
పార్ట్ - 14
కృష్ణకిరణకు, ఏం జరిగిందో క్షణకాలం పాటు అర్ధం కాలేదు.
"పద ... బాబూ!" అన్నాడు ఆ ఒంటి కన్ను మనిషి.
కృష్ణ కిరణ్ ను తరిమే దెయ్యం, స్రీ దెయ్యం పారిపోయాయి.
కొంపదీసి ... వీడు .... వాళ్ళకంటె శక్తివంతమైన దెయ్యమా?!!
కృష్ణ కిరణ్ ఇమ్కియా వనుకుతూనే ఉన్నాడు.
"పద బాబూ ...." మళ్ళీ అన్నాడు ఆ వ్యక్తి
ఆ వ్యక్తికీ గుండు ఉంది. చొక్కాలేదు. కషాయరంగు పంచే ధరించివున్నాడు.
మేడలో..... నల్లపూసల దండ. ఆ దండ చివరన .... బంగారంతో చెయ్యబడిన పుర్రెబొమ్మ.
"ను.... నువ్వు.... మి... మి.... మీరూ...."
"నేను మంత్రగాణ్ణి. నా పేరు ... సుక్షేత్రమాతాక్ష ."
"మరి..... బావిలో నుండి వచ్చారేం?"
దానికి సమాధానం చెప్పకుండా ... అతడు నడవసాగాడు .
అతని నడక చండప్రచండంగా ఉంది.
కృష్ణకిరణ్, అతని వేగాన్ని అందుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది.
"బావిలో నుండి వచ్చారేందుకు?" కృష్ణకిరణ్ రెట్టించి అడిగాడు.
"ట్రాలీ డైలమా ... తెలుసా?" అడగాడు సుక్షేత్రమాతాక్ష.
"ఏంటీ ?!!"
"ట్రాలీ డైలమా!"
"తెలీదు."
"ట్రాలీడైలమా .... అనేది గేం ధీయరీలో ...ఒక గణితశాస్రపు లెక్క. అసీలు గేమ్.... థీయరీ తెలుసా?"
"తెలీదు కానీ ... విన్నాను. అందులో .... రకరకాల లెక్కలు ఉంటాయి. కొన్ని లెక్కలు.... మనస్తత్వ శాస్రంలో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇంతవరకే తెలుసు.
"చాలు అంతకంటే ఎక్కువగా తెల్సుకోవాల్సిన అవసరం లేదు. ట్రాలీడైలమా ... అందులో ... ఒక భాగం ."
"......"
"ఒక రైల్వే ట్రాక్ మీద.... ట్రాలీ అంటే..... సూపర్ మార్కెట్లలో ఉండే తోపుడు బండికాదు. రైల్వేగ్యాంగ్ మెన్, మెకానిక్ లు వాడే ట్రాలీ లో..... నలుగురు దాకా పడతారు. దాన్ని ట్రాక్ మీదే నడుపుతూ ... తీసుకేళ్ళచ్చు."
"తెలుసు . అయితే?"
"ఒక పిచ్చి తత్వవేత్త ... రాల్వే ట్రాక్ మీద కొద్దిదూరంలో ... అయిదుగురిని పడుకోబెట్టి..... కట్టేసాడు. ఆ తర్వాత ..... వేగంగా .... ట్రాలీ ని వాళ్ళవైపు తోసాడు. అయిదుగురూ.... హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ నువ్వు ఉన్నావోచోట ! నీకు అందుబాటులో .... ఒక మీట ఉంది. ఆ మాట నొక్కితే .... ట్రాలీ ట్రాక్ మార్చుకుని ప్రక్క ట్రాక్ నుండి వెళుతుంది. అయితే ... ఆ ప్రక్క ట్రాక్ మీద ... ఒక్కమనిషి కట్టివేయబడున్నాడు. మీట నొక్కుతానానోక్కవా?"
ఈ అర్దరాత్రి .... నిశీధి నీరవంలో శ్మసనపు నది బొడ్డున .... ఉరకులూ పరుగులతో నడుస్తూ.... ఇలాంటి ప్రశ్న వేసిన .... ఈ వ్యక్తి .... మూత్రగాడా .... లేక భేతాళుడా?! 'సమాధానం తెలసి కోదా చెప్పకపోయావా.... నీతల వెయ్యి చెక్క లౌతుందనా, వెయ్యి ముక్కలౌతుందనో. వెయ్యి వాక్కలౌతుందనో...... బెదిరించలేదు కాబట్టి..... భేతాళుడు .... కాడు.
చెక్క.... ముక్క.... వాక్క.... తేడా ఏమిటి?!
"చెప్పు " సుక్షేత్రమాతక్ష కంఠం ఖంగుమంది.
కృష్ణకిరణ్ తన ఆలోచనలు మాని.... సమస్యగురించి ఆలోచించాడు.
మూడే మూడు దారులు!
మీట నోక్కకపోతే .... ఐదుగురు చస్తారు. మీటనొక్కితే ... ఒకడు చచ్చి, ఐదుగురు బ్రతుకుతారు. ఏమీ చెయ్యకుండా ... నాకెందుకులే అని వెళితే .... అప్పుడూ ఐదుగురు చస్తారు.
"మీట నొక్కుతాను ." చెప్పాడు కృష్ణకిరణ్.
సుక్షేత్రమాతక్ష నవ్వి , "నూటికి తొంభైతోమ్మిది మంది సమధానం! సరే ...ఒకవేళ ... ప్రక్క ట్రాక్ మీదున్న వ్యక్తి.... నీ తల్లి అనుకో. అప్పుడేం చేస్తావ్?
నిజాయితీగా చెప్పాలిసుమా!" అన్నాడు.
ఐదుగురు వ్యక్తులు... ఒక వ్యక్తి !
ఐదుగురు అపరిచితులు..... కన్నతల్లి !!
ఐదు ప్రాణాలు ... ఒకే ప్రాణం !!
కృష్ణ కిరణ్ ఐదునిమిషాలు తర్జనభర్జనలు పడి చెప్పాడు. "మీట నోక్కను. ఐదుగురు అపరిచితులుకంటే.... నాతల్లి నాకు ముఖ్యం."
సుక్షేత్రమతాక్ష చిరునవ్వు నవ్వి , "ఈ సమస్యలో చిన్న మార్పు చేద్దాం. ఐదుమందిని ... ఒక ట్రాక్ మీద కట్టేసారూ. ఒకే ట్రాక్ ఉంది. ట్రాలీని వదిలారు. ట్రాలీని వదిలిన ప్రదేశం నుండి.... ఆ ఐదుగురుని చేరేలోపే ... మధ్యలో.... ఒక బ్రిడ్జి ఉంది. మీద బ్రిడ్జి క్రింద ట్రాక్ !! నువ్వు బ్రిడ్జి మీదున్నావ్ నీ ప్రక్కన ఒక లావుపాటి వ్యక్తి ఉన్నాడు. ఒకవేళ నువ్వు అతణ్ణి ... బ్రిడ్జి మీది నుండి.... ట్రాక్ మీదికి తోసేస్తే ... ఆ ట్రాలీ .... ఆ భారీకాయుణ్ణి ఢీకొని ... ప్రక్కకు లోయలో పడిపోతుంది. అతడూ చచ్చిపోతాడు. ఇప్పుడు చెప్పు.... అతణ్ణి తావుసేస్తావా?"
కృష్ణ కిరణ్ కు.... మొదటిసారి అడిగిన సమస్యకు, దీనికే తేడా ఏమిటో అర్దంకాలేదు.
అక్కడా.... ఒకదా.... ఐదుగురా .... అనే డైలమా ఉంది. ఇక్కడా... అదే ఉంది.... అందరూ అపరిచితులే!! కానీ... ఏదో సన్నని అస్పష్టమైన మెలిక ఉందనిపిస్తోంది.
కృష్ణ కిరణ్ అనాలోచితంగానే, "తోసేస్తాను ." అన్నాడు.
సుక్షేత్రమాతాక్ష పగలబడి నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నారు?"
"ప్రపంచంలో .... ఎవ్వరిని అడిగినా .... దాదాపు ఇదే సమాధానం వస్తుంది. ఎందుకంటే .... అధిక శాతం మంది మనస్తత్వం ఇలాగే ఉంటుంది కాబట్టి !!"
"ఇందులో తప్పేముంది ... ఐదుగురిని కాపాడేందుకు ... ఒక్కరిని బలపేడుతున్నాను. మొదటిసారి అడిగిన ప్రశ్నకూ ... ఇదే సమాధానం చెప్పానుగా!"
"రెండిటికే ... చాలా ఉంది...... కృష్ణకిరణ్ ."
శ్రీకృష్ణని పాంచజన్యము అర్జునుడి దేవదత్తము. భీముడి ప్రౌ౦డము, ధర్మరాజుని అనంతవిజయము , నకులుని సంఘోష్యము. సహదేవుని మణిపుష్పము ..... ఈ శంఖములన్నీ ఒకేసారి తన చెవిలో పూరించినట్లయ్యింది.
"నా పేరు... మీకెలా తెలుసు?"
సుక్షేత్రమాతాక్ష , దానికి సమాధానం చెప్పకుండా , "మొదటిసమస్యలో ... నీకు ఈ ఐదుగురినీ కాపాడేందుకు మరో అవకాశం లేదు. అందుకే.... మీట నొక్కి ట్రాలిని ఒక్కవ్యక్తి ఉన్న ట్రాక్ మీదికి మళ్ళించావ్ ! అక్కడ ..... అతడికి బ్రతికే అవకాశం లేదు. కానీ ... ఈ మూడోసమస్యలో అలా కాదు. భారీకాయుడుకి ... ఈ సమస్యతో ఏసంబంధం లేదు. తన తిప్పలు తాను నిలబడి చూస్తున్నాడు. అతణ్ణి ముప్పుల్లోనికి నెట్టే హక్కు నీకు ఎక్కడిది? నువ్వు ఆ ఐదుగురిని రక్షించడానికి .... ఇతణ్ణి చంపడం .... నేరం కాదా?! మొదటి సమస్యలో ... ఆ ఒక్క వ్యక్తిని .... నువ్వు కట్టెయ్యలేదు." అన్నాడు.
"నాకేమీ పెద్దగా తేడా అనిపించడం లేదు." అన్నాడు కృష్ణకిరణ్ .
"ఒక పైలెట్ కి ... విమానం... ఒక నిమిషంలో క్రాష్ ఆవబోతుందని తెలుసు.అప్పుడు క్రిందకి చూస్తె ... తన విమానం కోఠీసెంటర్ లో కూలిపోబోతుందని అర్దమయ్యింది, కోఠీసెంటర్ ... జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. అతడు..... తన దిశకు మార్చేసాడు.....! నా ఉద్దేశ్యం ...ప్లేయిట్ దిశను ఫ్లైట్ .... జపార్క్ ఎదురుగా ఉన్న బెంగుళూర్ హైవే ప్రక్కన కూలింది. అక్కడా.... జనం ఉంటారని పైలైట్ కి తెలుసు . అయితే .... జనసాంద్రత తక్కువ.మంది చనిపోతారు. ఒకవేళ పైలెట్ నిర్ణయం తీసుకోకపోతే ... ప్లైట్ తన సహజ దిశలో వెళ్ళు౦టే ... ఎక్కువ మంది చనిపోయేవారు. ఎవరో ఒకరు .... చావడం మాత్రము ఖాయం. ఎందుకంటే .... నిర్ణయం తీసుకోవడానికి సమయం ఎక్కువగా లేదు.
మొదటి సమస్యలో .... నీ చేతిలోని మీటకూ, పైలైట్ చేతిలోని..... విమానం దిశా మార్చే మీటకూ ....పెద్ద తేడా లేదు. పైలైట్ నిర్ణయాన్ని నువ్వు సమర్దిస్తావా లేదా?"
"నిస్సందేహంగా .... సమర్దిస్తాను."
"మీట నొక్కి ... ఐదుగురు ని కాపాడేందుకు .... ఒకరిని చంపడానికే, ఒకణ్ణి తోసి.....ఐదుగురిని కాపాడడానికే చాలా తేడా ఉంది. తీవ్రంగా ఆలోచించు ... అర్ధమవుతుంది."
కృష్ణ కిరణ్ తల అడ్డంగా ఊపుతూ, "వీలైనంత ఎక్కువ మందిని కాపాడడం.... ముఖ్యం! ఐదుగురి కోసం.... ఒక్కరిని బలిపెట్టడంలో తప్పులేదు." అన్నాడు. సుక్షేత్రమాతాక్ష నవ్వి , "సమస్యలో మరో చిన్న మార్పు చేద్దాం. మొదట సమస్యలో లాగా... రెండు ట్రాకులు .... ఒక ట్రాక్ మీదికి వెళ్ళి.... అక్కడున్న ఒకడూ చనిపోయాక ... ట్రాలీ అలాగే ముందుకు వెళ్ళి.... టాఫ్ లైన్ లో ప్రవేశించి .... వెనక్కీ వస్తూ .... ఆ ఐదుగురు మీది నుండీ వస్తుంది. ఇప్పుడు చెప్పు ఏం చేస్తావ్?"
కృష్ణ కిరణ్ కు దిమ్మ తిరిగిపోయింది!!
"మీట నొక్కను. ఆ ఐదుగురూ చచ్చిపోతారు. ఒకడిని రక్షించినవాడిని అవుతాను! మీట నొక్కితే .... మొత్తం ఆరుగురూ చనిపోతారుగా !!" అన్నాడు నీరసంగా.
చూసేందుకు అతి మామూలుగా కనిపించే.... ఈ ట్రాలీ డైలమాలో అద్భుతమైన మానసికవిశ్లేషణ దాగుంది.
దేనికోసం ఏది బలి పెట్టాలో మనిషి నిర్ణయించుకునేప్పుడు .... ఈ ట్రాలీడైలమాలో.... చిక్కుకుంటాడు.
ఒక ట్రాక్ మీద తల్లి.... ఒక ట్రాక్ మీద పెళ్ళాం! మీతనీ చేతుల్లో ఉంది!!
ఒక ట్రాక్ మీద కుటుంబం .... ఒకత్రాక్ మీద ప్రేయసి! మీట నీ చేతుల్లో ఉంది!!!
ఒక ట్రాక్ మీద నీతి ..... ఒక ట్రాక్ మీద అవసరం! మీట నీ చేతుల్లో ఉంది!!
ఒక ట్రాక్ మీద ధ్యేయం... ఒక ట్రాక్ మీద వ్యసనం ! మీట నీ చేతుల్లో ఉంది!!
ఒక ట్రాక్ మీద అలసట .... ఒక ట్రాక్ మీద లక్ష్యం!! మీట నీ చేతుల్లో ఉంది!!
ఒక ట్రాక్ మీద కులం ... ఒక ట్రాక్ మీద విశాలదృక్పథం ! మీట నీ చేతుల్లో ఉంది!!!
ఒక ట్రాక్ మీద మానవత్వం .... ఒకట్రాక్ మీద శక్తి, జ్ఞానం, బలం, ఐశ్వర్యం , అధికారం .... మీట నొక్కి మానవత్వాన్ని చంపితే ... ట్రాలీ లూప్ లైన్ లో ప్రవేశించి ..... మిగతా వాటినీ ద్వంసం చేస్తుంది.
సుక్షేత్రమాతాక్ష నవ్వి, "ఒక ట్రాలీ ... ఏ ట్రాక్ మీద ప్రవేశించాలో ... డనివల్ల కలిగే లాభనష్టాలేమితో.... ఆయా ట్రాక్ ల మీద పడున్న మనుషులు మనకు ఎంతబాగా తెలుసో, వారి తో అనుబంధం ఎంత గాఢంగా ఉందో, వారివల్ల మనకు లాభం ఏమిటి, వారివల్ల సమాజానికి లాభం ఏమిటి... ఇలా చాలా విషయాలపై ఉంటుంది.
ఒక వేళ ఇదే సమస్యను ....ఒక భారతీయసైనుకుడికి ఇచ్చి.... యుద్ధం జరుగుతోంది. ఈ ట్రాలీడైలమా ఎదురయ్యింది. మీట నొక్కుటావా.... రెండు ట్రాక్ ల మీద పాకిస్తాను సైనికులే ఉన్నారు..... అని అడిగితే.... మీట నొక్కను ..... ఆ ఐదుగురు నీ..... చావనిస్తాను అంటాడు. ఈ ట్రాలీడైలమా ప్రశ్నకు అంతం లేదు." అన్నాడు.
ఇదంతా తనను ఎందుకు అడిగాడో ..... కృష్ణకిరణ్ కు అర్దంకాలేదు.
శ్మశానం దాటేసారు తనకు .... శ్మశానభయం కలగకుండా .... ఇదంటా అడిగాడేమో..... అనుకున్నాడు కృష్ణకిరణ్.
కానీ ... అది నిజం కాదని త్వరలోనే అర్ధమయ్యింది.
"ఇంతకుముందు .... వెనుకనుండి ఒకదేయ్యం , ముందు నుండి ఒక దెయ్యం, ఒక వైపు గోడ , ఒక వైపు బావి.... ఇలాంటి పరిస్థితిని ఎదురుకున్నాను. ఇదీ... ట్రాలీ డైలమా నేనా?!"
"కాదు.... అవును!"
"అంటే?"
"ఆ టైమ్ లో స్రీ దెయ్యం .... నిన్ను చంపాలా .... లేక బావిలో తోసేయ్యాలా అనే డైలమాలో ఉంది.! నిన్ను .... మొదటినుండే తరిమే దెయ్యం..... ఆ స్రీదెయ్యాన్ని తరిమి .... నిన్ను చంపాలా .... లేక ... నిన్ను చంపాక ... దాన్ని తరమలా .... అనే డైలమా లో ఉంది.
నువ్వు గమనించలేదు గానీ.... ఆ గొడమీద .... నీ ప్రేఎసి అర్చన ప్రేతాత్మ కూడా ఉంది. మిగిలిన రెండు దెయ్యాలకూ కనిపించకుండా ..... కూర్చుంది. ఒకవేళ నువ్వు గోడవైపు వస్తే.... నిన్ను లాగి... గోడ అవతలకు చేర్చి రక్షించాలని చూస్తోంది. నువ్వు గోడవైపు రాకపోతే.... ముందుగా స్రీ దెయ్యం పై అటాక్ చెయ్యాలా .... పురుష దెయ్యం పై అటాక్ చెయ్యాలా .... అనే డైలమాలో ఉంది.
అర్చన ప్రేతాత్మకు ..... నువ్వు ట్రాలీని ! మిగిలిన రెండు దెయ్యాలు ..... ట్రాక్ లు !!
స్రీ ప్రేతాత్మకు ..... నువ్వు ట్రాలివి! పురుష దెయ్యం, బావి ..... ట్రాక్ లు !!!
పురుషుని ప్రేతాత్మకు .... నువ్వు ట్రాలీని ! నీ శరీరం , స్రీ ప్రేతాత్మ ట్రాక్ లు !!!
నీ మనసుకు .... నీ దేహం ట్రాలీ! గోడ, బావి, స్రీ దెయ్యం పురుష దెయ్యం ట్రాక్ లు !!!"
కృష్ణకిరణ్ అత్యంత కుతూలంగా విన్నాడు.
"మీరు మంత్రగాడా .... మానసిక శాస్రవేత్తా?!"
