.png)
పార్ట్ - 12
తెలుగు బాషభిమాని ..... తాను అపహరించిన .... రామకృష్ణ కొడుకు సాకేత్ వంక జాలిగా చూసి, ఒక పొట్లం అందించాడు.
వెంకటేశ్వరస్వామి కోవెలలో తెచ్చిన ప్రసాదం .... పులిహొర అది.
కుర్రాడు గబగబా .... ఆ ప్రసాదాన్ని తినేసాడు.
"అ కాగితం మీద .... వార్తలున్నాయిగా .... చదువు ." అన్నాడు.
కుర్రాడు .... నూనె అంటిన ఆ కాగితాన్ని మోహం ముందు పెట్టుకుని , చదవసాగాడు.
"చిలక .... లగూడపో..... లీస్ స్టే.... షన్.... దగ్గ .... రబీ ... టేక వి.... దయా రది.... మెడ .... లోగోలుసు ... కాజే ... షారు. ఆమె తల్ల డిల్లీపోయింది. నాలుగుతు .... లాలగోలుసు....."
"ఛస్! ఆపు.... వెనకటికి నీలాంటివాడే...... ఎవడో..... రాముని తోక .... పివరుండినట్లనియె అని చదివాడట . చిలక, లగూడపో, రబీ, లోగోలుసు. ఆమె తల డిల్లీపోయింది.... లాల గొలుసు .... ఏంటిదంతా ... ఆ (....! చిలకల గూడ పోలీస్ స్టేషన్ దగ్గర. బీటెక్ విద్యార్ది మెడలో గొలుసు కాజేశారు. ఆమె తల్లడిల్లిపోయింది. నాలుగు తులాలగోలుసు ..... ఇదీ చదివే విధానం! ఎక్కడ కామాలు పెట్టాలో, ఫుల్ స్టాఫ్ లు పెట్టాలో ... ఇంగ్లీషు లో మాత్రం తెలుసు. ఎక్కడ ఆపాలో, ఎక్కడ కొనసాగించాలో.... తెలుగులో మాత్రం తెలీదు. నిన్ను కాదురా .... నీ అయ్యనూ .... నీ అమ్మనూ తన్నాలి . వాళ్ళనే కాదు. తెలుగులో పుట్టి .... తెలుగుబాష సరిగా నేర్చుకునే అవకాశం ఇవ్వకుండా .... తమ పిల్లలను ... ఆసుపత్రినుండే తీసుకెళ్ళి .... తిక్కకేజేయో .... పిచ్చికేజియో .... ఏదో కేజిలో తోస్తారు. పిల్లలు .... నీలాగే .... బయటకోస్తారు." కోపంగా అన్నాడు.
"అంకుల్ ..... నేను...."
"అంకుల్ అంటే...... పెంకు లేచిపోతోంది."
"మరి ఏమనాలి?"
"తెలుగుబాషాభిమాని.... అను."
కుర్రాడికి నాలుక తిరగలేదు ." తెలు.... బాష .... భీమా .... ని! తెలు బాష..... భీమాని."
"వొరేయ్ ..... వొరేయ్ .... తెలుగు భాషకు అసలే తెగులు పట్టిందంటే ..... నువ్వు తేళ్ళూజెర్రులూ పాకిస్తూన్నావ్ రా . తెలుగు భాషాభిమాని అనే పదాన్ని ..... ఒక విషపు జుంతువు, ఒక ముస్లీం పేరు, జీవితభీమా .... ఇవన్నీ పట్టుకొచ్చి హత్య చేసావ్ " అన్నాడు.
"సరే ... ఏమీ అనను. ఐకాన్ద్డ్ రీడ్ .... తెలుగు.... ఫేక్లీబ్లీ ....!! బట్..... ఐకేన్ రైట్ ." అన్నాడు. కుర్రాడు.
ఇంగ్లీష్ లో మాట్లాడినందుకు ..... వాణ్ణి లాగిపెట్టి కొట్టి ......" సరే .... రాయి ....." అన్నాడు.
వాడు చెంపరుద్దుకుంటూ, తన బ్యాగ్ లో నుండి. పెన్నూ. నోట్ బుక్ తీసాడు.
వృక్షసంపద .... ఎంతో విలువైనదో మహవృక్షాలే.... మానవజాతికి రక్షణ. అసలు.... వృక్షాలు లేని ఇల్లె .... ఇల్లు కాదు. వక్షాలను పెంచడం అంటే.... ఎందరికో అమృతాన్ని పంచడం తెలుసా ..వక్షాలు ... వాటి లాభాలపై ... నా కూతురూ .... పరిశోధన చేస్తోంది. నా .... భార్యకూ వృక్షాలు పెంచడం అంటే ఏనుగేక్కినంత ఇష్టం. మానవ జాతికి నిస్వార్ధంగా ... సేవ చేసే వృక్షలంటే నాకు ఎంతో ... ప్రీతి!"
తెలుగు భాషాభిమాని .... నేలమీద పడి గిలగిలా తన్ను కోసాగాడు. తర్వాత లేచి కూర్చున్నాడు.
"అంకు .... సారీ ... తెలు.... బాష.... భీమాని .... మీ బ్సేక్ సైడ్ ... టూ మెంబర్స్ ఉన్నారు." అన్నాడు.
తెలుగుబాషాభిమాని జుట్టు పీక్కుంటూ వెనక్కీ తిరిగి చూసాడు.
వెనక ... సుబ్బన్న, ఏసుపాదం నిలబడి ఉన్నారు.
వాళ్ళను చూసి, తెలుగుభాషాభిమాని .... ఉలిక్కిపడ్డాడు.
ఇద్దరూ అతణ్ణి వోడిసి పట్టుకున్నారు.
ఆ తరవాత.... సుబ్బన్న తన జేబులో నుండి సెల్ ఫోన్ తీసుకుని , ఫోన్ చేసాడు.
"హాలో.... జ్ఞానచంద్రను మాట్లాడుతున్నాను."
"సార్..... తెలుగు భాషాభిమానిదొరికాడు."
"వా.... వ్! గుడ్.... గుడ్!! వెంటనే తీసుకొచ్చేయ్యండి?! అవతల ఫోన్ కట్ అయ్యింది.
అయితే .... ఒక్కసారిగా తెలుగుబాషాభిమాని రెచ్చిపోయాడు.
బలంగా మోకాలితో ... ఏసుపాదం డొక్కలో తన్నాడు.
అమ్ మ్ ... మ్మా!" ఏసుపాదం బాధతో మూలిగాడు.
మరో తన్ను అక్కడే తన్నాడు.
ఏసుపాదం అతణ్ణి వదిలేసాడు.
సుబ్బన్న అతడి చేతులు రెండూ కలిపి.... కట్టేయబోయాడు .
తెలుగుబాషాభిమాని .... తన దంతాలతో సుబ్బన్న భుజాన్ని కొరికి...... వెనుదిరిగి పారేపోతూ కుర్రాడు కూర్చున్న ప్రదేశాన్ని చూసాడు.
అక్కడ...... కుర్రాడి బేగ్ మాత్రం ఉంది . కుర్రాడు లేడు!!!
తెలుగుభాషాభిమాని వేగంగా పరుగుతీశాడు
సుబ్బన్న ఏసుపాదం అతని వెంటబడ్డారు.
* * * *
ఎవరెస్టు, టి.వి. సెక్యూరిటీ గార్డుతో ..... ఆ సెక్యూరిటీ గార్డు ఇంటికి వచ్చాడు.
"ఈమె నా భార్య సార్ " చెప్పాడు.
సెక్యూరిటీ గార్డు భార్య నమస్కారం పెట్టింది. ఎవరెస్టు రెడ్డి ప్రతినమస్కారం చేసాడు.
"ఈయన మా సార్ ... ఎవరెస్టు రెడ్డిగారు" పరిచయం చేసాడు భార్యకు.
"ఓహ్ మీరు చాలాసార్లు దారితప్పి ప్రవర్తిస్తుంటే ... మిమ్మల్ని సరైనదారిలో పెట్టిన మాష్టారు
"ఓహొ .... మీరు చాలాసార్లు దారితప్పి ప్రవర్తిస్తుంటే .... మిమ్మల్ని సరైనదారిలో పెట్టిన మాష్టారు .... అని చెబుతుండేవారు. వీరేనా !!"అంది.
సెక్యూరిటీగార్డు తలూపాడు .
ఎవరెస్టు రెడ్డి ఒకసారి ఇల్లంతా పరిశీలించి చూసాడు.
ఇంట్లో .... చిన్న పోర్టబుల్ టి.వి. నవారు మంచం, నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు, గోడకు ఏదో దినపత్రిక తాలూకు క్యాలెండర్, వెంకటేశ్వరావు స్వామి ఫోటో, పాతకాలపు , గడియారం కొక్కేనికి రెండు చొక్కాలు, ఒక ప్యాంటు ....! ఇల్లు చాలా సాదాసీదాగా ఉంది.
ఎవరెస్టు రెడ్డి .... సెక్యూరిటీ గార్డును, అతని భార్యను మార్చి మార్చి చూసాడు.
సెక్యూరిటీ గార్డు మొహంలో ప్రశాంతత అతని భార్య మొహంలో .... స్వచ్చత.
"కూర్చోండి మాష్టారూ ...."
ఎవరెస్టు రెడ్డి కూర్చున్నాడు.
సెక్యూరిటీగార్డు భార్య, చెంబుతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది.
"ఒకరోజు ... బడిలో .... నేను ఓ కుర్రాడి కంపాస్ బాక్సులో నుండి... పదిరూపాయలు దొంగలించాను. మాష్టారు .... చాలా సులువుగా .... నేనే దొంగనని ఓ చిన్నకిటుకు వాడి కనిపెట్టేసారు. కనిపెట్టాక ..... నన్ను మందలించలేదు. ఆ కుర్రాడి పదిరూపాయలు .... మాష్టారే ఇచ్చారతనికి . ఆ తర్వాత .... సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు , నన్ను తనతో పాటూ మార్కెట్ కు తీసుకెళ్ళి .... నాకు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు , నన్ను తనతో పాటూ మార్కెట్ కు తీసుకెళ్ళి .... నాకు చాక్లెట్లు , బిస్కెట్లు , బఠాణీలు కూల్ డ్రింగ్ .... ఇవన్నీ కొనిపెట్టి .... నేను దొంగలించిన పడిరూపాయలను .... గుడిదగ్గరుండే ఓ వృద్ధిభిక్షకుడికి దానం చెయ్యించారు." భార్యాకు చెప్పాడు. ఎవరెస్టు రెడ్డి చిరునవ్వు నవ్వుతూ న
ఇంకోసారి ... నేను చెయ్యని తప్పుకు .... హిందీమాష్టారు ... నన్ను కొడితే ... విషయం తెల్సుకున్న ఈ మాష్టారు హిందీసారూతో గొడవపడ్డారు."
ఎవరెస్టు రెడ్డి మంచినీళ్ళ చెంబును ... ఆమెకు అందించాడు.
"ఎంతవరకు చదువుకున్నావ్ ?" అడుగాడు ఎవరెస్టు రెడ్డి , సెక్యూరిటీగార్డును.
ఆ తర్వాత , కెమెరామెన్ మాట్లాడాడు.
"ఆయనను కసులుకోవడం ... నిజంగా నా అదృష్టం . అయన ఘాట్ చేసారంటే నేను నమ్మను." ఆ తర్వాత , ఆ నాటి తల్లి మాట్లాడింది.
"నా కూతురు ఎవరికీ ద్రిహం చెయ్యలేదు. నా కూతురును ఎందుకు చంపారు ?" ఏడుస్తూ..... అడుగుతుంది.
ఆ తర్వాత ... టి.వి లో కె. రత్నచంద్ర దర్శకత్వం వహించిన సినిమాలలోని సీన్స్ చూపిస్తూన్నారు.
మరో ఛానల్ మార్చి చూసారు. అందులో ..... ఏసిపి నరేంద్ర మాట్లాడుతున్నాడు.
"ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యింది. ఈ హత్య ఎవరు చేసారో . ఊహాగణాలు వద్దు." ప్రతి న్యూస్ ఛానల్ లోనూ ఇదే అంశం .
"ఇన్ని న్యూస్ ఛానళ్ళున్నాయా ... చెబుతూనే ఆశ్చర్ర్యపోయాడు శిష్యుడు.
"అసలు.... మాష్టారు టి.వి. చూడడం లేదా?" మనసులో అనుకున్నాడు.
ఎవరెస్టు రెడ్డి .... టి.వి.లో చూపిస్తున్న వార్తను చూసి.... కోపంతో పిడికిలి బిగించి టివి.ని ఒక్క గుద్దు గుద్దాడు.
టి.వి.....భళ్ళున పగిలి ముక్కలయ్యింది!!
* * * *
విస్కీని గ్లాసులో పోసి, గ్లాసులో పాలు మిక్స్ చేసుకుని .... ఓఅక ఐస్ క్యూబ్ వేసి.... ఆ గ్లాసును బుగ్గకు ఆనించుకుని .... ఆ చల్లనదాన్ని ఆస్వాదిస్తూ...... ఆ విస్కీవాసనను పీలుస్తూ ... రెండు గుక్కలు తాగాడు షరీఫ్.
"రేయ్! ఎవరిని చంపడానికి వెళ్ళావ్ .... ఎవరిని చంపావ్ బే." అన్నాడు షరీఫ్ కోపంగా.
"అన్నా .... నేను గురి సరిగ్గానే చూసుకున్నాను. కానీ... నేను తుపాకే పీల్చేటైమ్ కు ... నన్ను ఏదో ... బా... గా ... కుట్టింది. అందుకే .... గురి కాస్త మిస్సయ్యింది ." చెప్పాడు యశ్వంత్.
"కా.... స్త... ! మ్... కా... స్త మిస్సయ్యిందా?! ఏం కుట్టింది ?" అడిగాడు షరీఫ్.
గోడదూకి పారిపోతూ ..... చూసుకున్నాను అన్నా! గండుచీమ కుట్టింది."
"గం...డు చీమ ! మ్ ... గండు చీమా!" అన్నాడు వెటకారంగా .
"కుట్టకూడని చోట కుట్టిందన్నా!" సంజాయియిషీ చెప్పాడు యశ్వంత్ .
"ప్చ్! పార్టీ .... ఆల్రెడీ సగం డబ్బు ఇచ్చేసింది బే. చంపాల్సినోణ్ణి చంపకుండా..... ఎవత్తినో చంపి..... ఇప్పుడు గండు చీమ అంటూ కధలు చెప్తావెం బే!"
"నా లైఫ్ లో.... ఇలా జరగడం ఫస్ట్ టైమ్ అన్నా!" అన్నాడు యశ్వంత్ .
"రేయ్.... ప్రతివృత్తిలో వాళ్ళూ తప్పులు చేస్తారు. కానీ... మనం తప్పు చెయ్యకూడదు. చూసావు కదరా.... ఒక ప్రాణమే పోయింది. సరే..... ఇంతకూ వాణ్ణి ఎప్పుడు చంపుతావుబే!"
"చంపుతునన్నా! రేపో.... ఎల్లుండో ... మళ్ళీ మాటేస్తా !" అన్నాడు యశ్వంత్.
"జాగ్రత్త!"
"జాగ్రత్తగానే చంపుతానన్నా!"
"నేను చెప్తోంది.... వొళ్ళు దగ్గర పెట్టుకుని పనిచెయ్యమని!"
యశ్వంత్ మళ్ళీ తలూపి వెళ్ళిపోయాడు.
యశ్వంత్ వెళ్ళిపోయినా ఐదునిముషాల తర్వాత .... లోపలనుండి.... హాల్లోనికి వచహాడు..... ప్రస్తుతం పి.వి.రాజక్రుష నాథ్ వర్మ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న అభిజిత్.
"ఏంటి..... మీ వాణ్ణి బాగా భయపెట్టినట్లున్నారు?" అడిగాడు అభిజిత్.
"ఊం! లేకపోతె.... చంపాల్సిన వాణ్ణి చంపకుండా ..... మా సినిమాలో నటించే .... నటిని చంపుతాడా?! వాణ్ణి..... ఎంతకష్టపడి బయటకి తీసుకొచ్చానో తెలుసా!" అన్నాడు షరీఫ్
"అది సరే ... సుబ్రహ్మణ్యం గాడు..... అని అన్నారు. ఎవడు వాడు?" అన్నాడు షరీఫ్.
"సుబ్రహ్మణ్యం అంటూ ఎవడూ లేడు. మీరు చంపమన్నారని చెప్పకూడదు కదా! అందుకే...... రియల్ స్టేట్ గొడవలో సుబ్రహ్మణ్యం అనేవాడు ..... చంపమన్నాడని చెప్పాను.... మా యశ్వంత్ గాడికి ." అన్నాడు షరీఫ్.
అభిజిత్ ..... టేబుల్ మీదున్న మార్జువానా పొడిని.... సిగరెట్ లో దూర్చి రెండుదమ్ములు లాగాడు.
"అసలు.... అతణ్ణి చంపితే..... మీ సినిమా ఆగిపోడా సార్?" అడిగాడు షరీఫ్.
అభిజిత్ మరో రెండు దమ్ములు లాగి. "ఆగదు . కొన్నిరోజులు వాయిదా పడుతుంది. అంతే!!
ప్రో.... డ్యూ....స్.....స్....స....ర్.....ఊ....రు...కో...డు....గా! వే....రే....వా......ళ్ ళ్ ళ్ ళ ను పెడతా ....డ్ ....వా.....డి....ప్లే.....స్.స్.....లో." అన్నాడు కూడబలుక్కుంటూ.
హమ్! ఒకప్పుడు హీరోలు ఎలా ఉండేవాళ్ళు ......ఇపుఉడు ఎలా ఉంటున్నారు. మాదకద్రవ్యాలు ... గొడవలు ..... హత్యలు ....' మనసులో అనుకున్నాడు షరీఫ్ . కానీ బయటకి అనలేదు. ఎవడు ఎటు.... పోయినా... షరీఫ్ కు అనవసరం అతనికి కావాల్సింది ... డబ్బు! అంతే!!
* * * *
చికెన్ ఫేస్టివల్!!
నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన.... చికెన్ ఫెస్టివల్ కు.... భాగ్యనగారావాసులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
సమయం ..... రాత్రి తొమ్మిదయ్యింది.
ఎంట్రీ 'ఫీ' ..... ఇరవైరూపాయలు ! 'ఫీ' తీసుకుని .... అందరూ లైన్ లో నిలబడుతున్నారు
