Previous Page Next Page 
అందరు మేధావులే పేజి 13

పార్ట్ - 13

    రామశాస్త్రీ . శేషు , కిరణ్ , రవి .... వీరిని కిడ్నాఫ్ చేసి తీసుకెళ్ళి హింసించినప్పుడు .... వాళ్ళ జేబుల్లోని డబ్బంతా తీసుకున్నాడు ధర్మావ్యాదుడు.
    ఆ డబ్బులో నుండి.... ఇరవై రూపాయలు పేట్టి టికెట్ కొని.... లోపలి నడిచాడు. అతని భుజానికి ఒక సంచీ వ్రేలాడుతోంది.
    లోపల .... ఎగ్జిబిషన్ లోలా గుడారాలు ఉన్నాయి.
    రకరకాల హొటల్ వాళ్ళు, కేటరింగ్ వాళ్ళు ఏర్పాటు చేసిన గుడారాలు అవిఏదైనా గుడారంలోనికి వెళ్ళి... తమకు కావాల్సిన చికెన్ ఐటమ్ ను రుచి చూసి .... బిల్ చెల్లించాలి.
    ధర్మవ్యాదుడు..... ఒక భారీ గుదారంలోనికి నడిచాడు.
    జింజర్ చికెన్, చికెన్ ప్రై, చిల్లీ చికెన్, చికెన్ సిక్స్ టీ ఫైవ్, చికెన్ మంచూరియా , చికెన్ పులుడు. చికెన్ అరేబియా, చికెన్ పాస్తా, చికెన్ కూబ్స్..... ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి.
    ఒక్కొక్కరికీ .... ఆ ఐటమ్స్ చూసి నోరు ఊరుతొంది.
    ఎగబడి తింటున్నారు.
    "ఏమండీ..... గొంగు చికెన్ లేదూ?" అడుగుతోంది ఒకావిడ భర్తను.
    "ఇక్కడ లేనట్లుంది. వేరే గుడారంలో ఉండొచ్చు." అంటున్నాడు భర్త లెగ్ పీస్ తింటూ,
    "చికెన్ తో హల్వా .... ఇవేవే లేవా?"
    షాపువాడికి కడుపులో తిప్పింది.
    "లేవు సార్!" అన్నాడు వాంతిని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ.....
    ధర్మవ్యాదుడు గోదారంలో తిరుగుతూ .... తన సంచీలో ఉన్న డబ్బా తీసి తనను ఎవరు గమనించడం లేదుకదా .... అని నిర్దారించుకుంటూ .... ఆ సంచీని అటూ ఇటూ కదుపుతూ..... మెల్లగా డబ్బాలో ఉన్న ద్రవాన్ని తీసి.... చికెన్ మీద..... అక్కడక్కడా పూసాడు.
    ఆ తర్వాత గబగబా వెళ్ళిపోయాడు.
    అతడు వెళ్ళిపోయినా నిముషం తర్వాత......
    "యా...క్...థూ ....!" అని నలుగురు ఉమ్మేసారు.
    "ఏమయ్యింది?" ఓ పాతికమంది దాకా జనం పోగయ్యారు.
    "చికెన్ ఐటమ్స్ లో.... బెల్లంపానకం కలపి వండారు థూ.....!"  జనం ... ఆ షాపులో నుండి అయ్యారు. అమ్మేవాడు నెత్తినోరు కొట్టుకుని మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు.
    షాపువాడికి ......'చికెన్ స్వీట్!" లేదా!!" అని అడిగిన వ్యక్తి మీద అనుమానం వచ్చింది. అప్పటికే ధర్మావ్యాదుడు మరో నాలుగు గుడారాలలో.... చికెన్ ఐటమ్స్ మీద .... బెల్లంపానకం పోసాడు.
    అరగంటలో గొడవ చెలరేగింది. జనం.... గుడారాలు పీకి ... అమ్మేవాళ్ళను  బడసాగారు.
    అప్పటికే ..... ధర్మవ్యాదుడు .... బయటకి వెళ్ళిపోయాడు.
    హొటల్ లో మనం భిజనం చేస్తున్నప్పుడు .... ఒకటీ రెండు టేబుల్స్ దగ్గర కస్టమర్స్ .... వాంతి చేసుకుంటే ..... మనం ఆ హొటల్ లోని పుడ్డును అనుమనైస్తాం. వెంటనే లేచి వెళ్ళిపోతాం . ధర్మవ్యాదుడు.... ఇక్కడ సరిగ్గా ఇదే టెక్నిక్ వాడాడు.
    "లోపల జరిగింది? మా అభిప్రాయం ఏమిటి?" అడిగింది.
    "అరే....ఎంతకష్టపడి .... ఎంతోదూరం నుండి.... చికెన్ ఫెస్టివల్ కోసం వస్తే.... ఇక్కడంతా ... తియ్యని చికెన్ సర్వ చేస్తున్నారు. మేము మెచ్చింది.  స్పైస్ చికెన్ తినడానికి స్వీట్లు ఫెస్టి వల్ కు కాదు." అనేసి గబగబా వెళ్ళిపోయాడు.
    ఏంకర్ . మరోకడి నోటికి మైకును అందించింది.
    "ఏ.....క్చు....వ.....ల్లీ! ఏ....క్చు....వ....ల్లీ..... నేను.... ఈ.... చి... కే...న్... ఫే.....స్టి....వ.....ల్....కోసం....ఏ...క్చువ్....ల్లీ....ఎంతో....ఎంతెంతో....ఆశతో వచ్చాను కా....నీ....ప్చ్....లోప...ల...." అతడు టి. వి.లో వీలైనంత ఎక్కువ సేపు కన్నాపడోచ్చని .... ఒక్కొక్క అక్షరాన్ని వొత్తిపలుకుతూ , సాగదీసి చెబుతున్నాడు.
    యాంకర్ అది గమనించి. వెంటనే మైకును తన నోటిముందు పెట్టుకుని ....."పాపం  బాధతో .... ఈయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు." అనేసి ... మరో వ్యక్తి , ఆమెకు అడ్డంగా వచ్చి, "నా అభిప్రాయం పూర్తిగా చెప్పలేదు." అన్నాడు కోపంతో.
    "మీ బోడి అభిప్రాయం అక్కర్లేదు వెళ్ళండి. " ఏంకర్.
    "అదేంటి ! సాటి హైదరాబాదు వాసి కష్టాన్ని .... మీరు తెల్సుకుని , విని .... టి. వి. లో ప్రసారం చెయ్యాలి గానీ .... ఇలా మధ్యలో మైకు  లాగేస్తారా." అన్నాడు.    
    ఏయ్ ... ఎక్కువగా వాగితే .... నీ జీవిత చరిత్ర తవ్వి.... నీ వెధవపనులన్నీ ప్రసారం చేస్తాం. ఏం కష్టం వచ్చింది నీకు? నీ మెళ్ళో గొలుసు తెంపుకుపోయాడా ఏ దొంగనైనా? నీకేమైనా ఎయిడ్స్ వచ్చిందా ? నీ ఇంట్లో పాము దూరిందా?ఏం కష్టం ?!అం(- - !! నోర్మూసుకుని పో. అని మెల్లగా అతనికి మాత్రమె వినపెడేలా అని, మరో వ్యక్తి నోటిముందు మైకును ఉంచి,
    "మీ అభిప్రాయం ?" అంది.
    "చికెన్ తియ్యగా ఉంది. అయితే.... దీనికి కారణం .... పాపం ... అమ్మే వాళ్ళుకాదు."
    "మరి? ఎవరైనా ఈ పోగ్రాం ను ఫ్లాష్ చెయ్యాలని ..... ఏ చక్కరనీళ్ళో..... కలుపుంటారంటారా ?"
    "కాదు. ఇది ఒకరకమైన .... ప్లూ! అంటే.... కోళ్ళజ్వరం , ఒకరకమైన వైరస్ వల్ల ... కోళ్ళు చనిపోతుంటాయి. ఆ చికెన్ తియ్యగా ఉంటుంది. అలాంటి చికెన్ ను తింటే చాలా ప్రమాదం . నడుమునొప్పులు, కాళ్ళనొప్పులు, కిళ్ళనొప్పులు, కంటివ్యాధులు , ఊబకాయ తలవెంట్రుకలు ఊడిపోవడం , శ్రుంగారసమస్యలు , స్రీలకైతే .... బహిష్టు సమయంలో విపరీతమైన నొప్పిరావడం .... లేదా బహిష్టు ఆలస్యంగా గానీ, తొందరగా గానీ రావడం...... మొలల వ్యాధి రావడం . చర్మం ఎండబారిపోవడం , మైగ్రేయిన్ ... ఇలా౦టి ఆరోగ్యసమస్యలలో .... ఏదో ఒక సమస్యకానీ.... రెండు మూడు సమస్యలు గానీ రావొచ్చు. సో..... ఈ చికెన్ కు దూరంగా ఉండండి. ఎందుకంటే .... ఈ కోళ్ళవైరస్ చాలా ప్రమాదకరమైనది. ఈపాటికే.... రాష్ట్రంలోని కోళ్ళలో చాలాభాగం .... ఈ వైరస్ బారిన పడిఉండొచ్చు." వివరంగా చెప్పాడు.
    "ఇంత చక్కగా చెప్పారు . మీరెవరు?"
    "కోళ్ళపై రీసెర్చ్ చేసిన.... శాస్రవేత్తను." చెప్పేసి అతడు గబగబా వెళ్ళిపోయాడు. అతడే..... ధర్మావ్యాధుడు , చికెన్ లో .... బెల్లం పానకం కలిపింది అతడేనని..... ఏంకర్ ఊహకు అందని విషయం .
    "చికెన్ తింటే.... ప్రమాదమని ..... శాస్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాదు కాదు .... నొక్కి నొక్కి వక్కాణిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త!!" అని తన అమూల్యమైన అభిప్రాయాన్ని ..... ప్రేక్షులకకు విశదీకరించి చెప్పింది.
    క్షణాలతో మిగతా ఛానల్ వాళ్ళు పోగయ్యారు. అందరినోట..... ఒకటే మాట!!
    'చికెన్ తినకండి ఏదో వైరస్ సోకింది." అంటూ ... అది తింటే వచ్చే అరిగ్య సమస్యల జాబితాను చదువుతున్నారు.
    ధర్మవ్యాదుడి ...... తెలివి ఇక్కడే బయటబడింది౧!! అతడు చెప్పిన ఆరోగ్య సమస్యల  లిస్టులో ... కనీసం ఏనాబహిశాతం మందికి ... ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. ఒకవేళ లేకపోయినా .... నడుము కాస్త కతక్కుమన్నా, తలనొప్పి వచ్చినా.... చికెన్ తినడం వల్లే వచ్చిందని ... కనీసం అరవైశాతం మంది నమ్ముతారు !అది చాలు ధర్మా వ్యాధుడికి. అందుకే ... తెలివిగా ... స్రీల సమస్యలను, ఊబకాయాన్ని, వెంట్రుకలు ఊడిపోవడాన్ని..... లిస్టులో  చేర్చాడు.
    జనం మెంటాలిటీ ప్రకారం .... పదిరోజులు క్రితం చికెన్ తిన్నవాడు సైతం తన ఆరోగ్యలేమికి కారణం....... కోళ్ళవైరస్ అనుకుంటాడు.
    అతడు సైంటిస్టో కాదో.... ఒపికిగా తెల్సుకునేంతటి తీరికా, అంకితంభావం , చాతుర్యం.... టి.వి. వాళ్ళకు లేవు. న్యూస్ స్పష్టించడానికి కష్టపడే వార్తాచానెళ్ళు ... ఇలా అయాచితంగా వార్తా దిరికితే.... అస్సలు వదలరు.
    ఒకేరోజు .... రెండు వార్తలు!! సినీనటి హత్యా , చికెన్ తింటే వచ్చేరోగాలు!! 'న్యూస్ చానల్స్ జనా...... సుఖినోభవంతు.' అనుకుంటూ.... విజిల్ వేస్తూ ధర్మావ్యాధుడు నీడవసాగాడు.
        *    *    *    *  
    చికెన్ ఫేస్టవల్ వార్తను టి.వి.లో చూస్తున్న జ్ఞానచంద్ర .... ఒక్కసారిగా అలర్టయ్యాడు.
    వెంటనే ..... ఖాజాకు ఫోన్ చేసి చెప్పాడు.
    "ఖాజా ... మాంసాహారాన్ని ద్వేషించే సుందరం.... చికెన్ ఫెస్టివల్ దగ్గరికి వెళ్ళి.... ఏదో చేసాడు. ఆ తర్వాత చికెన్ తింటే అరిగ్యసమస్యలు వస్తాయని ..... టి.వి. ఛానల్ తో తన అభిప్రాయాన్ని చెప్పి.... తాను సైంటిస్టును అని కూడా చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే వెళ్ళి.... ఆ సుందరాన్ని పట్టుకోండి."
    "సర్.... మేము చార్మినార్ ఏరియాలో ఉన్నాం సార్. మేము వెళ్ళేసరికి .... అతడు అక్కడుంటాడో లేదో?"
    "అయినా ఫర్వాలేదు. వెళ్ళి వెతకండి. నెక్లెస్ రోడ్డంతా గాలించండి.."
    "సర్ సార్ !"
    "జాగ్రత్త! తెలుసుగా ... సుందరం ఎంత ప్రమాదకరమైన వాడో...."
    "తెలుసు సార్!" చెప్పాడు ఖాజా.
    ఆ తర్వాత ....ఖాజా ,
    వాళ్ళు వెళ్ళిన ఐదునిమిషాలకు .... రాజశేఖర్ .... నార్లా శేఖర్ అక్కడకి వచ్చాడు.        


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS