప్రాబ్లం కనిపిస్తుంది . ఇంకా టైం వెస్ట్ చెయ్యకుండా ఐ.వి. ద్వారా ట్రైచేద్దాం . మీరు నిర్ణయం చేసుకుని చెప్పండి. అది కూడా ఒకసారితో అయిపోతుందనుకోవద్దు . రెండు మూడు సార్లు పట్టచ్చు అంటూ మెంటల్ గా వాళ్ళిద్దరి ని ప్రిపేర్ చేసి ప్రొసీజర్ ఖర్చు అన్ని సావిరంగా చెప్పింది.
    ఖర్చు తలచుకుని గాభరాపడి పెంచుకుంటేనో అని అలోచించి, వున్న సేవింగ్స్ గోవిందా, అయినా సక్సెస్ ఐతే చాలని , కిందా మీదపడి అలోచించి, ఎవరికీ చెప్పద్దు అని ఆఖరి చాన్స్ తీసుకోడానికి నిర్ణయించు కున్నారు భార్య భర్తలు. భగవంతుడు దయ తల్చినట్టు రెండోసారి సక్సెస్ అయి ప్రెగ్నెన్సీ నిలిచింది. మొత్తానికి ఒక కొడుకు పుట్టి కళ్ళు కాయలు కాచెట్టు ఎదురు చూసిన తాతల్ని అమ్మమ్మ ని నాయనమ్మని అందరిని సంతోష పెట్టాడు చైతన్య. ఇదివరకు రోజుల్లో పిల్లల కోసం యజ్ఞాలు చేసేవారు . పాపం చైతన్య కొడుకు కోసం యజ్ఞాన్ని మించిన పనే చేశాడు.
    అంత అపురూపంగా, అంత ఖర్చు పెట్టి, కన్న కొడుకుని ఎంత బాగా మామ్మ చెప్పిన పాఠాలు గుర్తు పెట్టుకుని పెంచుతాడో, అయిదేళ్ళ కి అపురూపంగా పుట్టిన కొడుకుని ఎంత ముద్దు చేస్తాడో తేర మీద చూడాల్సిందే!!!

                                  *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS