Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 62

 

    ఆ సంగతి నీకెలా తెలుసు?

 

    "అతని గతాన్ని ఇన్ వెస్టిగెట్ చేశాను నేను. కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయితో లవ్ లో పడిపోయాడు కార్తిక్. కానీ ఆ అమ్మాయి అతనివైపు కన్నెత్తి చూసేది కాదు. ఆ అమ్మాయి తనకి ప్రేమలేఖలు రాసినట్లు ఫోర్జేర్డ్ లెటర్స్ సృష్టించి అవి ఫ్రెండ్స్ అందరికి చూపించి తృప్తి పడుతూ ఉండేవాడు కార్తిక్. చివరికి అది పెద్ద గొడవయిపోయింది. ప్రిన్సిపాల్ దాకా వెళ్ళింది ఆ విషయం. కార్తిక్ ఆ అమ్మాయిని అపాలజీ చెప్పుకోవలసి వచ్చింది."

 

    "ఆ ఇన్సిడెంట్ నాకు తెలుసు!"

 

    కానీ ఆ తరువాత జరిగింది నీకు తెలియదు.

 

     తనలో ఉన్న ఆ టేలెంటుకి పదును పెట్టాడు కార్తిక్. సంతకాలు ఫోర్జేరి చెయ్యడంలో ఎక్స్ పర్టు అయ్యాడు."

 

    గట్టిగా శ్వాస తీసుకుని అన్నాడు శశికాంత్.

 

    "ఉజ్వలా! యూ ఆర్ సింప్లీ గ్రేట్!

 

    "శశీ! కార్తిక్ వస్తాడు ఇప్పుడు, అవసరమైన చోట సౌమ్య సంతకాలు తను పెట్టేస్తాడు. దేర్ ఎండ్స్ ద మేటర్..........ఆ తరువాత ........నువ్వు, నేను కలిసి.......... వి విల్ లివ్ హపిలి ఎవర్ ఆప్టర్! అంది ఉజ్వల చిరునవ్వుతో.........

 

    ఆమె పెదిమల మధ్య లాస్యం చేస్తున్న చిరునవ్వుని రెప్ప వెయ్యకుండా కొద్దిసేపు చూశాడు శశికాంత్. ఆ తరువాత ఆ చిరునవ్వుని రుచి చూడటానికన్నట్లు తన పెదిమలని ఆనించాడు.

 

    ఆ రెండు జతల పెదిమలు కలుసుకోగానే - వేయి వోల్టుల విద్యుత్తు వాళ్ళ నరనరాల్లోకి ప్రవహించినట్లయింది.

 

    ఒకళ్ళని ఒకళ్ళు అల్లుకుపోయారు.

 

    గంట తరువాత-

 

    రేగిన జుట్టు సవరించుకుని , లైట్ గా మేకప్ చేసుకుని, కార్తిక్ కి రింగ్ చేసింది ఉజ్వల.

 

    కార్తిక్ వచ్చాడు.

 

    మరమనిషిలా ఆమె పెట్టామన్న చోటల్లా సౌమ్య సంతకాలు పెట్టేశాడు.

 

    తరువాత వెళ్ళిపోయాడు.

 

    "చూశావా! దట్ సింపుల్! అంది ఉజ్వల. సౌమ్య సంతకాలు పెట్టి ఉన్న కాగితాలను శశికి కానుకలా అందిస్తూ. కానీ ఒక విషయం!

 

    ఏమిటన్నట్లు చూశాడు శశికాంత్.

 

    శశీ! ఇవాళ సౌమ్య సంతకాలు ఫోర్జరీ చేశాడు కార్తిక్. రేపు అతను మరొకరి సంతకం చెయ్యడానికి మాత్రం ఎందుకు వెనకాడతాడు?

 

    ఫర్ ఎగ్జాంపుల్, కార్తిక్ రేపు నా సంతకమో, నీ సంతకమో ఫోర్జరీ చేస్తే?

 

    పాయింటే? ఎలా మరి? అన్నాడు శశికాంత్ సాలోచనగా.

 

    "అందుకని మనం ఇతన్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. అయితే దీనికోసం నువ్వు, బుర్ర పాడు చేసుకోవలసిన అవసరం లేదు. ఆ విషయం నా కోదిలేయ్! నేను చూసుకుంటాను."

 

    ఉజ్వల తన ప్లాట్ దగ్గరికి వచ్చేసరికి ఆమె కోసం అక్కడే కాసుకుని వున్నాడు కార్తిక్.

 

    "హలో ఓల్డ్ బాయ్! "హౌ ఆర్ థింగ్స్?"

 

    ఉద్వేగంగా అన్నాడు కార్తిక్ -

 

    'ఉజ్వలా! నీ పని జరిగిపోయింది! ఇంక నా పని పూర్తయ్యేదెప్పుడు?

 

    "ఏం పని? అంది ఉజ్వాల కవ్వింపుగా, దీర్ఘం తీస్తూ.

 

    "ఏమి తెలియని దానిలా మాట్లాడకు!"

 

    ఓహ్! ఆ పనా! గుర్తొచ్చింది! అని నవ్వింది ఉజ్వల.

 

    నవ్వుతావెం?

 

    అతని భుజాల మీద చేతులు వేసి అతని కళ్ళలోకి చూస్తూ అంది ఉజ్వల. "నా పిచ్చి కార్తిక్? కావాలనుకున్నంత మాత్రాన దొరికిపోతానా ఏమిటి నేను? నేను కావాలంటే నన్ను గెలుచుకోవాలి.

 

    "అదేమిటి?"

 

    "మాన్! నాకేం తోచడం లేదు. పేకాట ఆడదామా? నేను ఓడిపోయినప్పుడల్లా ఒక్కొక్క గార్మెంట్ చొప్పున విప్పెస్తాను. ఒకే?"

 

    విజిలేశాడు కార్తిక్?"

 

    "ఈ గేమ్ గురించి విన్నానే కానీ ఎప్పుడూ ఆడలేదు. నేను ఓడిపోయినప్పుడల్లా నేనూ ఒక్కొక్క గార్మెంట్ చొప్పునా విప్పెయాలా? ముందు షర్టు తరువాత బనీను..........

 

    "ఆలోచనకేం తక్కువ లేదు. " అని నవ్వింది ఉజ్వల. 'అలా కాదు. నువ్వు గెలిచి నప్పుడల్లా నేనో గార్మెంట్ వదిలేస్తాను. నేను గెలిచినప్పుడల్లా నువ్వు ఒక్కొక్కరి సంతకం ఫోర్జరీ చేసి నాకు ఇస్తూ వుండాలి."

 

    మొహం అదోలా పెట్టాడు కార్తిక్.

 

    అబ్బ! ఫోర్జరీ అనకు! దొంగలాగా ఫీలవుతాను."

 

    "నోనో! అటో గ్రాఫ్ అంటానులే!"

 

    "ఒకే! డన్!"

 

    ఉత్సాహంగా పెకముక్కలని చకచకా కలిపాడు కార్తిక్! పంచాడు.

 

    అట మొదలయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS