
పార్ట్ - 10
- కండ్లకుంట శరత్ చంద్ర
"కాఫీ కొట్టకండి. క్రియేట్ వ్ గా ఆలోచించకండి అని చెప్తున్నాను! అంతే." అన్నాడు చలనచిత్ర నిలబడే.
"క్రియేట్ .....హ్వ హ్వ హ్వ !! దాని స్పెల్లింగ్ తెలుసా?"
చలనచిత్రశర్మ బలంగా ఊపిరి పీల్చి, వదిలి చెప్పాడు.
"మీ .... సినిమాలో విలన్ ను పరిచయం చేసేటప్పుడు .... ముందే లాంగ్ షాట్ లో అతడి ఇంటిని కట్ చేసి .... ఆ తర్వాత అతడి ఇంటి పరిసరాలను చూపించి .... ఆ తర్వాత విలన్ అనుచరుల మీదుగా .... కెమెరాను ప్యాను చేస్తూ.... విలన్ ను క్లోజప్ లో కట్ చేస్తే. చేసే 'డీల్' ను చూపిస్తూ ..... డైలాగ్స్ వినిపిస్తూనే .... లాంగ్ షాట్ కట్ చేస్తే.... సీన్ లో .... అద్భుతమైన డ్రమేటైజేషన్ వచ్చేది ." దర్శకుడి దిమ్మతిరిగిపోతుంది.
అదంతా వింటున్న
కెమెరామెన్..... ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని రెండు రకాలుగా ఊహించుకుని చూసాడు. ఆ వ్యక్తి చెప్పేలా తీస్తే సీన్ నిజంగానే ఎఫెక్ట్ గా ఉంటుందనిపించింది.
"అలాగే .... హీరోయిన్ ఏడ్చే సీన్ లో ... కెమెరాను టాఫ్ ఏంగిల్ లో కట్ చేస్తూ ..... జూమ్ ఇన్ చేస్తే .... ఎఫెక్ట్ పదింతలు ఉండేది."
దర్శకుడు అనాలోచితంగానే ..... లేచినిలబడ్డాడు.
"మొదటిపాటలో ..... హిరో, హీరోయిన్ల వెనక డ్వాన్స్ చేసే వాళ్ళలో..... రెండవవరసలో .... కుడినుండి మూడవ అమ్మాయి..... పాటకు ముందు.... ఐమీన్ ... కంపోజ్ చేసేటప్పుడు ..... ఐమీన్ డ్యాన్స్ కంపోజ్ చేసేటప్పుడు ... ఏడ్చినట్లుంది.... బహుశా ఏదో పర్సనల్ ప్రాబ్లం అయ్యుండొచ్చు. ఏడ్చిఏడ్చి దర్శకుడు, కెమెరామెన్ మొహమొహాలు చూసుకున్నారు.
మరోవిలన్ .... విద్యాశాఖామంత్రి పాత్రదారి .... కారులో వెళుతున్నప్పుడు .... అతని కారు ముందున్న జెండా .... రివర్సు లో ఉంది! ఐమీన్ .... ఆకుపచ్చరంగు పైనా కషాయం రంగు క్రింద .....!!"
".............."
"రెండో ఫైట్ లో ..... మొత్తం ఏడుగురు రౌడీలు వస్తారు. ఫైట్ చేసేటప్పుడు.... ఆరుగురు రౌడీలనే చూపారు."
"........."
"హిరో .... విలన్ తమ్ముణ్ణి కిడ్నాఫ్ చెయ్యడానికి...... వికారాబాద్ వెళుతున్నానని చెప్పి బైక్ మీద వెళ్ళే సీన్ చూపారు. అప్పుడు .... రోడ్డు ప్రక్కన శంషాబాద్ ఆరుకిలోమీటర్లు అనే... మైలురాయి కనిపించింది."
"....."
"ఇవన్నీ టెక్నికల్ మిస్టేక్స్ ఇంకా చాలా ఉన్నాయి !! అవన్నీ ఒక ఎత్తు . ఫైట్స్ లో .... రౌడీలు షాజ్ అయిపోవడం , బులేట్స్ గాలిలో ఆగిపోవడం , రివాల్వర్ లో బుల్లెట్ల సంఖ్య , అవసరం లేకపోయినా .... క్రియేట్ చేసి మరీ లైఫ్ తూలిస్ కిస్ సీన్ పెట్టడం., రోడ్లమీద..... పిట్టల్ని కాల్చినట్లు కాల్చుకుంటున్నా .... పోలీసులు రాకపోవడం ... వీటన్నింటికీ మించి .... హీరోకు డైలాగులు చెప్పడం చేతకాకపోవడం ... సినిమా చూస్తున్నంత సేపూ ... నాకు లెట్రిన్ లో కూర్చుని..... అన్నం తింటున్న ఫీలింగ్ కలిగింది. మొత్తం మీద .... నువూ నీలాంటి డైరెక్టర్లు ..... సినిమాలను భ్రష్టుపట్టిస్తున్నారన్నమాట. నా అంచనాప్రకారం .... సంవత్సరానికి ..... ఒకటో, రెండో సినిమాలు ... హిట్టవుతున్నయనుకుంటా !!"
ఈసారి మాత్రం .....'నువ్వు' అంటూ ఏకవచనంతో సంభోదించాడు.
మాములుగా మాట్లాడేవాడైతే..... దర్శకుడు ఈపాటికి అతన్ని ఘోరంగా తిట్టిఉండేవాడు!
"మి ... మీరు ...ఎవరు సార్?" అడిగాడు కెమెరామెన్ . చలన చిత్ర శర్మ సమాధానం చెప్పలేదు. మౌనంగా వెళ్ళిపోసాగాడు..
అతడు పదిఅడుగులు వెయ్యగానే ....."అసలు గెట్ దగ్గర సెక్యూరిటీ గార్డులను దాటుకుని ఈయన లోపలి ఎలా వచ్చాడో?" అన్నాడు కెమెరా మెన్ దర్శకుడినితో .
చలన చిత్ర శర్మ వెనక్కీ తిరిగి చూసి " అన్నపూర్ణ స్టూడియో గురించి .... మీ కంటే, నాకు బాగా తెలుసు " అనేసి వెళ్ళిపోసాగాడు.
స్టూడియోలో ... క మూలాన .... ఊడుస్తున్న వ్యక్తి .... చలన చిత్ర శర్మను చూసి..... ఆనందంగా కేకపెడుతూ పరుగెత్తు కొచ్చి.... ఆయనను చుట్టేశాడు.
అయన కాళ్ళమీద పది, నమస్కారం పేట్టి..... పైకి లేచాడు.
"సార్.... మీరు .... మీరు .... మీరేనా సార్! ఎన్నెండ్లయ్యింది సార్ మిమ్మల్ని చూసి ఇట్లా అయిపోయినారెంటి సార్! మోహమంత పీక్కుపోయి .... ఇంత సన్నగా అయ్యారెంటిసార్ !" ఆ వ్యక్తి , చలన చిత్ర శర్మను ప్రశ్నలతోనూ .... పలకరింపిలతోను ముంచేస్తున్నాడు.
"నీ పేరు నారాయణ కదూ! అం..... అం..... గుర్తుకొస్తుంది. ఏం నారాయణా ..... నీ కొడుకుఏం చేస్తున్నాడు? ఇంకా .... సినిమా హీరో అవుతా అంటున్నాడా ?"
"లేదు సార్ ఇదే స్టూడియోలో ... వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు."
"నీ కూతురు?"
"పెండ్లి అయ్యింది సార్ ! ఏలూరులో ఉంది."
"సరే.... వెళ్ళొస్తాను," అనేసి చలనచిత్ర శర్మ వెళ్ళిపోయాడు.
ఊడ్చేవ్యక్తి ... అతనితో మాట్లాడటం చూసిన దర్శకుడు , కెమెరా మెన్ ... గబగబా అతని దగ్గరికి వచ్చి, "ఎవరామేన్?" అడిగారు.
"అర్రే .... అయన తెలీదా సార్.... అవునులెండి ఎట్లా తెలుస్తుంది..... ఆయనేమీ ... ఈకాలందర్శకుడిలా .... మీడియాముందు కొచ్చి మాట్లాదేవాడే కాదు. పేపరోళ్ళకు ఇంటర్ వ్యూలు ఇచ్చేవాడె కాదు. ఇచ్చినా .... తన ఫోటోలు పేపర్లో వేయొద్దని బ్రతిమాలేవాడు . ప్చ్ ! చాలా గొప్పమనిషి . అవసరంలో ఉన్నారని తెలిస్తే..... అవతలివాళ్ళు అడక్కుండానే పైసలిచ్చేవాడు. ప్చ్! అప్పట్లో ..... దబ్బపండులా గుండెవాడు . ఇప్పుడు ..... చీపురుపుల్లల్లా అయ్యాడు. ఏనాడూ ..... ఆడియో క్యాసెట్ల ఫక్షన్లకూ, వందరోజుల ఫంక్షన్లకూ హాజరుయ్యేవాడు కాదు. చాలామంది ఆయనను కలవాలని ..... వచ్చేవాళ్ళు . అయన ..... తానెవరో తెలియనిచ్చేవాడు కాదు . ఒక్కసినిమా .... హిట్టవ్వగానే అటోగ్రాపులు ఇచ్చే హిరోయిన్లను, పేపర్లలో ..... వార పత్రికల్లల్లో తమ ఫోటోలు ప్రింటవ్వాలని పోజులిచ్చే హొరోలను చూసి నవ్వుకుంటూ ..... జనం మధ్యనుంచే వెళ్ళిపోయేవాడు. ఒకసారి ..... ఓ పత్రికాయేన ..... ఈయన ఫోటోను ప్రింట్ చేస్తే ...... ఆ ఆఫీసుకు వెళ్ళి తన్నినంత పని చేసాడు. ఈయనేసార్..... కె.రత్న చంద్ర ."
దర్శకుడు, కెమెరామెన్ ఉలికిపడ్డాడు.
కె...... ర...... తన..... చం......ద్ర!!!
పాతికసినిమాలు డైరెక్టర్ చేసాడు. ఒక్కో సినిమాకూ, మరో సినిమాకూ .... కధ కధనం , పాత్రచిత్రణలలో ...అస్సలు సంబంధం ఉండేదేకాదు. సృజనాత్మకతకు ఒక మంసిహిరూపం అంటూ ఉంటే .... అది ... అతడే !!! అతడు తీసినా కెమెరా ఎంగిల్స్ .... ఎందరో దర్శకులకు పాఠాలు! అతడు ఎన్నుకునే మ్యాజిక్ ...... ఎవరేగ్రీన్ !!
అతడు ..... గోదావరినదిపై ఒక సినిమా తీస్తే ..... ఆ సినిమా ఆడినంతకాలం.... రాజమండ్రి , భద్రచలం, పాపికొండలు .... వీటికి ప్రయాణీకులు తాకిడి ఎక్కువయ్యింది.
అతడు .... బ్యాంకురాబడీ మీద సినిమా తీసాడు. సినిమా విడుదలైన పదిరోజులలోనే ...... ఎనిమిది బ్యాంకులు లూటి అయ్యాయి. రాష్ట్రంలోని బ్యాంకులన్నీ .... భద్రతలను అనూహ్యం గా పెంచాల్సివచ్చింది.
వరకట్నంపై.... అప్పట్లో అతడు తీసిన సోషల్ సెటైర్ ..... ఎన్నో ఇళ్ళల్లో సామాజిక వివిప్లవాన్ని రగిల్చింది.
కరాటేపై అతడు తీసిన సినిమా దెబ్బకు .... వందకుపైగా కరాటే సెంటర్లు..... వారం రోజుల్లో తెరుచుకున్నాయి.
"కనీసం అతడి పేరు ఉచ్చరించే అర్హత కూడా మనకు లేదు !" మనసులో అనుకున్నాడు దర్శకుడు.
"సార్.... కానీ ... ఈయన గురించి..... ఒక కధ ప్రచారంలో ఉంది. నిజమో .... గాసిప్పో తెలియదు." అన్నాడు కెమెరా మెన్ .
"ఏంటి?"
"ఈయన .... తాను ఇంట్రడ్యూస్ చేసి .... స్టార్ గా మార్చిన ఒక హిరోయిన్ ను ప్రేమించాడనీ .... ఆమె వేరే వ్యక్తిని పెళ్ళి చేస్కోవడంతో...... మానసికంగా క్రుంగిపోయి, పిచ్చెక్కిపోయి .... ఎటో వెళ్ళిపోయాడనీ .... ఒక మ్యూజిక్డైరెక్టర్ చెప్పాడు."
"అదే నిజం! ఆ హిరోయిన్ ... సత్యాంజలి. నా సినిమాలో .... హీరోకు తల్లిపాత్ర వేసిందిగా! అప్పుడు ఆమె చెప్పింది ..... నాకు." చెప్పాడు దర్శకుడు.
"మళ్ళీ ..... ఇన్నేళ్ళ తర్వాత ..... ఇలా కనిపించాడెంటి సార్! కొంపదీసి ..... మళ్ళీ సినిమాలు తీస్తాడా?"
"తీస్తే మళ్ళీ పూర్వపు నైపుణ్యంతో తియ్యగలడనే .... అనిపిస్తోంది. ఒకవేళ తీస్తే ..... ఇప్పుడు నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సత్యప్రణీత్ ..... వెనక్కీ వెళ్ళిపోతాడు."
"అదేంటి సార్..... అందరూ..... మీరే నెంబర్ వన్ అంటున్నారుగా .......! మీరేమో.....
"నా దృష్టిలో ..... సత్యప్రణీత్ నెంబర్ వన్ ! నా ర్యాంకు నాకు తెలీదు. రత్నచంద్ర ..... పిట్టలోనికి దిగితే ..... ప్రేక్షుకుల టెస్టును మార్చగలడు. మేము ఎంతటి కంపుకొట్టే సినిమాలు తీస్తున్నామో ...... ప్రేక్షకులకు అర్ధమౌతుంది." నిజాయితీగా చెప్పాడు. దర్శకుడు.
హిరో , విలన్, విలన్ చెల్లెలు..... వీళ్ళున్న స్థలానికి వచ్చారు.
అప్పుడు వినిపించింది..... బుల్లెట్ పేలిన శబ్దం.!!
బుల్లెట్ ..... విలన్ చెల్లెలి పాత్ర నుదుటినుండి దూసుకుపోయింది.
* * * *
కృష్ణ కిరణ్ గజగజ వణుకుతూ..... పరుగులంఘించుకున్నాడు.
"రేయ్..... ఎంత చెప్పినా ..... ఆగవా?" అరూస్తూనే దెయ్యం అతని వెనక రాసాగింది.
చీకట్లు మెత్తగా భూమిని మొట్టుతున్నాయి.
దారునాలన్నేన్నో భూమిపై చూసి చూసి సూర్యుడు ఎరుపెక్కి అస్తమించేశాడు.
కృష్ణకిరణ్ రోడ్డుడిగి చెట్లల్లోనికి పరుగెత్తాడు.
ఎండుటాకులు...... అతని కాళ్ళక్రింద కరకరలాడాయి .
అతడు తూలూతునే .... జారుతూనే ..... పరిగెత్తుతున్నాడు.
ధ..... బాబ్!!!! ఈసారి అతడు జారిపడలేదు. ఎవరో.... తనకు ఎదురుగా దూకారు.
అతడు అకస్మాత్తుగా ఆగిపోయి చూసాడు.
నీలరంగు చీరలో ..... జుట్టు విరబోసుకుని .... గాయాలతో ఒక స్రీ!!
ఆమె పెదవులు సన్నగా వణుకుతున్నాయి.
"నువ్వు..... నువ్వెవరు?" అడిగాడు .... భయంగా.
"ఒకదేయ్యం నన్ను తురుముతోంది.' భయంభయంగా అంది.
"ఆ ..... నిన్నూ ..... తరుముతోందా?"
