
పార్ట్ - 11
- కండ్లకుంట శరత్ చంద్
"అవును!" అంది పైకి లేస్తూ.
వెనక.... దూరంగా .... అడుగుల చప్పుడు!!
అతని వెనుక వినిపిస్తోందీ...... ఆమె వెనకనుండే వినిపిస్తోంది.
అతడు... ఆమె భుజాలమీదినుండి...... ఆమె వెనక ఇరవై అడుగుల దూరంలో..... ఒక దెయ్యం.
ఆ దెయ్యానికి ..... నోట్లోనుండి రెండు కోరలున్నాయి. కళ్ళునీలరంగులో ఉన్నాయి. మెడనుండి..... పాదాలవరకూ ..... పసుపురంగులో తయారు చేయబడిన ఎక వస్రలాంటిది ఉంది.
వెనక్కీ తిరిగి చూసాడు.
పదడుగుల దూరంలో ..... తనను తరుముతున్న దెయ్యం.
వెంటనే ఆమె చెయ్యిపట్టుకుని ..... ఎడమవైపు పరుగెత్తాడు.
ఆమె ఆయాసంతో రొప్పుతోంది.
ఇద్దరూ వేగంగా ..... కాంపౌండ్ వాల్ లా కట్టి వున్న స్థలంలోనికి ప్రవేశించి, వెంటనే గేటువేసేసి.... పరుగుతీసారు.
చుట్టూ ..... మట్టిదిబ్బలు .... అక్కడక్కడా సమాధులు!!
ఇద్దరూ అలసిపోయి ..... ఆగిపోయారు. చుట్టూ ..... వందలాది సమాధులు!!
"హైదరాబాద్ శివార్లలో ఇంత పెద్ద శ్మశానం ఉందా!!" అన్నాడు కృష్ణకిరణ్ వణుకుతున్న కంఠంతో.
"ఇది..... చాలా ఏళ్ళనుండే ఉంది." అందామె, చెమటలు తుడుచుకుంటూ
"అవునూ.... అ దెయ్యం నిన్నెందుకు తరుముతోంది?" అడిగాడు.
"అది.... మా అయన ప్రియురాలు." అంది ఒక సంధిమీద కూర్చుంటూ. అతడూ ఒక సమాధిమీద భయంభయంగా కూర్చుంటూ.... ఆ దెయ్యాలు రావడంలేదుకదా ..... అని అటూ ఇటూ చూస్తూ.... "మీ అయన .... ఆ దెయ్యాన్ని ప్రేమించాడా?" అడిగాడు ఆశ్చర్యంగా.
"లేదు లేదు..... చచ్చిపోయిన దెయ్యాన్ని ఎవరైనా ప్రేమిస్తారా?!" అంది, నవ్వుతూ.
"చచ్చిపోయిన దెయ్యం ఏమిటి! అసలు,..... నీకు తెలుగువాడు నేర్పాడు ? చచ్చిపోతేనే దెయ్యం అవుతుందిగా !" అన్నాడు.
"చావకపోయినా దెయ్యాల్ల్లా తిరిగే మనుషులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ప్రేమించలేదనే అమ్మాయి మీద ఏసిడ్ పోసే..... దెయ్యాలు! ప్రేమించలేదేనే అమ్మాయి.... గొంతుకోసే దెయ్యాలు! తాతలు, తండ్రే, .... సంపాదించే అస్థితిలో జల్సాలు చేసే దెయ్యాలు! నేలకు యాభైవేలు సంపాదించే స్టాఫ్ వేర్ ఇంజనీయర్స్ అయ్యుండే .... పెళ్ళాలను శారీరకంగానో, మనసికంగానో హింసించే దెయ్యాలు! గృహహింస చట్టాన్ని దుర్వినియోగం చేసే..... దెయ్యాలు! బంధువులు మెప్పుకోసం తలకుమించిన అప్పులు చేసే.... దెయ్యాలు! పిల్లలను తెగగారాబం చేసి.... చివరికి వాళ్ళు ఏ ఇంటర్ నెట్లోనో .... బూతువైబ్ సైట్లు చూస్తూ మీడియాకు దొరికిపోయాక...... విలపించే దెయ్యాలు! సైన్సు, టెక్నాలజీ తప్ప ఆర్ట్స్ రంగాలేవీ పనికొచ్చే వి కావని తీర్మానించుకునె దెయ్యాలు! మాతోన్మాడంతో .... అమాయకులను బాంబులతో చంపే దెయ్యాలు! టి .ఆర్. . పి రేటింగు పెంచుకోవడం కోసం..... ఒకటి ప్లస్ ఒకటి .... మూడు అనేవరినీ, ఒకటిప్లాస్ పక్టి.... ఆరు అనేవారినీ, ఒకటి ప్లస్ ఒకటి.... తొంభైరెండు అనేవారినీ పిలిచి..... వారి మధ్య 'చర్చ' పేరుతో ..... తలామెండం లేని వాదనను చెయ్యించి .... విషపునవ్వు నవ్వే న్యూస్ ఛానల్ దెయ్యాలు! హ్హ హ్హ హ్హ ..... !! నువ్వు.... నా పదప్రయోగాన్ని తప్పుపడుతున్నావా? చచ్చిపోయిన దెయ్యానికీ, బ్రతికి ఉన్నదేయ్యానికే తేడా ఇదే."
