అన్న గంటలోనే "టీవి లో పబ్ లో పట్టుబడ్డ స్టూడెంట్స్ లో మీ అబ్బాయి కూడా కనిపించాడు అన్న వార్త గాభరాగా ఎవరో స్నేహితురాలు చెప్పగానే ఆవిడ గాభరాగా భర్తకి ఫోన్ చేసింది. అప్పటికే పని ముగించుకుని బయలుదేరా పోతున్న అయన మొహం పాలిపోయింది ఆ వార్తా వినగానే. ఫ్లైట్ దిగకముందే తన మనుషుల ద్వారా సంగతంతా వివిధ వర్గాల నించి తెలుసుకున్నాడు. ఆ పోలీస్ సూపరింటెండెంట్ అతి రూల్స్ మనిషి దేనికి లొంగే రకం కాదని తెలుసుకున్నాడు. డీలా పడ్డాడు. ఇంటికి రాగానే తలపట్టుకు కూర్చున్న భర్తని చూసి భయపడిపోయింది. ఎప్పుడు ఏది కావాలన్న నిమిషాలలో జరిగిపోడమే తెల్సిన , ఆవిడ భర్తని ఏం అడగడానికి భయపడి పోయింది. ఆఖరికి ఆయనే తలెత్తి 'నాన్న అదృష్ట వంతులు త్వరగా దాటిపోయారు లేకపోతె మనవడి ని చూసి వాడు ఎలా తయారయ్యాడో చూసి గుండె ఆగిపోయేది. నిశ్చింతగా మనవడి ముద్దు ముచ్చట్లు చూసి దాటిపోయారు. వున్న ఒక్కడు ఇలా తయారవడానికి కారణం మనమే. ఒక్కడే అని, అడిగిందల్లా ఇచ్చి వాడు ఆడిందాటగా పెంచాం, ఉద్ద్దరిస్తాడు పెద్దయి, ఏదో చిన్నతనం అనుకుని చూసీ చూడనట్టు వదిలేశాం. తోట కూరనాడే సరిదిద్దకపోవడం మన తప్పు. వెధవని జైల్లో పడుండని కొన్నాళ్ళు బుద్ది వస్తుందేమో " ఎగిరాడాయన. "అయ్యో చిన్నవాడు ఏదో చెడు స్నేహాలతో సరదాలతో తిరుగుతూ చిన్న తప్పు చేస్రే వదిలేస్తే ఎలాగండి" అని గోల పెట్టింది వరలక్ష్మీ. "ఎవరి కాళ్ళు పట్టుకో మంటావు. ఆ పోలీస్ ఆఫీసర్ నిజాయితీ గా భయపడక డ్యూటీ చేసే రకంట. డబ్బుకి లొంగే రకం కాదట. కేసు ఫైల్ అయింది, రేపు కోర్టులో జడ్జి ముందు బెయిల్ కి ప్రయత్నించాలి. అంతే మరో దారి లేదు. నా పరువు ప్రతిష్ట మరిచిపోయి జడ్జి ముందు తప్పయిందని ఒకోసారి ఇలా జరగకుండా పిల్లాడిని అదుపులో పెట్టుకుంటాం అని తప్పు ఒప్పుకుని ఫైన్ కట్టి తీసుకురావాలి" అని విసుగ్గా విసురుగా భార్య ముందు ఎగిరాడాయన.
అన్నట్టే తల్లితండ్రుల విన్నపాలు విన్న జడ్జి పెద్ద లెక్చర్ ఇచ్చి తన పవరేమిటో చూపిస్తూ దుమ్ము దులిపి వదిలాడు. ఇది మొదటి సారా, పాపం సరదాగా వెళ్ళారా , మీ పిల్లలని ఆ మాట చెప్పమనండి. ఇది మొదటిసారి జైల్లో కూల్చేడం, ఇది ఐడో సారి పట్టుబడడం పోనీ అని గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేసారట మొదటిసారి ఇంకోసారి మీలాటి పవర్ వున్నవాళ్ళు ఏదో తెలియక చేసారి ఇక ముందు జరగకుండా చూస్తాం అని భరోసా ఇచ్చి పోయారట. మరోసారి మినిష్టర్ సిఫార్స్ , మరోసారి ఫైన్ కట్టి విడిపించుకు పోయారు. ఈసారి వాళ్ళ పప్పులు ఉడకలేదు. ఏళ్ళని మించిన ఘటికుడు ఎవరి సిఫార్సు లు లెక్క చేయని పోలీస్ ఆఫీసర్ వచ్చాడు రంగం లోకి. ఇవిగో ఫైల్స్ చదువుకోండి. పిల్లలని కని, మంచి బుద్దులు నేర్పకుండా , డబ్బుందని వూరి మీద వదిలేస్తే వీళ్ళు రౌడీలలా పెద్ద ఫోజులు కొడుతూ, కార్లలో తిరుగుతూ , అమ్మాయిలని బతకనీయకుండా పోకిరి వేశాలీ వేస్తూ తిరుగుతుంటే , చూస్తూ వూరుకోవాలా, చట్టం ఒకటుందని గుర్తు లేకపోతె, చూపిస్తాం జైలు జీవితం ఎలా ఉంటుందో, అంటూ తల్లి తండ్రులకి ఏమి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా, పదివేల జరిమానా, వారం జైలు శిక్ష వేసేశాడు జడ్జి. ఇంకో అపుడు ఏ సిఫార్సులతో భయపడో మెత్తపడో వదిలేసే వాడేమో కాని, ఈ పోలీస్ ఆఫీసర్ దన్నుతో చెలరేగి పోయాడు. తల దించుకుని చేతులకి బేడీలతో వెడుతున్న పుత్ర రత్నాలని చూడలేక వాళ్ళు తలలు దించుకుని బయటికి నడిచారు.
* * *
ఇంటికి వస్తూనే కోపం ఎవరి మీద చూపలేక భార్య మీద ఎగిరాడు. 'ఒక్కడే కదండీ చిన్న వెధవ...అంటూ నెత్తి కేక్కిన్చుకుని అడిగినంత డబ్బు నాకు తెలియకుండా ఇస్తూ, కార్లలో షికారులు తిరుగుతున్నా , కాలేజీ డుమ్మాలు కొడుతూ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నా నాకు తెలియకుండా కప్పెట్టి వెనకేసుకు వచ్చావు ఇన్నాళ్ళు, అనుభవించి ఏడు. వీడివల్ల అ జడ్జి తల్లి తండ్రుల్ని తిడుతుంటే తలదించుకోవలసి వచ్చింది. బాధ కోపం ఉక్రోషంతో అరిచాడు. వరలక్ష్మీ నోరెత్త కుండా కన్నీళ్ళు పెట్టుకుంది. "మంచిదే ఉండని జైల్లో ఆభయమన్న ఉంటె కాస్త తగ్గుతారు వెధవలు.' మరోసారి అరిచాడు.
భార్య దగ్గర అర్చినా, కొడుకాయ, తన రక్తం . అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క బిడ్డ ఆ రాత్రి అంతా నిద్ర పట్టక దొర్లాడు. ఏ మంత్రినో ముఖ్య మంత్రితోనో చెప్పిస్తే పని జరుగునేమో ముఖ్యమంత్రి తో అంత సయోధ్య లేదు ముందు నించి, తన కాండిడేట్ కాక, ఊరి వాళ్ళ బలవంతం వల్ల గెలిచే పోటెంటషల్ ఉన్నవాడిని కాదని అగైనేస్ట్ గా వెళ్ళడం మంచిది కాదని తగ్గాడు , కానీ తానంటే ముందు నించి దూరం పెట్టిన ముఖ్య మంత్రికి , తన కొడుకు ఇలాటి వాడని చెప్పుకోడం చిన్నతనం అనిపించి, ముఖ్య మంత్రిని కాదని, మిగతా మంత్రులు మాత్రం సాయం చేస్తారా , అసలు ఎమ్మెల్యే కోటా నించి డబ్బు దాచుకోకుండా ఏదో మంచి పనులు చేయిస్తూ మంచి పేరు తెచ్చు కుంటున్నాడని తన పలుకుబడి నచ్చక ముభావంగా ఉంటాడు. అలాటి వాడిని అడిగి లేదని పించుకోడం ఎందుకు అని ఊరుకున్నాడు.
* * *
"ఏమండీ అలా వదిలేసి ఊరుకోవలసిందేనా, ఆ తిండి ఎలా తింటాడండి కాస్త భోజనం పంపడానికి అవుతుందేమో అడిగి చూడండి." భయపడుతూనే........"ఆ నీ కొడుకు పెద్ద కలక్టరని భోజనాలు తీసి కెళ్ళనిస్తారు వెటకారంగా అన్నాడు."
"ఏదో ఆ డిగ్రీ కాస్త అయితే ఏ అయినింటి పిల్లనో, పెళ్లి చేద్దామండి కాస్త ఇంటి పట్టున వుండి ఏదో వ్యాపారాలు చూసుకుంటూ బుద్దిగా ఉంటాడేమో కుర్రవేషాలు కట్టిపెట్టి." ఆశగా అంది తల్లి ప్రాణం కొట్టుకుంటుండగా.
"చాల్లే మాట్లాడకు పెళ్లి చేసి ఇంకోర్తి కూడా మనతో కలిసి ఏడవాలా" కోపంగా అరిచారు.
మీరు మరీను. ఏదో చిన్నపుడు అల్లరి చిల్లరిగా తిరిగాడని అలా వదిలేస్తామా? ఇంటి బాధ్యత , సంసారం బాధ్యతలు వస్తే వాడే మారతాడు" అంది ఆవిడా గట్టిగానే.
"ముందు నీ కొడుకు బియ్యే అనిపించుకుంటే పిల్ల నిచ్చే వాళ్ళు మనకున్న ఆస్తి పాస్తులన్నా చూసి పిల్లనిస్తారు." అన్నాడాయన.
* * *
వారం రోజుల తర్వాత టాక్సీ లో ఇంటి కొచ్చిన కొడుకుని చూసి వరలక్ష్మీ కలవర పడిపోయింది. ఆదిత్య ఎవరి మొహం చూడకుండా గదిలో కెళ్ళి తలుపులు మూసుకున్నాడు. నాలుగు రోజులయాక తండ్రి దశరద్ కొడుకుని పిలిచి 'ఇదిగో కారు తాళం మరో మూడు నెలలు పరీక్షలు ఆయెంతవరకు మాత్రమే వాడుకుని నాకు తిరిగి ఇవ్వాలి, కాలేజీ దూరం అని, చదువు డిస్ట్రబ్ అవకూడదని ఇస్తున్నాను. ఇదేదో నీకు భయపడో, చదువు మానేస్తావనో ఇవ్వడం లేదు.
చదువు మానేస్తే నష్టపోయేది నీవే. ఏదో తాత తండ్రులు సంపాదన వుంది నా కెందుకీ బియ్యే డిగ్రీ అనుకుంటావేమో , ఇది కూడా లేకపోతె సమాజంలో నీకు వీధిన పోయే ముష్టి వాడు కూడా గౌరవం ఇవ్వడు. వున్నవి తిని తిరిగి తగలేయడం మొదలెడితే చిప్ప చేతికి రావడానికి ఎన్నెల్లో పట్టదు. తాతగారిచ్చింది కాపాడుకుని దాన్ని పదింతలు అభివృద్ధి చేశాను కనకే నాకు అందరూ గౌరవం ఇచ్చారు. పేరు సంపాదించుకున్న దాంతో పదవులు అడక్కపోయినా, కట్టపెట్టి ఊరికి పెద్ద దిక్కుగా హోదా ఇచ్చారు అని తెలుసుకో. నిన్ను ఒక్కగానొక్క కొడుకువి పెద్ద చదువులు చదివించాలని కలలు కన్నా. విదేశాలు పంపి చదివించి పెద్ద హోదాలో నిన్ను చూసి గర్వపడాలి అనుకున్నా కానీ నీవు మెట్రిక్ , ఇంటరు లో తప్పగానే నీ కెపాసిటీ తెల్సిపోయి, చదువు పట్ల నీకు ఆసక్తి, కష్టపడి సాధించాలనే తపన నీలో లేదని అర్ధమై పోయి, ఆశ వదిలేశా. కనీసం వున్నది అభివృద్ధి చేసుకోవాలనే దృష్టి ఆలోచన, వ్యాపార మెళకువలు తెలుసుకోవాలనే ఆరాటం ఏది నీలో కనపడలేదు. పెద్దలు సంపాదించి ఇచ్చింది తింటూ, అల్లరి మూకని వెంటేసుకు కారుల్లో తిరుగుతూ పెద్ద హీరోలాగా జల్సా చేయడం కాదు జీవితం అంటే. చదువులో లేకపోయినా కనీసం ప్రవర్తన లో మాట మర్యాద మంచితనమన్న ఉంట...అందరికీ చదువు అబ్బదు. జీవితంలో పైకి వస్తే చాలు ఏదో నా తర్వాత వ్యాపారాలు, ఎమ్మెల్యే పదవి అందుకుంటే చాలనుకున్న. ఆ ఆశ పోయిందిప్పుడు , ఇప్పటికే కాలేజీ లో ఎన్నో కంప్లెయింట్స్ రూల్స్ పాటించకుండా నీ స్పీడ్ డ్రైవింగు లు, డ్రింక్ చేసి అర్ధరాత్రి తాగి తందనాలు , అమ్మాయిల పట్ల మీరు చేసే వెకిలి వేషాలు ఇవన్నీ నాకు తెలియదనుకుంటున్నావా, ఇక ముందు ఏ పోలీస్ కంప్లైంట్ అన్న వస్తే నేనున్నా అనుకోకు. దేనిలోనూ నే కలగ చేస్కోను. నేను చెప్పాల్సింది చెప్పా. తరువాత నీఇష్టం ఆలోచించుకో." ' ఆ ఇంకో విషయం నీకు పెట్రోలు పోయిస్తా నీ రోజువారీ ఖర్చుకి కావలసింది మీ అమ్మని కాదు నన్ను అడగాలి అని గుర్తుంచుకో" అయన చాల సీరియస్ గా చెప్పదలచింది చెప్పి గదిలోంచి వెళ్ళిపోయారు. తండ్రిని అంత కోపంగా ఏనాడు చూడని, మనసులో బెదిరి మవునంగా తాళాలు తీసుకు వెళ్ళిపోయాడు.
కాస్త జాగ్రత్తగా పరీక్షలు ఆయెవరకు వుండి, అదేదో గట్టిక్కిస్తే తండ్రి కోపం తగ్గుతుందని అనుకున్నాడు. కాస్త ఫ్రెండ్స్, పార్టీలు డ్రింకులు కారులో సరదాలు అన్ని తగ్గించి పరీక్షలు పూర్తయ్యాయని పించాడు.
"పాపం భయపడి పోయాడండి. చిన్న వెధవ ఏదో సరదా లుంటాయి కుర్రాళ్ళ కి" ఒకరోజు నచ్చ చెప్పే ధోరణి లో ఏదో చెప్పబోతుంటే అయన హుంకరించినట్టే మాట్లాడకు అసలు నీ వల్లే ఇదంతా అంటూ హుంకరించాడు అయన.
ఏదో కొడుకుని దాటిలో పెడితే భార్య అన్నట్టు కాస్త ఏలైనింటి పిల్లనో డబ్బు తన హోదా చూపి కాస్త చదువుకున్న పిల్లని తెచ్చి ఆ పెళ్లి ఏదో జరిపిస్తే బాధ్యత వచ్చి బాగు పడతాడేమో అని అయన ఆశ.
కానీ మనం అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇంకేం కావాలి అన్నది అయన మర్చిపోయారు.