క్రుష్ణకిరణ్ కు దిమ్మ తిరిగిపోయింది. తమాయించుకుంటూనే. "ఇంతకూ ..... మీ అయన ప్రేమించింది ఎవరిని? చచ్చిపోయిన దెయ్యాన్నా...... బ్రతికి ఉన్న దెయ్యాన్నా?" అడిగాడు.
"బ్రతికి ఉన్న దెయ్యాన్నే! ఆ తర్వాత .... నాకు విషయం తెలసి...... నేను ఆమెను చంపాను. ఇప్పుడు.... చచ్చిపోయి దెయ్యమయ్యింది. " అంది.
"ఓహొ..... మరి మీ ఆయనేమయ్యాడు?"
"చచ్చిపోయిన .... ఆమె మా ఆయనను ప్రేమించలేదట! మా అయన మాత్రమె ఆమెను ప్రేమించాడట. ప్చ్! ఈ సంగతి నాకు .... ఆమె చచ్చిపోయాక తెల్సింది. ఆమెకు ఆల్రెడీ ఒక ప్రియుడు ఉన్నాడు. ఆ ప్రియుడు..... ఆమెను .... మా అయన చంపాడని తెలివితక్కువగా నమ్మి.... మా ఆయనకు చంపేసాడు." అంది ఏడుస్తూ.
"ఇదేదో...... రక్తచరిత్రటైపులో .... చావు చరిత్ర లాగుంది." మనసులో అనుకున్నాడు కృష్ణకిరణ్.
"మరి..... మీ ఆయనా..... చచ్చిపోయి దెయ్యమవలేదా?" అడిగాడు.
ఆమ్వే సమాధానం చెప్పబోతుంటే .... ఎవరిదో దగ్గు వినిపించింది.
కృష్ణకిరణ్ భయంగా ..... ఆ దగ్గు వినిపించిన వైపు చూసాడు.
ఒక వృద్దుడు , ఒక ఐదేళ్ళపాపను ఎత్తుకుని..... లాంతరుతో అక్కడికి వచహాడు.
"ఎవరు మీరు?" అడిగాడు వృద్దుడు , అనుమానం నిండిన కళ్ళతో చూస్తూ.
"దెయ్యాలు మమ్మల్ని తరుముతుంటే .... ఒఅరుగెట్టుకొచ్చాం." అన్నాడు కృష్ణ కిరణ్ .
వృద్దుడు చిరునవ్వు నవ్వి," మీ ఇద్దరినే చూస్తుంటే..... వ్లాడిమర్ ఎట్రాగన్ గుర్తుకోస్తున్నారు." అన్నాడు.
"వాళ్లెవరు ?" అడిగారు ఇద్దరూ.
"సామ్యూల్ బకెట్ అనీ.... ఒక ఐర్లాండ్ రచయితా ఉన్నాడు. ఆంగ్లంలోనూ, ఫ్రెంచ్ భాషలోనూ ..... రచనలు చేసేవాడు. వెయిటింగ్ ఫార్ గాడేట్..... అని. నాటకం రాశాడు...... 1953 లో. ......"
వృద్దుడి మాటలకు అడ్డుతగులుతూ , తాతయ్యా..... స్పెల్లింగు .... జీ, వో.డో. వో. టి..... .... కానీ... గాడేట్ అని పలకడం తప్ప. గాడో లేదా అనాలి." అంది పాప వృద్దుడు తలూపి "అం.... వెయిటింగ్ ఫార్ గోడో అనే నాటకం రాసాడు. ఆ నాటకంలో ... వ్లాడిమిర్ ఎస్టాగన్ అనే ఇద్దరు అపరిచితులు .... ఒకచోట ..... గోడో అనే వ్యక్తికోసం ఎదురు చూస్తుంటారు . వాళ్ళిద్దరికే గోడో అనేవాడు ఎవరో, ఎలా ఉంటాడో తెలీదు . కానీ పేరు మాత్రం మహాబాగా తెలుసు, వాడికోసం ఎదురు చూస్తూ .... ఒకరినొకరు .... సంబంధం లేని విషయాల గురించి చెబుతూ .... సంబాషిస్తుంటారు. అసలు విషయం వదిలేసి ... ఏవో మాట్లాడుతుంటారు. మీరిద్దరూ .... అలాగే మాట్లాడుకుంటున్నారు!!!
మధ్యలో ..... పోజ్జో. లక్కీ అనే పాత్రలు వచ్చి...... చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తాయి. కానీ.... గోడో మాత్రం రాడు. రెండరోజు ......ఇలాగే తమకు సంబంధం లేని విషయాలు..... మాట్లాడుతుంటారు. మళ్ళీ..... పోజ్జో , లక్కీ వచ్చి ఇంకా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. గోడో మాత్రం రాడు. అలా .... ఎదురు చూస్తూనే ఉంటారు. 'గోడో ఈ రోజు రాలేదు. రేపు వస్తానని చెప్పాడు!" అని ఓ కుర్రాడు వచ్చి చెప్పి వేలుతుంటాడు.
కనిపించే అయిదు పాత్రలతో, కనిపించని గోడో పాత్రతో..... సామ్యూల్ బకెట్ చేసిన అబ్బార్డ్ విన్యాసం .... ఆ రోజుల్లో సెన్సేషన్
సామ్యూల్ బకెట్ కు .... సాహిత్యంలో నోబుల్ బహుమతి వచ్చింది. " చెప్పాడు. కృష్ణకిరణ్ , ఆమె మోహాలు చూసుకున్నారు.
"బహుశా.... మీలాంటి పాత్రలను, సంబాషణను..... చాలాచోట్ల చూసి ఉంటాడు." అనేసి నవ్వుతూ .... ఆ వృద్దుడు వెళ్ళిపోసాగాడు.
"మా అయన చచ్చిపోయి. దెయ్యమయ్యాడు." చాలాసేపటిక్రితం ..... కృష్ణకిరణ్ అడిగిన ప్రశ్నకు, ఆమె సమాధానం చెప్పింది.
కృష్ణకిరణ్ మాట్లాడకుండా ...... వెళ్ళిపోతున్న ఆ వృద్దుడినే చూస్తున్నాడు.
"ఆ దెయ్యమే ..... నిన్ను తరుముతోంది."
ఆమె చెప్పిన వాక్యం...... పది పర్జానాలు...... నీర్జీవమైన ఆ సమాధులపై గర్జించినట్లయ్యింది!!
"ఏంటీ?!!" కేచుగా అరిచాడు కృష్ణకిరణ్ .
"అవును నువ్వేగా .... మా ఆయనను చంపింది!" అంది ఆమె ఏడుస్తూ .
"అంటే .... అంటే .... రామారావు ..... నీ భర్తా?"
"అవును . నేను చంపినా ..... నీ ప్రియురాలు అర్చన నుండి..... అదే .... ఆ దెయ్యం నుండి నన్ను రక్షించు ప్లీజ్ .....!" అంది.
కృష్ణకిరణ్ కోపంతో పైకి లేస్తూ ...." అంటే.... నా అర్చనను నువ్వు చంపావా? నిన్ను తరిమిన దెయ్యం ... అర్చన ప్రేతాత్మ ?!! నన్ను తరిమే దెయ్యం ..... రామారావు ప్రేతాత్మా మరి .... మరి .... నన్ను తరిమే దెయ్యం ... అడదేయ్యం కాదా?!" అన్నాడు.
"దెయ్యాలకు....... సెక్స్ ఉండదు. సెక్స్ అంటే నా ఉద్దేశ్యం ....... క్రియకాదు.... నామవకాహకం.!"
"........"
"ఐమీన్ .... దెయ్యాలకు స్రీలింగం, పులింగం ఉండదు ." అంది.
"నిన్ను చంపేసి.....ఇక్కడే పాతిపెడతానే .... నా అర్చనను చంపుటావా ....." అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు.
ఆమె అతణ్ణి పట్టించుకోకుండా చెప్పింది. "ఈ.... స్రీలింగ , పులింగ ..... ప్రాబ్లం రావద్దనే ..... నేను చక్కగా చీరకట్టుకున్నాను."
అతడు ఆగిపోయాడు. ఆమె ఏమన్నదో అర్డయ్యేసరికి ..... అతనికి చెమటలు పట్టాయి.
"చచ్చిపోయి దెయ్యాన్ని అయిన నన్ను.... వదలకుండా వెంటాడుతోంది..... నీ అర్చన ప్రేతాత్మ!" ఆమె లేచినిలబడింది
అతడు నాలుగు అడుగులు వెనక్కీ వేసాడు.
"నున్ను ..... నిన్నెవరు చంపారు?" అడిగాడు అనుకోకుండానే .
"నన్నేవరూ చంపలేదు. మొగుడు చచ్చిపోయాడనే ఆవేశంలో ..... పురుగులమందు తాగాను."
"మందు తాగి చ.... చ... ని... పోయావా!" అడుగుతూనే ఎటువైపు పారిపోవాలో .... చూసాడు .
"నేను తాగిన పురుగులమందు వల్ల చావలేదు. ఆ మందు ఎక్స్ ఫైర్ అయ్యింది. అయితే .... కాస్త కడుపునొప్పిలా వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే..... ఏవో తెల్లరంగు మందు బిళ్ళలు ఇచ్చారు. అయితే.... ఆ మందుబిళ్ళలు .... ఎక్స్ ఫైర్ అయిపోయిన తేదీవట ! ఈసారి .... చచ్చాను !" అంది అతని వైపు అడుగులు వేస్తూ.
కృష్ణకిరణ్ పరుగెత్తాడు.!! పావుగంట తర్వాత .... ఆ వృద్దుడిని , పాపను కలిసాడు.
సార్ .... సార్ .... అది దెయ్యం ....." అన్నాడు కృష్ణ కిరణ్ ఆయాసంతో
"తెలుసు" క్లుప్తంగా అన్నాడు వృద్దుడు.
"తే..... తెలు.... సా!!"
"మనుషులకు .... తను ప్రక్కనున్నది దెయ్యం అని తెలియకపోవచ్చు గానీ ..... దెయ్యాలకు, తమ ప్రక్కనున్నది మనిషో, దేయ్యమో..... ఆ మాత్రం తెలియదా!!" నవ్వుతూ ఒక సంధి బండను ప్రక్కకు జరిపి .... అందులో పాపను పడుకోబెట్టి, సమాధి బండను మూసేసి .... మరో సమాధిబండను జరిపి, అందులో తక్యను పడుకుని .... బండను కప్పుకున్నాడు. కృష్ణకిరణ్ కు ఒకేసారి అన్ని దెయ్యాలను చూసేసరికి ..... వొళ్ళు జ్వరంతో వేడెక్కింది. వృద్దుడు బండను కాస్త తొలగించి, తల బయటకి పేట్టి, "వీలయితే .... వచ్చేసారి..... ఒక టేప్ రికార్డురు .... కొన్ని పాటలు క్యాసెట్లు పట్రా ! నా మనుమరాలు .... పాటలు వింటేగానీ నిద్రపోదు. ఆఫ్ కోర్స్ .... నువ్వు బ్రతికి బట్టకడితేనే ....!" అనేసి మళ్ళీ బండను కప్పెసుకున్నాడు.
వెనక .... అయిదడుగుల దూరంలో .... ఆ స్రీ!
ముందర ..... పదడుగుల దూరంలో ..... తనను తరిమే దెయ్యం!!
ఎడమ ప్రక్కన .... పాడుబడిన బావి!
కుడి ప్రక్కన ..... తాత మనువరాళ్ళ సమాధులను అనుకుని వున్న .... పదడుగుల కాంపౌండ్ వాల్.
అంతగోడ తాను.... ఇంత దగ్గరి నుండి దూకాలేడు. కనీసం...... పరుగెత్తుకొచ్చినా దూకే అవకాశం ఉంది.
బావిలోనికి దూకితెనో?!!
దెయ్యాలు బావిలోనికి రాగలవా?! వ్యర్ధమైన ఆలోచనా.
"కానీ..... డైరెక్టర్ గా దెయ్యాలకు పట్టుబడి .... అవి తనను చీల్చేబదులు...... బావిలోనికి దూకి.... నీళ్ళలోమునిగిచావడం మంచిది. నీళ్ళు లేకపోతే ..... కనీసం ఏం బండరాయికైనా తలతగిలి .... చటుక్కున ప్రాణం పోవడం మంచిది.
అవును .... అదే ఉత్తమమైన ఆలోచన . దెయ్యాలకు మాత్రం..... చస్తే దొరకకూడదు ఛ.... ఇక చచ్చినాక దొరికేదేమిటి!!
అతడు ఇలా ఆలోచిస్తూనే ..... బావి వైపు చూసాడు.
"అమ్మాయో ..... వా... మ్...మ్మయ్య....౧!" ఎవరో బావిలో నుండి పాకుతూ బయటకి వచ్చారు.
ఆ..... వచ్చిన వ్యక్తికీ ..... ఒకే కన్ను ఉంది అదీ..... నుదుటమధ్యలో .
హ్హ హ్హ హ్హ ..... హ్హే హ్హే హ్హే .....!!" అతడు వికృతంగా నవ్వాడు .
* * * *
"ఏదీ .... యజ్ఞోపవీతము ..... అను ."
"యజ్ఞోపవ్వీ ..... తమ్ము ...." అన్నాడు కుర్రాడు ఏడుస్తూ.
"జ్ఞో.... గ్నోకాదు ..... జ్ఞ .... అను."
"గ్యు.... గ్యు...." అన్నాడు కుర్రాడు.
